Followers

మలబార్ గోల్డ్ డైమండ్స్ లో హెరిటేజ్ జ్యువెలరీ షో

 మలబార్ గోల్డ్ డైమండ్స్ లో హెరిటేజ్ జ్యువెలరీ షో

కూకట్ పల్లి,పెన్ పవర్

బంగారు, వజ్రాల నగల వ్యాపారంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ కూకట్‌పల్లిషోరంలో హెరిటేజ్ జ్యువలరీ షోను ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రముఖ మోడల్, బాలీవుడ్ నటి జోయమిర్జా హాజరై జ్యువలరి షోను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశిష్ట ఆభరణాల ప్రదర్శనలో భాగంగా బంగారు ఆభరణాలు, యాంటిక్ ఆభరణాలు, అద్వితీయమైన కళానైపుణ్యంతో, హుందాతనంగా ఉండే ఆభరణాలు ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రదర్శన ఈనెల పద్నాలుగో తరీఖు నుండి ఇరవై ఒకటో తారీఖు వరకు నిర్వహిస్తున్నట్లు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ నిర్వాహకులు తెలియజేసారు. 

అలాగే ఈ సంస్థ తమ వార్షిక ఆదాయం నుండి కొంతమొత్తం ఆదాయాన్ని సంస్థాగత బాధ్యత రూపంలో ఆరోగ్యం, ఉచిత విద్య, నిరుపేదలకు గృహనిర్మాణం, మహిళ సాధికారత, పర్యావరణ పరిరక్షణ వంటి కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నట్లు స్టోర్ హెడ్ సానిబ్ వివరించారు.

పుట్టిన గడ్డ రుణం తీర్చుకొనేందుకే ట్రస్ట్ స్థాపన

 పుట్టిన గడ్డ రుణం తీర్చుకొనేందుకే ట్రస్ట్ స్థాపన

సంపాదనలో కొంత భాగం ఖర్చు చేసేందుకే సేవ కార్యక్రమాలు

చిన్ననాటి కోరిక మేరకే సామూహిక వివాహా కార్యక్రమాలు

వేములవాడ,పెన్ పవర్

వేములవాడ నియోజకవర్గ మీడియా మిత్రుల ఆత్మీయ సమావేశంలో సామూహిక వివాహల పోస్టర్ ఆవిష్కరించిన -- టి ఆర్ కె ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట రామ్ కుమార్ పుట్టిన గడ్డ రుణం తీర్చుకొనేందుకే టి.ఆర్.కె చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని టి ఆర్ కె చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట రామ్ కుమార్ అన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో మరికొద్ది రోజుల్లో నిర్వహించనున్న సామూహిక వివాహాల పోస్టర్ ను ఆదివారం వేములవాడ పట్టణములోని మహా లింగేశ్వర ఫంక్షన్ హాల్ లో ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి వేములవాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మీడియా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తోట రామ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎంతో సంపాదిస్తారు కానీ అందులో నుండి కొంత మంది మాత్రమే ఖర్చు చేసేందుకు ముందుకు వస్తారని, ఈ క్రమంలోనే పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలనే ఉద్దేశ్యంతో ట్రస్ట్ స్థాపించి, కష్టపడాలి పది మందికి సాయం చేయాలి అనే నినాదంతో సేవ కార్యక్రమాలు చేస్తున్నాని, అలాగే చిన్ననాటి కోరిక మేరకు ట్రస్ట్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని నిరుపేద వంద మంది ఆడపిల్లల పెళ్లిళ్లు అన్ని మతాల వారికి వారి వారి సంప్రదాయాల్లో చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, ఉగాది కొత్త పంచాంగంలో ఈ మహోత్తర కార్యక్రమం నిర్వహిస్తామని, దీనికి మీ వంతు సహకారం అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. 

సమాచారం అందించడంలో మీడియా పాత్ర ఎంతో కీలకం

ప్రజలకు సమాచారం చేరవేయడంలో మీడియా పాత్ర ఎంతో కీలకమని టి ఆర్ కె ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట రామ్ కుమార్ అన్నారు. సామూహిక వివాహ కరపత్రం ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయడంలో ప్రింట్&ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఎంతో కృషి చేస్తున్నారని, ఎండనక, వాననక కష్టపడుతూ సమాజం అభివృద్ధిలో జర్నలిస్టులు కీలకంగా వ్యవహరిస్తున్నారని, అలాగే తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి, నిరుపేద కుటుంబాలకు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టి ఆర్ కె ట్రస్ట్ డైరెక్టర్ మోట్టల మహేష్, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి నాయిని శేఖర్, ఎంక్వయిరీ టీం, వర్కింగ్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు.

జన్మదిన సందర్భంగా పండ్లు పంపిణీ చేస్తున్న బీజేపీ నాయకులు

జన్మదిన సందర్భంగా పండ్లు పంపిణీ చేస్తున్న బీజేపీ నాయకులు

ఇంద్రవెల్లి,పెన్ పవర్

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చిట్యాల సుహాసిని రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు మరప రాజు మాట్లాడుతూప్రజల కష్ట సుఖాల్లో ఎల్లప్పుడూ నేనున్నా అంటూ నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి పక్షాన నిలబడి ప్రతి సమస్యను తన సమస్యగా తీసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్న మా ప్రియతమా నాయకురాలు నిండు నూరేళ్లు ఆయుఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని, జీవితంలో ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని అన్నారు.అనంతరం రోగులకు పండ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ మిషన్ జిల్లా కన్వీనర్ దీపక్ సింగ్ షేకవత్, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షుడు చంపత్ రావు,వైస్ ఎంపీపీ పి.గోపాల్ సింగ్,ఇంద్రవెల్లి మండల బీజేపీ అధ్యక్షుడు అరెళ్లి రాజలింగు,యువమోర్చా మండల అధ్యక్షుడు గిరి లహానే,ప్రధాన కార్యదర్శి గెడం భారత్,మండల బీజేపీ ఉపాధ్యక్షుడు భీంరావు, మండల నాయకులు మెస్రం జైరాం, శివకుమార్, కేంద్రే ప్రహ్లాద్,సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

పూలాజీ బాబా బాటలో నడవాలి...

 పూలాజీ బాబా బాటలో నడవాలి...

ఇంద్రవెల్లి,పెన్ పవర్

 పూలాజీబాబా సూచించిన ఆధ్యాత్మిక మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని మండల ఎంపీపీ పోటె శోభాబాయి అన్నారు. ఆదివారం మండలకేంద్రంలో సద్గురు పూలాజీబాబా ధ్యాన మందిరం 13వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఒక్కరూ వ్యసనాలకు దూరంగా ఉండి, పూలాజీబాబా సూచించిన భక్తిభావాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ధ్యాన మందిరం కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ ఆంద్ ఉద్యోగులు సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాకురే రాందాస్, ఆదివాసీ ఆంద్ సంఘం జిల్లా అధ్యక్షులు ముఖడే విష్ణు, పోటె సాయినాథ్, పుడంలిక్, బన్సీలాల్, డి. మాధవ్ టీచర్, తదితరులు పాల్గొన్నారు.

ఐకమత్యంగా ఉంటే గెలుపు మనదే

 ఐకమత్యంగా ఉంటే గెలుపు మనదే

గుడీహత్నూర్,పెన్ పవర్ 

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బోథ్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలు అంతా ఐకమత్యంగా ఉండి కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని బజార్ హత్నూర్ జడ్పిటిసి సభ్యులు మల్లెపూల నర్సయ్య అన్నారు. ఆదివారం మంచిర్యాలలోని కాంగ్రెస్ పార్టీ  సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు నివాసంలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గానికి సమర్థుడైన అభ్యర్థిగా తాంసి మండలానికి చెందిన వైద్యుడు మల్లెల అశోక్ అన్ని విధాలా అర్హుడని,ఆయనకు టికెట్ కేటాయిస్తే నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఐకమత్యంగా పని చేసి బోథ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండాను ఎగరవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అంకతి రవీందర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ షంసుద్దీన్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

ఎన్నికల ఓటింగ్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ శ్వేతా మహంతి

 ఎన్నికల ఓటింగ్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ శ్వేతా మహంతి

మేడ్చల్ మల్కాజిగిరి,పెన్ పవర్

మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ శాసన మండలి పట్టభద్రుల ఎన్నికల ఓట్ల సరళిని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి ఆదివారం ఉదయం పరిశీలించారు . ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు ప్రతి పట్టభద్రుడు  ఓటు హక్కు  వినియోగించుకోవాలని ఆమె సూచించారు.

ఈ సందర్భంగా  బాలానగర్ మండలంలోని రాజు కాలనీలో ఉన్న ఎన్నికల కేంద్రాలైన 443, 444, 445, 446 పోలింగ్ కేంద్రాలతో పాటు కూకట్పల్లి జేఎన్టీయూ, ప్రగతినగర్, బాచుపల్లి, కుత్భుల్లాపూర్లోని సూరారం కాలనీ, దూలపల్లి ,ఎన్నికల కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా  ఎన్నికలు జరుగుతున్న సరళి, పోలింగ్ శాతాన్ని కలెక్టర్ అధికారులనుండి తెలుసుకున్నారు.. ఆయా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి పోలింగ్ జరుగుతున్న తీరు ఇప్పటి వరకు ఎంత మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.. ఎన్నికల కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు తలెత్తాయి అనే విషయాలను కలెక్టర్ శ్వేతా మహంతి స్వయంగా తెలుసుకున్నారు.  ఆదివారం ఉదయం 8గంటలకు ప్రారంభమై సాయంత్ర 4గంటల లోపు క్యూలో ఉన్న వారు ఓటు వేసే అవకాశం ఉంటుందన్నారు.

 ఈ ఎన్నికలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఇప్పటి వరకు ఎన్నికలు ఎక్కడ ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా జరుగుతున్నట్లు కలెక్టర్ శ్వేతా మహంతి పేర్కొన్నారు.. ఈ సందర్భంగా  మధ్యాహ్నం సమయంలో ఓటు వేసేందుకు అన్ని పోలింగ్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో ఓటర్లు రావడంతో ఈ విషయాన్ని గుర్తించిన కలెక్టర్ అప్పటికప్పుడు అందుబాటులో ఉన్న అదనపు పోలింగ్ ఆఫీసర్లు లను విధులు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. పట్టభద్రులకు అవసరమైన పెన్నులు, ఇతరత్రా పరికరాలను అందుబాటులో ఉంచామని, ఓటర్ల కోసం తాగునీటి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశాం. అని తెలిపారు.. అలాగే ఎండలు ఎక్కువగా ఉన్నందున ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్లు, తాగునీటి సదుపాయాల ఏర్పాటును పర్యవేక్షించి అవసరమైన చోట్ల తగిన సౌకర్యాలను కల్పించారు. అలాగే క్యూ లైన్లలో ఉన్న వారికి తగిన ఏర్పాటు చేయించారు. అధికారులు తమకు  ఎటువంటి ఇబ్బందులు వున్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

కొండరెడ్ల రెడ్డిగుంపులోబోరింగ్ మరమ్మతులు

 కొండరెడ్ల రెడ్డిగుంపులోబోరింగ్ మరమ్మతులు 

వి.ఆర్.పురం,పెన్ పవర్

వి.ఆర్.పురం  మండలం ఉమ్మడివరం గ్రామంలో కొండరెడ్ల రెడ్డి గుంపులోమంచినీటి సమస్య ఎక్కువగా ఉండటంతో అక్కడ ప్రజలు  నానా ఇబ్బందులు పడుతున్నారు. సమాచారం తెలుసుకున్న రేఖపల్లి పంచాయతీకి సంబంధించిన నూతన సర్పంచ్ పూ నెం సరోజిని ఆ గ్రామానికి వెళ్లి దగ్గరుండి బోరింగ్ మరమ్మతులు చేయించినారు.  రేఖపల్లి పంచాయతీలో గల గ్రామాల్లో ప్రజలకు ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే  గ్రామంసర్పంచ్ కి తెలియజేయాలని ఆమె ప్రజలకు తెలియజేసినారు.ఆ గ్రామ ప్రజలు సర్పంచ్ కు కృతజ్ఞతలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనెం సత్యనారాయణ ఉప సర్పంచ్ పాయం లక్ష్మణ్ చిక్కాల రామారావు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...