Followers

పౌష్టికాహారం అందజేత

 పౌష్టికాహారం అందజేత    

పెన్ పవర్, కందుకూరు

 పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో గల అంగన్వాడి సెంటర్ నందు గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు ఐసిడిఎస్ సిడిపిఓ లిడియమ్మ గురువారం  పౌష్టికాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా లిదియమ్మ  మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు బలవర్ధకమైన విటమిన్లు  ఉండే ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. అనంతరం అంగనవాడి కేంద్రంలో రికార్డులు పరిశీలించి పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ సునీత, అంగన్వాడీ కార్యకర్త ఝాన్సీ రాణి, తదితరులు పాల్గొన్నారు.

ఆశ్రమ పాఠశాలలో కరోన టెస్టులు

 ఆశ్రమ పాఠశాలలో కరోన టెస్టులు

నెన్నెల, పెన్ పవర్

మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుష్ణపల్లి ఆశ్రమ పాఠశాలలో 50 మంది విద్యార్థులకు వైద్య సిబ్బంది ఇందిరా, రోజా,శైలజలు కరోన టెస్టులు నిర్వహించారు.వైద్యాధికారి అనిష్ ఆదేశాల మేరకు కరోన టెస్టులు చేశామని ఏఎన్ఎం  ఇందిరా తెలిపారు.అందరు విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.ఎవ్వరికి కూడా పాజిటివ్ రాలేదని అందరికీ నెగెటివ్ వచ్చిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆశవర్కర్ రోజా,హాస్టల్ ఏఎన్ఎం శైలజ,హాస్టల్ వార్డెన్,హాస్టల్ ఉపాద్యాయులు పాల్గొన్నారు

రాఘపతిరావు ట్రస్ట్ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలు

 రాఘపతిరావు ట్రస్ట్ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలు

తాండూర్, పెన్ పవర్

మంచిర్యాల జిల్లా  తాండూర్  కోక్కిరాల రాఘపతిరావు ట్రస్ట్ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను జిల్లా కాంగ్రెస్ డిసిసి అధ్యక్షురాలు కోక్కిరాల సురేఖ ప్రేంసాగర్ రావు, ప్రారంభించారు. బుధవారం మాదారం సింగరేణి మైదానంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ కు ముఖ్య అతిథిగా. హజరై క్రిడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు.ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఈసా,పార్టీ సినియార్ నాయకులు స్థానిక ఎంపిటిసి సూరం రవీందర్ రెడ్డి, నాయకులు కాపర్తి సుభాష్, మాజీ జేడ్పిటిసి బండి పోషం,మాజీ సింగిల్ విండో వైఎస్ చైర్మన్ దామోదర్ రెడ్డి,పుట్ట శ్రీనివాస్,క్రీడాకారులు, పాల్గొన్నారు.

అంగన్వాడీ టీచర్లకు పోషణ పక్వాడ్ గురించి వివరించి వారితో ప్రతిజ్ఞ

 అంగన్వాడీ టీచర్లకు పోషణ పక్వాడ్ గురించి వివరించి వారితో ప్రతిజ్ఞ

తాండూర్, పెన్ పవర్

 మార్చి 16 నుంచి 30 వరకు పోషణ పక్వడా కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు మాదరం సెక్టార్ లోని 32 మరియు కన్నల సెక్టార్ లోని 25 సెంటర్లలో ఈ రోజు అన్ని సెంటర్లలో సెంటర్లను శుభ్రంగా చేసుకొని పెట్టుకున్నారు. తాండూరు మండల లోని నీలాయపల్లి ఒడ్డార కాలనీ అంగన్వాడీ సెంటర్ కి వైట్ వాష్ చేయించము. అంగన్వాడీ టీచర్లకు పోషణ పక్వాడ్ గురించి వివరించి వారితో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ మమత, అంగన్వాడీ టీచర్లు ఉమారాణి,సువర్ణ, ధనలక్ష్మి, యాదలక్ష్మి, మీనా,అనసూర్య, విజయ, నాగమణి మరియు ఆయా పాల్గొన్నారు.

విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు నినాదాలతో లిబరేషన్ నాయకుల ర్యాలీ

 విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు నినాదాలతో లిబరేషన్ నాయకుల ర్యాలీ            

 ప్రత్తిపాడు,పెన్ పవర్ 

ఈరోజు ధర్మవరం లో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాలి అంబేద్కర్ సెంటర్ నుంచి నంది సెంటర్ వరకు ర్యాలీ జరిగింది విశాఖ ఉక్ధ్ర ఆంధ్రులు హక్కు కు మోడీ పెట్టిన వ్యవసాయ మూడు చట్టాలు రద్దు చేయాలని నినాదాలు చేశారు ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి అంటూ నినా దించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు ప్రజలకు ఏమాత్రము ఉపయోగకరంగా లేదని వారు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు మానుకొండ లచ్చ బాబు అఖిల భారత్ ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు రాపా లక్ష్మి తిరుపతి చిన్న బాబులు గొల్లపల్లి కామరాజు గుడాల వెంకట్ లక్ష్మి తిరగటం నాగమణి ఇ అనుసూరి లక్ష్మి ఎ తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే పాటి సుభద్ర నివాసంలో వెంకటకిష్టయ్య.పుణ్యతిథి కార్యక్రమం

 మాజీ ఎమ్మెల్యే పాటి సుభద్ర నివాసంలో  వెంకటకిష్టయ్య.పుణ్యతిథి కార్యక్రమం...


 
బెల్లంపల్లి ,  పెన్ పవర్

బెల్లంపల్లి లో గల పాటి సుభద్ర నివాసంలో పాల్గొన్న టిఆర్ఎస్ అధికార ప్రతినిధి సముద్రాల వేణుగోపాలచారి, అరిగెల నాగేశ్వరరావు,గుల్లపల్లి ఆనంద్,తొంగల సత్యనారాయణ,బొడ్డు నారాయణ,గేల్లి రాజలింగు, రాజ్ కుమార్ పాండే,మురుకురి చంద్రయ్య,శ్యామ్ సుందర్ సారాడా,అబ్దుల్ నవాబ్,మరియు ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు...

సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న...జి.వి.ఎమ్.సి నూతన మేయర్

 సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న...జి.వి.ఎమ్.సి నూతన మేయర్

మహారాణి పేట, పెన్ పవర్


గ్రేటర్ విశాఖ మున్సిపల్ మేయర్ గా నూతనంగా ఎన్నికైన గోలగానీ హరి కుమారి, శ్రీనివాస్ దంపతులు గురువారం సాయంత్రం సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కప్ప స్తంభం ఆలింగనం చేసుకుని ముడుపులు మొక్కుబడులు చెల్లించుకున్నారు ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. వేద పండితులు వేద ఆశీర్వాదం చేశారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...