Followers

జిల్లా పరిషత్,మండల పరిషత్ లకు నిధులు కేటాయించటం పై హర్షం వ్యక్తం చేశారు

 జిల్లా పరిషత్,మండల పరిషత్ లకు నిధులు కేటాయించటం పై హర్షం వ్యక్తం 

చేశారు

జగిత్యాల జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి దావ వసంతసురేష్

పెన్పవర్,  జగిత్యాల 

తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  మండల పరిషత్, జిల్లా పరిషత్ స్థానిక సంస్థలను బలోపేతం కావాలని ఆకాంక్షిస్తూ మండల, జిల్లా పరిషత్ లను క్రియాశీలక చేసే దిశగా ప్రభుత్వ కార్యాచరణ ఉంటుందని గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం పెంచే విధంగా తీసుకున్న నిర్ణయం లో భాగంగా  2021-22  వార్షిక బడ్జెట్ నందు జిల్లా ప్రజా పరిషత్ లకు రూ.లు. 252.00  కోట్లు మరియు మండల ప్రజా పరిషత్ లకు రూ.లు.248.00 కోట్లు కేటాయించడం పట్ల జగిత్యాల జడ్పీ చైర్ పర్సన్.  శ్రీమతి  దావ వసంతసురేష్  గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి  ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసినారు. అదేవిధంగా ఇట్టి కేటాయింపులు చేయుటలో కృషి చేసిన గౌరవ పంచాయతి రాజ్ శాఖామాత్యులు గారికి, గౌరవ సంక్షేమ శాఖామాత్యులు గారికి, శ్రీమతి కల్వకుంట్ల కవిత అక్క ఎమ్మెల్సీ గారికి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గారికి మరియు జగిత్యాల జిల్లా శాసనసభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేసినారు.

బైంసా అల్లర్ల ఘటనపై సిబిఐ చేత విచారణ జరిపించాలి

 బైంసా అల్లర్ల ఘటనపై సిబిఐ చేత విచారణ జరిపించాలి...

పార్లమెంటులో గళం విప్పిన ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు

ఆదిలాబాద్, పెన్ పవర్ 

ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని బైంసా పట్టణం లో తరచూ జరుగుతున్న మత ఘర్షణల కేసులో హిందువుల పై దాడులు జరుగుతున్నా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని,ఈ వరుస ఘటనలపై సిబిఐతో విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాలని ఎంపీ సోయం బాపురావు కోరారు. పార్లమెంట్లో జీరో అవర్ సందర్భంగా సోయం బాపురావు బైంసా అల్లర్ల వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. ఎంఐఎం పార్టీ నేతలు గుండాయిజం ప్రదర్శిస్తున్నారని వారికి భయపడి టిఆర్ఎస్ ప్రభుత్వం  నిందితులపై సరైన విధంగా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ప్రతిసారీ జరుగుతున్న దాడుల్లో హిందువులు తీవ్రంగా గాయపడుతున్నా పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రాళ్లు రువ్వడం, కత్తులు, మారణాయుధాలతో  దాడులు విధ్వంసం సృష్టిస్తూ అమాయకులపై ప్రతాపం చూపుతున్నారని అన్నారు.బైనసా పట్టణం లో హిందువులు భయభ్రాంతులకు గురవుతున్నారని  వారికి రక్షణ లేకుండా పోతుందని సోయం బాపురావు అన్నారు.ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని సిబిసిఐడి చేత విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

దరఖాస్తుదారులు ధ్రువీకరణ పత్రాల పరిశీలన

 దరఖాస్తుదారులు ధ్రువీకరణ  పత్రాల పరిశీలన

 నార్నూర్ , పెన్ పవర్

 ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం లో మినీ అంగన్వాడీ టీచర్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నా దరఖాస్తుదారుల ధ్రువీకరణ పత్రాలను గురువారం ఐసిడిఎస్ కార్యాలయం లో సిడిపిఓ ఉమాదేవి పరిశీలించారు.  మొత్తం మండల పరిధిలోని కోసం 94 మంది దరఖాస్తు చేసుకోగా 84 మంది హాజరైనట్లు వారి వారి ధ్రువీకరణ పత్రాలు పరిశీలించినట్లు ఆమె పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ వందల కంప్యూటర్ ఆపరేటర్ అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

కరోనా మహమ్మారి తో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

 కరోనా మహమ్మారి తో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

 ఆదిలాబాద్ డిఎంహెచ్ఓ రాథోడ్ నరేందర్

 బేలా , పెన్ పవర్

 మలిదశ కరోనా మహమ్మారి కేసులు పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య శాఖ అధికారి రాథోడ్ నరేందర్ అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని  మహారాష్ట్ర బార్డర్ ఆనుకొని ఉన్న  కొబ్బయి గ్రామన్ని మండల టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఠాక్రె గంబీర్, ఆడానేశ్వర పౌండేషన్ ఛైర్మన్ సతీష్ పవార్ తో కలిసి జిల్లా వైద్య శాఖ అధికారి రాథోడ్ నరేందర్   గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పక్క రాష్ట్ర మైన మహారాష్ట్రలో కరుణ కేసులు ఎక్కువ ఉండడంతో మహారాష్ట్ర కు ఆనుకొని ఉన్న గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ,  ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి శానిటైజర్ వాడాలని తెలిపారు. గ్రామాల్లో పరిస్థితులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు గ్రామంలోని పరిసరాలను శుభ్రంగా ఉంచాలని పంచయితి సూచించారు. ప్రతి ఒక్కరికి వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని ప్రజలకు తెలిపారు. గ్రామాల్లోని కిరణా షాప్ లోని యజమానులకు కరోనా పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్య అధికారి డా. క్రాంతి కుమార్, సాంగిడి ఎంపిటిసి రాకేష్,  టిఆర్ఎస్ నాయకులు మహేందర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

సాయిబాబా ఆలయ వార్షికోత్సవం లో పాల్గొన్న జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్

 సాయిబాబా ఆలయ వార్షికోత్సవం లో పాల్గొన్న జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్...




 ఆదిలాబాద్ ,  పవర్ పవర్

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కుచలాపూర్ గ్రామంలో గల  సాయిబాబా ఆలయ 25వా వార్షికోత్సవాల్లో బుధవారం ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్ధన్ రాథోడ్, రాష్ట్ర డెయిరి చైర్మన్ లోక భూమారెడ్డి లతో కలిసి పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బాబా ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం శ్రీ యోగానంద ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తూ ఆలయ అభివృద్ధి కోసం తన నిధుల నుంచి రూ 5 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు జడ్పీ చైర్మన్ గ్రామ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, జెడ్పిటిసి ఫోరం అధ్యక్షులు రాజు, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ మతాని నారాయణ, ఎంపీపీ కళ్యాణం లక్ష్మి  రాజేశ్వర్, స్థానిక సర్పంచ్ మొహితే ప్రభ, దేవ్ రావు, గ్రామస్తులు సదాశివ, మల్లయ్య, ప్రభాకర్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

పౌష్టికాహారం అందజేత

 పౌష్టికాహారం అందజేత    

పెన్ పవర్, కందుకూరు

 పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో గల అంగన్వాడి సెంటర్ నందు గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు ఐసిడిఎస్ సిడిపిఓ లిడియమ్మ గురువారం  పౌష్టికాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా లిదియమ్మ  మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు బలవర్ధకమైన విటమిన్లు  ఉండే ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. అనంతరం అంగనవాడి కేంద్రంలో రికార్డులు పరిశీలించి పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ సునీత, అంగన్వాడీ కార్యకర్త ఝాన్సీ రాణి, తదితరులు పాల్గొన్నారు.

ఆశ్రమ పాఠశాలలో కరోన టెస్టులు

 ఆశ్రమ పాఠశాలలో కరోన టెస్టులు

నెన్నెల, పెన్ పవర్

మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుష్ణపల్లి ఆశ్రమ పాఠశాలలో 50 మంది విద్యార్థులకు వైద్య సిబ్బంది ఇందిరా, రోజా,శైలజలు కరోన టెస్టులు నిర్వహించారు.వైద్యాధికారి అనిష్ ఆదేశాల మేరకు కరోన టెస్టులు చేశామని ఏఎన్ఎం  ఇందిరా తెలిపారు.అందరు విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.ఎవ్వరికి కూడా పాజిటివ్ రాలేదని అందరికీ నెగెటివ్ వచ్చిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆశవర్కర్ రోజా,హాస్టల్ ఏఎన్ఎం శైలజ,హాస్టల్ వార్డెన్,హాస్టల్ ఉపాద్యాయులు పాల్గొన్నారు

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...