Followers

బైంసా అల్లర్లకు, నాలుగేళ్ల పాప పై జరిగిన అత్యాచారం ఘటనపై న్యాయ విచారణ చేపట్టాలి...

 బైంసా  అల్లర్లకు, నాలుగేళ్ల పాప పై జరిగిన అత్యాచారం ఘటనపై న్యాయ విచారణ చేపట్టాలి...

* కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్

 *జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేత

ఆదిలాబాద్ , పెన్ పవర్

 ఇటీవల   నిర్మల్ జిల్లా బైంసా లో జరిగిన అల్లర్లకు కారణమైన వారికి,4 సంవత్సరాల పాప పై జరిగిన అత్యాచార ఘటన లపై తొందరగా న్యాయ విచారణ జరిపించి నిందితులకు శిక్ష పడేవిధంగా  చూడాలని కోరుతూ బుధవారం  ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తపట్నాయక్ కు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో  నాగేష్,మల్లేష్ యాదవ్, రాజు యాదవ్ తదితరులు.

టిఆర్ఎస్ పార్టీకి ఒక న్యాయం.. కాంగ్రెస్ ఒక న్యాయమా?

 టిఆర్ఎస్ పార్టీకి ఒక న్యాయం.. కాంగ్రెస్ ఒక న్యాయమా?

 కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్



 ఆదిలాబాద్ ,  పెన్ పవర్

 టిఆర్ఎస్ అధికారంలో ఉందని ఆ పార్టీ కార్యాలయానికి నిర్మాణం కోసం  ఒక ఎకరం కేటాయించారు. పలుమార్లు అధికారుల కార్యాలయం చుట్టూ తిరుగుతున్న అప్పటి కాంగ్రెస్ పార్టీకి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ  కార్యాలయం కోసం భూమి కేటాయించకపోవడం శోచనీయమని, అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీకి ఒక న్యాయం కాంగ్రెస్ ఒక న్యాయమా? అని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్ మండిపడ్డారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయం లో జడ్పీ చైర్మన్ జనార్ధన్  రాథోడ్ ను కలిసి వినతి పత్రం అందజేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం స్థలం కోసం కలెక్టర్,అధికారుల చుట్టూ తిరుగున్న ఎలాంటి స్పందన లేకపోవడం తో ఈ రోజు జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట నూతనంగా నిర్మించిన వ్యాపార సముదాయం  వేలం పాట లో  పాల్గొని రు.16వేలు అద్దె  మల్గి ని పొందడం జరిగిందని అన్నారు. పార్టీ కార్యాలయ స్థలం కోసం  అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగిన స్పందన లేకపోవడం తో నిరసనగా వేలంపాట లో పొందిన మల్గి లో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు రాహుల్ ఉన్నారు.

అవినీతి ఊబిలో సత్యవేడు సబ్ రిజిస్టర్ కార్యాలయం

 అవినీతి ఊబిలో సత్యవేడు సబ్ రిజిస్టర్ కార్యాలయం 

చేయి తడపందే భూ రిజిస్ట్రేషన్లు కావు

సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సర్వ సాధారణం గా మారుతున్న కాసులదందా

భూరిజిస్ట్రేషన్ కోసం భూవిలువలో దాదాపు ఒక శాతం ఆమ్యామ్యాలు సమర్పించుకోవాలి సిందే 

భూములకు సంబంధించిన ఈసీలు కావాలన్న అదనంగా కాసులు ఇవ్వాల్సిందే .

సత్యవేడు సబ్ రిజిస్టర్ కార్యాలయ అధికారుల తీరు ఇది 

పెన్ పవర్,సత్యవేడు

చిత్తూరు జిల్లా సత్యవేడు సబ్ రిజిస్టర్ కార్యాలయం అవినీతి ఊబిలో కూరుకుపోతున్నట్టు సర్వత్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి .భూముల క్రయవిక్రయాలలో రిజిస్ట్రేషన్ అధికారుల చేయితడపందే భూరిజిస్ట్రేషన్ కావడం గగనమే అవుతుందని పలువురు కొనుగోలుదారులు చెబుతున్నారు .దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కాసుల దందా సర్వసాధారణంగా మారిపోతున్న వైనం కనిపిస్తోంది .ముఖ్యంగా భూ క్రయవిక్రయాలలో కొనుగోలుదారులు భూ విలువలో దాదాపు ఒక శాతం సొమ్మును సంబంధిత సబ్ రిజిస్ట్రేషన్ అధికారులకు ఆమ్యామ్యాలుగా సమర్పించుకుంటే తప్ప భూరిజిస్ట్రేషన్ అయ్యే పరిస్థితి ఉండదు . పైగా భూ కొనుగోలుకు సంబంధించి రికార్డు పరంగా అన్ని సక్రమంగా ఉన్న కాసులు ఇవ్వకుంటే మాత్రం లేనిపోని కొర్రీలు పెట్టి వాటిని పక్కన పెట్టడం రిజిస్ట్రేషన్ అధికారులకు అందవేసిన చేయిగా మారుతోంది .ఉదాహరణకు 10 లక్షల రూపాయల విలువ చేసే భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే నిబంధనల మేరకు స్టాంప్ డ్యూటీ ఆరున్నర శాతం అరవై ఐదు వేల రూపాయలు ,రిజిస్ట్రేషన్ ఫీజు ఒక శాతం పదివేల రూపాయలు , యూజర్ చార్జీలు 250 రూపాయలను ఆన్లైన్ చలానా ద్వారా భూ కొనుగోలుదారుడు చెల్లించాల్సి ఉంటుంది . దీంతోపాటు సబ్ రిజిస్ట్రేషన్ అధికారులకు ఆదనంగా ఒక శాతం పదివేల రూపాయలను లంచంగా సమర్పించుకోవాలిసిందే .అలాగే భూక్రయ విక్రయాలు సంబంధించిన ఈసీల మంజూరులో 1983 నుంచి ఇప్పటివరకు వందల 520 రూపాయలు తీసుకోవాల్సి ఉండగా 750 ,అదే 1993 నుంచి అయితే రెండు వందల ఇరవై రూపాయలు చెల్లించాల్సి ఉండగా మూడు వందల యాభై రూపాయలు చెల్లించే పరిస్థితి వస్తోంది .ఈతంతు పూర్తిగా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ కనుసన్నల్లో జరుగుతున్నట్టు ఆరోపణల మిన్నంటుతున్నాయి .సబ్ రిజిస్టర్ కార్యాలయంలో దళారుల ప్రమేయాన్ని నివారించడంతోపాటు అవినీతికి ఆస్కారం లేకుండా ప్రభుత్వం ఆన్లైన్ పద్ధతిని అమల్లోకి తెచ్చిన ప్రయోజనం లేకపోతోంది .సత్యవేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తుల హవా కొనసాగుతోంది .ఇద్దరు రాజశేఖర్లు కార్యాలయంలోనే తిష్టవేసి భూ క్రయవిక్రయాల సంబంధించిన అవసరమైన విషయాలను ఎప్పటికప్పుడు ఇటు రిజిస్ట్రేషన్ అధికారులకు ,అటు కొనుగోలుదారులకు అందిస్తూ చక్రం తిప్పడం రివాజుగా మారింది .రిజిస్టర్ కార్యాలయంలో కాసుల దందా యథేచ్ఛగా కొనసాగుతున్న సంబంధిత అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రేక్షక పాత్ర  వహించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి . సత్యవేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కొనసాగుతున్న కాసులదందా వ్యవహారంపై సంబంధిత సబ్ రిజిస్టర్ అధికారిని కోమలదేవిని వివరణ కోరగా అటువంటిది ఏది తన దృష్టికి రాలేదన్నారు . ఏదైనా జరిగితే చర్యలు తప్పకుండా తీసుకోవడం జరుగుతుందన్నారు .ఏది ఏమైనా సత్యవేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కొనసాగుతున్న  ఆమ్యామ్యాలు వ్యవహారాన్ని కట్టడి చేయడానికి సంబంధిత ఉన్నతాధికారులు అవసరమైన చర్యలు తీసుకొని భూ కొనుగోలుదారులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని పలువురు కోరుతున్నారు .

అభం శుభం తెలియని పసికందును వదిలేశారు

 అభం శుభం తెలియని పసికందును వదిలేశారు

 తాంసి , పెన్ పవర్ 

 ఆదిలాబాద్ జిల్లా  తాంసీ మండలంలోని  పొన్నారి గ్రామ సమీపంలో పోజింగ్ ఫ్యాక్టరీ దగ్గర బుధవారం అభం శుభం తెలియని ఓపసికందును చున్నీతో కట్టినట్టు వంటి ఉయ్యాలలో పడుకోబెట్టి వదిలేసి వెళ్లిపోయినా స్థానికంగా కలకలం రేపింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు  అందించిన సమాచారం ప్రకారం వెంటనే తాంసీ ఎస్ఐ శిరీష ,  బాలల పరిరక్షణ అధికారి రాజేంద్ర ప్రసాద్ , చైల్డ్ లైన్ జిల్లా సమన్వయకర్త తిరుపతి  వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకోని పసికందును వైద్యపరీక్షల నిమిత్తం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ హాస్పిటల్ కి తరలించరు. వైద్య పరీక్షల అనంతరం ఈ పసికందును శిశు గృహ లో చేర్పించడం జరుగుతుందని తెలియజేశారు.ఇట్టి పసికందుకు సంబంధించిన  వివరాల కోసం డీసీపీవో రాజేంద్రప్రసాద్ గారిని,9440555872 చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ తిరుపతి గారిని 9989581713 ఫోన్ చేసి సంప్రదించగలరు లేదా స్థానిక తాంసి పోలీస్ స్టేషన్ సంప్రదించవలసినదిగా పేర్కొన్నారు.

రాఘపతిరావు ట్రస్ట్ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలు

 రాఘపతిరావు ట్రస్ట్ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలు

తాండూర్, పెన్ పవర్

మంచిర్యాల జిల్లా తాండూర్లో కోక్కిరాల రాఘపతిరావు ట్రస్ట్ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను జిల్లా కాంగ్రెస్ డిసిసి అధ్యక్షురాలు కోక్కిరాల సురేఖ ప్రేంసాగర్ రావు, ప్రారంభించారు. బుధవారం మాదారం సింగరేణి మైదానంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ కు ముఖ్య అతిథిగా. హజరై క్రిడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు.ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఈసా,పార్టీ సినియార్ నాయకులు స్థానిక ఎంపిటిసి సూరం రవీందర్ రెడ్డి, నాయకులు కాపర్తి సుభాష్, మాజీ జేడ్పిటిసి బండి పోషం,మాజీ సింగిల్ విండో వైఎస్ చైర్మన్ దామోదర్ రెడ్డి,పుట్ట శ్రీనివాస్,క్రీడాకారులు, పాల్గొన్నారు.

ఆశ్రమ పాఠశాలలో కరోన టెస్టులు

 ఆశ్రమ పాఠశాలలో కరోన టెస్టులు

నెన్నెల , పెన్ పవర్

మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుష్ణపల్లి ఆశ్రమ పాఠశాలలో 50 మంది విద్యార్థులకు వైద్య సిబ్బంది ఇందిరా, రోజా,శైలజలు కరోన టెస్టులు నిర్వహించారు.వైద్యాధికారి అనిష్ ఆదేశాల మేరకు కరోన టెస్టులు చేశామని ఏ ఎన్ ఎం ఇందిరా తెలిపారు.అందరు విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.ఎవ్వరికి కూడా పాజిటివ్ రాలేదని అందరికీ నెగెటివ్ వచ్చిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆశవర్కర్ రోజా,హాస్టల్ anm శైలజ,హాస్టల్ వార్డెన్,హాస్టల్ ఉపాద్యాయులు పాల్గొన్నారు

బంగారు లక్ష్మణ్ 82వ జయంతి వేడుకలు

 బంగారు లక్ష్మణ్  82వ జయంతి వేడుకలు

తాండూర్,పెన్ పవర్

మంచిర్యాల జిల్లా తాండూర్ తేదీ 17 మార్చి 2021 రోజున ఎస్సీ మోర్చా తాండూర్ మండల అధ్యక్షులు ఏముర్ల రవి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా,కేంద్ర మంత్రిగా పనిచేసిన కీ॥శే॥ బంగారు లక్ష్మణ్ 82వ జయంతి వేడుకలు తాండూర్ ఐబి లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బాజపా మండల అధ్యక్షుడు రామగౌని మహీధర్ గౌడ్ మాట్లాడుతూ బీజేపీ జాతీయ అధ్యక్షులు గా బంగారు లక్ష్మణ్ గారు ప్రవేశ పెట్టిన "అంత్యోదయ సిద్దాంతం" పాటిస్తూ ప్రభుత్వ ఫలాలు చిట్ట చివరి వ్యక్తి కి అందేలా ప్రవేశ పెట్టబడిన అయన సిద్ధాంతాలు తప్పక పాటిస్తాం అని ప్రమాణం చేస్తూ అయన పార్టీ కి అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ మహనీయునికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కేశెట్టి విజయ్ కుమార్, సీనియర్ నాయకులు చిలువేరు శేషగిరి,మండల ఉపాధ్యక్షులు కోమండ్ల శ్రీనివాస్,మండల ప్రధాన కార్యదర్శి పట్టెం విష్ణుకళ్యాణ్, బీజేవైఎం జిల్లా కార్యదర్శి ఏముర్ల ప్రదీప్,మండల కోశాధికారి రాచర్ల సురేష్, మండల కార్యవర్గ సభ్యులు కటకం నాగయ్య,సిద్ధం మల్లేష్,రాచర్ల సాయిరాం తదితర నాయకులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...