Followers

జాతర్లలో ట్రైనీ ఐ ఎ ఎస్ ల పర్యటన

 జాతర్లలో ట్రైనీ ఐ ఎ ఎస్ ల పర్యటన

గుడిహత్నూర్ ,  పెన్ పవర్

 ఆదిలాబాద్ జిల్లా  బజార్  హత్నూర్   మండలంలోని  జాతర్ల  గ్రామాన్ని ట్రైనీ ఐఏఎస్ లు కునాల్ అర్వింద్  ప్రతాప్ ( గ్రూప్ లీడర్), శ్రీవాస్తవ,కంటా జంగీర్,సుస్మా నేగి లు మంగళవారం  సందర్శించారు. కాగా  గ్రామంలోని గ్రామపంచాయతీ  ఆఫీస్ లో  వివిధ  డిపార్ట్ మెంట్ల  ఆఫీసర్లతో ఏర్పాటు  చేసిన  మీటింగ్ లో  పాల్గొని గ్రామిణాభివృద్ధి  కోసం  చేపడుతున్న  కార్యక్రమాలను అడిగి  తెలుసుకున్నారు.  ఐసీడీఎస్, స్కూల్స్ , హాస్టల్స్, గ్రామపంచాయతీలలో  రోజువారీగా   జరిగే  ప్రోగ్రామ్స్ లతో  పాటు  వారి విధులను  అడిగి తెలుసుకున్నారు.  ఇక్కడి  సీహెచ్ సీ  సెంటర్ లో   గర్భవతులు, చైల్డ్ ఇమ్యూనైజేషన్, పోష్టికాహార అందజేత లాంటి పథకాలను అడిగి  తెలసుకున్నారు. వీటితో  పాటు  ఇక్కడ  జరుగుతున్న ఆదివాసీ పెళ్లి కార్యక్రమంలో  జరిగే ఆచార,వ్యవహరాలను ప్రత్యేకంగా  గ్రామస్థులు  వివరించారు.  వారితో ఎంపీడీఓ దుర్గం శంకర్, తహశీల్దార్ గంగాధర్, ఐసీడీఎస్ సూపర్ వైజర్  లక్ష్మీ, సర్పంచ్ లక్ష్మీబాయి నాగోరావు, ఎంపీటీసి అందె  సుజాత ప్రకాష్,  వివిధ శాఖల ఆఫీసర్లు ఉన్నారు.

గాడిగూడా మండలంలో పల్లె ప్రకృతి

 గాడిగూడా మండలంలో పల్లె ప్రకృతి వనమును ఆకస్మిక తనిఖీ  చేసిన  అదనపు కలెక్టర్ డేవిడ్


 నార్నూర్,  పెన్ పవర్  

 ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలంలోని పల్లె ప్రకృతి పార్కును మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం  ఎంపీడీఓ కార్యాలయం లో అదనకు కలెక్టర్ డేవిడ్ మండలంలోని  సర్పంచ్ లు,పంచాయతీ కార్యదర్శిలు, ఈజీఎస్  టీ ఏ ల తో రివ్వు మీటింగ్ తీసుకున్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టపంగా ప్రవేశపెట్టిన రైతువేదికలు, పల్లె ప్రకృతి వనం, స్మశాన వాటిక,నర్సరీ క్రిమిటోరియము పనులు ఎందుకు పూర్తి కాలేదు అని ప్రశ్నించారు.ఈ పనులని నెల చివరి వరకు 25-27 తేదీ లోగ పూర్తి చెలలేని గ్రామ సర్పంచ్ లు,పంచాయతి కార్యదర్శి లు, కాంట్రాక్టు లపై చర్యలు తప్పవని,  మండిపడ్డారు.ముఖ్యగా నర్సరీలలో 20% మొక్కలు మాత్రమే ఉన్నాయని, ఉపాధి హామీ పథకం పనుల మాస్టర్ రోల్ లో కచ్చితంగా మూడు ఫోటోలు తీసి కార్యదర్శి, మెట్, ఎంపీవో,ఏపీ ఓ, టీ ఏ, ఎంపీడీఓ ల సంతకలు ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో  ఎంపీడీఓ రమేశ్వర్,ఎంపీవో సాయి ప్రసాద్,ఏపీఓ  అమర్ సింగ్,వివిధ గ్రామ సర్పంచ్ లు, పంచాయతీ కార్యదర్శులు, టి ఏ లు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

5వార్డు ప్రజలకు కృతజ్ఞతాభివందనాలు టిడిపి జిల్లాకార్యదర్శి మొల్లి లక్ష్మణరావు

 5వార్డు ప్రజలకు కృతజ్ఞతాభివందనాలు టిడిపి జిల్లాకార్యదర్శి మొల్లి లక్ష్మణరావు        

పెన్ పవర్, మధురవాడ

జీవీఎంసీ 5వ వార్డ్ టిడిపి కార్పొరేటర్ అభ్యర్థిగా మొల్లి హేమలతను గెలిపించినందుకు ఆమె తండ్రి గారైన టిడిపి జిల్లా కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు 5వ వార్డు ప్రజలకు కృతజ్ఞతాభివందనాలు తెలిపారు.ఇందులో భాగంగా వార్డు పరిధిలోని మారికవలస గ్రామం,మారికవలసకాలనీ, బోరవానిపాలెం,డ్రైవర్స్ కాలనీ,పరదేశిపాలెం తదితర గ్రామాలప్రజలను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. వార్డ్ లో ప్రజలు,మహిళలు మంగళ హారతులు పడుతూ స్వాగతం పలికారు. కార్యక్రమంలో మోల్లి లక్ష్మణరావు మాట్లాడుతూ.. ఈ విజయంలో తనవెన్నంటి ఉండి రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి పనిచేసిన పార్టీ పెద్దలు, యువత,కార్యకర్తలు అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు చేసుకుంటున్నానని తెలియజేశారు.

స్థానిక సమస్యలపై నిరంతరం కృషి చేస్తానని,వార్డులో ఎటువంటి సమస్యలుఉన్న వెంటనే పరిష్కరిస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.ఇది బాధ్యతగా భావించి ఓట్లు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరిని తలెత్తి తిరిగేట్టు చేయడం నాకర్తవ్యం అని అన్నారు. ఎల్లవేళలా ప్రజాసేవలో ఉంటానని ప్రజలకుహామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు వండ్రాశి అప్పలరాజు, వార్డు అధ్యక్షులు నాగోతి సత్యనారాయణ,వార్డు సెక్రటరీ ఈగలరవి,నమ్మి శ్రీను,బోయి శ్రీను,బోయిరమాదేవి,వార్డు మహిళాఅధ్యక్షురాలు బోర హేమలత తదితరులు పాల్గొన్నారు.

యువత కు క్రీడా సామగ్రి పంపిణీ

 యువత కు  క్రీడా సామగ్రి పంపిణీ

 నెన్నెల, పెన్ పవర్

మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం లో యువతకు సర్పంచ్ తోట సుజాత శ్రీనివాస్ క్రీడ సామగ్రిని అందించారు సర్పంచ్ మాట్లాడుతూ యువత  చదువుతో పాటు క్రీడల్లో కూడా ముందు ఉండాలని అన్నారు. చెడు వ్యసనాలకు గురికాకూడదని తెలిపారు. భవిష్యత్తులో యువవతకి  తమ సహాయసకారాలు ఉంటాయని  తెలిపారు.తమ వంతు సహాయం కింద క్రికెట్ సామగ్రి అందజేసినారు.ఈ కార్యక్రమానికి హాజరు అయిన  గ్రామ యువత హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు  తెలిపారు. ఈ కార్యక్రమంలో నెన్నెల గ్రామ ఉప సర్పంచ్ పుప్పాల అంజన్న  వార్డు సభ్యులు పాల్గొన్నారు.

డైరెక్టర్ ఫా ఉత్పత్తి పై వీడియో కాన్ఫరెన్స్

 డైరెక్టర్ ఫా ఉత్పత్తి పై వీడియో కాన్ఫరెన్స్

కల్యాణి ఖని , పెన్ పవర్

మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయ సమావేశమందిరంలో    అన్ని ఏరియాలోని జనరల్ మేనేజర్లు, ప్రాజెక్ట్ ఆఫీసర్,  ఏజెంట్లతో డైరెక్టర్ ఆపరేషన్స్ , ఫా  చంద్రశేఖర్   ఉత్పత్తి  ఉత్పాదకత  డిస్పాచ్  పై    రివ్యూ మీటింగ్   వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ చంద్రశేఖర్  మాట్లాడుతూ  అన్ని గనుల , ఓసిపి ల లో జరుగుతున్న ఉత్పత్తి ఉత్పాదకత విషయాలను అడిగి తెలుసుకొని తగు సూచనలను సలహాలను ఇచ్చారు.  ఈ కార్యక్రమంలో మందమరి జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ ,ఎస్వోటు జీఎం రామ్ మోహన్, కేకేఒసిపి ప్రాజెక్ట్  ఆఫీసర్ పద్మనాభ రెడ్డి,  ఆర్కే ఓసి ప్రాజెక్ట్ ఆఫీసర్  మధుసూదన్, ఐ ఈ డి, డిజిఎం రాజన్న, కేకే ఏజెంట్ రాంచందర్,  కాసిపేట ఏజెంట్ రాజేందర్, సిహెచ్పి డిజిఎం చెరువు శ్రీనివాస్, ఆర్కే ఓసి మేనేజర్ వెంకటేశ్వర్లు, ఐటి  ప్రోగ్రామర్ రవి  పాల్గొన్నారు.


కూకట్ పల్లి నియోజకవర్గ ఓబిసి సెల్ చైర్మన్ నియామకం

 కూకట్ పల్లి నియోజకవర్గ ఓబిసి సెల్ చైర్మన్ నియామకం

కూకట్ పల్లి, పెన్ పవర్

మూసాపేటకు చెందిన కాంగ్రెస్ నాయకులు తూము సంతోష్ కుమార్ ను కూకట్ పల్లి నియోజకవర్గ ఓబిసి సెల్ చైర్మన్ గా నియమించారు. ఈమేరకు రాష్ట్రఛైర్మన్ వెంకటస్వామి చేతుల మీదుగా సోమవారం గాంధీ భవన్ లో నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈసందర్భంగా తూము సంతోష్ కుమార్ మాట్లాడుతూ తన పార్టీకి చేస్తున్న సేవను గుర్తించి ఈ పదవి ఇచ్చిన టీపిసీసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్, రాష్ట్ర ఓబీసీ ఛైర్మన్ వెంకటస్వామి, మేడ్చల్ మల్కాజిగిరి చైర్మన్ ఉమేష్ గౌడ్ లకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, మరింత ఉత్సాహంతో పని చేస్తానని అన్నారు.

ఏబీవీపీ విద్యార్థుల అర్ధనగ్న ప్రదర్శన

 ఏబీవీపీ విద్యార్థుల అర్ధనగ్న ప్రదర్శన


కూకట్ పల్లి, పెన్ పవర్

రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ఉపకులపతులను, బోధన, బోధనేతర సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కూకట్ పల్లి కె.పి.హెచ్.బి కాలనీ లోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ప్రధానద్వారం ముందు ఏబీవీపీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో అర్ధనగ్న నిరసన కార్యక్రమని నిర్వహించారు. వారిని అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేసి కె.పి.హెచ్.బి కాలనీ పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబెర్ వినోద్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న పేద దళిత, బహుజన, గిరిజన వర్గాల విద్యార్దులకు విద్యను దూరం చేయాలన్న కుట్రలో భాగంగా ప్రయివేటు యూనివర్సిటీలకు పట్టం కట్టేలా ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పద్దెనిమిది నెలలుగా ఖాళీగా ఉన్న ఉపకులపతుల పోస్టులను, బోధన బోధనేతర సిబ్బందిని నియమించడం లేదని, తెరాస  ప్రభుత్వానికి మద్యం అమ్మడంలో ఉన్న శ్రద్ధ విశ్వవిద్యాలయాల అభివృద్ధిపై లేదని విమర్శించారు. చదువుకునోళ్ళకు కొలువులు లేవని, సర్కారు బడుల్లో పంతుళ్లు లేరని, తన బిడ్డకి ఆరునెలలు పదవి లేకపోతే ఆగమేఘాల మీద ఎమ్మెల్సీ పదవి ఇప్పించిన కేసీఆర్ ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు.  వెంటనే ఖాళీలను భర్తీ చేయాలని లేని యెడల ప్రభుత్వం గద్దె దిగేవరకు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో నిఖిల్, రాకేష్, ప్రసాద్, వేణు, సుధీర్, గోపాల్, సాయి, ప్రశాంత్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...