Followers

రావులపాలెంలో ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవం

 రావులపాలెంలో ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవం

పెన్ పవర్,రావులపాలెం

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని శుక్రవారం రావులపాలెంలో కొత్తపేట ఎమ్మెల్యే, ఏపి పియూసి ఛైర్మన్ చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పార్టీ శ్రేణులతో కలిసి ఊబలంక ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న కోవిడ్ వాక్సినేషన్ వేస్తున్న తీరును పరిశీలించారు. అనంతరం రావులపాలెం వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించి పార్టీ శ్రేణులకు స్వీట్స్ పంచి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు,రావులపాలెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కర్రి నాగిరెడ్డి, రావులపాలెం ఉప సర్పంచ్ గొలుగూరి మునిరెడ్డి, జడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్ సాకా ప్రసన్నకుమార్, రావులపాలెం సర్పంచ్ తాడేపల్లి నాగమణి, ముసునూరి వెంకటేశ్వరరావు, దేవరపల్లి సర్పంచ్ దొమ్మేటి అర్జునరావు, పితాని రాంబాబు, మాజీ ఎంపీటీసీ కొండేపూడి రామకృష్ణ, దేవరపల్లి మాజీ సర్పంచ్ గన్నవరపు వెంకటరావు, మాజీ వైస్ ఎంపీపీ దండు వెంకట సుబ్రహ్మణ్యవర్మ, రావులపాలెం వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అక్రమ లేఅవుట్ ను స్వాధీనం చేసుకున్న మునిసిపాలిటీ అధికారులు

 అక్రమ లేఅవుట్ ను స్వాధీనం చేసుకున్న మునిసిపాలిటీ అధికారులు                   

  పెన్ పవర్, కందుకూరు

 పట్టణంలోని ఆనందపురం రోడ్డు, దూబగుంట, విక్కిరాలపేట రోడ్డు, పామూరు రోడ్డు నందలి రెండు అక్రమ లేఅవుట్లు గుర్తించినట్లు మునిసిపాలిటీ అధికారులు తెలిపారు. అయితే వీటిలో దూబగుంట పెట్రోల్ బంక్ తూర్పువైపున అనధికార లే అవుట్ ఇటీవల మునిసిపాలిటీ అధికారులు హద్దు రాళ్లను తొలగించినప్పటికీ లే అవుట్ యజమాని హద్దు రాళ్లను మరల ఏర్పాటు చేయడంతో మున్సిపాలిటీ అధికారులు శుక్రవారం తొలగించి అక్రమ లేఅవుట్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలో ఉన్న అనధికార లేఅవుట్ గుర్తించి తొలగిస్తున్నామని నూతనంగా ఎవరు అనధికార లే ఔట్ లను  వేయరాదని మున్సిపల్ కమిషనర్ మనోహర్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. పట్టణ ప్రజలు ఎవరైనా అనధికార లే అవుట్ నందు ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి బిల్డింగ్ నిర్మాణ అనుమతులు కానీ, మున్సిపాలిటీ కల్పించే మౌలిక సదుపాయాలు కానీ కల్పించబడవు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రణాళిక అధికారి వేణు, టౌన్ సర్వేయర్ శ్రీధర్, సచివాలయ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రెవిన్యూ సిబ్బంది పై ఆగ్రహించిన ఎమ్మెల్యే మానుగుంట

 రెవిన్యూ సిబ్బంది పై ఆగ్రహించిన ఎమ్మెల్యే మానుగుంట

పెన్ పవర్,వలేటివారిపాలెం

మండలంలోని చుండి,  అమ్మ పాలెం గ్రామాల్లో రెవిన్యూ భూముల పరిస్థితి సొమ్మోకడిది సోకోకడిది అన్నట్టు ఉంది.  సాధారణంగా తమ భూములను ఆన్ లైన్ చేయించు కోవాలంటే రెవిన్యూ ఆఫీసుల చుట్టూ నెలలు తరబడి తిరిగినా ప్రయోజనం కనిపించదు.  అయితే వలేటివారిపాలెం మండలం లోని చుండి , అమ్మ పాలెం పంచాయితీల్లో మాత్రం సొమ్మోకడిది సోకోకడిది అన్నట్టు కనిపిస్తుంది. భూ యజమానికి తెలియకుండానే ఆన్ లైన్ లో ఎంచక్కా ఎక్కించుకున్నారు.  వివరాల్లోకి వెళితే కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి శుక్రవారం తహశీల్దార్ కార్యాలయంలో ప్రజాసమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా తమ భూములను తమ పేర్లమీద కాకుండా మరొకరి పేరు మీద ఆన్ లైన్ చేసి ఉందని చుండి, అమ్మ పాలెం పంచాయితీల్లో ని పలువురు రైతులు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే  రైతు సమస్యలపై  అధికారులను ఆరా తీశారు. చుండి గ్రామంలో 630 ఆఖరి సర్వే నెంబరైతే, 718-1 సర్వే నెంబర్ ఎలా వచ్చిందని కంప్యూటర్ ఆపరేటర్ పై ఆంగ్రహం వ్యక్తం చేశారు. ఈవిధంగా ఆన్లైన్ ఎలా జరిగిందని ప్రశ్నించారు.  దీంతో  కంప్యూటర్ ఆపరేటర్ నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఎమ్మెల్యే అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు‌.   తహశీల్దార్ సంతకం లేకుండా ఆన్లైన్లో భూములు ఎలా చేస్తున్నారని అన్నారు. రిజిస్ట్రేషన్ పత్రాలు లేకుండా తల్లి, తండ్రి బతికుండగానే పార్టిషన్ లేకుండా మరొక పేరు పై ఎలా ఆన్లైన్ చేస్తారన్నారు. ఒకరి భూమి మరోకరిపై అనువంశికం ఎలా మారుతుందో చెప్పాలన్నారు.   చుండి పంచాయతీ లో  90 ఎకరాల భూమిని ఇతర గ్రామాల్లో ని వ్యక్తులకు ఆన్ లైన్ చేసినట్లు అమ్మ పాలెం వైసీపీ పార్టీ నాయకులు వరికూటి సంజీవరెడ్డి ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి దృష్టికి తెచ్చారు.  నలదలపూరు గ్రామం లో ఎఫ్ ఎల్ ఆర్ రికార్డు ఎందుకు కనబడకుండా పోయిందని ఆ గ్రామ విఆర్ఓ వి ఆర్ ఓ ని ఆరాతీశారు.  పూర్తిస్థాయిలో వివరాలు సేకరించి నలదల పూరు గ్రామ విఆర్ఓ ని  సస్పెండ్ చేయమని తహశీల్దార్ కి చెప్పారు.  లింగసముద్రం మండలం కంటే వలేటివారిపాలెం మండలంలో భారీ స్థాయిలో భూ కుంభకోణం జరిగినట్లు తెలుస్తోందన్నారు.  భూ యజమాని ఒకరైతే ఆన్లైన్లో మరొకరు ఎలా ఉంటున్నారు. కంప్యూటర్ ఆపరేటర్ తన తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకోక తప్పదని అన్నారు. మండలంలో వందల ఎకరాలు ప్రభుత్వ భూములన తమ ఇష్టం వచ్చినట్లు ఆన్ లైన్ చేసి చాలా రికార్డులు తారు మారు చేశారన్నారు. ఇంత జరుగుతున్నా రెవిన్యూ సిబ్బంది ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థం కాకుండా చేశారని తెలిపారు.  ప్రభుత్వ భూములను ఆక్రమించి ఆన్లైన్ లోకి ఎక్కించుకున్న వారిపై కేసులు నమోదు చేయాలని తెలిపారు. సోమవారం నాటికి  వచ్చిన ఆన్ లైన్ ఫిర్యాదలకీ సంబంధించిన ఆధారాలను తహశీల్దార్ గారికి అందజేయాలని కంప్యూటర్ ఆపరేటర్ ని చెప్పారు.

నాడు-నేడు నిధులు దుర్వినియోగం చేస్తే క్రిమినల్ కేసులు. ఐటిడిఏ పీఓ వెంకటేశ్వర్

 నాడు-నేడు నిధులు దుర్వినియోగం చేస్తే క్రిమినల్ కేసులు. ఐటిడిఏ పీఓ వెంకటేశ్వర్

పెన్ పవర్,విశాఖపట్నం

 నాడు నేడు నిధులు దుర్వినియోగం చేస్తే క్రిమినల్ కేసులు తప్పవని పాడేరు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ( ఐ టి డి ఏ) ప్రాజెక్ట్ అధికారి వెంకటేశ్వర్ సలిజామల  హెచ్చరించారు. శుక్రవారం  తమ కార్యాలయంలో ఇంజనీరింగ్  విద్యాశాఖ  ప్రధానోపాధ్యాయులతో సమావేశం  జరిగింది. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో  మౌలిక వసతులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతానికి 105 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని ఆయన తెలిపారు. ఏజెన్సీ 11 మండలాల్లో  మనబడి  నాడు నేడు కార్యక్రమాలు నడుస్తున్నాయి అన్నారు. ప్రభుత్వ  పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు తీసిపోని విధంగా మౌలిక వసతులు  కల్పించనున్నారు. నాడు నేడు పనులు ఏజెన్సీ ప్రాంతంలో నత్తనడక నడుస్తున్నాయి. పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని  ఎన్ని మార్లు హెచ్చరించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిమ్మకు నీరెత్తినట్లు లేదన్నారు. ప్రభుత్వం కేటాయించిన నిధులు సరిపోవని  వాదనలు వినిపిస్తున్నారు అని ప్రభుత్వం అంచనాల మేరకే నిధులు మంజూరు చేశారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో  నాడు నేడు మనబడి కార్యక్రమాలు  త్వరిత గతిన పూర్తి చేయాలని ఆయన కోరారు. నాడు నేడు నిధులు పరిపూర్ణంగా పనులు కేటాయించాలని  లేనిపక్షంలో క్రిమినల్ కేసులకు గురవుతారని ఆయన అన్నారు. గడువు నాటికి నాడు నేడు పనులు పూర్తిచేయాలని పి ఓ ఆదేశించారు.

శివాలయంలో పోటెత్తిన భక్తులు

 శివాలయంలో పోటెత్తిన భక్తులు

 గూడెంకోత్తవీధి,పెన్ పవర్
   మండలంలోని జికేవీధి,ఆర్వీనగర్,మంగళపాలెం శివాలయలలో గురువారం మహాశివరాత్రి సంధర్భంగా భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆర్వీనగర్ లో ఉదయం కందిరీగలు భక్తులకు దాడిచేయడం తో  చింతపల్లి మండలంలోని అంతర్ల శివాలయనికి వెళ్లారు.దేవరాపల్లి పంచాయితీ  మంగళపాలెం గ్రామంలో ఉదయం నుండి భక్తులు పోటెత్తారు .ఆ గ్రామంశివలయనికి వచ్చిన భక్తులకు అన్నసంతర్పణ ప్రసాదం అందించారు. దేవరాపల్లి సర్పంచ్ సిరిబాలబుజ్జిబాబు దంపతులు, గిరిజన సంఘం మండల కార్యదర్శి గడుతూరి సత్యనారాయణ కుటుంబ సభ్యులు శివలింగాన్ని ధశించుకున్నారు.

నక్కా ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

 నక్కా ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

తాళ్ళపూడి, పెన్ పవర్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి నేటికి పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తాళ్ళపూడి గ్రామ పంచాయితీ సర్పంచ్ నక్కా వెంకట అనురాధ ఆధ్వర్యంలో  ఘనంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మెయిన్ రోడ్ మదనగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న  వైఎస్ఆర్ విగ్రహానికి  సర్పంచ్ అనూరాధ పూలమాల వేశారు. అనంతరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ  నాయకులు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా పలువురు వైఎస్సార్సీపీ నాయకులు మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసమే వైఎస్ఆర్సిపి పార్టీ పనిచేస్తుందన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం ఒక ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే వినూత్నమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కష్టపడి పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషి చేసిన వారికి పార్టీలో తప్పకుండా భవిష్యత్తు ఉంటుందన్నారు. సర్పంచ్ నక్కా వెంకట అనురాధ  కేక్ కటింగ్ చేసి, స్వీట్లు పంపిణీ చేసి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ గోలి వీర వెంకట సత్యనారాయణ, ఎఎంసి డైరెక్టర్ కంకిపాటి బాబురావు,  వైయస్సార్సీపీ  మండల యువజన విభాగం అధ్యక్షులు వంబోలు పోసిబాబు, వైయస్సార్సీపీ నాయకులు నక్కా ఆనంద్, బండ్రెడ్డి వెంకటేశ్వరరావు, గూడా విజయరాజు, సిద్దంశెట్టి కృష్ణ, మైగాపుల రాజారావు, బండారు సత్తిబాబు, చిట్టాల రాము, కోదాటి సత్యనారాయణ, బ్యాంక్ సత్యనారాయణ, కొక్కిరాల గాంధీ, మైగాపుల ఆంజనేయులు, నాయుడు రత్నాజీ, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

ఆదిత్యలో ఇంటర్న్ షిప్ అవకాశాలపై అవగాహనా సదస్సు

 ఆదిత్యలో ఇంటర్న్ షిప్ అవకాశాలపై అవగాహనా సదస్సు

గండేపల్లి,పెన్ పవర్

గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో బి.టెక్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులకు ఎ.ఐ.సి.టి.ఇ అధీకృత సంస్థ ఇంటర్న్ శాల వారు నిర్వహించే ఇంటర్న్ షిప్ అవకాశాలపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు కళాశాల ప్రిన్సిపాల్ డా. ఆదిరెడ్డి రమేష్ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ ఇంటర్న్ షిప్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం,మరియు వాటి లాభాలను గురించి సోదాహరణలతో వివరించారు. ఈ సదస్సులో పాల్గొన్న జె.బాలరాజు,మేరీ జ్యోతి విద్యార్థులకు ఇంటర్న్ షిప్ లకు ఎలా  ధరఖాస్తు చేయాలి, ఎలాంటి ఇంటర్న్ షిప్ లు ఎంచుకోవాలి వంటి విషయాలపై అవగహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్లేస్ మెంట్ ఆఫీసర్ మధు మాణిక్యం పాల్గొనగా సుమారు 500మంది విద్యార్థులు ఈ సదస్సుకు హాజరయ్యారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...