సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరించిన సుజాత ముత్యాలు
పరవాడ,పెన్ పవర్స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో ముత్యాలమ్మ పాలెం సర్పంచ్ గా ఎన్నిక అయిన చింతకాయల సుజాత ముత్యాలు విజయం సాధించిన విషయం పాఠకులకు విదితమే.సోమవారం నాడు గ్రామ సచివాలయంలో వార్డు సభ్యులు, సిబ్బంది,స్థానిక నాయకులు,కార్యకర్తల ఆధ్వర్యంలో సుజాత ముత్యాలు గ్రామ నూతన సర్పంచ్ గా ప్రమాణస్వీకారం చేశారు.అనంతరం సుజాత ముత్యాలు మాట్లాడుతూ తనమీద నమ్మకం ఉంచి ఈ విజయం అందించిన గ్రామ ప్రజల రుణాన్ని తాను నిస్వార్థంగా సేవచేసి తీర్చుకుంటాను అని అన్నారు.ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పధకం రాజకీయాలకు అతీతంగా అర్హులకు అందరికి అందే చూస్తాను అని తెలిపారు.అంతే కాకుండా గ్రామాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి అభివృద్ధి పధంలో నడిపిస్తాను అని తెలియ జేశారు.ఈ సందర్భంగా నా విజయానికి కష్టపడిని నాయకులకు,కార్యకర్తలకు,ప్రజలకు ప్రతి వక్కరకి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో చింతకాయల ముత్యాలు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.








