Followers

కుంయ్..కుయ్..కుయ్.. వచ్చేసిందోచ్

 కుంయ్..కుయ్..కుయ్.. వచ్చేసిందోచ్

ఎమ్మెల్యే చొరవ..ఎట్టకేలకు తీరిన ప్రజల చిరకాల కల

వరదయ్యపాలెంలో 108ను ప్రారంభించిన వైసీపీ నాయకులు

పెన్ పవర్,వరదయ్యపాలెం

వరదయ్యపాలెం మండల ప్రజలకు శుభవార్త. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చొరవతో  ప్రజలు చిరకాలంగా ఎదురుచూస్తున్న 108వాహనం వచ్చేసింది. వరదయ్యపాలెం కు మంజూరైన 108 వాహనాన్ని శుక్రవారం స్థానిక ప్రాథమికఆరోగ్యకేంద్రంలో వైద్యాధికారి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్చంగ వైసీపీ అధ్యక్షుడు దయాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ బొప్పనతిలక్ బాబు మాట్లాడుతూ అటు పర్యాటక కేంద్రం ఉబ్బలమడుగు, కల్కి భగవాన్ ఆశ్రమం,ఇటు తిరుపతి శ్రీకాళహస్తి వంటి పుణ్యక్షేత్రాలకు ప్రధాన మార్గంగా ఉన్న వరదయ్య పాలెంలో ఎక్కువుగాప్రమాదాలు జరుగుతున్నా108 లేకపోవటంతో అమాయక ప్రాణాలు కోల్పోయివారని అన్నారు.గత 10ఏళ్లుగా 108 మంజూరు చేయాలని అధికారులకు ప్రజాప్రతినిధులకు విన్నవించినా పలితం శూన్యమని ఆవేదన వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఆశయ సాధనలో భాగంగా ప్రతి మండలానికి 108  మంజూరు చేయడంతో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం  సహకారంతో 108 వాహనం ఏర్పాటు చేయడం హర్షణీయం అని అన్నారు. కార్యక్రమంలో రాచర్ల సర్పంచ్ ధనంజయ లు వైసీపీ యువజన అధ్యక్షుడు వినోద్ యాదవ్, మైనారిటీ కన్వీనర్ అబ్దుల్, హాస్పిటల్ స్టాఫ్,  నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

గొలగానికే....మేయర్ పీఠం

 గొలగానికే....మేయర్ పీఠం

జి.వి.ఎం.సి. మేయరు గా హరి వెంకట కుమారి ఎన్నిక

విశాఖ పొలిటికల్, పెన్ పవర్  

విశాఖ నగర మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఆరిలోవ 11 వ వార్డు వై.ఎస్.ఆర్.సి.పి. అభ్యర్ధినిగా 4850 మెజారిటీ తో గెలిచి అందరి మన్ననలు పొందిన గొలగాని హరి వెంకట కుమారి ని నేడు విశాఖ నగర మేయర్ పదవి వరించింది. ఆమె  ఒమ్మి లక్ష్మీ, మరియు స్వర్గీయ ఒమ్మి అప్పల నాయుడు దంపతుల  ప్రధమ కుమార్తె. ఆమెది ఒక సామాన్య  సాదా సీదా కుటుంబం. బి.ఎస్.సి.,బి.ఇ. డి. విద్యను అభ్యసించారు. అంతకు మించి ప్రజాసేవ అనే గ్రంధాన్నిక్షుణ్ణంగా పఠించిన సేవాతత్పరత భావాన్ని కలిగిన నిగర్వి.  స్వర్గీయ దివంగత నేత, మాజీ మంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి చేసిన సేవలకు ఆకర్షితుడై  ప్రజాసేవకే అంకితమైన గొలగాని శ్రీనివాస్ ను వివాహం చేసుకున్నారు. అప్పటి నుండి అనునిత్యం భర్త అడుగుజాడల్లో నడుస్తూ ప్రతి ఒక్కరి తో మమేకమై తారతమ్య బేధాలు లేకుండా ప్రజాసేయస్సుకు పాటుపడుతూ నేడు మేయర్ పీఠాన్ని అధిష్టించారు. ఈ సందర్బంగా మేయర్ హరి వెంకట కుమారి మాట్లాడుతూ.   ఒక బి.సి. సామాజిక మహిళకు మేయర్ పదవిని కట్టబెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి, రాజ్యసభ సభ్యులు విజయ్ సాయి రెడ్డి కి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా కుల మత వర్గ తరతమ్యా బేధాలు లేకుండా అందరికీ  అన్నివేళలా అందుబాటులో వుంటూ అవినీతికి తావు లేకుండా  ప్రజల సమస్యలను తీర్చడమే నా ప్రధాన ద్యేయమని మరియు నగరం లోని అన్ని వ్వార్డులను సందర్శించి  సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా అడుగులు వేస్తామని ముఖ్యంగా సామాన్య ప్రజానీకానికి అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. 

ఈ నేపథ్యంలో వై.ఎస్.ఆర్.సి.పి. నాయకుడు గోలగాని  శ్రీనివాస్ మాట్లాడుతూ.....కార్పొరేషన్ ఏజండా గా మంచి నీటి సమస్య లేకుండా చూస్తామని, డ్రైనేజీ వ్యవస్థ ను ప్రక్షాళన పరుస్తామని,   పారిశ్రామిక వేత్తలు  పెట్టుబడులు పెట్టె రీతిలో నగరాన్ని తీర్చిదిద్దుతామని, పర్యాటక రంగాన్ని అభివృద్ధి  పరుస్తామని,  100 సంవత్సరాల చరిత్ర కలిగిన ముడసర్లోవ రిజర్వాయర్ ను అభివృద్ధి చేస్తామని,  సిటీ లో ఉన్న విలీన మారుమూల ప్రాంతాలన్నింటినీ జోనల్ కమీషనర్, ఆ ప్రాంత ప్రజా ప్రతినిధి, వ్వాలంట్రీ, సచివాలయా వ్యవస్థ లను కలుపుకోని ఒక ప్రణాళిక బద్దం గా అభివృద్ధి చేస్తామని, ఆరోగ్య విషయం లో స్థానికంగా ఉన్న ప్రాథమిక వైద్యశాలాలను అభివృద్ది పరిచి మెరుగైన వైద్యాన్ని అందిస్తామని, నగరం లో లక్షలాది వాహనాల వలన ట్రాఫిక్ సమస్య అధికంగా ఉందని పోలీస్ కమీషనర్ వారిని సంప్రదించి ప్రజలకు అనుకూలంగా ఆ సమస్యను పరిష్కరిస్తామని అన్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నగరాన్ని ఎగ్జిక్యూటివ్ కాపిటల్ గా ప్రకటించడం జరిగిందని ఆయన ఆశీస్సులతో, విజయసాయిరెడ్డి సూచనలతో ఈ నగరాన్ని యావత్ దేశంలోనే ఆదర్శవంతమైన నగరంగా తీర్చిదిద్ధి ప్రపంచ పటంలో చూపిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. అధికారులు, రాజకీయ నాయకులు అనే తారతమ్యం లేకుండా, పార్టీ వైషమ్యాలు పొడ చూపకుండా అందరూ ఒకే కుటుంబం లా పనిచేసి ప్రజా సంక్షేమానికి, కార్పొరేషన్ అభివృద్ధి కి పాటు పడాలని హితవు పలికారు. విశాఖ జోనల్ కమిషనర్ లు, కార్పొరేషన్ యూనియన్ లీడర్లు, వివిధ సంఘాల పెద్దలు, ఎన్నికయిన పాలక మండలి కార్పొరేటర్లు, వివిధ విద్యా సంస్థల ప్రిన్సిపాల్ లు, విద్యార్థులు, చర్చ్, మసీదు మత పెద్దలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళా సంఘాలు , విద్యుత్ సంఘ ఉద్యోగులు మేయర్ నుమర్యాద పూర్వకంగా కలసి  అభినందించారు. పూలమాలలు, పుష్ప గుచ్చాలు సమర్పించి  శాలువాలు కప్పి సన్మానించారు.

సూడో పోలీసుల అరెస్టు రిమాండ్.

 సూడో పోలీసుల అరెస్టు రిమాండ్.. పేకాట వ్యసనం..కటకటాల పాలు చేసింది..

మేడ్చల్ పట్టణంలో సూడో పోలీసుల హల్ చల్..డమ్మీ తుపాకీతో బెదిరించి నగదు దోచుకెళ్ళిన 6 గురు సూడో పోలీసులు..

ఈనెల 14వ తేదీన ఆర్ ఆర్ ఓలాడ్జ్ లో డమ్మీ గన్ తో బెదిరింపులు..డిసిపి పద్మజ.. ఒక డమ్మి రివాల్వర్, ఫైబర్ లాఠీ, జంగిల్ ష్యూస్,పోలీస్ క్యాప్,2,22,000 నగదు స్వాదీనం..








పెన్పవర్,

మేడ్చల్

మేడ్చల్ పోలిస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 14వ తేదీన పోలీసులమని చెప్పి లాడ్జీలో పేకాట ఆడుతున్న ఇందుగల మణికంఠ, శ్రీహరి, సాయి సాంగ్ అనే ముగ్గురు వ్యక్తుల పై పోలీసులమని ఆరుగురు దుండగులు బెదిరించి దాడి చేశారు. మణికంఠ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మేడ్చల్ పోలీసులు. గురువారం డిసిపి పద్మజ, ఏసీపీ రామ లింగరాజు, సీఐ ప్రవీణ్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో వివారాలు వెల్లడించారు.. ఫేక్ పోలీసులమని చెప్పిన ఆరుగురు దుండగులను పోలీసులు కేసున ఛేదించి పట్టుకున్నారు. లాడ్జీలో పేకాట ఆడుతున్న ముగ్గురిపై తుపాకీతో బెదిరించి వారి వద్ద నుండి దాదాపు 2,20,000 రూపాయలను అపహరించిన డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఆరుగురి సూడోపోలీసుల వివరాలు అకీల్, అహ్మద్, షేక్ మహమ్మద్, అక్సర్, కైజర్, మహమ్మద్ ల ను మేడ్చల్ సీఐ ప్రవీణ్ రెడ్డి, క్రైమ్ టీమ్ సహాయంతో వారిని పట్టుకున్నారని డిసిపి పద్మజ పత్రిక సమావేశంలో పేర్కొన్నారు.. డీసీపీ పద్మజ మాట్లాడుతూ లాడ్జీలను అద్దెకు ఇచ్చేటప్పుడు పూర్తి వివరాలను నమోదు చేసుకోవాలని లాడ్జీ యాజమాన్యాలకు సూచించారు. ఇంత త్వరగా కేసును ఛేధించినందుకు పోలీసులను డిసిపి పద్మజ అభినందించారు.  పేకాట వ్యసనమే..క్రిమినల్ ఆలోచనకు దారితీసింది.. పిర్యాదు దారులు మణికంఠ,శ్రీహరి, సామ్ సంగ్ లు తరచు నిజామాబాదుకు చెందిన అఖిల్ అహ్మద్, అహ్మద్ అజిమ్, షేక్ అహ్మద్ లతో అందర్,బాహర్ అనే పేకాట ఆడేవారు.. ప్రతిసారీ మణికంఠ అతని స్నేహితులే డబ్బులు గెలుచుకుంటున్నారనే అక్కసుతో , వారి దగ్గర నుండి ఎలాగైనా డబ్బులు కాజేయాలని నిందితుడు ఏ1 అఖిల్ అహ్మద్ పథకం ప్రకారం పేకాట ఆడుదామని వారిని మేడ్చల్ పట్టణంలోని ఆర్ఆర్ లాడ్జ్ కు పిలిపించాడు,అఖిల్ అహ్మద్ ముందుగా వేసిన ప్లాన్ ప్రకారం షేక్ అక్బర్, గణేశ్, ఖైసర్ లతో కలిసి ముఠాగా ఏర్పడి వీరు ఆడేరూమ్ సమీపంలోనే మరో రూమును తీసుకున్నాడు. పేకాడ ఆడే సమయంలో సదరు రూము తలుపులు కొట్టగా..లోపల వ్యక్తులు తలుపులు తీయగా అనుకున్న ప్లాన్ ప్రకారం ఖైసర్ ,గణేష్ లు డమ్మి తుపాకీ తో బెదిరించి ,లాఠీలతో కొడుతుండగా వారి దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చి వదలమని ప్రాదేయ పడ్డారు. ఆ డబ్బులు ఖైసర్ తలదిండు కవర్ లో వేసుకొని కింద తమ సి.ఐ సార్ ఉన్నాడని కదలకుండా ఇక్కడే ఉండాలని హెచ్చరించి వెళ్ళిపోయారు..,, ఎంతకూ రాకపోవడంతో అనుమానం వచ్చి చూడగా అక్కడ ఎవరూ లేని విషయం గమనించిన బాదితులు.. వారు సూడోపోలీసులుగా గుర్తించి వెంటనే మణికంఠ పోలీసులకు ఫిర్యాదు చేశారు.. మేడ్చల్ పోలీసులు మూడు స్పెషల్ టీంలు ఏర్పాటు చేసి వెతకగా తూప్రాన్ వద్ద పోలీసులు వీరిని అఖిల్ అహ్మద్, షేక్ అహ్మద్, షేక్ ఆజమ్,షేక్ అక్బర్,గణేష్ మరియు షేక్ ఖైసర్ ను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించామని డి.సి.పి తెలిపారు. వారి వద్ద నుండి ఒక డమ్మి గన్,ఫైబర్ లాఠీ, జంగిల్ షూస్, పోలీస్ క్యాప్ మరియు 2,22,000/- రెండు లక్షల ఇరవై రెండు వేల నగదు స్వాధీనం చేసుకున్నారు..

జడ్పీ ఎస్ ఎస్ పాఠశాలలో కరోనా కలకలం

 జడ్పీ ఎస్ ఎస్  పాఠశాలలో కరోనా కలకలం

గుడిహత్నూర్,  పెన్ పవర్ 

 ఆదిలాబాద్ జిల్లాలోని  ఇచ్చోడ మండల కేంద్రంలోని జడ్పీఎస్ ఎస్ పాఠశాలలో కరోనా కలకలం రేపుతోంది. పాఠశాలలోని 8 మంది ఉపాద్యాయులకు పాజిటివ్ రావడంతో మండలం మొత్తం ఉలిక్కిపడుతోంది. బుధవారం ఒక ఉపాధ్యాయునికి పాజిటివ్ రావడం తో ఈ రోజు పాఠశాలలోని 70 మంది బోధన, బోధనేతర సిబ్బంది మరియు 40 మంది విద్యార్థులకు పరీక్షలు చేయగా 7 గురు ఉపాధ్యాయులకు పాజిటివ్ అని తేలింది.దీనితో నేటి నుండి సోమవారం వరకు 5 రోజుల పాటు సెలవు ప్రకటించిన మండల విద్యాధికారి తెలిపారు.

సెల్ టవర్ తొలగించాలంటు నిరసన

 సెల్ టవర్ తొలగించాలంటు నిరసన

పెన్ పవర్,  మల్కాజిగిరి

 గౌతంనగర్ డివిజన్ లోని జనావాసాల మధ్య సెల్ ఫోన్ టవర్ ఏర్పాటు చేస్తున్నా వాటిని తొలగించాలంటు  గురువారం మల్లికార్జున నగర్ లో కాలనీవాసులు ఆందోళన చేపట్టారు. రేడియేషం తో ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదురుకొవలసిన పరిస్దితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక టిఆర్ఎస్ నేత మేకల రాము యాదవ్ కు ఫిర్యాదు చేయడంతో మల్కాజిగిరి శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చరు. ప్రస్తుతం సెల్ టవర్ పనులు ఆగిపోవడంతో కాలనీవాసులు నిరసనను విరమించారు.

ఎంపీని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా బిజెపి నాయకులు.

 ఎంపీని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా బిజెపి నాయకులు..


వేములవాడ, పెన్ పవర్

భారతీయ జనతా పార్టీ యువ మోర్చా రాజన్న సిరిసిల్ల జిల్లా అధికార ప్రతినిధి సార్ల చారి,యువమోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు ఈర్లపల్లి హరీష్,రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు ఎర్రం మహేష్,బిజెపి నాయకులు ముప్పిడి శ్రీనివాస్ లు  గురువారం  కరీంనగర్ ఎంపి,తెలంగాణ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు సంజయ్ కుమార్ ను పార్టీ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలుసుకొని స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నూతనంగా నియమించబడిన నాయకులకు ఎంపి శుభాకాంక్షలు తెలిపారు.

రెండో రోజు కొనసాగిన అరెస్టుల పర్వం..

 రెండో రోజు కొనసాగిన అరెస్టుల పర్వం..



 
వేములవాడ,పెన్ పవర్

నియోజకవర్గ అభివృద్ధి గాలికొదిలి సంవత్సరం కాలంగా జర్మనీలో ఉంటున్న వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు రాజీనామా చేయాలంటూ రెండో రోజు అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న   వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులను గురువారం ఉదయం  పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ .. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందని .. ఇలా ముందస్తు అరెస్టులు చేయడం అప్రజాస్వామికం అని,టిఆర్ఎస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీల నాయకుల చూస్తే  భయం మొదలైందని, ఆ భయంతోనే  ప్రజాస్వామ్య విరుద్ధంగా అరెస్టులు చేయిస్తున్నారని పేర్కొన్నారు. అరెస్టయినవారిలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సాగర్ వెంకటస్వామి, మోడీ కే చంద్రశేఖర్, చిలక రమేష్, మధు, ఎంపిటిసి రాజశేఖర్, నాగుల విష్ణు, సర్పంచ్ రాజ ప్రకాష్, ప్రశాంత్, ఎర్ర మామయ్య, రాజేష్, రాము,రాజు  ఉన్నారు

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...