Followers

స్థలం ఇచ్చిన దాతలకు సత్కారం

 స్థలం ఇచ్చిన దాతలకు సత్కారం

పెన్ పవర్,ఆత్రేయపురం

ఉచ్చిలి గ్రామంలో గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రానికి అవసరమైన 10 సెంట్ల స్థలాన్ని ఉచ్చిలి గ్రామ పెద్దలు కీ. శే.  నంబూరి జగ్గ రాజు నంబూరి వెంకట రాజు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు నంబూరి వెంకట రామరాజు మురళి మాస్టారు రవి మాస్టార్ట్ రాంబాబు సుబ్బారాజు వారి స్వాధీనంలో సర్వే నంబర్34/13లో ఉన్న స్థలం 10 సెంట్లు ఏ విధమైన ప్రతిఫలం ఆశించకుండా కీ. శే. నంబూరి  జగ్గరాజు వెంకటరాజు స్థల దాతలుగా పేర్కొని ఆత్రేయపురం ఎంపీడీవో  ద్వారా ఉచ్చిలి  గ్రామపంచాయతీకీ అందించినట్లు తెలిపారు ఎంపీడీవో నాతి బుజ్జి  మాట్లాడుతూ మండలంలో ఎంత విలువైన భూములను ఎలాంటి స్వ లాభాపేక్ష లేకుండా ప్రభుత్వ కార్యాల నిర్మాణం కొరకు అందించినందుకు స్థల దాతలు సత్కరించారు ఈ కార్యక్రమంలో ఉచ్చిలి నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ ఊర్రింకల మీరమ్మ త్రిమూర్తులు ఉప సర్పంచ్ పద్మరాజు బాబులురాజు  ఇందుకూరికృష్ణంరాజు బచ్చు శివ ప్రసాద్ ఊర్రింకల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సన్మానించిన ఏబీవీపీ నాయకులు

 రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సన్మానించిన ఏబీవీపీ నాయకులు 

అదిలాబాద్,పెన్ పవర్

  బేల మండల కేంద్రంలో ని ఏబీవీపీ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సునీల్, నందు ను ఏబీవీపీ మండల నాయకులు శాలువా తో  ఘనం గా సన్మానించారు.వారి ఎన్నిక పట్ల జిల్లా  ఎస్ ఎఫ్ డి  కన్వీనర్ మడవార్ హరీష్, మండలఅధ్యక్షుడు శివనిత్ వార్ ఓంప్రకాశ్ హర్షం వాక్యం చేశారు. ఈ కార్యక్రమంలో మనోజ్ అజయ్, పాండు, సాయి,ప్రితం, తదితరులు పాల్గొన్నారు.

ప్రజ్ఞ సూపర్ స్పషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి...

 ప్రజ్ఞ సూపర్ స్పషాలిటీ ఆసుపత్రిని  ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి...

పెన్ పవర్ ,మేడ్చల్

 మేడ్చల్ మునిసిపాలిటీ పరిధిలో ఈ రోజు ప్రజ్ఞ సూపర్ స్పషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రి మల్లారెడ్డి, మునిసిపాలిటీ ఛైర్పెర్సన్ మర్రి దీపిక నర్సింహారెడ్డి, వైస్ చైర్మన్ చిర్ల రమేష్, ఎంపీపీ పద్మజగన్ రెడ్డి, డాక్టర్ సరళ, ఎండి. రవి కుమార్ లతో కలిసి ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి, హాస్పిటల్ ఎం.డీ రవికుమార్, డా.సరళ మాట్లాడుతూ ప్రజలకు 24/7 గంటల సర్వీస్ అందుబాటులో వైద్యసేవలు అందిస్తామని అన్ని రకాల సర్జరీలు చేస్తామని, పేదప్రజల అనుకూలంగా ఉండే వేగంగా మా సేవలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు మద్దెల శ్రీనివాస్ రెడ్డి, మర్రి నర్సింహారెడ్డి, మునిసిపాలిటీ ప్రెసిడెంట్ శేఖర్ గౌడ్, నగరాజ్, రవీందర్, మోనార్క్, మధుకర్, మోహన్ రెడ్డి, మునిసిపాలిటీ కౌన్సిలర్లు నర్సింహ స్వామి యాదవ్, తుడుం గణేష్, జకట దేవరాజ్, సాటి నరేందర్, మర్రి శ్రీనివాస్ రెడ్డి, సాయి కుమార్ మరియు  ఆసుపత్రి సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.

సంచార చలివేంద్రం ప్రారంభం

 సంచార చలివేంద్రం ప్రారంభం

కూకట్ పల్లి,పెన్ పవర్ 

యోగ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో గత ఇరవై ఆరు సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న మజ్జిగ పంపిణీ కార్యక్రమని కూకట్ పల్లి ఏసిపి సురేందర్ రావు ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కూకట్ పల్లీ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని యోగ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో గత ఇరవై ఆరు సంవత్సరాలుగా ఆయుర్వేద విద్యా, ఆహార విద్యా, యోగా నేర్పించడమే కాకుండా సమాజసేవలో భాగంగా ప్రతిరోజు పలు ఆసుపత్రులు తిరుగుతూ ప్రతిరోజు సుమారు ఏడు వందల మందికి పైగా ఆహారం అందజేస్తున్న ప్రముఖ యోగా గురువు జగన్ గురుజిని ఆయన అభినందించారు.జగన్ గురూజీ మాట్లాడుతూ కరోనా సమయంలో అరవై రోజుల పాటు రోజు రెండు వేల మందికి ఆహారం అందజేయడం జరిగిందని, అదే సేవ దృక్పథంతో మూడు నుండి నాలుగు నెలల పాటు బాలానగర్ చౌరస్తా నుండి మియాపూర్ చౌరస్తా వరకు మజ్జిగ, నిమ్మరసం, పళ్ళ రసాల వంటి పానీయాలను రహదారుల వెంబడి సంచరిస్తూ ఉచితంగా అందచేస్తామని, తమ సంస్థ ఆధ్వర్యంలో నిత్యం సేవా కార్యక్రమాలు ఇలానే కొనసాగుతాయని తెలియజేశారు. కూకట్ పల్లి సిఐ నర్సింగ్ రావు మాట్లాడుతూ ఇలాంటి మంచిపని చేయడం ఎంతో హర్షదాయకమని, నిరంతరం ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించే తమ సిబ్బందికి కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడుతయని,  భవిష్యత్తులో ఈ సంస్థ మరిన్ని సేవలు చేస్తూ ముందుకు వెళ్లాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి ఎస్.ఐలు శంకర్, భాను ప్రసాద్, సురేష్, సీనియర్ జర్నలిస్టులు జయకుమార్ గుప్తా, గంగరాజు, లక్ష్మణ్ ప్రసాద్, విద్య సాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లలో సీట్లు సంఖ్య పెంచాలి

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లలో సీట్లు సంఖ్య పెంచాలి

పెన్ పవర్,విశాఖపట్నం

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సీట్ల సంఖ్య పెంచాలని ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న ప్రతీ ఒక్కరికీ డిగ్రీ లో ప్రవేశం కల్పించాలని గిరిజన విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తుంది.బుధవారం ‍జిల్లా గిరిజన విద్యార్థి సంఘం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి మరియు ఆంధ్ర యూనివర్సిటీ ఆదేశాల మేరకు  జారీచేసిన షెడ్యూల్ ప్రకారం, బి.ఏ. బీకాం .బీఎస్సీ గ్రూపుల్లో చేరేందుకు ఆన్లైన్ లో విద్యార్ధులు,దరఖాస్తులు చేసుకున్నారు. ఇంటర్మీడియట్ ప్రెస్ రిలీజ్ అయిన విద్యార్థిని విద్యార్థులు ఆయా ప్రాంతాల్లో ఉన్న డిగ్రీ కళాశాలల్లోనే ఆన్ లైన్ చేసుకోవడం జరిగింది.విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో వేలాది మంది ఇంటర్ మీడియట్ విద్యార్థినీ విద్యార్థులు అరకొర సీట్ల పై ఆందోళన చెందుతున్నారు.ఆన్ లైన్ చేసుకున్న పేద గిిరిజన విద్యార్థులకు డిగ్రీ కళాశాలలో సీట్లు పెంచి చదువుకునే అవకాశం కల్పించాలి. కావున డిగ్రీ కళాశాలల్లో ప్రతి గ్రూప్ కి కనీసం 60 సీట్లు అయిన పెంచాలి. అప్పుడే ప్రతి ఒక్కరూ చదువుకోడానికి వీలు కలుగుతుంది.ముఖ్యంగా పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు ఎక్కువమంది ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు చేసు కోవడం జరిగింది.ఈ కళాశాలల్లో సీట్లు చాలా తక్కువగా ఉన్నాయి. కావున ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి డిగ్రీ కళాశాలలో ఉన్న బిఏ.బికాం.బీఎస్సీ గ్రూపు ల సీట్ల ను పెంచి అప్లై చేసుకున్న ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థుల. కు ప్రభుత్వ కళాశాలలో చదువుకునే అవకాశం కల్పించాలి.లేని ఎడల విద్యార్థులు చదువుకు దూర మై చెడువ్యసనాలకు బానిసలు అవుతారు.కావున ప్రజాప్రతినిధులు సహకారం అందించాలని కోరుతున్నారు.ఈ సమస్య పాడేరు ఐటిడిఏ పీఓ దృష్టి కి తీసుకు వెల్లగా ఆయన స్పందించి విద్యార్థులు అందరికీ చదువుకునే వెసులుబాటు కల్పిస్తామని హమి ఇచ్చినట్లు విద్యార్థి సంఘం తెలిపింది.గిరిజన విద్యాసర్థి సంఘం జి ఎస్ యుఫ జిసల్లాఅధ్యక్షులు బుడిదే సుమన్. మాజీ అధ్యక్షుడు కిషోర్ కిరశని సాయినాథ్ గొల్లోరి, సత్య నారాయణ తమర్భా రమేష్ విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలు

 ఘనంగా సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలు

అదిలాబాద్, పెన్ పవర్

మండల కేంద్రంలోని ఏబీవీపీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 124వ వర్థంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆమె  చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కర్యవర్గ సభ్యులు రాజన్లవార్ సునీల్,దమాల నందు మాట్లాడుతూ.బాల్యవివాహాలు,అంటరానితనం, సతిసహగమనానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని  కొనియాడారు.ఆమె రచనలు స్తెతం మహిళల్లో చైతన్యని నింపాయని నేటి మహిళలు ఆమె స్పూర్తితో తమ సమస్యలపై పోరాడాలని పిలుపు నిచ్చారు. సావిత్రిబాయి పాఠశాలకు వెళ్లే క్రమంలో ఎన్ని అవాంతరాలు ఎదుర్తెనా బాధలను ఎదుర్కొని స్త్రీలకు చదువు నేర్పా మొదటి మహిళగా నిలిచిందన్నారు.ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా ఎస్ ఎఫ్ డి  కన్వీనర్ మడవార్ హరీష్,మండల అధ్యక్షుడు ఓం ప్రకాష్,అజయ్,సాయి,మనోజ్ రెడ్డి,ప్రీతం,తదితరులు పాల్గొన్నారు.

అన్నదాతలు ప్రకృతి వ్యవసాయంపై మక్కువ చూపాలి

 అన్నదాతలు ప్రకృతి వ్యవసాయంపై మక్కువ చూపాలి

పెన్ పవర్,ఆలమూరు 

  అన్నదాతలు ప్రకృతి వ్యవసాయంపై ఎక్కువ శ్రద్ధ చూపాలని ఆలమూరు సబ్ డివిజన్ వ్యవసాయశాఖ ఏడీఏ సీహెచ్ కెవి చౌదరి అన్నారు. బుదవారం ఆలమూరు మండలం మోదుకూరు గ్రామంలో పొలంబడి కార్యక్రమం ఆలమూరు మండల వ్యవసాయ అధికారిణి సోమిరెడ్డి లక్ష్మి లావణ్యతో కలిసి నిర్వహించారు. ఈ కార్యక్రమం యొక్క ఉపయోగం ఏ విధంగా ఉన్నదాని రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రతి రైతు కుటుంబానికి సరిపడా వరి, కూరగాయలు ప్రకృతి వ్యవసాయం విధానంలో పండించుకుని తినడం ద్వారా ఏ విధమైనటువంటి లాభాలు ఉంటాయో తెలిపారు. అగ్గి తెగులు, మాని పండు తెగులు పంటలపై ఏవిధంగా సౌకుతుందో వాటి నివారణ చర్యలు రైతులకు వివరించారు. అలాగే మిత్ర పురుగుల గురించి వివరిస్తూ చిత్ర పటాలు ద్వారా చూపించి అవి ఏవిధంగా శత్రు పురుగులను నాశనం చేస్తాయో తెలియజేశారు. అనంతరం వాటర్ హోల్డింగ్ కెపాసిటీ గురించి వివరిస్తూ, మూడు రకాల నేలలలో ఏ విధంగా నీటిని పట్టి ఉంచుతుంది అనేది తెలిపారు. అనంతరం ప్రతి రైతు దాళ్వా వరి అనంతరం చేను తగలబెడం వలన అనేక అనర్థాలు కలుగుతాయని అన్నారు. అలాగే 200 లీటర్ల నీటిలో రెండు కేజీల బెల్లం కలిపి డీకంపోజర్ ను దానిలో కలిపి ప్రతి రోజు ఉదయం సాయంత్రం కలుపుతూ నాలుగు నుంచి ఏడు రోజుల పాటు చేస్తే మంచి ద్రావణం తయారవుతుందని, వాటిని ప్రకృతి వ్యవసాయంలోని ఆకులను, ఎండు గడ్డిని కుళ్ళబెట్టడానికి ఉపయోగించవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల వ్యవసాయ సహాయకులు తోపాటు పలువురు రైతులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...