Followers

నగరపాలక సంస్థ నూతన పాలక వర్గ మేయర్ గా ముచ్చు నాగలక్ష్మి

 నగరపాలక సంస్థ నూతన పాలక వర్గ మేయర్ గా ముచ్చు నాగలక్ష్మి

విజయనగరం,పెన్ పవర్

 నగరపాలక సంస్థ నూతన పాలక వర్గం గురువారం  కొలువుదీరింది. మేయర్ గా వెంపటాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ గా ముచ్చు నాగలక్ష్మి ఎన్నికయ్యారు.  నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ఏర్పాటైన ప్రత్యేక సమావేశంలో ఎన్నికల పరిశీలకులు కాంతిలాల్ దండే,ప్రత్యేక అధికారి మరియు జిల్లా కలెక్టర్ హరిజవహర్లాల్ హాజరయ్యారు. కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరిగింది.అక్షర క్రమంలో సభ్యులందరూ తమ తమ స్థానాల్లో ఆసీనులయ్యారు. ఈ సమావేశంలో ముందుగా నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులతో కలెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించారు. స్థానిక శాసన సభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి ఎక్స్ అఫిషియో మెంబర్ గా సమావేశానికి హాజరయ్యారు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 48 మంది సభ్యులు ఓవైపు, తెలుగుదేశం, స్వతంత్ర సభ్యులకు మరోవైపు సీట్లను కేటాయించారు. సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం మేయర్ ఎన్నికకు సంబంధించి జిల్లా కలెక్టర్ ప్రకటన వెలువరించారు. మేయర్ గా వెంపటాపు విజయలక్ష్మి పేరును సీనియర్ సభ్యులు ఎస్ వి వి రాజేష్ ప్రతిపాదించగా, మరో సభ్యులు కేదారి శెట్టి సీతారామమూర్తి బలపరిచారు. సభలో మెజార్టీ సభ్యులు వెంపడాపు విజయలక్ష్మి అభ్యర్థిత్వానికి మద్దతు తెలపడంతో ఆమె మేయర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కలెక్టర్ ప్రకటించారు. మేయర్ ఎన్నిక లాంఛనప్రాయమే అయ్యింది.  అనంతరం డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి జిల్లా కలెక్టర్ ప్రకటన వెలువరించారు. ఒకటో వార్డు కు చెందిన ముచ్చు నాగలక్ష్మి పేరును 40వార్టు సభ్యురాలు బోనెల ధనలక్ష్మీ ప్రతిపాదించగా, 42వవార్టు సభ్యురాలు పిన్నింటి  కళావతి బలపరిచారు. నాగలక్ష్మి అభ్యర్థిత్వానికి మెజార్టీ సభ్యులు మద్దతు తెలపడంతో ఆమె డిప్యూటీ మేయర్ గా  ఎన్నికైనట్లు కలెక్టర్ ప్రకటించారు. మేయర్, డిప్యూటీ మేయర్ లాంఛనప్రాయమే అయ్యింది. సభ్యులందరికీ అభినందనలు తెలుపుతూ మేయర్, డిప్యూటీ మేయర్ లకు జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ ,కమిషనర్ ఎస్ ఎస్ వర్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలందిస్తూ ఆదర్శ నగరపాలక సంస్థగా తీర్చిదిద్దాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. పచ్చదనానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ, పౌరులకు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించే విధంగా కృషి చేయాలన్నారు. స్థానిక శాసన సభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ ప్రజా పాలకవర్గం నేడు కొలువుదీరిందని అభివర్ణించారు. అవినీతికి ఆస్కారం లేకుండా నీతివంతమైన పాలనను అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తారని అన్నారు.

 ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  సూచనలతో మేయర్, డిప్యూటీ మేయర్ పేర్లను ప్రకటించడం జరిగిందన్నారు. అందరి సమిష్టి కృషితో నగరపాలక సంస్థ  మరింత అభివృద్ధి చెందాలని, ప్రజలకు సంపూర్ణ మౌలిక సదుపాయాలు లభించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. నూతనంగా ఎన్నికైన మేయర్ వెంపడాపు విజయలక్ష్మి మాట్లాడుతూ అందరి సహకారంతో నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చారు. మంత్రి బొత్స సత్యనారాయణ, స్థానిక శాసన సభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి సూచనలు సలహాలతో ప్రజలకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించి రాష్ట్రంలోనే మంచి నగరపాలక సంస్థగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానన్నారు.  మరో డిప్యూటీ మేయర్ ముచ్చు నాగలక్ష్మి మాట్లాడుతూ సామాన్యులమైన తమకు నగర ఏలికలుగా పదవులు లభించడం అదృష్టం అన్నారు. పదవులు కల్పించిన స్థానిక శాసన సభ్యులు కోలగట్ల వీరభద్ర స్వామి కి ప్రత్యేక అభినందనలు తెలిపారు. అందరి సూచనలు, సలహాలతో ఉత్తమ వార్డు గా అభివృద్ధి చేయడంతోపాటు, నగర అభివృద్ధిలో తమ వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ ఎస్ వర్మ, సహాయ కమిషనర్ ప్రసాద్ రావు,ఈఈ డా.కిలాన దిలీప్,ఏసిపీలు వెంకటేశ్వర రావు,మధుసూదన్ రావు  తదితరులు పాల్గొన్నారు.

గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ నూతన పైపులైన్ లను వేయాలి

 గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ నూతన పైపులైన్ లను వేయాలి-బీజేపీ నాయకుల డిమాండ్

రైతులతో కలిసి ఇరిగేషన్ కార్యాలయం ముందు ధర్నా-బీజేపీ నాయకుల ధర్నాకు పోలీస్ ల గట్టి బందోబస్తు



లక్షెట్టిపెట్, పెన్ పవర్

పట్టణంలోని ఇరిగేషన్ కార్యాయం ముందు భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో రైతులు గురువారం ధర్నా చేపట్టారు.దండేపల్లి మండలం గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ నూతన పైపు లను వేయాలని అదే విధంగా లిఫ్ట్ నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ ని బ్లాక్లిస్టులో పెట్టాలని డిమాండ్ చేసారు.పట్టణంలోని ఊత్కూర్ చౌరస్తా నుండి లక్షెట్టిపెట్,దండేపల్లి,హాజీపూర్ మండలాలకు చెందిన సుమారు వంద మంది రైతులు బిజెపి నాయకులు బిజెపి జిల్లా అద్యక్షుడు వెరబెల్లి రఘుణత్ ఆద్వర్యంలో ర్యాలీగా కార్యాలయం వరకు వెల్లి సుమారు రెండు గంటల పాటు కార్యాలయం ముందు బైటాయించి రైతులు లిఫ్టు వల్ల పడుతున్న బాదలను కార్యాలయ సిబ్బందికి తెలిపారు.ఈ సందర్భంగా బిజెపి జిల్లా అద్యక్షుడు రఘునాథ్ మాట్లాడుతూ లిఫ్టు నిర్మాణం చేపట్టి కనీసం ఆరు ఏండ్లు కూడా కావడం లేదని ప్రతీ ఏటా పైపులు పలిగి రైతులకు నీరు అందకపోవడంతో పాటు పైపులైన్ పలిగి. చుట్టు ప్రక్కల ప్రాంతం రైతుల పంటలు కూడా సర్వ నాషనం అవుతున్నాయన్నారు. గూడెం లిఫ్ట్ ద్వారా మూడు టిఎంసిల నీరు ముపైవేల ఎకరాలకు అదికారులు ఇవ్వాల్సి ఉందని కనీసం ఒక టిఎంసి నీరు కూడా రావడం లేదన్నారు.ఎక్కడో రెండు వందల యాబై కిలోమీటర్ల దూరంలో ఉన్న  హైదరాబాద్ లో ఉన్న కెసిఆర్ ఫాంమ్ హౌజ్ కి నీరు అందుతున్నాయని ఇక్కడ ఉన్న కనీసం పది పదిహేను కిలోమీటర్ల వరకు కూడా సాగు నీరు అందడం లేదని కాంట్రాక్టర్ కెసిఆర్ తో కుమ్మకై ఆయనకు నాణ్యతతో ఉన్న పైపులు వేసారని ఇక్కడ రైతులకు మాత్రం నాణ్యత లేని పైపులు వేసి రైతులను అరి గోసపెడుతున్నారని విమర్శించారు.వెంటనే లిప్ట్ ఇరిగేషన్ నిర్మాణం చేపట్టిన మేగా ఇంస్ట్రక్చర్ కంపనీ యాజమాన్యం ను బ్లాక్లిస్టులో పెట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. అదే విధంగా నాణ్యతతో కూడిన మంచి  పైపు లైన్ వేసి చివరి ఆయకట్టు రైతులకు రెండు పంటలకు సరిపడా నీరువ్వాలని డిమాండ్ చేసారు.లిఫ్టు ద్వారా 24గంటలు నీరు రైతులకు ఇచ్చినప్పటికి కూడా మూడు టిఎంసిల నీరు రైతులకు పట్టదని లిఫ్టు కట్టినప్పటి నుండి ఇప్పటి వరక కనీసం ఒక టిఎంసి నీరు కూడా సరిగ్గా రాలేదన్నారు.పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఇరిగేషన్ డీఈ దశరథ్ కు అందజేసారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాద్యక్షుడు  రజినీష్  బిజెపి జిల్లా,రాష్ర్టనాయకులు తిరుపతి,రంగారావు,తమ్మినీడి శ్రీనివాస్,శంకరయ్య లక్షెట్టిపెట్, దండేపల్లి  మండలాల అద్యక్షుడు బొప్పు కిషన్,పట్టణ అద్యక్షుడు హరిగోపాల్ రావు, నాయకులు మదు,చంద్రమౌళి,శివశంకర్, సతీష్,చంద్రయ్యతో పాటు సుమారు వంద మంది రైతులు పాల్గొన్నారు..

మౌలిక సదుపాయాలు కల్పించాలని రేచిని గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు బీజేపీ ధర్నా

 మౌలిక సదుపాయాలు కల్పించాలని రేచిని గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు బీజేపీ ధర్నా


తాండూర్, పెన్ పవర్

మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం రేచిని గ్రామ పంచాయతీలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో పంచాయతీ పాలక వర్గం విఫలమైనందుకు నిరసనగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రేచిని గ్రామ పంచాయతీ  కార్యాలయం ముందు ధర్నా చేసి అనంతరం  ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని పంచాయతీ కార్యదర్శి వసంత గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా భారతీయ జనతా యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు తాళ్లపెల్లి భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ  గ్రామంలో వీధి దీపాల నిర్వహణ సరిగ్గా లేదని, చెత్త సేకరణ కొన్ని వార్డులకే పరిమితం అయినదని, గ్రామంలోని 12 వార్డులలో చెత్త సేకరణ చేపట్టాలని, గ్రామంలో గ్రంథాలయం లేకపోయినా, ప్రజలు నుంచి గ్రంథాలయం వినియోగ పన్ను కట్టించుకుంటున్నారు కావున వెంటనే గ్రంథాలయం అలాగే పబ్లిక్ టాయిలెట్ ఏర్పాటు చేయాలని, గతంలో ప్రభుత్వం పేదలకు నివాసానికి కేటాయించిన కాలనీలో నీటి, విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరారు. లేనియెడల ప్రజలు పక్షాన భారతీయ జనతా పార్టీ పోరాటాన్ని ఉదృతం చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు మొగిలి తిరుపతి, బీసీ మోర్చా మండల ఉపాధ్యక్షుడు అదే శ్రీనివాస్, నాయకులు బామనపెల్లి ఆనంద్,రాజశేఖర్,శంకర్, సంతోష్, గురుగుల రాజన్న,గురుగుల శ్రీనివాస్ మహిళలు శారద, కళ్యాణి, ప్రమీల, భాగ్యలక్ష్మి, రాధ,మల్లేశ్వరి మరియు పలుగురు గ్రామస్తులు పాల్గొన్నారు.

పట్టణాల్లో తాగునీటి సమస్య లేకుండా చూస్తాం

 పట్టణాల్లో తాగునీటి సమస్య లేకుండా చూస్తాం

 ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమెందర్

 ఆదిలాబాద్,పెన్ పవర్

పట్టణంలో తాగునీటి సమస్య లేకుండా చేస్తామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమెందర్ అన్నారు. గురువారం కైలానగర్ , న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలలో మిగిలిపోయిన మిషన్ భగీరథ పైప్ లైన్ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటికి తాగునీరు అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ చేపట్టిన మిషన్ భగీరథ పనులు పూర్తి కవచ్చయని తెలిపారు. మరికొన్ని వార్డుల్లో పనులు నిలిచి పోవడంతో ఎమ్మెల్యే జోగు రామన్న గారు సహరంతో 52 కిలోమీటర్ల పైప్ లైన్ పనులు మంజూరు అయ్యాయని తెలిపారు. ప్రస్తుతం పట్టణంలో తగు నీటి సమస్య లేదని, గతంలో మార్చి నెలలో నీటి సమస్య తలెత్తే దని పేర్కొన్నారు. ఈ నెలాఖరుకల్లా పైప్ లైన్ పనులు పూర్తి చేసుకొని వేసవి కాలంలో ప్రతి రోజూ ఇంటింటికి తాగునీరు అందిస్తామని అన్నారు.

కాలనీ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి

కాలనీ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి

జీడిమెట్ల,పెన్ పవర్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని ప్రసూన నగర్ కు చెందిన సంక్షేమ సంఘం సభ్యులు గురువారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ ప్రాంతంలో మిగిలి ఉన్న నాలా అభివృద్ధి పనులు, సీసీ రోడ్లను పూర్తి చేయాలని కోరుతూ ఎమ్మెల్యేకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పందిస్తూ సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు రూ.70 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న నాలా అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అలాగే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీసీ రోడ్డు పనులు వారంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలని సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాగశేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సి.హెచ్.శంకర్, సలహాదారు ఎస్.నాగేశ్వర్ రావు, పి.లింగం తదితరులు పాల్గొన్నారు.

గ్రామ పంచాయతీ లే-అవుట్ లను రిజిస్ట్రేషన్లు చేయండి ఎమ్మెల్యేకు వినతి

 గ్రామ పంచాయతీ లే-అవుట్ లను రిజిస్ట్రేషన్లు చేయండి ఎమ్మెల్యేకు వినతి

కుత్బుల్లాపూర్,పెన్ పవర్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గ్రామపంచాయతి లేఅవుట్లను రిజిస్ట్రేషన్లు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే కే.పీ.వివేకానందకు వినతి.. నియోజకవర్గానికి చెందిన ఎస్.ఎల్.ఎన్ వెంచర్స్, అక్షర వెంచర్స్, వైష్ణవి వెంచర్స్, ఎస్ఆర్ వెంచర్స్, ఎకేఆర్ ప్రాజెక్ట్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ను ఆయన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గత సంవత్సరం మార్చి నుండి ఇప్పటి వరకూ కరోనా కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ఆగస్టు నుండి ఇప్పటి వరకూ రిజిస్ట్రేషన్ లు నిలిపివేయడంతో ఆర్థికంగా బాధపడుతున్నామని, గ్రామ పంచాయతీ లే-అవుట్ లకు రిజిస్ట్రేషన్ లు నిలపడంతో ఏమి తోచని స్థితిలో జీవనం కొనసాగిస్తున్నామని, ఈ సమస్యకు పరిష్కారంగా రిజిస్ట్రేషన్ లు తిరిగి ప్రారంభించేలా తమరు చొరవ చూపాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు స్పందించిన ఎమ్మెల్యే సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి త్వరలోనే పరిష్కారం చూపి తిరిగి రిజిస్ట్రేషన్ లు ప్రారంభించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాకేష్ జాలిగం, ఆనంద్, సతీష్, జాకీర్ హుస్సేన్, సాయి, సుభాష్ రెడ్డి, పవన్ తదితరులు పాల్గొన్నారు.

బండి సంజయ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి

 బండి సంజయ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి

ఎమ్మార్పీఎస్ టీఎస్ నాయకుల డిమాండ్

 ఆదిలాబాద్,పెన్ పవర్ 

ఏదైతే గతంలో ఉన్న జరిగినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ అధికారి నీ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేసినటువంటి అనుచితమైన వాక్యాలను వెంటనే వెనక్కి తీసుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఎమ్మార్పీఎస్ టీఎస్ అదిలాబాద్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది.  జిల్లా కేంద్రంలో గురువారం స్థానిక ప్రెస్ క్లబ్ లో  ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఒక మాదిగ బిడ్డ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ అనేక మైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద విద్యార్థుల కోసం నాణ్యమైన విద్యను అదేవిధంగా నాణ్యత  ఆహారాన్ని అందిస్తూ రానున్న దశలో  కులాల్లోని విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉండాలని ఉద్దేశంతోనే ముందుకు నడుపుతున్న ఇటువంటి ప్రవీణ్ కుమార్ పై ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని లేని ఎడల బిజెపి నాయకులను ప్రతి పల్లెలో ప్రతి గల్లీలో నిరసన కార్యక్రమాలను అడ్డుకొని తిరిగి తనే ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ హెచ్చరిస్తోంది అదేవిధంగా ఉన్నత స్థాయిలో దళితులు ఉంటే ఇటువంటి బిజెపి పుట్టుక లక్షణాలను బయట పెట్టాల్సిన పరిస్థితులు కళ్ళ ముందు కనపడుతున్నాయి ఇప్పుడిప్పుడే దళితులు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎదుగుతుంటే ఓర్వలేక అగ్రవర్ణాల చేతి చేతులు కీలుబొమ్మగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ విధమైనటువంటి దుష్ప్రచారాలు చేస్తే సహించబోమని హెచ్చరిస్తున్నాం  గ్రామ గ్రామాన ఈ బిజెపి నాయకులు దళితులపై చేస్తున్నటువంటి తీవ్ర ఆరోపణలు ఎండగడుతూ బిజెపి నాయకులను గ్రామాల్లో దళిత వాడలో తిరిగి రాకుండా దళితులు అడ్డుకుంటారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఖబర్దార్ బిజెపి నాయకులకు ఎక్కడ కూడా దళితుల పట్ల అనుచితమైన వాక్యాలు చేసినట్లయితే ఎమ్మార్పీఎస్ తీవ్ర పోరాట రూపాలు చేస్తుందని దానికి బాధ్యత బిజెపి వహించాలని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ కుమార్ మాదిగ జిల్లా అధ్యక్షులు గజ్జల కాంతం మాదిగ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బండారి అశోక్ మాదిగ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లగొండ గంగాధర్ మాదిగ జిల్లా ఉపాధ్యక్షులు మాదిగ అదిలాబాద్ జిల్లా ఇంచార్జి మల్యాల కరుణాకర్ మాదిగ  ఆశన్న ,ఉషన్న, జాదవ్ రాందాస్ తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...