Followers

జీవీఎంసీ కొత్త పాలకవర్గం విశాఖ సమస్యలపై ద్రుష్టి సారించాలి

జీవీఎంసీ కొత్త పాలకవర్గం విశాఖ సమస్యలపై ద్రుష్టి సారించాలి

మహారాణి పేట, పెన్ పవర్

జీవీఎంసీ కొత్త పాలకవర్గం విశాఖ సమస్యలపై ద్రుష్టి సారించాలని విశాఖ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు సంకు వెంకటేశ్వర్రావు కోరారు.గురువారం మీడియా కు విడుదల చేసిన ప్రకటనలో మేయర్ గా ఎన్నికైన గోలగాని హరి వెంకట కుమారి,డిప్యూటీ మేయర్ గా  ఎన్నికైన జియ్యాని శ్రీధర్, ప్రమాణస్వీకారం చేసిన కార్పొరేటర్ లకు అభినందనలు తెలిపారు.విశాఖలో పేరుకుపోయిన ఎన్నో సమస్యలపై పాలక వర్గం దృష్టిసారించాలని కోరారు.విశాఖ ఉక్కు ప్రవేటీకరణకు వ్యతిరేకంగా మొదటి సమావేశంలోనే  తీర్మానం చెయ్యాలని  డిమాండ్ చేసారు.రాజకీయాలకతీతంగా విశాఖ ఉక్కు ప్రవేటీకరణకు వ్యతిరేకముగా అందరమూ కలిసి పోరాడదామని  సంకు పిలుపునిచ్చారు.

వేరుశనగ కాయలు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన

 వేరుశనగ కాయలు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన

వైఎస్సార్సీపీ మండల పార్టీ కన్వీనర్ కె టి హరిచంద్ర రెడ్డి

పెన్ పవర్, సత్యవేడు

చిత్తూరు జిల్లా పిచ్చా టూరు మండలం సిద్దిరాజుల కండ్రిగ రైతు భరోసా కేంద్రం నందు వేరుశనగ కాయలు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళారులు మధ్య వ్యాపారం విక్రయించడం వలన రైతులు నష్టపోతున్నారని గుర్తించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతి రైతు భరోసా కేంద్రం నందు కొనుగోలు కేంద్రాన్ని ప్రవేశపెట్టారని అన్నారు మండలంలోని రైతులు తమ వేరుశనగ కాయలను ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన కేంద్రంలో వేయాలని కోరారు.అనంతరం ఏ ఓ కోదండయ్య మాట్లాడుతూ రైతులు వేరుశనగ కాయలు దళారులు విక్రయించడం వలన రైతులు నష్టపోతున్నారు కాయలను విక్రయిం చదవలసిన రైతులు వెంటనే ఆర్ బి కె లో ఉన్న విస్తరణ అధికారిని సంప్రదించాలన్నారు రైతులు పత్రాలు పాసు పుస్తకం,ఆధార్ కార్డు,బ్యాంక్ పాస్ పుస్తకం తీసుకొని వచ్చి అగ్రిమెంట్ చేసుకొని గోనే సంచులు తీసుకోవాలని తెలిపారు.

వేరుశనగ కాయలు ఉండవలసిన నాణ్యత ప్రణాళిక

1. తేమశాతం 9./. తక్కువ

2. గింజ శాతం 74./. కన్న తక్కువ

3. వ్యర్థ పదార్థములు 4./. కన్న తక్కువ

4. ఫిసికల్ ప్యూరిటీ 96./.

ఈ కార్యక్రమంలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ పవిత్ర, ప్రశాంత్,గజలక్ష్మి,చంద్రశేఖర్,సిద్దిరాజుల కండ్రిగ సర్పంచ్ సుకేశ్ స్వప్న,రాజానగరం సర్పంచ్ భూపతి,వైఎస్సార్సీపీ నాయకులు పాండియన్,గోవిందన్,రైతులు జ్యోతిరాజు,బాబునాయుడు,సుధాక రాజు,గ్రామస్థులు పాల్గొన్నారు.

ఘనంగా ఏనుగు మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు.

 ఘనంగా ఏనుగు మనోహర్ రెడ్డి  జన్మదిన వేడుకలు.




వేములవాడ, పెన్ పవర్

 మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలను బుధవారం ఆ పార్టీ శ్రేణులు ఆయన అభిమానులు వేములవాడ పట్టణంలో ఘనంగా నిర్వహించారు.రాజన్న ఆలయంలో ఆయన పేరిట కోడే మొక్కుచెల్లించి ప్రత్యేక పూజలను నిర్వహించారు ఆయన అభిమానులు.అనంతరం ఆలయం ముందు భాగంలో కేక్ కట్ చేశారు. నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఆదిత్య లో ప్రశాంతంగా ముగిసిన జె.ఈ.ఈ. మెయిన్స్ పరీక్షలు

 ఆదిత్య లో  ప్రశాంతంగా ముగిసిన జె.ఈ.ఈ. మెయిన్స్  పరీక్షలు

గండేపల్లి,పెన్ పవర్

గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్యా ఇంజనీరింగ్ కళాశాలల ప్రాంగణంలో ఉన్న ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల లో ది.  బుధవారం  రెండవరోజు  ఉదయం 9-00 నుండి మధ్యాహ్నం 12-00 గంటల వరకు జరిగిన జె.ఇ.ఇ  మెయిన్స్  పరీక్షలు  ప్రశాంతంగా జరిగాయి. ఈ పరీక్షలకు ప్రిసిడింగ్ ఆఫీసర్ గా కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం.శ్రీనివాసరెడ్డి,టెస్ట్ సెంటర్ అడ్మిన్ గా ప్రో. ఎం. రాజబాబు వ్యవహరిస్తున్నారు. ఈ రోజు పరీక్షకు ఉ.75మందికి గాను 75మంది అయ్యారని రాజబాబు తెలిపారు. ఈరోజు ఉదయం సెషన్ తో ఆదిత్య లో పరీక్షలు ముగిసాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరిక్షలకు ఎటు వంటి ఆటంకం లేకుండా ఆదిత్య యాజమాన్యం సహాయసహకారాలు అందించారు.

లొల్ల పాఠశాలలో మద్యాహ్న భోజనం పరిశీలించిన ఎంపీడీఒ

 లొల్ల పాఠశాలలో మద్యాహ్న భోజనం పరిశీలించిన ఎంపీడీఒ

పెన్ పవర్,ఆత్రేయపురం

 లొల్ల గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మద్యాహ్న భోజన పథకాన్ని ఆత్రేయపురం ఎంపీడీఒ నాతి బుజ్జి పరిశీలించారు. పాఠశాలలో భోజన పథకం అమలు, టాయిలెట్ల సదుపాయం, పదవ తరగతి పాఠ్యాంశాల భోదన, పరీక్షలకు సమాయత్తమవుతున్న విధానం తదితర అంశాలపై పదవ తరగతి విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ మెనూ ప్రకారం రుచికరం,శుచి కరమైన భోజనం పిల్లలకు తయారు చేసి పెట్టాలని ఇంప్లిమెంటింగ్ ఏజన్సీ వారిని ఆదేశించారు. ఈ పరిశీలనలో పాఠశాల ప్రదానోపాద్యాయులు అంగర రాజు, ఉపాద్యాయులు ఉన్నారు.అనంతరం గ్రామ సచివాలయాన్ని  పరిశీలించి, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లతో  సమావేశం నిర్వహించి సచివాలయ సర్వీసులు, సచివాలయ సిబ్బంది చేయాల్సిన తనిఖీలు , సంక్షేమ పధకాల అమలు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సమావేశం లో కార్యదర్శి విజయ్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.ఇటీవల ఉత్తమ అధికారిణి గా అవార్డు అందుకున్న సందర్భంగా లొల్ల గ్రామ సచివాలయ సిబ్బంది,గ్రామ వాలంటీర్లు  గ్రామ పెద్దలు తూము తాతాజీ, డి.సూర్యనారాయణ రాజు, వార్డు సభ్యులు,ఉపాద్యాయులు బెనర్జీ, దేవకుమార్, ఎ.రాజు తదితరులు ఎంపీడీఒ ను సత్కరించారు.

ప్రభుత్వ రంగం మా భవిష్యత్తు...వాటి జోలికొస్తే సహించేది లేదు

 ప్రభుత్వ రంగం మా భవిష్యత్తు...వాటి జోలికొస్తే సహించేది లేదు

ఎస్ఎఫ్ఐ, గిరిజన సంఘం సిఐటియు, ఆగ్రహం

జీవో నెంబర్ 3 రిజర్వేషన్ పునరుద్ధరణ చేయాలని

 స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని 

పెన్ పవర్ బ్యూరో,విశాఖపట్నం

ఎస్సి ఎస్టి బిసి రిజర్వేషన్ల రద్దు నిర్ణయాలను మానుకోవాలని బుధవారం పెదబయలు మండల కేంద్రంలో ఎస్ఎఫ్ఐ గిరిజన సంఘం సిఐటియు ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ ర్యాలీ మానవహారం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని  ఉద్దేశించి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగ పరిశ్రమలను బ్యాంకులను రక్షణ భీమా రైల్వే తదితర సంస్థలను కారుచౌకగా కార్పొరేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం పచ్చి దుర్మార్గమైనదని కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలకు  రాష్ట్ర ప్రభుత్వం సమర్థించడం రాష్ట్ర ప్రజలను వంచించడమేనని బిజెపి తీసుకుంటున్న అప్రజాస్వామిక విధానాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం   చిత్తశుద్ధి గా వ్యవహరించాలని సూచించారు. చేతనైతే కొత్త పరిశ్రమలు స్థాపించాలి అంతే తప్ప అనేక త్యాగాలు చేసి ఇ పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి సాధించుకున్న  స్టీల్ ప్లాంట్ వంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలు అమ్మే అధికారం ఈ ప్రభుత్వానికి లేదని మొండిగా వ్యవహరిస్తే దేశ ప్రజల ఆగ్రహ జ్వాలలకు కాలి బూడిదై పోక తప్పదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే గిరిజన సంఘం మాజీ  రాష్ట్ర కమిటీ సభ్యులు బొండ సన్ని బాబు మాట్లాడుతూ.... దేశా సంపదను కొల్లగొట్టే వ్యవహారంలో భాగంగా దేశానికి సంబంధించిన అతి పెద్ద 100 పరిశ్రమలను అంబానీ ఆధాని లకు విదేశీ బహుళజాతి కంపెనీలకు అమ్మేసి కులా మతాల మధ్య చిచ్చులు రెచ్చగొట్టి దేశాన్ని అల్లకల్లోలం చేయాలని కంకణం కట్టుకున్న ఈ బిజెపి విధానాలను కూకటి వేళ్లతో పెకిలించే ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ డివిజన్ నాయకులు సింహాద్రి పెదబయలు ఎస్ఎఫ్ఐ కమిటీ సభ్యులు రామదాసు వీరన్న వెంకటేష్ భీమరాజు సిఐటియు మండల కార్యదర్శి  కే.సర బన్న తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు చేపట్టాలి.

 ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు చేపట్టాలి..

కుత్బుల్లాపూర్, పెన్ పవర్

తెలంగాణ రాష్ట్ర గురుకులాల కార్యదర్శి డాక్టర్.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు, దళిత ఐక్య వేదిక నాయకులు ఏసురత్నం, సీపీఐ కుత్బుల్లాపూర్ కార్యదర్శి మహేష్, స్వేరో సర్కిల్ సొసైటీ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ఎర్ర యాకన్నలు డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ జగద్గిరిగుట్ట బస్ స్టాండ్ ప్రాంతంలో స్వేరో సర్కిల్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో దళిత ఐక్య వేదిక ముఖ్య నాయకులు ఏసురత్నం, సీపీఐ కుత్బుల్లాపూర్ కార్యదర్శి మహేష్, స్వేరో సర్కిల్ సొసైటీ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ఎర్ర యాకన్నలు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో సుమారు 1000 గురుకుల పాఠశాలలో సుమారు 5 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని, గురుకుల పాఠశాలలో కులాలు, మతాలకు, అతీతంగా ఎస్.సి, ఎస్.టి, బీసి, ఓసి,లు అందరు విద్యార్థుల కు విద్యను అందిస్తున్న ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మతోన్మాద, మనువాద భావాలను తమపై రుద్దాడానికి ప్రయత్నం చేస్తున్న బీజేపీ నాయకులు బండి సంజయ్ ఖబర్దార్ అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత ఐక్య వేదిక నాయకులు వల్లూరి బాబు రావు, సీపీఐ నాయకులు డప్పు రాములు, వెంకటేష్, సోమయ్య, శ్రీను, దళిత నాయకులు గణేష్, నరేష్, స్వేరో సర్కిల్ సొసైటీ మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్ర వీరన్న, సోమయ్య, రమేష్, అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...