Followers

సీసీ కెమెరాలతో నిఘా పటిష్టం

 సీసీ కెమెరాలతో నిఘా పటిష్టం

గుడిహత్నూర్ ,పెన్ పవర్

 ఆదిలాబాద్ జిల్లా  గుడిహత్నూర్ మండలంలోని డొంగర్గావ్ గ్రామ పంచాయతీలో నేను సైతం మరియు కమ్యూనిటి పొలిసింగ్ లో భాగంగా ఏర్పాటు చేసిన  సిసి కెమెరాలను ఆదివారం ఇచ్చోడా సిఐ కంప రవీందర్ స్థానిక సర్పంచ్ ప్రజాప్రతినిధులు కలిసి ప్రారంభించారు. నేర రహిత సమాజ నిర్మాణంలో సిసి కెమెరాలు చాలా కీలకంగా పనిచేస్తాయని ఆయన అన్నారు.సిసి కెమెరాల ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రాంతాలలో నేరాలను అదుపు చేయవచ్చని, దొంగతనాలు నివారించే అవకాశం ఏర్పడుతుందని సీఐ తెలిపారు. ఒకవేళ దొంగతనం జరిగినా సిసి కెమెరాల ద్వారా వారిని గుర్తించి పట్టుకోవచ్చని చెప్పారు. సీసీ కెమెరాల ద్వారా ఎన్నో నేరాలు అరికట్టడం జరిగింది అని అన్నారు. జిల్లాలో కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా అన్ని గ్రామాలలో,పట్టణాల్లో సిసి కెమెరాల ఏర్పాటు చేసే విధంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామని చెప్పారు. నేరాలను అదుపు చేయడం, నేరాలు, అసాంఘిక కార్యకలాపాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించి పట్టుకోవడంలో సిసి కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. అన్ని గ్రామ పంచాయతీలు,గ్రామాల్లో  సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు దాతలు ముందుకు రావాలని, ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఓర్సు లక్షీబాయ ఎస్సై ఎల్ ప్రవీణ్ , రెహమాన్ ఖాన్, టిఆర్ఎస్ మండల కన్వీనర్ కరాడ్ బ్రహ్మానంద్, పిఎసిఎస్ డైరెక్టర్ అశన్న గ్రామస్థులు రవుఫ్ ఖాన్, మారుతీ, సుధాకర్  తదితరులు పాల్గొన్నారు.

వైసీపీ సీనియర్ నాయకులు విజయ సాయి రెడ్డి ని కలిసిన కోలగట్ల

 వైసీపీ సీనియర్ నాయకులు విజయ సాయి రెడ్డి ని కలిసిన కోలగట్ల

విజయనగరం,పెన్ పవర్

రాజ్యసభ సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయిరెడ్డిని విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు లు సోమవారం నాడు విశాఖపట్నంలో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో నగరపాలక ఎన్నికలలోనూ, మున్సిపల్ ఎన్నికల్లోనూ అనూహ్య ఫలితాలు సాధించిన ఎమ్మెల్యే కోలగట్ల ను, జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు లను  విజయసాయి రెడ్డి అభినందించారు. విజయనగరం నగరపాలక ఎన్నికలలో 50 డివిజన్లకు గాను 48 డివిజన్లను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం పట్ల ప్రత్యేకంగా ఎమ్మెల్యే కోలగట్ల ను ఆయన అభినందించారు. ఇదే స్ఫూర్తితో త్వరలో జరగనున్న జెడ్ పి టి సి, ఎంపీటీసీ ఎన్నికలలో కూడా వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలి అన్నారు. జిల్లాలో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టత పట్ల చర్చించారు.

హావర్స్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో మంచి నీటి పంపిణీ

హావర్స్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో మంచి నీటి పంపిణీ

 ఇచ్చోడ,పెన్ పవర్ 

ఇచ్చొడ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24హావర్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మంచి నీటి క్యాన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 24హావర్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు విశ్వబోధి మాట్లాడుతూ మాన్యశ్రీ కాన్షిరాం జయంతి నుంచి మొదలుకొని అంబేద్కర్ జయంతి వరకు రోజు ఆరోగ్య కేంద్రంలో వచ్చే రోగులకు నీటి పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు,సోన్ కాంబ్లే వికాస్,తదితరులు పాల్గొన్నారు.


గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించిన మహిళ కమిషన్ సభ్యురాలు ఈశ్వరిబాయి

 గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించిన మహిళ కమిషన్ సభ్యురాలు ఈశ్వరిబాయి

ఇంద్రవెల్లి,పెన్ పవర్

కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటిస్తూ పిల్లలు జాగ్రత్తగా చదువుకోవాలని తెలంగాణ రాష్ట్ర మహిళ కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరిబాయి అన్నారు సోమవారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని గిరిజన   ఆశ్రమ బాలికల ఉన్నత  పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా 9 ,10 వ తరగతి పిల్లలతో ముచ్చటించారు ఈ సందర్భంగా ఈశ్వరిబాయి మాట్లాడుతూ  కరోనా మహమ్మారి రోజు రోజుకు   విజృంభిస్తున్న వేళ  భౌతిక దూరం పాటిస్తూ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా  తమ చదువులు కొనసాగించాలని ఆమె అన్నారు.పరీక్షలు దగ్గర పడుతున్న0ధున కష్టపడి చదవి మంచి మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉన్నత విద్యను అభ్యసించే దిశగా ప్రణాళిక అలవర్చుకొని పరీక్షలకు హాజరవ్వాలని ఆమె అన్నారు.అనంతరం పాఠశాల ఉపాధ్యాయులతో   సమావేశమై పాఠశాల లో  కోవిడ్ నిబంధనల ఏర్పాటు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గంగారాం ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

దంచుతున్న ఎండలు

 -దంచుతున్న ఎండలు-

-దాహార్తిని తీరుస్తున్న పుచ్చకాయలు-జిల్లా ప్రతినిధి మనోజ్ కుమార్

సెల్:7032074335

జగిత్యాల,పెన్ పవర్

ప్రతీ ఏటా మార్చి నెల చివరి రోజుల్లో ప్రారంభమయ్యే ఎండలు ఫిబ్రవరి మాసంలోనే మొదలువడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.శివరాత్రి పర్వదినం దాటినా తర్వాత ఎండలు ఇంత త్వరగా 36 డిగ్రీలు దాటడంతో ఎప్రిల్,మే నెలల్లో ఇంకా ఎండలు ఏ విధంగా ఉంటాయని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.ఎండలను దృష్టిలో ఉంచుకుని పుచ్చకాయలని సాగు చేసే వ్యాపారులు గత పదిహేను రోజులుగా వాటిని విక్రయిస్తున్నారు.పట్టణంలోని ఇరువైపులా రోడ్ల పై ఎక్కడ చూసినా పుచ్చకాయలు కి 20 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. దాహార్తిని తీసుకోవడానికి ప్రజలు పుచ్చకాయలను కొనుగోలు చేస్తూ దాహార్తిని తీర్చుకుంటున్నారు. పుచ్చకాయలను విక్రయించే వ్యాపారులు మహారాష్ట్ర లోని పలు ప్రాంతాల్లో నుండి నిత్యం వాహనాల్లో పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి ఈ చిరు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. దీంతో ప్రతీ వీధిలో సైతం చిరు వ్యాపారులు తిరుగుతూ పుచ్చకాయలని విక్రయిస్తూ తమ జీవితాలను గడుపుతున్నారు.అలాగే భానుడి ప్రతాపానికి గొంతు ఎండిపోవడంతో వాటిని తింటూ సేద తీరుతున్నారు.పుచ్చ కాయలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని పలువురు అంటున్నారు. ఎండకాలంలో దొరికే ఫలం అయినందున ప్రతీ ఒక్కరు తినాలని పలువురు పేర్కొంటున్నారు.

బ్యాంకుల ప్రైవేటీకరణను తక్షణమే ఆపాలి పాచిపెంట శాంతకుమారి పిసిసి ప్రధాన కార్యదర్శి

 బ్యాంకుల ప్రైవేటీకరణను తక్షణమే ఆపాలి పాచిపెంట శాంతకుమారి పిసిసి ప్రధాన కార్యదర్శి

అరకు, పెన్ పవర్

 కేంద్ర ప్రభుత్వం బ్యాంకులు ప్రవేటికరణకు వ్యతిరేకంగా సోమ మంగళ వారాలలో చేపట్టిన నిరసనకు  ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాచిపెంట శాంతకుమారి సంఘీభావం తెలిపారు. సోమవారం అరకు వేలి మండల కాంగ్రెస్ కార్యాలయంలో ఇక నాయకులతో కలసి బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి శాంతకుమారి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె  మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేటికరణ మంత్రం జపిస్తోందని ఏమాత్రం సమంజసంగా లేదని అన్నారు బ్యాంకులు ప్రవేటికరణ చేయడం ద్వారా బ్యాంకు ఉద్యోగులతో పాటు ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది  అని తెలిపారు. నాటి  భారత ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరా గాంధీ భారత దేశ ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాజా ఆభరణాలు రద్దు చేసి బ్యాంకుల జాతీయకరణ చేస్తే నేడు మోడీ బ్యాంకులను ప్రైవేటీకరణ చేసి  భారత దేశ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని  అన్నారు అదే విధంగా కొన్ని బ్యాంకులు మూత పడే అవకాశం ఉందని వారు హెచ్చరించారు. చిన్న పరిశ్రమలు, వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోతుందని, కార్పొరేట్ శక్తులు తీసుకున్న రుణాలు పక్క దారి పడతాయని, వారిపై చర్యలు తీసుకోవాలంటే ఇబ్బందులు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో అరకు వేలి కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాచిపెంట చిన్నస్వామి యూత్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ మొస్య ప్రేమ్ కుమార్ తెడబారికి  భీమారావు ,కె సుశిల,వంతల మలేష్, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.

గుండారం లో రెవెన్యూ భూమి పై సర్వే జరపండి

 *గుండారం లో రెవెన్యూ భూమి పై సర్వే జరపండి *

ఎల్లారెడ్డిపేట,పెన్ పవర్

ఎల్లారెడ్డిపేట మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేసి  గుండారం గ్రామంలో రెవెన్యూ భూమి పై సర్వే జరపాలని తాసిల్దార్ శ్రీకాంత్ కు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొమ్మాట నరసయ్య మాట్లాడుతూ గుండారం గ్రామంలో  147 సర్వే నెంబర్లో 159 ఎకరాల రెవెన్యూ భూమి ఉందని ఇట్టి భూమిని గిరిజనులకు దళితులకు పంపిణీ చేయాలన్నారు అటవీశాఖ అధికారులు ఈ భూమిని అటవీశాఖ భూమి అంటూ అక్రమంగా కలుపుకోవడం జరిగిందన్నారు రెవెన్యూ అటవీశాఖ అధికారులు కలసి ఉమ్మడి  సర్వే జరిపించి రెవెన్యూ భూమిని వేరు చేయాలన్నారు కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజు నాయకుని అక్రమ కేసుల్లో ఇరికించి అరెస్టు చేసి జైలుకు పంపించడం జరిగిందన్నారు రాజు నాయక్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్ జిల్లా కార్యదర్శి బండ్ల లింగం గౌడ్ నాయకులు కరికెశ్రీనివాస్ .మర్రి శ్రీనివాస్ రెడ్డి ..రాజేందర్ అక్కపురం కృష్ణ . శెట్టిపల్లి బాలయ్య .గజ్జల శ్రీనివాస్. దేవయ్య దండు శ్రీనివాస్ మానుక నాగరాజు సిరిపురం మహేందర్ రాజు రాములు రైతులు పాల్గొన్నారు

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...