ప్రజ్ఞ సూపర్ స్పషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి...
పెన్ పవర్ ,మేడ్చల్
మేడ్చల్ మునిసిపాలిటీ పరిధిలో ఈ రోజు ప్రజ్ఞ సూపర్ స్పషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రి మల్లారెడ్డి, మునిసిపాలిటీ ఛైర్పెర్సన్ మర్రి దీపిక నర్సింహారెడ్డి, వైస్ చైర్మన్ చిర్ల రమేష్, ఎంపీపీ పద్మజగన్ రెడ్డి, డాక్టర్ సరళ, ఎండి. రవి కుమార్ లతో కలిసి ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి, హాస్పిటల్ ఎం.డీ రవికుమార్, డా.సరళ మాట్లాడుతూ ప్రజలకు 24/7 గంటల సర్వీస్ అందుబాటులో వైద్యసేవలు అందిస్తామని అన్ని రకాల సర్జరీలు చేస్తామని, పేదప్రజల అనుకూలంగా ఉండే వేగంగా మా సేవలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు మద్దెల శ్రీనివాస్ రెడ్డి, మర్రి నర్సింహారెడ్డి, మునిసిపాలిటీ ప్రెసిడెంట్ శేఖర్ గౌడ్, నగరాజ్, రవీందర్, మోనార్క్, మధుకర్, మోహన్ రెడ్డి, మునిసిపాలిటీ కౌన్సిలర్లు నర్సింహ స్వామి యాదవ్, తుడుం గణేష్, జకట దేవరాజ్, సాటి నరేందర్, మర్రి శ్రీనివాస్ రెడ్డి, సాయి కుమార్ మరియు ఆసుపత్రి సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.







