Followers

అమ్మవారి పండుగల వల్ల గ్రామాలు సుభిక్షం..

 అమ్మవారి పండుగల వల్ల గ్రామాలు సుభిక్షం..

వి.మాడుగుల,పెన్ పవర్

 అమ్మవారి పండగలు చేయడంవల్ల గ్రామం సుభిక్షంగా ఉంటుందని ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు అన్నారు. మంగళవారం మాడుగుల మొదమాంబ కాలనీ వాసులు చేసిన మోదకొండమ్మ పండగలో  ఆయన అమ్మవారి ఘట్టాలను మోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రతి గ్రామంలో అమ్మవారు కొలువై ఉండటం ఆనవాయితీగా వస్తుందని  గ్రామస్తులు ప్రతియేటా అమ్మవారికి  తీర్థ మహోత్సవాలు  పండగలు జాతరలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు బంధువులు స్నేహితులు ఇతరులను ఆహ్వానించడం వల్ల పల్లెల్లో సమైక్యతా భావం పెరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం సాహసోపేత పథకాలు అమలు చేస్తున్నారు. పేద ప్రజల వైద్యం కోసం  సీఎం సంక్షేమ నిధి నుంచి చెక్కుల ను అందజేయడం జరుగుతుందన్నారు. మాడుగుల కు చెందిన నలుగురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలను ఆంద చేశారు. మొదమాంబ కాలనీలో  డ్రైనేజీ లను పరిశీలించారు. గ్రామంలో సిమెంట్ రోడ్ల నిర్మాణం జోరుగా సాగుతుందని   వాటిని నెలాఖరులోగా పూర్తి చేయాలని అన్నారు. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థను కూడా మార్పులు చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రేణుక ఎల్లమ్మ కళ్యాణానికి రమ్మని మంత్రి కెటిఆర్ ను ఆహ్వానించి న నాయకులు

 రేణుక ఎల్లమ్మ కళ్యాణానికి రమ్మని మంత్రి కెటిఆర్ ను ఆహ్వానించి న నాయకులు


రాజన్న సిరిసిల్ల , పెన్ పవర్ 

 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గౌడ సంఘం ఆధ్వర్యంలో బొప్పాపూర్  గ్రామంలో ఈ నెల 24 న  నిర్వహించ తలపెట్టిన శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవానికి రమ్మని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ను బొప్పాపూర్ గౌడ సంఘం ప్రతినిధులు మండల ప్రజా ప్రతినిధులు మంగళవారం ఆహ్వాన పత్రిక ను అందజేసి ఆహ్వానించారు .హైదరాబాద్   ఆసెంబ్లీ హాల్ లో రాజన్న సిరిసిల్ల జిల్లా టిఆర్ఎస్ పార్టీ అదికార ప్రతినిధి తోట ఆగయ్య ఆద్వర్యంలో మంగళవారం వెళ్ళి   రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ను కలిశారు.  కలిసిన వారిలో ఎల్లారెడ్డిపేట జడ్పీటీసీ చీటీ లక్ష్మన్ రావు. రాచర్ల బొప్పాపూర్ మార్కేట్ కమీటి అద్యక్షులు కొండ రమేష్ గౌడ్ మాజీ జడ్పీటీసీ వడ్నాల నర్సయ్య .టిఆర్ఎస్ పార్టీ మండల అద్యక్షులు వరస కృష్ణహారి.  సర్పంచ్ ల పోరం మండల అద్యక్షులు కొండాపురం బాల్ రెడ్డి. గౌడ సంఘం ప్రతినిధి  చిదుగు గోవర్దన్ గౌడ్.  టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇల్లందుల శ్రీ నివాస్ రెడ్డి .నంది కిషన్ తదితరులు ఉన్నారు.  రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవానికి రావడానికి మంత్రి కెటిఆర్. సానుకూలంగా స్పందించినట్టు కొండ రమేష్  గౌడ్  తెలిపారు.  బొప్పాపూర్ మార్కేట్ కమీటీ కీ నిధులు కేటాయించాలనీ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ కు రాచర్ల బొప్పాపూర్ మార్కేట్ కమీటీ చైర్మన్ కొండ రమేశ్ గౌడ్ వినతిపత్రాన్ని ఇచ్చి విజ్ఞప్తి చేయగా  ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నీ పురాతన శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ నిర్మాణానికి నిధులు ఇప్పించాలనీ టిఆర్ఎస్ పార్టీ జిల్లా అదికార ప్రతినిధి తోట ఆగయ్య మాజీ జడ్పీటీసీ వడ్నాల నర్సయ్య.ఆలయ కమీటీ  చైర్మన్ నంది కిషన్ మంత్రి కెటిఆర్ కు వినతిపత్రాన్ని ఇచ్చి కోరారు.

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి

 వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి

మహారాణి పేట, పెన్ పవర్

అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను మంగళవారం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూల మాలలు వేసి  ఘనంగా నివాళులర్పించి,అల్లిపురం గాంధీ బొమ్మ వద్ద చలివేంద్రం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి, ప్రాణ త్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములని అన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఎంతగానో కృషి చేసారన్నారు. మహాత్మా గాంధీ భోదించిన సత్యం,అహింసా,హరిజనోద్ధరణకు జీవితాంతం కృషి చేసిన మహనీయుడన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షులు విఠల్ కుమార్,జనరల్ సెక్రటేరి డి.వి.యస్.యన్ రాజు,వైస్ ప్రెసిడెంట్ ఎస్. సుబ్రహ్మణ్యం,చైర్మన్ డి.వి.సత్యానంద్ గుప్త,వారిగల పండు తదితరులు పాల్గొన్నారు.

పొట్టి శ్రీరాములు కి పూలమాలలు వేసి నివాళులర్పించిన కార్పోరేటర్ గంటా అప్పలకొండ

 పొట్టి శ్రీరాములు కి పూలమాలలు వేసి నివాళులర్పించిన  కార్పోరేటర్ గంటా అప్పలకొండ

భీమిలి, పెన్ పవర్

అమరజీవి పొట్టి శ్రీరాములు 120వ జయంతిని పురస్కరించుకుని  భీమిలి బీచ్ లో ఉన్న పొట్టి శ్రీరాములు నిలువెత్తు విగ్రహానికి  జి.వి.ఎమ్.సి.3వ వార్డు కార్పోరేటర్ గంటా అప్పలకొండ,తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, భీమిలి డివిజన్ అధ్యక్షులు గంటా నూకరాజు సంయుక్తంగా పూలమాలలు వేసి నివాళులర్పించడమైనది. ఈ  సందర్భంగా 3వ వార్డు కార్పోరేటర్ గంటా అప్పలకొండ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధనకోసం,తెలుగువారికందరికీ ఒక రాష్ట్రం ఉండాలని 28 రోజులు నిర్విరామంగా ఆమరణ నిరాహారదీక్ష చేసి  ప్రాణాలర్పించిన మహానుభావుడు పొట్టి శ్రీరాములని అన్నారు. నేడు తెలుగు వారికి ఒక రాష్ట్రం ఏర్పడుటకు గాని, దేశంలో తెలుగు వారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చిందంటే ఆనాడు మహానుభావులు  పొట్టి శ్రీరాములు నాటిన బీజమని అన్నారు.ఇలాంటి మహోన్నతమైన వ్యక్తి తెలుగువారిగా పుట్టడం, ఆయన జన్మించిన ఈనేలపై మనం జీవించడం మన అదృష్టమని గంటా అప్పలకొండ అన్నారు.తెలుగుదేశం పార్టీ  రాష్ట్ర కార్యదర్శి, భీమిలి డివిజన్ అధ్యక్షులు గంటా నూకరాజు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు1901 మార్చి'  16వ తేదీన మద్రాసులో  గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారని అన్నారు.అప్పటికి తెలుగువారు చెల్లాచెదురుగా ఇతర రాష్ట్రాల్లో ఉండటం,దేశంలో హిందీ భాష తరువాత ఎక్కువగా తెలుగు మాట్లాడేవారు ఉండటం వలన తెలుగువారికి ఒక ప్రత్యేకమైన రాష్ట్రము ఉండాలని కంకణం కట్టుకొని అలుపెరగని పోరాట యోధుడిలా నిర్విరామంగా 28రోజులు  కఠోరమైన ఆమరణ నిరాహారదీక్ష చేశారని అన్నారు.  అలాంటి మహానుబావులు ఈనేలమీద పూట్టారు కాబట్టి  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దేశంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని అన్నారు. ఈ  కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మారోజు సత్యవరప్రసాద్, కాసరపు నాగరాజు, మారోజు సంజీవకుమార్,కనకల అప్పలనాయుడు, కాసరపు ఎల్లాజి, కొక్కిరి అప్పన్న,అప్పికొండ నూకరాజు, కంచెర్ల కామేష్, దాసరి వెంకటేష్,గండిబోయిన పోలిరాజు,  రాజగిరి రమణ,సత్తరపు చిన్న,కందుల సుందర్ రావు,  సత్తరపు శివ, వాడపల్లి వంశీ,చింతపల్లి నూకరాజు,  చింతపల్లి శ్రీను, బొడ్డు రమేష్, వియ్యపు పోతురాజు, అల్లిపిల్లి సతీష్, తెడ్డు రామదాసు  తదితరులు పాల్గొన్నారు.

గెలిచిన వార్డు మెంబర్లను అభినందించిన టిడిపి నాయకులు

 గెలిచిన వార్డు మెంబర్లను అభినందించిన టిడిపి నాయకులు]

పరవాడ,పెన్ పవర్

ఆదివారం వెలువడిన కార్పొరేటర్ ఎన్నికల ఫలితాల్లో టిడిపి నుంచి పోటీచేసి విజయం సాధించిన వార్డు మెంబర్లు రౌతు శ్రీను,మాదంశెట్టి చిన్నతల్లి(వైఫ్ ఆఫ్ నీలబాబు)లను స్థానిక తెలుగుదేశం నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి పయిల జగన్నాధరావు,టిడిపి జెడ్పిటిసి అభ్యర్థి అట్టా సన్యాసి అప్పారావు,ఈ బోనంగి సర్పంచు బొద్ధపు శ్రీనివాసరావు స్థానిక నాయకులు వున్నారు.

ఘనంగా పరదేసి అమ్మవారి పండుగ

 ఘనంగా పరదేసి అమ్మవారి పండుగ

పరవాడ,పెన్ పవర్

గ్రామ  లో వెలసిన  పరిదేశమ్మ పండగ మహోత్సవ  సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నా  రాష్ట్ర సీఈసీ సభ్యులు పయిల శ్రీనివాసరావు,సర్పంచ్ సిరిపురపు అప్పలనాయుడు,జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్క రాము నాయుడు,ఉప సర్పంచ్ బండారు  రామారావు.మంగళవారం  ఉదయం నుంచి గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని మొక్కు బడులుసమర్పించారు. అనంతరం మధ్యాన్నం గుడిదగ్గర అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఎంసి చైర్మన్ పయిల హరీష్, చల్ల కనకరావు,కసిరెడ్డి నగేష్ ,ఆలయ కమిటీ సభ్యులు,భక్తులు పాల్గొన్నారు.

బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చర్యలను విరమించుకోవాలి

 బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చర్యలను విరమించుకోవాలి

పరవాడ,పెన్ పవర్

కేంద్ర బిజెపి ప్రభుత్వం ఉద్యోగులకు,కార్మికులకు ద్రోహం చేసేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేటికరణ చేయాలి అనే ఏకపక్ష నిర్ణయాలను విరమించుకోవాలి అని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో తాడి రైల్వే స్టేషన్ లో ఆందోళన చేశారు.ఈ సందర్భంగా సి ఐ టి యు జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతు, కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడాలని ఆయన డిమాండ్ చేశారు.రైతులపై,ప్రజలపై భారాలు మోపే నూతన వ్యవసాయ చట్టాలను, విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసే బిజెపి మోడీ విధానాలు నశించాలి అన్నారు.ఎందరో త్యాగాల మీద నిర్మితమైన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆయన అన్నారు. మోడీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విరమించుకోవాలని స్టీల్ ప్లాంటుకు సొంత గనులు కేటాయించాలని ఆయన కోరారు.కార్మిక హక్కులు కాలరాసే లేబర్ కోడ్ లను రద్దు చేయాలన్నారు. దేశానికి ఎంతో ఆదాయాన్ని సమకూర్చిన భారత రైల్వే రంగాన్ని ప్రైవేటీకరించడం సిగ్గుచేటన్నారు.బీజేపీ ప్రభుత్వం రైతు కి వ్యతిరేకంగా తీసుకు వచ్చిన 3 వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.కేద్రం బిజెపి ప్రభుత్వం పరిపాలనలో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రవేటికరణ పేరుతో గుజరాతీయులకు దేశాన్ని దోచి పెడుతోంది అని తీవ్రంగా ఆరోపించారు.     ఈ కార్యక్రమంలో కే. రమణ,జి.ముసలినాయుడు,అప్పలరాజు,జి.దేవుడు,జి.గణేష్,బి నాగేశ్వరరావు, అప్పలరాజు,జిన్నారం కొండ బాబు తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...