Followers

జనసేన నాయకులు గంటా కృష్ణ దాతృత్వం

 జనసేన నాయకులు గంటా కృష్ణ దాతృత్వం

తాళ్ళపూడి, పెన్ పవర్

తాళ్ళపూడి మండలం తాడిపూడి గ్రామంలో జనసేన పార్టీ తరపున జనసేన నాయకులు మాజీ సర్పంచ్ గంటా కృష్ణ ఆధ్వర్యంలో  పట్టిసం వీరభద్రస్వామి దేవాలయ సందర్శనకు వెళ్లే భక్తులకు  పులిహోర, మజ్జిగ, వాటర్ పేకెట్లు భారీఎత్తున వితరణ చేయడం జరిగింది. గంటా కృష్ణ దగ్గరుండి యేటిగట్టు మీద వాహనాల మీద వెళ్లే భక్తులకు వాహనాలు అపి దాహార్తి తీర్చడం జరిగింది. గ్రామస్తులకే కాకుండా ఇతర గ్రామాల నుండి వచ్చిన వారికి సహాయ పడటంలో మిన్న అని తాడిపూడి గ్రామస్థులు గంటా కృష్ణ ను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బత్తుల సూర్యారావు, గంటా సూర్యచంద్రం, బదిరెడ్డి శ్రీను, వీరిశెట్టి సీతారామయ్య, జనసైనికులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

మహాశివరాత్రి సందర్భంగా బెల్లంపల్లి షిరిడి సాయి బాబా గుడి ఆవరణలో గజ్జ పూజ..

 మహాశివరాత్రి  సందర్భంగా బెల్లంపల్లి  షిరిడి సాయి బాబా గుడి ఆవరణలో గజ్జ పూజ..

బెల్లంపల్లి రూరల్,పెన్ పవర్

బెల్లంపల్లి లో శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గజ్జ పూజ కార్యక్రమం నిర్వహించారు. నాట్య గురువు పేర్ల అర్చన ఆధ్వర్యంలో శ్రీ నటరాజ స్వామి పూజ మహోత్సవము మరియు శిష్యులకు గజ్జె పూజ కార్యక్రమం నిర్వహించారు

బుగ్గ శివాలయాన్ని దర్శించుకున్న ప్రముఖులు.

 బుగ్గ శివాలయాన్ని దర్శించుకున్న ప్రముఖులు. 

 బెల్లంపల్లి ,పెన్ పవర్


 మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత శ్రీధర్.  మార్కెటింగ్ చైర్ పర్సన్ గడ్డం కళ్యాణి భీమా గౌడ్.  మున్సిపల్ వైస్ చైర్మన్ సుదర్శన్ తదితరులు అర్చన లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మరియు  దేవాలయ కమిటీ చైర్మన్ శ్రీదేవి ఆత్మ చైర్మన్ సున్నం రాజు  కన్నాల సర్పంచ్ స్వరూప వెంకటస్వామి తెరాస పార్టీ  నాయకులు కొమ్మెర లక్ష్మన్,ఇతర ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు,తదితరుల పాల్గొన్నారు...

శ్రీ బుగ్గ రాజా రాజేశ్వర స్వామి జాతర అత్యంత వైభవంగా జరిగింది ..

 శ్రీ బుగ్గ రాజా రాజేశ్వర స్వామి జాతర అత్యంత వైభవంగా జరిగింది ..

బెల్లంపల్లి రూరల్,పెన్ పవర్

 భక్తులు ఉదయం  నుంచే జాతరకు తరలివచ్చారు. మహిమాన్విత క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన బుగ్గ జాతరకు వచ్చిన భక్తులు రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గుట్టపై స్వయంగా వెలిసిన గంగాజలాన్ని తలపై చల్లుకుని దైవ దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బారీకేడ్లు నిర్మించారు.జాతరకు సుమారు లక్షకు పైగా భక్తులు దర్శించుకుంటారని  అధికారులు అంచనా వేశారు. బెల్లంపల్లి పాత బస్టాండ్‌ నుంచి బుగ్గ దేవాలయం వరకు మంచిర్యాల ఆర్టీసీ డిపో నుంచి బస్సులు ఏర్పాట్లు చేశారు. జాతరను పురస్కరించుకుని స్వచ్ఛంద సేవా సంస్థలు  కార్యక్రమాల్లో పాల్గొన్నారు...

ఈసుగం శివ మల్లన్న స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ నాయకులు

 ఈసుగం శివ మల్లన్న స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ నాయకులు

కాగజ్ నగర్,పెన్ పవర్

ఈసుగం మండల అధ్యక్షులు ఈశ్వర్ దాస్  ఆధ్వర్యంలో మహాశివరాత్రిని పురస్కరించుకోని గురువారం రోజు న ఉదయం ఈసుగం శివమల్లన్న స్వామి ఆలయంలో కొమురం భీం జిల్లా బీజేపీ  అధ్యక్షులు జెబి పౌడేల్  ప్రత్యేకంగా శివునికి అభిషేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి కొంగ సత్యనారాయణ ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొత్తపల్లి శ్రీనివాస్ గారు,రాష్ట్ర కిస్సాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు రావి శ్రీనివాస్ ,సిర్పూర్ అసెంబ్లీ కన్వీనర్ గొల్లపల్లి వీరభద్ర  ,సిర్పూర్ తాలూకా నాయకులు పాల్వాయి హరీష్ బాబు ,కాగజనగర్ పట్టణ అధ్యక్షులు గోలెం వెంకటేశం ,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కాళిదాసు ముజుందార్ ,అజిమీరా ఆత్మరంనాయక్ ,ఎంపీటీసీ వికాస్ గరామి ,కాగజనగర్ పట్టణ ప్రధాన కార్యదర్శి గుమ్ముల సాయి కృష్ణ ,సమీర్ గుప్తా ,రణ్వీర్ ,పాల్గొన్నారు.

రామలింగేశ్వర ఆలయానికి పంచలోహ ఉత్సవ విగ్రహాల బహుకరణ

 రామలింగేశ్వర ఆలయానికి పంచలోహ ఉత్సవ విగ్రహాల బహుకరణ 

నెక్కొండ,పెన్ పవర్


నెక్కొండ లోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నెక్కొండ కు చెందిన ప్రముఖ వ్యాపారి  నంగునూరి శివయ్య-సావిత్రి దంపతులు శ్రీపార్వతీ పరమేశ్వరుల పంచలోహ ఉత్సవ విగ్రహాలను బహుకరించారు. శివయ్య  తన 60వ జన్మదినం షష్టిపూర్తి ఉత్సవ సందర్భంగా పార్వతీ పరమేశ్వరుల పంచలోహ ఉత్సవ మూర్తులను ఆలయ అర్చకుల చేతులమీదుగా అందించారు .ఎనిమిదేళ్ల క్రితం అందించిన పంచలోహ విగ్రహాలు గత ఏడాది ఆలయం నుంచి చోరీకి గురవ్వగా వాటి స్థానంలో కొత్త విగ్రహాలను  గురువారం అందించారు.అలాగే ఆలయానికి రంగులు కూడా వేయించారు.గురువారం ఆలయ మండపంలో ఉత్సవ మూర్తులకు దాన్య,జల,పుష్ప అధివాసాల అనంతరం పంచామృత అభిషేకాలు, విశేష పూజలు జరిపారు.విగ్రహ దాతల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించారు.

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

 ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

చిన్నగూడూరు, పెన్  పవర్

స్థానిక మండల కేంద్రంలో గురువారం నాడు రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ మంగపతిరావు ఖాతాదారుల సేవా కేంద్రాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సబ్బండ వర్గాల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రభుత్వ పథకాలను యువత సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మండలంలోని కొప్పుల రవీందర్ ఏర్పాటు చేసుకున్న ఖాతాదారుల సేవా కేంద్రం(మినీ బ్యాంక్ సర్వీస్)ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభం చేయడం జరిగిందని తెలిపారు. యువత తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా ఉపాధి అవకాశాలను అన్వేషించు కావాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రామ్ సింగ్, వెంకటరెడ్డి, వైస్ ఎంపీపీ పిల్లి వీరన్న, తెరాస మండల ప్రధాన కార్యదర్శి కరె ధారాసింగ్, టిఆర్ఎస్ నాయకులు మత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...