ఎన్నికల ఓటింగ్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ శ్వేతా మహంతి
మేడ్చల్ మల్కాజిగిరి,పెన్ పవర్
మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ శాసన మండలి పట్టభద్రుల ఎన్నికల ఓట్ల సరళిని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి ఆదివారం ఉదయం పరిశీలించారు . ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు ప్రతి పట్టభద్రుడు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆమె సూచించారు.
ఈ సందర్భంగా బాలానగర్ మండలంలోని రాజు కాలనీలో ఉన్న ఎన్నికల కేంద్రాలైన 443, 444, 445, 446 పోలింగ్ కేంద్రాలతో పాటు కూకట్పల్లి జేఎన్టీయూ, ప్రగతినగర్, బాచుపల్లి, కుత్భుల్లాపూర్లోని సూరారం కాలనీ, దూలపల్లి ,ఎన్నికల కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికలు జరుగుతున్న సరళి, పోలింగ్ శాతాన్ని కలెక్టర్ అధికారులనుండి తెలుసుకున్నారు.. ఆయా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి పోలింగ్ జరుగుతున్న తీరు ఇప్పటి వరకు ఎంత మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.. ఎన్నికల కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు తలెత్తాయి అనే విషయాలను కలెక్టర్ శ్వేతా మహంతి స్వయంగా తెలుసుకున్నారు. ఆదివారం ఉదయం 8గంటలకు ప్రారంభమై సాయంత్ర 4గంటల లోపు క్యూలో ఉన్న వారు ఓటు వేసే అవకాశం ఉంటుందన్నారు.

ఈ ఎన్నికలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఇప్పటి వరకు ఎన్నికలు ఎక్కడ ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా జరుగుతున్నట్లు కలెక్టర్ శ్వేతా మహంతి పేర్కొన్నారు.. ఈ సందర్భంగా మధ్యాహ్నం సమయంలో ఓటు వేసేందుకు అన్ని పోలింగ్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో ఓటర్లు రావడంతో ఈ విషయాన్ని గుర్తించిన కలెక్టర్ అప్పటికప్పుడు అందుబాటులో ఉన్న అదనపు పోలింగ్ ఆఫీసర్లు లను విధులు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. పట్టభద్రులకు అవసరమైన పెన్నులు, ఇతరత్రా పరికరాలను అందుబాటులో ఉంచామని, ఓటర్ల కోసం తాగునీటి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశాం. అని తెలిపారు.. అలాగే ఎండలు ఎక్కువగా ఉన్నందున ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్లు, తాగునీటి సదుపాయాల ఏర్పాటును పర్యవేక్షించి అవసరమైన చోట్ల తగిన సౌకర్యాలను కల్పించారు. అలాగే క్యూ లైన్లలో ఉన్న వారికి తగిన ఏర్పాటు చేయించారు. అధికారులు తమకు ఎటువంటి ఇబ్బందులు వున్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.