Followers

వేల కోట్ల నిధుల మళ్లింపు

 వేల కోట్ల  నిధుల మళ్లింపు,  దుర్వినియోగం జరుగుతోంది

...బిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి సత్తయ్య

తెలంగాణ ,పెన్ పవర్

 పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని 2వ గనిలో సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బిఎంఎస్ ఏర్పాటు చేసిన సమావేశంలో బిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి సత్తయ్య  ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. సింగరేణి వ్యాప్తంగా కార్మికుల సమస్యల పరిష్కారానికి సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బిఎంఎస్ ఆధ్వర్యంలో దీర్ఘకాలిక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపినారు .అందులో ప్రధానంగా సింగరేణి సంస్థ నుండి రాష్ట్ర ప్రభుత్వానికి గత ఆరు సంవత్సరాల నుండి పన్నుల రూపేణా సుమారు రూ 15011 కోట్లు,కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కొరకు రూలు 230 కోట్లు, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ట్రస్ట్ కొరకు 2739 కోట్లు మొత్తం రూపాయలు 17980 కోట్లు పన్నుల రూపేణా రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తున్నారన్నారు. వేల కోట్ల రూపాయల నిధుల మళ్లింపు నిధుల దుర్వినియోగం జరుగుతోందని అందుకే సింగరేణి కార్మికులకు సంబంధించిన ప్రధాన సమస్యలు కోల్ ఇండియా మాదిరిగా అలవెన్సుల పై  ఆదాయపన్ను సింగరేణి యాజమాన్యం కార్మికులకు రీయింబర్స్ మెంట్ చెల్లించాలని అలాగే ఆదాయపన్ను ప్రతి ఏటా 250 కోట్ల రూపాయల పన్ను కార్మికులకు రియంబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్ చేసినారు సింగరేణికి రావలసిన విద్యుత్ బకాయిలను రూ 15 వేల కోట్ల రూపాయలు వెంటనే సింగరేణి యాజమాన్యానికి చెల్లించాలని డిమాండ్ చేశారు. సొంతింటి పథకం అమలు చేయడానికి కావలసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి పెడుతున్నా పన్నుల నుండి నిధులు కేటాయించి సొంతింటి పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆరు జిల్లాల గ్రామాలకు పట్టణాలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించాలని దుబారా ఖర్చులను తగ్గించాలనే అని కొత్త ఉద్యోగాలు రావడానికి నూతన బొగ్గు గనులకు నిధులు కేటాయించాలని తద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ఫిట్ కార్యదర్శి సిరిపురం నరసయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్న నాయకులు పెండెం సత్యనారాయణ, తాట్ల లక్ష్మయ్య  కందుల నరహరి, గంధం ధర్మయ్య, గాలి పెళ్లి తిరుపతి, పోతరవేణి విజయ్ కుమార్, బోడకుంట రాజేశం, తడగొండ నరసయ్య,సాయవేణి సతీష్, వై కోటయ్య ఎస్ పర్వతాలు కె బిక్షపతి,ఎన్. గంగారాం, కె మహేష్ జి చంద్రమౌళి  జి నరేష్ జి వెంకటేష్ ఎం నరేందర్ మేకల రవీందర్ ఎం వర్మ ఏ ప్రవీణ్ జి కిషన్ తదితరులు పాల్గొన్నారు

నేడే పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల కౌంటింగ్

 నేడే పెద్దాపురం ఆర్డీఓ  కార్యాలయంలో ఎన్నికల కౌంటింగ్

పెద్దాపురం,పెన్ పవర్

పెద్దాపురం పురపాలక సంఘం ఎన్నికల కౌంటింగ్ ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ ప్రత్యేక అధికారి మరియు ఆర్డిఓ ఎస్ మల్లిబాబు  తెలిపారు శనివారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆర్ డి ఓ విలేకరులతో మాట్లాడుతూ  మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సంబంధించి ఉదయం 8 గంటల నుండి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని దీనికి సంబంధించి 8 టేబుల్స్ ఏర్పాటు చేశామని, నాలుగు రౌండ్లు ద్వారా కౌంటింగ్ పూర్తి అవుతుందని  తెలిపారు . ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. 

 కౌంటింగ్ సిబ్బందికి, కౌంటింగ్ ఏజెంట్ లకు మున్సిపల్ కమిషనర్ ప్రత్యేకమైన కౌంటింగ్ పాసులు జారీ చేశారని చెప్పారు. గుర్తింపు పొందిన ఐడి కార్డు ఉన్నవారికి మాత్రమే కౌంటింగ్  హలు లోప్రవేశం ఉంటుందని చెప్పారు. సెల్ ఫోన్లు కానీ ఇతర ఎలక్ట్రికల్ పరికరాలు గాని  కౌంటింగ్ హాల్లోకి అనుమతించమని తెలిపారు . మీడియ సెంటర్ ఏర్పాటు చేశామని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ కు సమాచారం అందజేయడం జరుగుతుందని తెలిపారు డీఎస్పీ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ నిర్వహణకుచర్యలు తీసుకున్నామని ఆర్డిఓ తెలిపారు.

ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ

 ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ

పెద్దాపురం,పెన్ పవర్

 ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పెద్దాపురం రెవిన్యూ డివిజనల్ అధికారి ఎస్ మల్లి బాబు తెలిపారు. శనివారం పెద్దాపురం డివిజన్లకు సంబంధించి  స్థానిక ఆర్ డి ఓ  కార్యాలయంలో 14వ తేదీ జరగబోవు ఎమ్మెల్సీ పోలింగ్ కు సంబంధించి 12 మండలాలకు, పోలింగ్ సిబ్బందికి పోలింగ్ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా ఆర్ డి ఓ ఎస్ మల్లి బాబు విలేకరులతో మాట్లాడుతూ 14వ తేదీ ఆదివారం డివిజన్లోని 11 మండలాల్లో ఎంపీడీవో కార్యాలయంలోను, రంగంపేటలో తాసిల్దారు కార్యాలయంలో ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు 1,039 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కును నమోదు చేసుకున్నారని తెలిపారు ఈరోజు ప్రత్యేకమైన బస్సులలో పోలింగ్ సిబ్బందికి పోలింగ్ సామాగ్రి అందజేసి వారిని పోలింగ్ కేంద్రాలకు తరలించామని చెప్పారు పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించామని, ఎటువంటి సమస్యలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు పోలింగ్ ఉదయం ఎనిమిది గంటల నుండి ప్రారంభమై 4గంటలకు ముగుస్తుందని, ఎమ్మెల్సీ కౌంటింగ్ సంబంధించి ఈనెల 17వ తేదీన  కాకినాడ జేఎన్టీయూలో కౌంటింగ్ పక్రియ ప్రారంభం అవుతుందని ఆర్డిఓ తెలిపారు.

పనులు నాణ్యత ప్రమాణాలతో చేయాలి

పనులు నాణ్యత ప్రమాణాలతో చేయాలి

పెన్ పవర్,కరప

 గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులు నాణ్యతా ప్రమాణాలతో చేయాలని ఆ డబ్యూఎస్ ఏఈ పి.ప్రసాద్ అన్నారు. సీసీ డ్రెయిన్ల నిర్మాణపనులను శనివారం ఆయన వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించి సూచనలు చేశారు. 14వ ఆర్థిక సంఘం నిధులు రూ 10 లక్షలు ఉపాధిహామీ పధకం నిధులు రూ 60 లక్షలు వెరశి రూ 70 లక్షలతో కొత్తపేట, మెరకవీది, బీనీ. ఎస్పీ వీధులలో నాలుగు సీసీ డ్రెయిన్ల నిర్మాణపనులు జరుగుతున్నాయన్నారు. మిగిలిన వీధులలో కూడా సీసీ డ్రెయిన్లు నిర్మించేందుకు నిధులు మంజూరుచేస్తామని రాష్ట్ర వ్యవసాయ. సహకారశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపినట్టు వైఎస్సార్ సీపీ గ్రామకమిటీ అధ్యక్షుడు మేడికెట్టి సత్తిబాబు చెప్పారు వైఎస్సార్ సీపీ నాయకులు యాళ్ల సుబ్బారావు, సాదే లోహిదాస్కుమార్, నక్కా సత్తిబాబు, పాట్నీడి భీమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

నేడు కొత్తపల్లి లో ఉచిత వైద్య శిబిరం..

 నేడు కొత్తపల్లి లో ఉచిత వైద్య శిబిరం..

గోకవరం,పెన్ పవర్

గోకవరం మండలం జి కొత్తపల్లి గ్రామంలో ఆదివారం నాడు కొత్తపల్లి గ్రామం మెయిన్ రోడ్డు నందుగల రైటర్ ఇంటి ఆవరణలో శ్రీరామ సత్య క్లినిక్ నందు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆ క్లినిక్ వైద్యులు డాక్టర్ శ్రీ కృష్ణ చైతన్య తెలిపారు. ఈ వైద్య శిబిరంలో అన్ని రకాల వ్యాధులకు డాక్టర్ శ్రీ కృష్ణ చైతన్య  వైద్య సేవలు అందిస్తారని క్లినిక్ యాజమాన్యం తెలిపింది. అంతేకాకుండా రోగులకు అవసరమైన మందులను పూర్తిగా ఉచితంగా అందజేస్తామని, రోగికి అవసరమైన రక్త పరీక్షలు సగం రేట్లకే చేస్తామని, రోగికి అవసరమైన ఏ రకమైన వైద్య సేవలైన పూర్తిగా ఉచితంగా చేస్తామని తెలిపారు. కాబట్టి కొత్తపల్లి చుట్టుపక్క గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ శ్రీ కృష్ణ చైతన్య తెలిపారు.

విశాఖ ఏజెన్సీలో ఆహార శుద్ధి యంత్రాలు ఏర్పాటు చేస్తాం

 విశాఖ ఏజెన్సీలో ఆహార శుద్ధి యంత్రాలు ఏర్పాటు చేస్తాం

పెన్ పవర్,విశాఖపట్నం

విశాఖ ఏజెన్సీలో ఆహారశుద్ధి యంత్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం  చేయాలని  పాడేరు సముగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ( ఐ టి డి ఎ)  ప్రాజెక్ట్ అధికారి  వెంకటేశ్వర సలిజామల  అన్నారు. శనివారం తన కార్యాలయంలో  సంబంధిత అధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపార విపణిలో  ఆర్గానిక్ వస్తువులకు  చాలా డిమాండ్ ఉందని. ఆ దిశలో ప్రయోగాత్మకంగా  గిరిజనులు పండించే తృణ ధాన్యాలను  మెరుగుపరిచి మార్కెట్ చేయడంవల్ల గిరిజనులకు ఆదాయ వనరులు చేకూరుతాయి అన్నారు. గిరిజనులు సేంద్రీయ పద్ధతిలో సాగుచేస్తున్న కాపీ పసుపు చింతపండు  మిరియాలు సొల్లు సామలు  కొర్రలు  అల్లం పాల పిండి వంటి పదార్థాలను మెరుగుపరిచి మార్కెట్ చేసే సౌకర్యం కల్పిస్తామన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన  ఉత్పత్తులతో ఆహార యూనిట్లు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. గిరిజనులు సేంద్రీయ విధానంలో  పండిస్తున్న  తృణధాన్యాలు  ఇతరత్రా వ్యవసాయ ఉత్పత్తులను వారపు సంతల్లో విక్రయిస్తున్నారని  అందువల్ల దళారిల దోపిడీలకు గురవుతున్నారని అన్నారు. ఈ మేరకు గిరిజనులకు తగిన ఆదాయం  సమకూరే లా ఐ టి డి ఎ ద్వారా ఆహార యూనిట్లు నెల్ల కల్పిస్తామన్నారు. దేనికి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని పీవో వెంకటేశ్వర్ ఆదేశించారు.

ప్రశాంతంగా ముగిసిన సి ఓ ఈ ప్రవేశ పరీక్ష

 ప్రశాంతంగా ముగిసిన సి ఓ ఈ ప్రవేశ పరీక్ష

పర్యవేక్షించిన ఆర్సీఓ కొప్పుల స్వరూపారాణి.

బెల్లంపల్లి , పెన్ పవర్

ఉదయం 8గం.ల కే  సెంటర్ల కు చేరుకున్న విద్యార్థులు. ఉదయం 10గo.లకు ప్రారంభమై  1గం.కు ముగిసింది.తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విధ్యాలయాల సంస్థ  ఆద్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతున్న సి ఓ ఈ (సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సీ) ల్లో వచ్చే విద్యా సంవత్సరానికిగాను ఇంటర్ మీడియట్ ప్రధమ సంవత్సరంలో అడ్మిషన్ కోసంనిర్వహించిన సిఓఈ ప్రధమ స్క్రీనింగ్ టెస్ట్  శనివారం ప్రశాంతంగా ముగిసింది. ఆదిలాబాద్ రీజియన్ వ్యాప్తంగా ఏర్పాటుచేసిన  10 పరీక్షా కేంద్రాలకు సంబంధించిన సౌకర్యాల విషయమై ఆర్సీఓ ఎప్పటికప్పుడు ఆడిగితెలుసుకుంటు విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రశాంతంగా పరీక్ష వ్రాసేలా సమన్వయంచేశారు.  రీజియన్ వ్యాప్తంగా 10 సెంటర్లలో 2694మందికి గాను 2385 మంది పరీక్ష వ్రాయగా 309 మంది గైర్ హాజరయ్యారు.  88.53 శాతం  హాజరైనట్లు ఆర్సీఓ కే.స్వరూపారాణి తెలిపారు. సంక్షేమ గురుకులాల ఆదిలాబాద్ ప్రాంతీయ సమన్వయాధికారిని (ఆర్సీఓ) కొప్పుల స్వరూపరాణి బెల్లంపల్లి లోని బాలుర,బాలికల  సెంటర్లతోపాటు చెన్నూర్, జైపూర్* సెంటర్లను సందర్శించారు. రూట్ ఆఫీసర్ గా ఏఆర్సీఓ కోటిచింతల మహేశ్వర రావు, చీఫ్ సూపరింటెండెంట్స్ గా సంబంధిత ప్రిన్సిపాల్స్ ఐనాల సైదులు, యస్.స్వరూప, ఆర్ బాలభాస్కర్, రాజమణి, లలితకుమారి, స్వర్ణలత, శ్రీనివాస్ రావు, ప్రవీణ్ కుమార్, శ్రీధర్,సంగీత లు వ్యవహరించారు. బెల్లంపల్లి లోని బాలుర మరియు బాలికల సెంటర్ల వద్ద తాళ్ళ గురజాల పోలీస్ స్టేషన్ ఎస్సై సమ్మయ్య ఆధ్వర్యంలో పటిష్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటుచేశారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...