Followers

లాలం ఇలాకాలో తెలుగుదేశం డీలా

 లాలం ఇలాకాలో తెలుగుదేశం డీలా

లాలం కోడూరులో కనిపించని పసుపు జెండా

సర్పంచ్ పోటీల్లో లేని తెదేపా

విశాఖ పొలిటికల్ బ్యూరో, పెన్ పవర్ 

పేరుగొప్ప  ఊరు దిబ్బ అనే  చందంగా  మారింది  జిల్లాలోని  లాలం కుటుంబీకుల  పరిస్థితి.  కేబినెట్  ర్యాంకు  హోదా అయిన  జిల్లా  పరిషత్  చైర్మన్  పదవిని  భార్యకు, ఎలమంచిలి  నియోజకవర్గం  నుంచి  ఎమ్మెల్యేగా పోటీ చేసే  అవకాశాన్ని  అందించిన  పార్టీకి  సొంత  గ్రామంలో  ప్రాతినిధ్య  లేకుండా  చేయడంపై తెలుగుదేశం  పార్టీ  అభిమానులు  విస్తుపోతున్నారు.

విశాఖ జిల్లా  ఎలమంచిలి  నియోజకవర్గంలో  రాంబిల్లి మండలం  పేరు చెబితే  ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, లాలం  బాస్కరరావు  కుటుంబ  సభ్యులే  గుర్తుకు వస్తారు.  ఈ ఇద్దరు  నేతలు  సుదీర్ఘకాలం  పాటు తెలుగుదేశం  పార్టీలోనే  కొనసాగుతూ  పార్టీ అందించిన  పదవులను  అనుభవించారు.  వయసు మీద  పడిన  ఎమ్మెల్సీ  పప్పల  చలపతిరావు  పార్టీ కోసం  నిరంతరం  కష్టపడుతుండగా , కేబినెట్  ర్యాంకు పదవుని  అనుభవించిన  లాలం  బాస్కరరావు  మాత్రం గ్రామంలో  పత్తా  లేకుండా  పోయారని  తెలుగు తమ్ముళ్ల  ఆవేదన  వ్యక్తం  చేస్తున్నారు. సొంత  గ్రామం నుంచి  కనీసం  తెలుగుదేశం  పార్టీ  తరఫున సర్పంచిని పోటీలో  నిలపలేని  దయనీయ  స్థితిలోకి  జారుకున్నారనే  ఆవేదన  వ్యక్తం  చేస్తున్నారు.  లాలం భాస్కరరావు,  ఆమె  భార్య  భవాని  ప్రస్తుతం తెలుగుదేశం  పార్టీలో  కొనసాగుతున్నా  భాస్కరరావు తమ్ముళ్లు  మాత్రం  సైకిల్  తొక్కి తొక్కి  అలసిపోయారో ఏమోగానీ  ఫ్యాన్  నీడలో   హాయిగా సేదతీరుతున్నారు.  లాలం  కుటుంబం  నుంచే వరుసకు  తమ్ముడు  అయ్యే  వ్యక్తిని  ఈ గ్రామం  నుంచి  వైకాపా  తరపున  సర్పంచిగా  ఏకగ్రీవంగా ఎన్నిక  కావడానికి  మార్గం  సుగమం  చేశారు.  తెలుగుదేశం  తరపున  జిల్లాస్థాయి  పదవులు అనుభవించి  పార్టీ  పేరుతో  రాష్ట్రస్థాయిలో వ్యాపారాలు  చక్కబెట్టిన  లాలం  బాస్కర కుటుంబ సభ్యులు  పల్లె  పోరుకు  విముఖతను  చూపుతూ తెలుగుదేశం  పార్టీ  కార్యకర్తలను  నట్టేట  ముంచారని అభిమానులు  వాపోతున్నారు.  ఇటువంటి నాయకులకు  జిల్లాస్థాయి  పదవులు  కట్టబెట్టిన తెలుగుదేశం  పార్టీ  అధిష్టానమే  భవిష్యత్తులో ఇటువంటి  నాయకులకు  చెక్  చెప్పాలని అభిమానులు  కోరుకుంటున్నారు.  గత  సాధారణ ఎన్నికల్లోనే  లాలం  బాస్కర  కుటుంబ  సభ్యులు వైకాపా  ఎలమంచిలి  నియోజకవర్గ  ప్రస్తుత  శాసన సభ్యులు  కన్నబాబురాజుతో  లోపాయికారి  ఒప్పందం కుదుర్చుకున్నారనే  ఆరోపణలు  వినిపిస్తున్నాయి. దీనిలో  భాగంగానే  తెలుగుదేశం  పార్టీకి  లాలం కుటుంబానికి  పూర్తిగా  పట్టు ఉన్న  లాలం కోడూరులో తెలుగుదేశం  పార్టీ నుంచి  పోటీ  చేసిన  పంచకర్ల రమేష్ బాబుకి  కేవలం  పదుల  సంఖ్యలో  ఓట్లు మెజార్టీ  వచ్చిందని  టీడీపీ  కార్యకర్తలు చెబుతున్నారు.  ఇదే  మండలం  నుంచి  జడ్పిటిసి అభ్యర్థిగా  పోటీ  చేసిన  భవానికి  మాత్రం  లాలం కోడూరులో  వేలలో  మెజార్టీ  వచ్చిందని  గుర్తు చేస్తున్నారు.  

తెలుగుదేశం  పార్టీ  రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా  పనిచేస్తున్న  లాలం  భాస్కరరావు పార్టీ తరపు  నుంచి  కనీసం  ఒక్క సర్పంచ్  అభ్యర్థుని కూడా పోటీలో  నిలవడం  అతని  గెలిపించ  లేకపోవడం  పట్ల కార్యకర్తలు  రగిలిపోతున్నారు.  పార్టీ  పదవులను వాడుకునే  ఇటువంటి  నాయకులు  పార్టీకి  అవసరమా అని  తెలుగుదేశం  పార్టీ  అధిష్టానం  ఆలోచన చేయాలని  కోరుతున్నారు.  కుటుంబ  సభ్యులు వైకాపాలోను  భాస్కరరావు, భవానీలు మాత్రం  తెలుగుదేశం పార్టీలోనూ  కొనసాగుతున్నట్లు  నాటకాలు  రక్తి కట్టిస్తున్నారని  కార్యకర్తలు  మండిపడుతున్నారు. దశాబ్దాలుగా  తెలుగుదేశంలో  కొనసాగుతున్న  లాలం కోడూరు  వాసులు  కూడా  ఈ అవకాశవాద రాజకీయాల పై మాట్లాడుకుంటున్నారు. పసుపు  జెండా  రెపరెపలాడే  గ్రామంలో  వైకాపా  జెండాను ఎగుర  వేస్తున్నారని విచారం  వ్యక్తం  చేస్తున్నారు. పదవుల  కోసమే పార్టీయా?  పార్టీ  కష్టాల్లో  ఉంటే పట్టించుకోరా?  అంటూ  కార్యకర్తలు  ఒకింత అసహనానికి గురవుతున్నారు.

బహుజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన

 బహుజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన

ఇంద్రవెల్లి,  పెన్ పవర్

 ఆదిలాబాద్ జిల్లా  ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో డా.ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర సంఘాల నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఖండిస్తూ బుధవారం మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా ఇంద్రవెల్లి అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ అధ్యక్షుడు సర్కాలే శివాజి మాట్లాడుతూ గురుకులాల రాష్ట్ర కార్యదర్శి డా.ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ (ఐపిఎస్) పై  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర సంఘాల నాయకులు అసత్య ఆరోపణలను చేయడం సరికాదని, పెద్దపల్లి జిల్లా దూళికట్ట లో జరిగిన బౌద్ధ విగ్రహ స్థాపనలో వందన కార్యక్రమంలో బౌద్దులు డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్  1956 ఆక్టోబర్ 14 రోజున మహరాష్ట్రలోని  నాగ్ పూర్ వేదికగా అందించిన 22 ప్రతిజ్ఞలను పాటించడం జరిగిందని, దాన్ని స్వేరోస్ సంస్థకు అంటగట్టడం సరికాదని కుల మత ప్రాంత భేదాలు లేకుండా నిరంతరం బడుగు బలహీన వర్గాల బిడ్డల అభ్యున్నతి కోసం స్వేరోస్ నిరంతరం కృషి చేస్తుందని, అనేక మంది నిరుపేద విద్యార్థులను ఙ్ణాన వంతులుగా చేసి అసాద్యలను సుసాద్యం చేసి చూపిస్తున్నారని,దేశంలోని అనేక ప్రముఖ యూనివర్సిటీలలో గురుకులాల విద్యార్థులు వారి వల్లే వెళ్లారని, దేశంలోనే నెంబర్ వన్ గా వారు నిలుస్తున్నారని అన్నారు.కాని బీజేపీ నేత బండి సంజయ్ మరియు ఇతర సంఘాల నాయకులు (ఐపిఎస్ అధికారి) గురుకులాల రాష్ట్ర కార్యదర్శి ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్ పై చేస్తున్న అసత్య ప్రచారన్నీ ఖండిస్తున్నామని ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పై తప్పుడు ప్రచారం మనుకోకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ధర్నాలు రాస్తా రోకోలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ అధ్యక్షుడు సర్కాళే శివాజీ, భీం ఆర్మీ ఖానాపూర్ నియోజకవర్గ  అధ్యక్షుడు పరత్ వాగ్ సందీప్, ప్రధాన కార్యదర్శి దత్తా పరత్ వాగ్, ఉపాధ్యక్షులు ఉత్తమ్, అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ మండల ప్రధాన కార్యదర్శి ఆచార్య దత్త, స్వేరోస్ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు సోన్ కాంబ్లే వికాస్, బహుజన సంఘాల నాయకులు భారత్ గాయక్వాడ్, జితేందర్, సూరజ్, పండిత్, తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం శనగ కొనుగోళ్లు చేపట్టాలి..

 రాష్ట్ర ప్రభుత్వం శనగ  కొనుగోళ్లు చేపట్టాలి..

 అఖిలపక్ష నాయకుల డిమాండ్

 ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రోడ్డుపై బైఠాయించినా అఖిలపక్షం నాయకులు

ఆదిలాబాద్,  పెన్ పవర్

 రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రైతులకు శాపంగా మారాయని రైతుల జీవితాలను ప్రైవేటు కి తాకట్టు పెట్టారని అఖిలపక్షం నాయకులు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు వెంటనే చేపట్టాలని బుధవారం జిల్లా కేంద్రంలోని స్థానిక పంజాబ్ చౌరస్తాలో  రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించి ధర్నా కార్యక్రమం చేపట్టారు. గంట పాటు కొనసాగిన ఈ ధర్నా రాస్తారోకో తో అటు ఇటు వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయం కలిగింది.  ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతుల కోసం ప్రభుత్వాలకు పట్టవా అని అన్నారు. దేశానికి రైతు వెన్నుముక అని చెప్పుకుంటున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల విషయంలో ఎందుకు మౌనం పాటిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే శనగ కొనుగోళ్లు ప్రారంభించి రైతులను ఆదుకోవాలని పేర్కొన్నారు. లేనిపక్షంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో మరింత ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు బండి దత్తాత్రి, లంక రాఘవులు, తలమడుగు జడ్పిటిసి సభ్యుడు గోక గణేష్ రెడ్డి, నర్సింగ్ రావు, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చరణ్ గౌడ్, గేడం కేశవ్,  రైతులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్యవైశ్యుడికి మూడు లక్షలు సహాయం

 ఆర్యవైశ్యుడికి మూడు లక్షలు సహాయం

వనపర్తి, పెన్ పవర్

వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం కేంద్రంలో అగ్నిప్రమాదంలో నష్టపోయిన శ్రీసాయి ఆటోమొబైల్స్ షాపు యజమాని ఆర్యవైశ్యుడు భీంశెట్టి శ్రీనివాసులు శెట్టికి తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో  మూడు లక్షల రూపాయల సహా యాన్ని రాష్ర్ట అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ అందజేశారు.చిన్నంబావి మండల ఆర్యవైశ్య సంఘం,వనపర్తి జిల్లా ఆర్యవైశ్య మహాసభ,తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ సంయుక్త ఆధ్వర్యంలో మూడు లక్షల రూపాయల సహాయాన్ని రాష్ర్ట అధ్యక్షుడు హైదరాబాద్ లో అందజేశారని వనపర్తి జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు నాగబంది యాదగిరి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నేతలు కొండే మల్లికార్జున్,నాగబంది యాదగిరి, గోనూరు యాదగిరి,విశ్వనాథం భీమయ్య శెట్టి పాల్గొన్నారు.

హెచ్ఎంటి రిటైర్డ్ ఉద్యోగుల దర్నా..

 హెచ్ఎంటి రిటైర్డ్ ఉద్యోగుల దర్నా..

కార్పొరేట్‌ కంపెనీలకు దేశాన్ని అమ్మేస్తున్న 

కేంద్ర ప్రభుత్వ చర్యలను ప్రతిఘటించాలి..

హెచ్ఎంటి మిషన్ టూల్స్ రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలి..

ధర్నాకు సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్..


జిడిమెట్ల, పెన్ పవర్

హెచ్ఎంటి మిషన్ టూల్స్ లిమిటెడ్ హైదరాబాద్ మేనేజ్మెంట్ విశ్రాంత ఉద్యోగులకు చట్టబద్దమైన బకాయలు, గ్రాట్యువిటి, దానిపై వడ్డి, పీఎఫ్, ఈయల్ ఎంక్యాష్మెంట్, సెటిల్మెంట్ అలవెన్స్ ఇతరత్రా రావలసిన బకాయిలపై జీడిమెట్ల హెచ్ఎంటి వద్ద రిటైర్డ్ ఎంప్లాయిస్ దర్నా చేపట్టారు.. ధర్నాలో స్థానిక ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యేండ్ల తరబడి చెమటోడ్చి కష్టపడిన విశ్రాంత ఉద్యోగులకు న్యాయబద్ధంగా రావలసిన బకాయిలు ఇవ్వకపోవడంతో వారు ఈ వయసులో రోడ్డుపై ధర్నా చేయడం బాధాకరం అన్నారు. రిటైర్మెంట్ తర్వాత జీవితాన్ని ఆనందంగా గడిపేందుకు ఎన్నో కలలు కని ఉంటారని, అలాంటి వారికి న్యాయంగా అందాల్సిన బకాయిలు ఇవ్వడంలో యాజమాన్యం అలసత్వం చూపడం సరైనది కాదన్నారు. దీనికి కారణం హెచ్ఎంటి యాజమాన్యంతో పాటు కేంద్ర ప్రభుత్వ విధానాలు అన్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ, ప్రభుత్వ ఆస్తులు అమ్ముకుంటూ అన్నీ ప్రైవేటీకరణ చేస్తున్న కేంద్రప్రభుత్వం చట్టపరంగా ఇవ్వాల్సిన బకాయిల్లో మొండి చేయి చూపడం ఎమ్మెల్యే దారుణంగా పేర్కొన్నారు.. ప్రభుత్వ ఆస్తులు అమ్మిన తర్వాత నిజానికి దేశంలో ఎవరు బాగు పడుతున్నరాంటే అంబానీ, అదానిలు అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఆస్తులు తగ్గుతుంటే వారి ఆస్తులు పెరుగుతున్నాయని విమర్శించారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులుగా ఉంటున్నారంటే కేంద్రం వారి పట్ల వ్యవహరిస్తున్న తీరుకి నిదర్శనం అన్నారు. స్వదేశీ, విదేశీ కార్పొరేట్‌ కంపెనీలకు భారతదేశాన్ని గంపగుత్తగా అమ్మేస్తున్న కేంద్ర ప్రభుత్వ చర్యలను ప్రతిఘటించాలని అన్నారు. ఈ సమస్యపై హెచ్ఎంటి యాజమాన్యంతో చర్చిస్తామని వారు సరైన స్పందన ఇవ్వకపోతే త్వరలోనే రాష్ట్రంలోని టీఆర్ఎస్ ఎంపిలందరినీ సమీకరించుకుని కేంద్రంలో సంబంధిత మంత్రి, సెక్రటరీలతో మాట్లాడి న్యాయం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంటి ఆఫీసర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కే.వి.రామారావు, మాజీ ఉపాధ్యక్షుడు కోతి కర్ణపాల్ రెడ్డి, పండరి, మురళి, నిరంజన్, నరహరి, సూర్య ప్రకాష్, భవాని శంకర్, పోచయ్య, జయందర్ నాథ్, బాల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

బైంసా అల్లర్లకు, నాలుగేళ్ల పాప పై జరిగిన అత్యాచారం ఘటనపై న్యాయ విచారణ చేపట్టాలి...

 బైంసా  అల్లర్లకు, నాలుగేళ్ల పాప పై జరిగిన అత్యాచారం ఘటనపై న్యాయ విచారణ చేపట్టాలి...

* కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్

 *జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేత

ఆదిలాబాద్ , పెన్ పవర్

 ఇటీవల   నిర్మల్ జిల్లా బైంసా లో జరిగిన అల్లర్లకు కారణమైన వారికి,4 సంవత్సరాల పాప పై జరిగిన అత్యాచార ఘటన లపై తొందరగా న్యాయ విచారణ జరిపించి నిందితులకు శిక్ష పడేవిధంగా  చూడాలని కోరుతూ బుధవారం  ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తపట్నాయక్ కు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో  నాగేష్,మల్లేష్ యాదవ్, రాజు యాదవ్ తదితరులు.

టిఆర్ఎస్ పార్టీకి ఒక న్యాయం.. కాంగ్రెస్ ఒక న్యాయమా?

 టిఆర్ఎస్ పార్టీకి ఒక న్యాయం.. కాంగ్రెస్ ఒక న్యాయమా?

 కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్



 ఆదిలాబాద్ ,  పెన్ పవర్

 టిఆర్ఎస్ అధికారంలో ఉందని ఆ పార్టీ కార్యాలయానికి నిర్మాణం కోసం  ఒక ఎకరం కేటాయించారు. పలుమార్లు అధికారుల కార్యాలయం చుట్టూ తిరుగుతున్న అప్పటి కాంగ్రెస్ పార్టీకి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ  కార్యాలయం కోసం భూమి కేటాయించకపోవడం శోచనీయమని, అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీకి ఒక న్యాయం కాంగ్రెస్ ఒక న్యాయమా? అని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్ మండిపడ్డారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయం లో జడ్పీ చైర్మన్ జనార్ధన్  రాథోడ్ ను కలిసి వినతి పత్రం అందజేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం స్థలం కోసం కలెక్టర్,అధికారుల చుట్టూ తిరుగున్న ఎలాంటి స్పందన లేకపోవడం తో ఈ రోజు జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట నూతనంగా నిర్మించిన వ్యాపార సముదాయం  వేలం పాట లో  పాల్గొని రు.16వేలు అద్దె  మల్గి ని పొందడం జరిగిందని అన్నారు. పార్టీ కార్యాలయ స్థలం కోసం  అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగిన స్పందన లేకపోవడం తో నిరసనగా వేలంపాట లో పొందిన మల్గి లో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు రాహుల్ ఉన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...