ఎమ్.ఎల్. సి ఎన్నికల్లో హామీలు నిలబెట్టుకోలేని ప్రభుత్వానికి ఓటు అడిగే అర్హత లేదు;రావుల చంద్రశేఖర్ రెడి
వనపర్తి, పెన్ పవర్
సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న బడుగు బలహీన వర్గాలకు చెందిన రమణకు ఓటు వేయాలని వనపర్తి మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం రావుల చంద్రశేఖర్ రెడ్డి వనపర్తిలో పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఉపాధ్యాయులకు పి.ఆర్.సి ఇవ్వకుండా మోసం చేసారని రావుల చెప్పారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేసారని, ఉపాద్యాయుల బదిలీలు చేయలేదని విమర్శించారు. రాష్ట్రములో 2లక్షల 67వేల పోస్టులు ఖాళీగా పెట్టి ఉన్న సిబ్బందిపైన పని భారం పెంచి ఒత్తిడికి గురిచేస్తున్నారని అన్నారు.గతములో పని చేసిన ఎమ్.ఎల్.సి లు ప్రజా సమస్యలపై పోరాటం చేయలేదని కాబట్టి సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఎల్.రమణను గెలిపించాలని కోరారు.ప్రభుత్వ పెద్దలు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు.ఆలోచించి ఓటర్లు నిర్ణయం తీసుకోవాలని అన్నారు.ఈ సమావేశానికి నందిమల్ల అశోక్ అధ్యక్షత వహించారు. సమావేశములో బి.రాములు,గంధం. బాలపెరు,నందిమల్ల.శారదా,ఏర్పుల.లక్మి,జోగు.శాంతన్న,మాధవ రెడ్డి,రాజశేఖర్,దస్తగిరి,శ్రీనివాస్ రెడ్డి,హుస్సేన్,కిశోర్ రెడ్డి,జెమీల్ ప్రసంగించారు.కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..








