Followers

రథ మహోత్సవంలో ఉమా కంఠమహేశ్వర స్వామి భక్తులకు దర్శనం

 రథ మహోత్సవంలో ఉమా కంఠమహేశ్వర స్వామి భక్తులకు దర్శనం

పెన్ పవర్,ఆత్రేయపురం

మహాశివరాత్రి పురస్కరించుకొని గురువారం తెల్లవారుజాము నుండి భక్తులతో శివాలయాలు ఓం నమశ్శివాయ  అనే ఓంకారంతో మార్మోగాయి ర్యాలీ  ఉమా కంఠమహేశ్వర స్వామి  ఆలయం భక్తులతో పోటెత్తిన ది మహాశివరాత్రి పురస్కరించుకొని ఈరోజు అత్యంత వైభవంగా కంఠమహేశ్వర స్వామి రథోత్సవం నిర్వహించారు పుణ్యక్షేత్రాలుగా చెప్పుకునే జగన్మోహిని కేశవ స్వామి శ్రీ ఉమా కంఠమహేశ్వర స్వామి ఆలయములు ఎదురుబొదురు ఉన్న వీధిలో ఉమా కంఠమహేశ్వర స్వామి రథం పైన భక్తులు దర్శనమిచ్చారు ఈ రథోత్సవంలో ఎక్కువ సంఖ్యలో భక్తులుపాల్గొన్నారు.

మహాశివరాత్రి పర్వదినాన ఆలయ సన్నిధిలో అన్నదాన కార్యక్రమం

 మహాశివరాత్రి పర్వదినాన ఆలయ సన్నిధిలో అన్నదాన కార్యక్రమం

బెల్లంపల్లి , పెన్ పవర్

ఈరోజు శ్రీ బుగ్గ  రాజరాజేశ్వర స్వామి  దేవాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.బెల్లంపల్లికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్తలు దిలీప్ కుమార్ సోనీ, సురేష్ మరద  ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ..

జనసేన నాయకులు గంటా కృష్ణ దాతృత్వం

 జనసేన నాయకులు గంటా కృష్ణ దాతృత్వం

తాళ్ళపూడి, పెన్ పవర్

తాళ్ళపూడి మండలం తాడిపూడి గ్రామంలో జనసేన పార్టీ తరపున జనసేన నాయకులు మాజీ సర్పంచ్ గంటా కృష్ణ ఆధ్వర్యంలో  పట్టిసం వీరభద్రస్వామి దేవాలయ సందర్శనకు వెళ్లే భక్తులకు  పులిహోర, మజ్జిగ, వాటర్ పేకెట్లు భారీఎత్తున వితరణ చేయడం జరిగింది. గంటా కృష్ణ దగ్గరుండి యేటిగట్టు మీద వాహనాల మీద వెళ్లే భక్తులకు వాహనాలు అపి దాహార్తి తీర్చడం జరిగింది. గ్రామస్తులకే కాకుండా ఇతర గ్రామాల నుండి వచ్చిన వారికి సహాయ పడటంలో మిన్న అని తాడిపూడి గ్రామస్థులు గంటా కృష్ణ ను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బత్తుల సూర్యారావు, గంటా సూర్యచంద్రం, బదిరెడ్డి శ్రీను, వీరిశెట్టి సీతారామయ్య, జనసైనికులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

మహాశివరాత్రి సందర్భంగా బెల్లంపల్లి షిరిడి సాయి బాబా గుడి ఆవరణలో గజ్జ పూజ..

 మహాశివరాత్రి  సందర్భంగా బెల్లంపల్లి  షిరిడి సాయి బాబా గుడి ఆవరణలో గజ్జ పూజ..

బెల్లంపల్లి రూరల్,పెన్ పవర్

బెల్లంపల్లి లో శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గజ్జ పూజ కార్యక్రమం నిర్వహించారు. నాట్య గురువు పేర్ల అర్చన ఆధ్వర్యంలో శ్రీ నటరాజ స్వామి పూజ మహోత్సవము మరియు శిష్యులకు గజ్జె పూజ కార్యక్రమం నిర్వహించారు

బుగ్గ శివాలయాన్ని దర్శించుకున్న ప్రముఖులు.

 బుగ్గ శివాలయాన్ని దర్శించుకున్న ప్రముఖులు. 

 బెల్లంపల్లి ,పెన్ పవర్


 మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత శ్రీధర్.  మార్కెటింగ్ చైర్ పర్సన్ గడ్డం కళ్యాణి భీమా గౌడ్.  మున్సిపల్ వైస్ చైర్మన్ సుదర్శన్ తదితరులు అర్చన లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మరియు  దేవాలయ కమిటీ చైర్మన్ శ్రీదేవి ఆత్మ చైర్మన్ సున్నం రాజు  కన్నాల సర్పంచ్ స్వరూప వెంకటస్వామి తెరాస పార్టీ  నాయకులు కొమ్మెర లక్ష్మన్,ఇతర ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు,తదితరుల పాల్గొన్నారు...

శ్రీ బుగ్గ రాజా రాజేశ్వర స్వామి జాతర అత్యంత వైభవంగా జరిగింది ..

 శ్రీ బుగ్గ రాజా రాజేశ్వర స్వామి జాతర అత్యంత వైభవంగా జరిగింది ..

బెల్లంపల్లి రూరల్,పెన్ పవర్

 భక్తులు ఉదయం  నుంచే జాతరకు తరలివచ్చారు. మహిమాన్విత క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన బుగ్గ జాతరకు వచ్చిన భక్తులు రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గుట్టపై స్వయంగా వెలిసిన గంగాజలాన్ని తలపై చల్లుకుని దైవ దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బారీకేడ్లు నిర్మించారు.జాతరకు సుమారు లక్షకు పైగా భక్తులు దర్శించుకుంటారని  అధికారులు అంచనా వేశారు. బెల్లంపల్లి పాత బస్టాండ్‌ నుంచి బుగ్గ దేవాలయం వరకు మంచిర్యాల ఆర్టీసీ డిపో నుంచి బస్సులు ఏర్పాట్లు చేశారు. జాతరను పురస్కరించుకుని స్వచ్ఛంద సేవా సంస్థలు  కార్యక్రమాల్లో పాల్గొన్నారు...

ఈసుగం శివ మల్లన్న స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ నాయకులు

 ఈసుగం శివ మల్లన్న స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ నాయకులు

కాగజ్ నగర్,పెన్ పవర్

ఈసుగం మండల అధ్యక్షులు ఈశ్వర్ దాస్  ఆధ్వర్యంలో మహాశివరాత్రిని పురస్కరించుకోని గురువారం రోజు న ఉదయం ఈసుగం శివమల్లన్న స్వామి ఆలయంలో కొమురం భీం జిల్లా బీజేపీ  అధ్యక్షులు జెబి పౌడేల్  ప్రత్యేకంగా శివునికి అభిషేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి కొంగ సత్యనారాయణ ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొత్తపల్లి శ్రీనివాస్ గారు,రాష్ట్ర కిస్సాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు రావి శ్రీనివాస్ ,సిర్పూర్ అసెంబ్లీ కన్వీనర్ గొల్లపల్లి వీరభద్ర  ,సిర్పూర్ తాలూకా నాయకులు పాల్వాయి హరీష్ బాబు ,కాగజనగర్ పట్టణ అధ్యక్షులు గోలెం వెంకటేశం ,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కాళిదాసు ముజుందార్ ,అజిమీరా ఆత్మరంనాయక్ ,ఎంపీటీసీ వికాస్ గరామి ,కాగజనగర్ పట్టణ ప్రధాన కార్యదర్శి గుమ్ముల సాయి కృష్ణ ,సమీర్ గుప్తా ,రణ్వీర్ ,పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...