Followers

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

 ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

చిన్నగూడూరు, పెన్  పవర్

స్థానిక మండల కేంద్రంలో గురువారం నాడు రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ మంగపతిరావు ఖాతాదారుల సేవా కేంద్రాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సబ్బండ వర్గాల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రభుత్వ పథకాలను యువత సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మండలంలోని కొప్పుల రవీందర్ ఏర్పాటు చేసుకున్న ఖాతాదారుల సేవా కేంద్రం(మినీ బ్యాంక్ సర్వీస్)ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభం చేయడం జరిగిందని తెలిపారు. యువత తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా ఉపాధి అవకాశాలను అన్వేషించు కావాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రామ్ సింగ్, వెంకటరెడ్డి, వైస్ ఎంపీపీ పిల్లి వీరన్న, తెరాస మండల ప్రధాన కార్యదర్శి కరె ధారాసింగ్, టిఆర్ఎస్ నాయకులు మత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

అంగడిపేట్ శివాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు..

 అంగడిపేట్ శివాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు..

కుత్బుల్లాపూర్,పెన్ పవర్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని అంగడిపేట్ గ్రామంలోని శివాలయంలో మహా శివరాత్రి సందర్భంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహా శివరాత్రి సందర్భంగా స్వామి వారిని దర్శించుకోవడం ఆనందకరం అన్నారు. ప్రజలపై స్వామి వారి చల్లని చూపు తప్పక ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక టీఆర్ఎస్ నాయకులు మరియు భక్తులు పాల్గొన్నారు.

శివనామస్మరణతో హోరెత్తిన రామలింగేశ్వరాలయం

 శివనామస్మరణతో హోరెత్తిన రామలింగేశ్వరాలయం 

నెక్కొండ,పెన్ పవర్

నెక్కొండ లోని శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో గురువారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు .ఆలయ అర్చకులు బివిఎన్ శాస్త్రి ఆధ్వర్యంలో అనుముల గోపాల కృష్ణమూర్తి శర్మ ,బూర్గుపల్లి శ్రావన్ శాస్త్రి ,శేష పవన్ కుమారాచార్యులు,వరప్రసాద్ శర్మ,సహజల్ యోధన్ శాస్ట్రీ ఆధ్వర్యంలో పూజాధి కార్యక్రమాలు సాగాయి .ఉదయం ఆరు గంటల నుంచే  ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. మధ్యాహ్నం దాకా మహాశివుడికి పంచామృత అభిషేక కార్యక్రమాలు సాగాయి .ఉత్సవ మూర్తులకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి సాయంత్రం నిర్వహించే కల్యాణానికి ముస్తాబు చేశారు. గర్భగుడిలో ప్రతిష్టుతులైన పరమశివుడికి రుద్రాభిషేకాలు, మంటపంలో కొలువుదీరిన పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులకు అష్టోత్తర శతనామ కార్యక్రమాలు సాగాయి .ఓం నమ శివాయ ,నమః పార్వతి పతయే హరహర మహాదేవ,శంభో శంకర  నామస్మరణతో ఆలయ ప్రాంగణం హోరెత్తాయి.సాయంత్రం నిర్వహించే  శివకల్యాణం కల్యాణ క్రతువుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. కార్యక్రమంలో విగ్రహ దాతలు నంగునూరి శివయ్య-సావిత్రి దంపతులు, శ్రీరామలింగేశ్వర సేవా సమితి సభ్యులు  డింగరిపవన్,ఆనంతులమురళీధర్,తాటిపెల్లి శివకుమార్,దోర్నాల ధర్మారెడ్డి, దొడ్డ విజయ్, పొక్కుల దనిష్ఠతదితరులు పాల్గొన్నారు.

ఎ మ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు ఖాయం

ఎ మ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు ఖాయం

చిన్నగూడూరు, పెన్ పవర్

చిన్న గూడూరు మండల కేంద్రంలోని గురువారం నాడు వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ సన్నాహక సమావేశం ఏర్పాటు చేసినారు. ముఖ్యఅతిథిగా డోర్నకల్ శాసనసభ్యులు డీఎస్ రెడ్యానాయక్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎన్నికలలో పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు ఖాయం అన్నారు. పట్టభద్రులు వారి మొదటి ప్రాధాన్యత(1)  ఓటు పల్లా రాజేశ్వర్ రెడ్డికి వేయాలి అని వారు అన్నారు. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో జరుగుతున్న అభివృద్ధి పనులను వారు వివరించారు. మిషన్ భగీరథ ,వృద్ధాప్య పింఛన్ ,ఒంటరి మహిళ పింఛన్, కళ్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్,రైతుబంధు, ఉచిత కరెంట్, రైతు బీమా, దేశానికి తలమానికంగా నిలిచినా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి రాష్ట్రంలోని ప్రతి ఎకరాలకు నీరు అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. రానున్న రోజులలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ని అందించే దిశగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వల్లూరు పద్మ వెంక రెడ్డి, జెడ్ పి టి సి మూల సునీత మురళీధర్ రెడ్డి, వైస్ ఎంపీపీ పిల్లి వీరన్న, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామ్ సింగ్ నాయక్, మండల టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మండల యూత్ అధ్యక్షులు దుండి మురళి, సర్పంచులు, ఎంపీటీసీలు, పట్టభద్రులు తదితరులు పాల్గొన్నారు.

పోలీస్ స్టేషన్ వద్ద మృతదేహంతో ధర్నా

 పోలీస్ స్టేషన్ వద్ద మృతదేహంతో ధర్నా

గోకవరం,పెన్ పవర్ 

జైలు అధికారుల  అలక్ష వైఖరి కారణంగా  వ్యక్తి మృతిచెందాడని ఆరోపిస్తూ మృతుని బంధువులు గోకవరం పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగిన సంఘటన బుధవారం రాత్రి జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మండలంలోని తిరుమలాయపాలెం లో అటవీ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఇటీవల పోలీసులు సారా బట్టీలు పై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో తిరుమలాయపాలెం గ్రామానికి చెందిన బోయడి. చంద్రం వయసు (30) ని అరెస్ట్ చేసి ఈనెల ఏడో తేదీన రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి రిమాండ్ నిమిత్తం పంపించడం జరిగింది.చంద్రం అనారోగ్యం పాలవడంతో అతని జైలు సిబ్బంది రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.  బెయిలు మంజూరు కావడంతో   చంద్రాన్ని బుధవారం విడుదల చేశారు.తీసుకుని వస్తుండగా మార్గమధ్యంలో చంద్రం మృతిచెందాడు.గోకవరం పోలీస్ స్టేషన్కు చేరుకున్న కుటుంబ సభ్యులు మృతదేహంతో స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. మధుమేహం, గుండె పోటు వంటే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న చంద్రానికి అస్వస్థతకు గురై మృతి చెందాడని బంధువులు ఆరోపించారు. చంద్రానికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.విషయం తెలుసుకున్న నార్త్ జోన్ డిఎస్పి కడలి వెంకటేశ్వరరావు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించి మృతుడి  మరణానికి గల కారణాలను పరిశోధించి తెలుసుకుంటామని బంధువులకు హామీ ఇచ్చారు.ఈ మేరకు గురువారం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి చంద్రం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించడం జరిగింది.

శ్రీ రుద్ర కోటేశ్వర స్వామి ఆలయంలోశివ నామస్మరణతో మారు మ్రోగిన క్షేత్రాలు

 శ్రీ రుద్ర కోటేశ్వర స్వామి ఆలయంలోశివ నామస్మరణతో మారు మ్రోగిన క్షేత్రాలు 

వి.ఆర్.పురం,పెన్ పవర్  

మహాశివరాత్రి  పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ రుద్ర కోటేశ్వర స్వామి ఆలయంలో ప్రజలు దర్శించుకుని శివనామస్మరణతో శైవ క్షేత్రాలు మారుమ్రోగాయి. తూర్పు గోదావరి జిల్లా వి.ఆర్.పురం మండలం వడ్డీ గూడెం గ్రామంలో గోదావరి ఒడ్డున వెలసియున్న శ్రీ రుద్ర కోటేశ్వర స్వామి ఆలయానికి ఆలయ కమిటీ వారు. దేవాలయానికి వచ్చిపోయే భక్తులకు అసౌకర్యం కలగకుండాఅన్నిఏర్పాట్లు చేసినారు.

మండల స్థానిక తాసిల్దార్ ఎన్. శ్రీధర్ ఆలయ కమిటీ వారు. భక్తుల కొరకు ఏర్పాటు చేసిన వాటిని పరిశీలించి శ్రీ రుద్ర కోటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. వడ్డిగూడెం గ్రామ  సచివాలయానికి సంబంధించిన గ్రామ సెక్రటరీ సురేష్ రెడ్డి మరియు వాలంటీర్లు ఆధ్వర్యంలో దేవాలయానికి వచ్చి పోయే భక్తులకు  ఉచితంగా పులిహార మజ్జిగ ఏర్పాటు చేసినారు.

 రేఖ పల్లి హెచ్ సి కి సంబంధించి ఏఎన్ఎంలు ఆశ వర్కర్లు దేవాలయం వద్ద  హెల్త్ క్యాంపు ఏర్పాటు  చేసినారు.  మండలానికి డి ఎం హెచ్  ఓ  వచ్చి శ్రీ రుద్ర కోటేశ్వర స్వామినీ దర్శించుకుని హెల్త్ క్యాంప్ ను పరిశీలించారు.మండలంలోని గ్రామాల నుంచి వచ్చిన భక్తులకు అధికారులకు దైవ దర్శనం  ప్రసాదాల కార్యక్రమం బాగా జరిగిందని అధికారులు ప్రజలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి ముత్యాల రామారావు ఆలయ కమిటీ వారు పాల్గొన్నారు.

విద్యార్థులు లే వర్కర్లు

విద్యార్థులు లే వర్కర్లు

గూడెం కోత్తవీధి పెన్ పవర్ 

కరోనా తర్వాత స్కూలు రీజనింగ్ చేసిన నుండి మూడు నెలల గడిచిన తర్వాత హాస్టల్లో విద్యార్థులు, విద్యార్థినిలు చేత వేటి చాకిరీ చేయిస్తున్న ఉపాధ్యాయుల పై చర్యలు తీసుకోవాలని గిరిజనుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు, హాస్టల్లో ఉన్న కిచెన్ నుండి వచ్చే వ్యర్థం పదార్థాలు గంజి తో పాటు స్కూల్ ఎదురుగా ఉన్న డ్రైనేజీ లో మూడు నెలల పాటు వ్యర్థాలతో నిండిన మురుగు నీరు ఎటు వెళ్ళాక డ్రైనేజీ లో ఉండిపోవడంతో హాస్టల్ విద్యార్థులు సాయంత్రం భోజనం చేసిన తరువాత ఏడు గంటల సమయంలో అది  రహస్యంగా హాస్టల్ విద్యార్థినిలతో సాయంత్రం వేళల్లో ఏడు గంటల మొదలుకొని రాత్రి 9 గంటల వరకు మోకాళ్ళ లోతు డ్రైనేజీ మురుగు కాలువలోకి దింపిన హాస్టల్ వార్డెన్,పి, డి మరియు సూపర్వైజర్,స్టిడికి వచ్చిన ఇంగ్లీష్ టీచర్,కలిసి దగ్గరుండి చదువుకోనే పిల్లలు చేత మురుగు డ్రైనేజీ లో దింపారు, పిల్లలు చేతులతో ఆ మురుగు వ్యర్థాలను ఎత్తించి పైన పడేశారు, స్కూలుకు అనేక నిధులు వచ్చినప్పటికీ ఆ నిధులను పక్కదారి పడుతున్నాట్లు విద్యార్థుల తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు,చదువుకోనే చిన్న పిల్లలతో వెట్టి చాకిరి చేయిస్తున్న అధికారులు మాత్రం తమకు ఏమి తెలియనట్లు విచారిస్తున్నారు, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, పాడేరు ఐటీడీఏ పీవో, పాడేరు సబ్ కలెక్టర్ తక్షణమే స్పందించి చిన్న పిల్లలతో పని చేయించిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...