Followers

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు ఖాయం

 ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు ఖాయం

చిన్నగూడూరు,పెన్ పవర్

చిన్న గూడూరు మండల కేంద్రంలోని గురువారం నాడు వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ సన్నాహక సమావేశం ఏర్పాటు చేసినారు. ముఖ్యఅతిథిగా డోర్నకల్ శాసనసభ్యులు డీఎస్ రెడ్యానాయక్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎన్నికలలో పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు ఖాయం అన్నారు. పట్టభద్రులు వారి మొదటి ప్రాధాన్యత(1)  ఓటు పల్లా రాజేశ్వర్ రెడ్డికి వేయాలి అని వారు అన్నారు. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో జరుగుతున్న అభివృద్ధి పనులను వారు వివరించారు. మిషన్ భగీరథ ,వృద్ధాప్య పింఛన్ ,ఒంటరి మహిళ పింఛన్, కళ్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్,రైతుబంధు, ఉచిత కరెంట్, రైతు బీమా, దేశానికి తలమానికంగా నిలిచినా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి రాష్ట్రంలోని ప్రతి ఎకరాలకు నీరు అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. రానున్న రోజులలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ని అందించే దిశగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వల్లూరు పద్మ వెంక రెడ్డి, జెడ్ పి టి సి మూల సునీత మురళీధర్ రెడ్డి, వైస్ ఎంపీపీ పిల్లి వీరన్న, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామ్ సింగ్ నాయక్, మండల టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మండల యూత్ అధ్యక్షులు దుండి మురళి, సర్పంచులు, ఎంపీటీసీలు, పట్టభద్రులు తదితరులు పాల్గొన్నారు.

శివనామస్మరణతో హోరెత్తిన రామలింగేశ్వరాలయం

 శివనామస్మరణతో హోరెత్తిన రామలింగేశ్వరాలయం 

నెక్కొండ,పెన్ పవర్

నెక్కొండలోని శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో గురువారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు .ఆలయ అర్చకులు బివిఎన్ శాస్త్రి ఆధ్వర్యంలో అనుముల గోపాల కృష్ణమూర్తి శర్మ ,బూర్గుపల్లి శ్రావన్ శాస్త్రి ,శేష పవన్ కుమారాచార్యులు,వరప్రసాద్ శర్మ,సహజల్ యోధన్ శాస్ట్రీ ఆధ్వర్యంలో పూజాధి కార్యక్రమాలు సాగాయి .ఉదయం ఆరు గంటల నుంచే  ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. మధ్యాహ్నం దాకా మహాశివుడికి పంచామృత అభిషేక కార్యక్రమాలు సాగాయి .ఉత్సవ మూర్తులకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి సాయంత్రం నిర్వహించే కల్యాణానికి ముస్తాబు చేశారు. గర్భగుడిలో ప్రతిష్టుతులైన పరమశివుడికి రుద్రాభిషేకాలు, మంటపంలో కొలువుదీరిన పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులకు అష్టోత్తర శతనామ కార్యక్రమాలు సాగాయి .ఓం నమ శివాయ ,నమః పార్వతి పతయే హరహర మహాదేవ,శంభో శంకర  నామస్మరణతో ఆలయ ప్రాంగణం హోరెత్తాయి.సాయంత్రం నిర్వహించే  శివకల్యాణం కల్యాణ క్రతువుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. కార్యక్రమంలో విగ్రహ దాతలు నంగునూరి శివయ్య-సావిత్రి దంపతులు, శ్రీరామలింగేశ్వర సేవా సమితి సభ్యులు  డింగరిపవన్,ఆనంతులమురళీధర్,తాటిపెల్లి శివకుమార్,దోర్నాల ధర్మారెడ్డి, దొడ్డ విజయ్, పొక్కుల దనిష్ఠతదితరులు పాల్గొన్నారు.

బుగ్గ రాజ రాజేశ్వర దేవాలయంలో మొక్కులు చెల్లించుకున్న బండి సదానందం

 బుగ్గ రాజ రాజేశ్వర దేవాలయంలో మొక్కులు చెల్లించుకున్న బండి సదానందం

మందమర్రి, పెన్ పవర్


మహాశివరాత్రి సందర్భంగా బెల్లంపల్లి మండలంలోని బుగ్గ రాజా రాజేశ్వర దేవాలయంలో గురువారం అఖిలభారత యాదవ్ మహాసభ జిల్లా అధ్యక్షులు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బండి సదానందం యాదవ్ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ శ్రీదేవి శ్రీరాములు, స్థానిక కన్నాల సర్పంచ్ జిల్లపెల్లి సరూప వెంకటస్వామి లు బండి సదానందం కు ప్రత్యేక దర్శనం చేయించి ఆయనను ఘనంగా సన్మానించారు. అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర సీనియర్ నాయకులు గేళ్ళి రాజలింగు ఆధ్వర్యంలో బండి సదానందం యాదవ్ చేతుల మీదగా మజ్జిగ పంపిణీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సదానందం యాదవ్ భక్తులందరినీ ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో పాటు సుఖసంతోషాలతో ఆ భగవంతుడు అందరిని చల్లగా చూడాలని కోరుకున్నారు.

పట్టణంలో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు

 పట్టణంలో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు

మందమర్రి, పెన్ పవర్





మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం మందమర్రి పట్టణం శివనామ స్మరణతో మార్మోగింది. పట్టణంలోని అన్ని శైవాలయలలో మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండే భక్తులు శివాలయాలను దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహా శివరాత్రి పండుగను పురస్కరించుకొని పట్టణ ప్రజలు ఉదయాన్నే నదీ స్నానానికి సమీపంలోని గోదావరి నదికి చేరుకొని, నది జలాలను తీసుకు వచ్చి శివునికి ప్రత్యేక పూజల్లో ఉపయోగించారు. శివునికి ఎంతో ప్రీతికరమైన బిల్వలు, పత్రాలు, పూలు, పండ్లు, పూజ సామాగ్రి, బోనాలు, జాగరణ సామాగ్రిని కొనుగోలు చేసేందుకు ప్రజలు పట్టణంలోని మార్కెట్ ప్రాంతంలో బారులుతీరారు. చుట్టుపక్కల ప్రాంతాల నుండి చిరువ్యాపారులు ఉదయాన్నే పట్టణ మార్కెట్ పరిసర ప్రాంతాల్లో పూజా సామాగ్రి, వివిధ రకాల పండ్లను తీసుకువచ్చారు. దీంతో పట్టణంలోని మార్కెట్ ప్రాంతం జన సమూహంతో కిక్కిరిసిపోయి, పండుగ శోభను సంతరించుకుంది. శివరాత్రి మహోత్సవం పురస్కరించుకొని పట్టణంలోని అన్ని శైవాలయాలు శోభాయ సుందరంగా అలంకరించారు. మహా శివరాత్రి సందర్భంగా శివునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, లింగోద్భవ సమయంలో ప్రత్యేక అభిషేకాలు,శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. పట్టణంలోని శివ భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో భారీ ఎత్తున మహాశివరాత్రి పూజా కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో విశాల్ గౌడ్..

 ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో విశాల్ గౌడ్..

జీడిమెట్ల,పెన్ పవర్

జీడిమెట్ల డివిజన్ పరిధిలోని అయోధ్య నగర్ లో టి.ఆర్ఎస్. పార్టీ నాయకులు కె.పి. విశాల్ గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు.. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ మన రాష్ట్రం బంగారు తెలంగాణ కావాలంటే ,అది కేవలం మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లనే సాధ్యమవుతుందని అన్ని మతాలను, కులాలను కలుపుకొని పోయే పెద్ద మనసు కె.సీ.ఆర్.దని కావున మార్చి 14 వ తారీకున జరగబోయే పట్టభద్రుల ఎన్నికలలో ముఖ్యమంత్రి కే.సీ.ఆర్. బలపరిచిన అభ్యర్థి సురభి వాణి దేవికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కే.పి విశాల్ గౌడ్ ఓటర్లను కోరారు.ఈ కార్యక్రమంలో గ్రాడ్యుయేట్ ఓటర్లు మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

శంభో శివ శంభో

 శంభో శివ శంభో

ఘనంగా మహాశివరాత్రి వేడుక\భక్తులతో కిటకిటలాడిన గోదావరి

లక్షెట్టిపెట్,పెన్ పవర్




పట్టణంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో హిందూ భక్తులు మహాశివరాత్రి వేడుకని గురువారం ఘనంగా జరుపుకున్నారు.వేకువ జమునే కుటుంబ సభ్యులతో కలిసి గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అనంతరం సమీపంలోని శివాలయం ఆలయంకి చేరుకొని పూజలు నిర్వహించారు.భక్తులతో  గోదావరి నది సమీపం మొత్తం కిటకిటలాడింది.వచ్చిన భక్తులకు స్నానాల గదులు షవర్లుతో పాటు మహిళలు బట్టలు మార్చుకునే గదులను మెడికల్ క్యాంప్ లను అధికారులు ఏర్పాటు చేసారు.మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు పుణ్యస్నానాలకు వచ్చే భక్తుల బాగోగులు చూసుకున్నారు.పోలీస్  ఆధ్వర్యంలో సీఐ నారాయణ నాయక్ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మంచి బందోబస్తు ఏర్పాటు చేశారు.ట్రాఫిక్ సమస్యతో పాటు ఇతర సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు.మంచిర్యాల ఏసీపీ అఖిల్ మహాజన్ గోదావరి నది వద్ద పరిశీలించి భక్తులతో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంచి ఏర్పాట్లు పై హర్షం వక్తం చేశారు.

భారతీయ జనతా పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ నుండి భారీ చేరికలు..

 భారతీయ జనతా పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ నుండి భారీ చేరికలు..

కుత్బుల్లాపూర్,పెన్ పవర్

గాజులరామారం లోని చిత్తారమ్మ టెంపుల్ దగ్గర కమిటీ హాల్ లో జరిగిన బిజెపి నాయకుల కార్యకర్తల పట్టభద్రుల సమ్మేళన కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే శ్రీ కూన శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. 125 డివిజన్,129 డివిజన్ ల నుండి భారతీయ జనతా పార్టీ లోకి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున చేరారు. ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి శ్రీ రామచంద్ర రావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విద్యావంతులకు, మేధావులకు, పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు, కాంగ్రెస్ పార్టీ నుండి బిజెపిలో చేరిన వారంతా కూడా ప్రతి బస్తీలలో పాల్గొనాలని, ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని 25 మంది పట్టభద్రుల ఓటర్లను కలిసి టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, వారు చేస్తున్న దౌర్జన్యాలను పట్టభద్రుల ఓటర్లకు వివరించి రామచంద్ర రావుని గెలిపించాలని కూన శ్రీశైలం గౌడ్ కోరారు. డివిజన్ లో ఉన్న భారతీయ జనతాపార్టీ నాయకులు కొత్త పాత అని విభేదాలు లేకుండా అందరూ కలిసి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని, రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడేలా మనం అందరం కలిసి పని చేద్దామని, రాబోవు రోజుల్లో బస్తీలలో మరియు కాలనీలలో ఉన్న ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై పోరాటం చేద్దామని కూన శ్రీశైలంగౌడ్ అన్నారు . ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గిరి వర్ధన్ రెడ్డి, బిజెపి నాయకులు కేకే ఏం ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్, బక్క శంకర్ రెడ్డి, నందనం దివాకర్, నటరాజ్ గౌడ్, సాయినాథ్ నేత, ఎం ఎస్ వాసు, బుచ్చి రెడ్డి, యామ్ సాగర్, పులమ్మ,వర్మ, బలరాం, సుశాంత్, గాదె వినోద్, లక్ష్మి బిక్షపతి, రమేష్, నర్సింగ్ రావు, నందు, సంగీత, తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...