ప్రవీణ్ కుమార్ పై తప్పుడు ప్రచారాలు మానుకోవాలి
తార్నాక, పెన్ పవర్
తెలంగాణ ఎస్సీ, ఎస్టీ గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను నాచారం లో అంబెడ్కర్ ఐడియాలజీ నేతలు ఖండించారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మద్దుతగా నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా అంబెడ్కర్ ఐడియాలజి నేతలు మాట్లాడుతూ కొందరు మతం ముసుగులో తన వీడియోలను మార్ఫింగ్ చేసి బురదజల్లే ప్రయత్నం చేస్తున్నరని దాన్ని ఖండిస్తున్నామన్నారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకుల కార్యదర్శిగా పదవి చేపట్టిన దగ్గర నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారని అన్నారు. పేద పిల్లల బంగారు భవిష్యత్తుకు కోసం బాటలు వేస్తున్న తీరు అందరికీ తెలిసిందేనని, అంతటి గొప్ప త్యాగం చేస్తున్న అధికారిపై కొందరు సంఘ విద్రోహశక్తులు, పనిగట్టుకుని మరీ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని వారు మండిపడ్డారు. పేద విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగకుండా అడ్డుపడుతున్నారని, వీరి ఆటలు సాగవని హెచ్చరించారు. అదే విధంగా తన వీడియోలను మార్ఫింగ్ చేసి బురదజల్లే ప్రయత్నం చేస్తున్న దుండగులను తక్షణమే అరెస్టు చేసి శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎం సి కేశవులు, గౌడవెల్లి రామకృష్ణ , నల్ల రాధాకృష్ణ, కోరపాక్ అంజయ్య , ఎలా సంతోష్ కుమార్, హరి బాబు ,శ్రీ రామ్ సత్యనారాయణ , తిరుపతి, సురేష, రఘు, మహేందర్ , మహేష్, రవి, ప్రభాకర్, రామ్ చందర్, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు







