Followers

ఆడపడుచులకు కల్యాణ లక్ష్మి వరం...

 ఆడపడుచులకు కల్యాణ లక్ష్మి వరం...

ఖానాపూర్ ఎమ్మెల్యే ఆజ్మీరా రేఖ శ్యాంనాయక్

ఆదిలాబాద్,పెన్ పవర్

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఆడపడుచులకు వరమని ఖానాపూర్ ఎమ్మెల్యే ఆజ్మీరా రేఖశ్యాంనాయక్ అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలోని స్థానిక మార్కెట్ యార్డులో అర్హులైన 62 మంది లబ్ధిదారులకు రూ. 62లక్షల 7192  విలువగల కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేఖానాయక్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం మహిళలకు అండగా నిలుస్తుందని అన్నారు . రైతు బంధు, రైతు బీమా వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రైతన్నల అభ్యున్నతికి పాటు పడుతున్నామని వివరించారు. ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామ న్నారు. పల్లెల్లో పట్టణాల్లో శుద్ధి చేసిన నీటిని మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి అందిస్తున్నా మని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ రాఘవేంద్రరావు, మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కోరెంగ గాంధారి సుంకట్ రావు, జడ్పీ కోఆప్షన్ సభ్యులు మహ్మద్ ఆంజద్,పిఎసియస్ ఛైర్మన్ మారుతి డోంగ్రే,ఉప సర్పంచ్ గణేష్ తెహరే,మార్కెట్ కమిటీ చైర్మన్ రాథోడ్ మోహన్ నాయక్, ఎంపిటిసిలు సభ్యురాలు గిత్తే ఆశాబాయి,స్వర్ణలత మహేష్ కదం,నాయకులు మారుతి దేవుపూజే, వసంతరావు, సర్కాలే శివాజీ, బాబు వాగ్మారే,కాలే శివాజి, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

ఆదిలాబాద్,పెన్ పవర్

బోథ్ నియోజకవర్గ శాసనసభ్యుడు  రాథోడ్ బాపురావ్ జన్మదిన వేడుకలను  కార్యకర్తలు, నాయకుల మధ్య శుక్రవారం గుడిహత్నూర్ మండల కేంద్రంలోని స్థానిక పార్టీ కార్యాలయంలో జరుపుకున్నారు. కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే కు శుభాకాంక్షలు తెలిపారు టి ఆర్ ఎస్ మండల కన్వీనర్ కరాడ్ బ్రహ్మానంద్ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేను కలిసి శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సత్కరించి పుట్టిన రోజు శుభకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ ఏడేండ్ల కాలంలో బోథ్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించారని అన్నారు.అనంతరం మండల ప్రెస్ క్లబ్ తరపున పాత్రికేయులు జ్ఞాపిక అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాత్రికేయులతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో పాత్రికేయులు దశరథ్ రెడ్డి, బండారి రవీందర్, మురళీ, సాక్షి శ్రీనివాస్, కొండా ప్రశాంత్, సిద్దార్థ్, టీ ఆర్ ఎస్ పార్టీ జిల్లా కోశాధికారి బూర్ల లక్ష్మీనారాయణ, కోఆప్షన్ సభ్యుడు జమీర్, నాయకులు జాదవ్ రమేష్,రావణ్ ముండే, మాధవ్ కేంద్రే, కుమ్మరి సత్యరాజ్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు సీనియర్‌  నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 

డ్రైనేజీ సమస్య పట్టించుకోని అధికారులు...

డ్రైనేజీ సమస్య పట్టించుకోని అధికారులు...

పెన్ పవర్,మేడ్చల్ 

మేడ్చల్  మున్సిపాలిటీలోని 3వ వార్డ్ దుస్థితి. ప్రభుత్వ సొమ్ము లక్షల రుపాయలు ఖర్చు చేసి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం, డ్రైనేజీ వ్యవస్థ ఏవిధంగా వుందో. ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు  డబ్బల్ బెడ్ రూమ్లు ,అందరికీ వృద్యప ఫించన్లు, కొత్త రెషన్ కార్దూలు ఇస్తామని ఓట్లు వేయుంచుకొని సామాన్య ప్రజలను  తన వెనుకల తీంపుకొంటున్నా ప్రజ ప్రతినిధి కొంచెం ప్రజల సమస్యలు తీర్చలని రోడ్ల మద్యలో వేసిన డ్రైనేజీ పైపులగురించి  కొన్ని లక్షల రూపాయల ఖర్చు చేసి పూర్తి చేయకుండా వదిలేసి రోడ్డు వెంట దుమ్ము లేస్తూన్నా , ప్రతి రోజు ఆ రోడ్డు పక్కన పొతున్న పట్టించూకొవడాం లేదు. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడం, అలాగే డ్రైనేజీలు కొసం కొన్ని లక్షల రూపాయలను తనకు కావలసిన  కాట్రాక్టలకు దారపొసి డ్రైనేజీ లైన్లు సరిగ్గా కలపకపొవడాం మనం చూస్తున్నాము, ఇవేగాక ఇంకా చాలా సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల ప్రచారంలో మాత్రం హడావుడి పని చేస్తారు. ఆ తర్వాత ఏమి పటించూకొకుండా, ఎక్కడెక్కడ ప్రభుత్వ భుమి వుందా కబ్జా చేద్దమని ఆశగా ఎదురు చూస్తున్నారు, తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు అమలు చేయాలని పెద, నీరుపేద, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కుటుంబలను ఆదుకోవాలని ఎవరికీ లేదు. మేము మున్సిపాలిటీకీ వెళ్లి ఎదైనా పని చేయమని అడిగితే బడ్జెట్ లేదు తర్వాత చేద్దామంటూ వాయిదా వేస్తూన్నారు. ఇంకా నైనా పదవులు అనుభవిస్తున్న అధికారులు కానీ, ప్రజ ప్రతినిధులు కానీ ప్రజల సొమ్మును వృధా చేయకుండా, సరైన ప్రణాలికను ఎర్పాటు చేసుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.


14న ఓట్ల లెక్కింపు

 14న ఓట్ల లెక్కింపు

 పెన్ పవర్,పెద్దాపురం

మునిసిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు  ప్రక్రియను కౌటింగ్ అధికారులు సిబ్బంది విజయవంతం చేయాలని అసిస్టెంట్ ఎలెక్షన్ అథారిటీ అధికారి మరియు మునిసిపల్ కమిషనర్ జి. సురేంద్ర కోరారు. శుక్రవారం స్థానిక మునిసిపల్ కార్యాలయ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఈ నెల14 వ తేదీన స్థానిక ఆర్డీవో కార్యాలయంలో నిర్వహిస్తున్న మునిసిపల్ ఓట్ల లెక్కింపుకు కేటాయించిన ఎలెక్షన్ అధికారులు, అసిస్టెంట్ ఎలెక్షన్ అధికారులు మరియు కౌటింగ్ సిబ్బంది తో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతి జరిగింది.

ఈ శిక్షణ తరగతిలో కమిషనర్ మాట్లాడుతూ 14 వ తేదీన ఉదయం8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారని తెలిపారు. ఓట్ల లెక్కింపుకు 24 మంది అధికారులను నియమించిన ట్లు చెప్పారు. వీరిలో 8 మంది ఎలెక్షన్ అధికారులు 8మందిఅసిస్టెంట్ ఎలెక్షన్ అధికారులు,మరో 8 మంది ఆదనపు అధికారులు వున్నారని తెలిపారు.36 మంది   కౌంటింగ్ సిబ్బంది, ఉన్నారని చెప్పారు. ఓట్ల లెక్కింపు 8 రౌండ్లు ద్వారా లెక్కింపు జరుగుతుందని,  మొత్తం 4 రౌండ్లలలో లెక్కింపు పూర్తి అవుతుందని వివరించారు. కౌటింగ్ అధికారులకు ,సిబ్బందికి ఫొటోతో కూడిన గుర్తింపు కార్డులు జారిచేస్తామని తెలిపారు. కౌటింగ్ అదికారులు, సిబ్బంది ఉదయం 6 గంటల కల్లా కౌటింగ్ కేంద్రానికి చేరుకోవాలని అన్నారు.కౌటింగ్ కేంద్రానికి మొబైల్ ఫోన్లు, సాంకేతిక పరమైన ఎటువంటి పరికరాలు అనుమతి లేదనిఅన్నారు.పోస్టల్ బ్యాల్లెట్స్ ఓట్లు, బ్యాలెట్ బాక్సలు ఓపెన్ చేసే విధానం , ఏజెంట్లు గుర్తింపు కార్డులు, బ్యాలెట్ పేపర్లు కట్టలు కట్టడం, కౌటింగ్ విధానం, ఫోరమ్ 38 ఫారం, ఫైనల్ రిజల్ట్ ప్ షీట్ తదితర అంశాలపై కమిషనర్ వివరించడం జరిగింది. కౌటింగ్  సరళి వీడియో గ్రాఫి పర్యవేక్షణ లో ఉంటుందని, కౌటింగ్ కేంద్రం వద్ద  బారి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలెక్షన్ అధికారులు, సిబ్బంది, మునిసిపల్ టిపిఓ ఉమామహేశ్వరరావు, మేనేజర్ నాగేశ్వరరావు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ దావిదు రాజు , మునిసిపల్ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

రక్త దానానికి యువకులు ముందుకు రావాలి

రక్త దానానికి యువకులు ముందుకు రావాలి

మందమర్రి, పెన్ పవర్

రక్తదానంపై అపోహలు వీడి యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని ఎంపీటీసీ సూపరింటెండెంట్ ఇంజనీర్ అశోక్ పేర్కొన్నారు. శుక్రవారం మందమర్రి ఏరియాలోని గనుల వృత్తి శిక్షణ కేంద్రం (ఎంవిటిసి) లో శిక్షణ పొందుతున్న నూతన కార్మికులకు రక్తదానం, తలసేమియా, సికిల్ సెల్ వ్యాధులపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంవిటిసి లో శనివారం ఉదయం 9 గంటల నుండి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. కారుణ్య నియామకాల ద్వారా శిక్షణ పొందిన ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని ఆయన కోరారు. ఆరోగ్యవంతమైన ప్రతి వ్యక్తి ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్త దానం చేయవచ్చునని ఆయన పేర్కొన్నారు. దేశంలో రోజురోజుకు తలసేమియా, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగిపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తలసేమియా, సికిల్ సెల్ లాంటి వ్యాధులను నివారించేందుకు యువతీయువకులు వివాహానికి ముందే రక్త పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. రక్తదాన శిబిరం ద్వారా సేకరించిన రక్తాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోని నిరుపేద రోగులకు, తలసేమియా, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు, రోడ్డు ప్రమాద భాదితులకు, కిడ్నీ, క్యాన్సర్ లాంటి వ్యాధిగ్రస్తులకు రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఉచితంగా రక్తాన్ని అందించడం జరుగుతుందని వివరించారు. ఏరియాలోని సింగరేణి కార్మికులు రక్తదాన శిబిరంలో పాలుపంచుకొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మేనేజర్ కృష్ణారావు, హెడ్ ఓవర్ మెన్స్ రాజేశం, సాగర్ లక్ష్మణ్, సతీష్,రెడ్ క్రాస్ జిల్లా కమిటీ సభ్యులు కాసర్ల శ్రీనివాస్, బెల్లంపల్లి డివిజన్ సభ్యులు సూరం లక్ష్మీనారాయణ, తలసేమియా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కాసర్ల రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 

పెద్దాపురం డివిజిన్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం

 పెద్దాపురం డివిజిన్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం

   పెద్దాపురం,పెన్ పవర్

పెద్దాపురం డివిజిన్ పరిధిలో ఈ నెల 14 వ తేదీన జరుగు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం చేసామని ఆర్డీవో ఎస్. మల్లిబాబు తెలిపారు. శుక్రవారం  స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ ఆదివారం జరుగు పోలింగ్ సిబ్బందికి పోలింగ్ మెటీరియల్ ను శనివారం పంపిణీ చేయడానికి ఆర్డీవో ఆఫీసులో డివిజిన్ స్థాయి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను ఏర్పాటు చేశామని  తెలిపారు.పెద్దాపురం డివిజిన్ లో 12 మండలకు 1039 మంది ఉపాద్యాయులు  తమ ఓటు హక్కు వినియోగించుకుంటారని తెలిపారు. 14 వ తేదీన ఉదయం 8 గంటల కు పోలింగ్ ప్రారంభించి, మధ్యాహ్నం 4గంటలకు  ముగిస్తుందని చెప్పారు. ప్రతీ మండల కేంద్రం     ఎంపీడీఓ ఆఫీసునందు,పోలింగ్ కేంద్రం  రంగంపేట మండలం తహసీల్దార్ ఆఫీస్ నందు ఎర్పాటు చేశామని తెలిపారు. మండలాలవారిగా ఉపాద్యాయ ఓటర్లు జగ్గంపేట కేంద్రంలో 64  మంది,ఏలేశ్వరం  116, ప్రత్తిపాడు 73,శంఖవరం 54, రౌతులపూడి 59, కోటనం దూర్ 29, తుని 241, తొండంగి 49 , కిర్లంపూడి 87, పెద్దాపురం 219, గండేపల్లి 27, రంగంపేట 21మంది ఉపాద్యాయులు ఓటరు గా నమోదు చేసుకున్నారని తెలిపారు. పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్  షామియనాలతో ఏర్పాటు చేశామని, మండలాలవారీగా టేబుల్స్ ,కుర్చిలు ఏర్పాటు చేశామని, సమాచార కేంద్రం, డ్రికింగ్ వాటర్, వాహనాల పార్కింగ్ తదితర అన్ని ఏర్పాట్లు చేసామని,ప్రత్యేకమైన బస్సు లో పోలింగ్ సిబ్బంది ని, మెటీరియల్ తో మండలకు పంపడం జరుగు తుందిని తెలిపారు. కోవిడ్-19 అనుసరించి మాస్కులు ధరించుట, శానిటేజర్ ఉపయోగింస్తున్నామని తెలిపారు.

సేంద్రియ పద్దతిలోకూరగాయలు సాగు

 సేంద్రియ పద్దతిలోకూరగాయలు  సాగు 

ఆదర్శంగా  నిలిచిన  యువకుడు  బొంగు  మల్లేశం 

గంభీరావుపేట , పెన్ పవర్  


రాజన్న సిరిసిల్ల  జిల్లా  గంభీరావుపేట మండలం  నర్మాల గ్రామం లో  బొంగు మల్లేశం యాదవ్   సేంద్రియ పద్ధతి లో  కూరగాయలు సాగు  చేస్తున్నాడు   ప్రవేట్  క్లినిక్  ఆర్ ఎం పి  డాక్టర్ ప్రజల కు  వైద్య సేవలు అందింస్తు. దింతో   తన ద్రుష్టి  వ్యవసాయం వైపు మళ్ళించాడు ఆదర్శం గా వ్యవసాయం వైపు  చుస్తూ ప్రాథమిక  వైద్య సేవలు అందిస్తూ కూరగాయలు  సాగు  తన  తల్లిదండ్రులు  సహకారం  తో  బొంగు  మల్లేశం యాదవ్   తన స్వంత  పొలం లో  కూరగాయలు ఆకు కూరగాయలు  అన్నిరకాల   పంటలు పండి స్తున్నారు     ఇటీవల  గత సంవత్సరం నవంబర్  నెల  2020  సంవత్సరం  లో  నర్మాల గ్రామ సర్పంచ్ ఎడబోయిన రాజు  తో  గ్రామం లోని     రైతులు వెళ్లి సందర్శించడం జరిగింది. తెలంగాణా లో వ్యవసాయవిధానానికి నిజామాబాద్  జిల్లా అర్ముర్ మండలం ,  తలమానికం అంకాపూర్ గ్రామాన్ని  గ్రామ రైతులు  అవలభిస్తున్నా  విధానాన్ని  అంకాపూర్ లోని  సేంద్రియ  పద్ధతి లో  నూతన వ్యవసాయం విధానం లో  పంటలు  కూరగాయలు  సారవంతం మైన నెల మీద  పెట్టాలని  అక్కడ  రైతులను సాగు పద్ధతి గురించి  అడిగి  తెలుసు కున్నాడు  అభివృద్ధి చెందావచ్చాని  రైతు లు  చెప్పడం జరిగింది. నర్మాల గ్రామం లో కూరగాయలు  సాగు లేదు గ్రామస్తులు  గంభీరావుపేట కు వచ్చి  కూరగాయలు  తీసుకొని పోయే దానికి  వస్తారు.  2021 సంవత్సరం లో  కూరగాయలు  సాగు  చెయ్యాలని   ఆలోచన  వచ్చి తల్లి దండ్రుల  సహకారం తో మొదలు పెట్టడం జరిగింది. అందుకే  తన ఊరిలోనే   తన స్వంత పొలం లో  కూరగాయలు  పండించాలని అదికూడా  సేంద్రియ  పద్ధతి లో సాగు  చెయ్యాలనినిర్ణహించాడు. తన కున్న  25 గుంట లో  విస్తీర్ణంలో  అన్ని రకాలుగా  కూరగాయలు  పండిస్తూన్నాడు   టమాటా , దోస , బెండకాయ , బీరకాయ , మిర్చి , గోధుమ , వెల్లుల్లి , ఉల్లి  , క్యారెట్. అన్ని పంటలుచేతికి  వచ్చింది. ఇంకా  ఎన్నో పంటలు  సాగు చేస్తున్నాడు  అడవి ప్రాంతం లో  పొలం ఉండడం తో వన్య ప్రాణుల భారీ నుండి కాపాడుకోవడానికి  చుట్టూ  కంచె  పెట్టడం  జరిగింది. కోళ్ల  పశువుల  పెడనే ఎరువులుగా వినియోగిస్తున్నాడు. రసాయన  ఎరువులు  క్రిమిసంహారంక మందులు వినియోగించడం లేదని   రైతు  బొంగు మల్లేశం  వివరించాడు  ఇదే  తొలి సారి కావడం ఫలితం  ఎలా ఉంటుందో   వేచి  చుడాలని అని  అన్నాడు   కూరగాయలు సాగు సేంద్రియ వరుస క్రమంలో పద్ధతి పెట్టడం జరిగింది.  కూరగాయలు  సాగు ఫలితం  చేతికి వచ్చింది  అని   నర్మాల గ్రామ ప్రజలు  బొంగు మల్లేశం ను  అభినందించారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...