Followers

కేసీఆర్ కు పాలాభిషేకం చేసిన ఆర్టీసీ కార్మికులు

 కేసీఆర్ కు పాలాభిషేకం చేసిన ఆర్టీసీ కార్మికులు

వనపర్తి, పెన్ పవర్

టి.ఎస్.ఆర్.టి.సి వనపర్తి డిపోలో రాష్ట్ర బడ్జెట్లో ఆర్టీసీకి దాదాపు మూడు వేల కోట్లు కేటాయించినందుకు ఆనందం వ్యక్తం చేస్తూ డిపో మేనేజర్ శ్రీ కె.వి. రాజశేఖర్  ఆధ్వర్యంలో  ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర రావుకు ఉద్యోగులు పాలాభిషేకం చేసినారు. డిపో మేనేజర్ మాట్లాడుతూ ఆర్టీసీ అభివృద్ధికి  సీఎం కెసిఆర్ ఇస్తున్న  చేయూత  గొప్పదన్నారు.  ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ చంద్రమౌళి,  ఎఎంఎఫ్  జయ కృష్ణ, ఎస్.టి.ఐ. శ్రీలత, ఉద్యోగులు పాల్గొన్నారు.

గుట్కా..అంబర్ల విక్రయాలను అరికట్టండి

 గుట్కా..అంబర్ల విక్రయాలను అరికట్టండి..

పట్టణం..గ్రామాలలో విచ్చలవిడిగా విక్రయిస్తున్న నిషేదిత గుట్కా,అంబర్ ప్యాకెట్లు..

కుటుంబాలకు కుటుంబాలే క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంది



కేసముద్రం, పెన్ పవర్ 

రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కోసం ప్రాణాలు కాపాడడం కోసం కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న టొబాకో మహమ్మారిని చట్ట ప్రకారంగా నిషేధించగా ,రాష్ట్రంలో దుష్ట శక్తులు ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసి, తమ సంపాదనే ధ్యేయంగా పనిగా పెట్టుకొని, తోబాకో, తంబాకు, పాన్ పరాగ్, విమల్, గుట్కా ల, రూపంలో రాష్ట్ర నడిబొడ్డు నుండి గ్రామాలలో వీధులలో ఉండే చిన్న చిన్న కిరాణా షాప్ లోకి పాన్ షాప్ లోకి సప్లై చేస్తూ కోటీశ్వరులు అవుతాన్నారు ,ఎంతలా ఎగిసి పడుతుంది ఈ రాకెట్ మహమ్మారి అంటే ,గతంలో ఒక్క రూపాయి కి దొరికే గుట్కా ఒక్క ప్యాకెట్ , నేడు ఆ ఒక్క ప్యాకెట్ ను ఐదు రూపాయల నుండి 10 రూపాలకు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు, మూడు నుండి ఐదు రూపాయలు గతంలో ఆమ్మీ నటువంటి తంబాకు( అంబర్ ) ప్యాకెట్ నేడు 15 నుండి 20, 25 రూపాయలు కూడా అమ్ముతున్నారు సగటున పేద మధ్యతరగతి ప్రజలు కూలీలు, ఎక్కువగా వీటికి అలవాటు పడి విరివిగా వీటిని వాడుతున్నారు కొంతమంది యువకులు ఫ్యాషన్ గా గా కూడా వీటిని వాడుతున్నారు అంటే అతిశయోక్తి కాదు ,వీటికి చదువుకున్నవారు చదువులేని వారు అనే తేడా లేకుండా ప్రతి పది మందిలో ఇద్దరు ముగ్గురు వీటికి బానిసలుగా మారిపోతున్నారు, ఎంతలా అంటే అన్నం లేకుండా ఉంటారు కానీ అంబర్ గుట్కా తినకుండా ఉండలేనంతగా బానిస గా మారి పోయారు దీనిని ఆసరాగా చేసుకున్న రాష్ట్రస్థాయి జిల్లాస్థాయి మండలస్థాయి గ్రామస్థాయి లో ఏజెంట్లుగా పెట్టుకొని సప్లై చేస్తూ ,సీక్రెట్ గా గుట్టుచప్పుడు కాకుండా అమ్ముతున్నారు ప్రతి పాన్ షాప్ లో ఇవి లేవు అని అంటే నమ్మశక్యం లేని మాటలు, ఒకటి నుండి మూడు నాలుగు ప్యాకెట్ల వరకు ప్రతి షాప్ వాళ్ళు రిటైల్గా అమ్ముతున్నారు ,దీనికి అధికారులు ప్రజా ప్రతినిధులు తెలిసి కూడా తెలియనట్టు గా ఉంటున్నారు, ఇప్పటికైనా ప్రజల ప్రాణాలను గుర్తుపెట్టుకుని చట్ట ప్రకారంగా నిర్మూలించిన టువంటి గుట్కా ప్యాకెట్ల అమ్మకాలను సమూలంగా నిర్మూలించేందుకు ప్రజా ప్రతినిధులు అధికారులు చొరవ తీసుకోవాలని లేనట్లయితే ప్రతి పది మందిలో ఇద్దరు ముగ్గురు క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు పెరిగే ప్రమాదం ఉందని ప్రతి మండలంలో ఒకరిద్దరు ఇప్పటికే ఉన్నారని మేధావి వర్గాలు చర్చించుకుంటున్నారు పెన్ పవర్ చేపట్టిన అటువంటి పరిశోధనలొ అధికారులకు తెలుసునని గతంలో కొంతమంది హోల్సేల్ డీలర్ల కిరానా షాప్ వాళ్లను పట్టుకొని చిన్న చిన్న కేసులతో వదిలేశారని ఇది మా మామూలే అని అంటున్నారు , ఈ అమ్మకాలు ఈ విధంగానే జరుగుతే కొద్ది ఏండ్లకే కొన్ని సంవత్సరాలలో పేద ప్రజలు మరింత దరిద్ర అనే ఊబిలోకి పోతారని మరీ ముఖ్యంగా ఆరోగ్యవంతులు కూడా అనారోగ్యం పాలవుతానరని ,ఒక కుటుంబంలో ఒక వ్యక్తి తింటే ఆ కుటుంబం అంతా ఆ వాసన సోకి వారందరూ కూడా అనారోగ్యం పాలవుతారు అని *ఒక ఆయుర్వేద వైద్యుడు తెలియజేశారు* ఇది ఇలాగే కొనసాగితే కుటుంబాలకు కుటుంబాలే అనారోగ్యం పాలవుతారు క్యాన్సర్ మహమ్మారి కౌగిలిలో బందీ అవుతారని ఇప్పటికైనా ప్రజల ప్రాణాలను ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు ప్రజా ప్రతినిధులు కఠినమైన చర్యలు తీసుకొని ఇలాంటి టొబాకో ప్యాకెట్లను నిర్మూలించేందుకు కంకణం కట్టుకోవాలని అందుకు ప్రజలు ,స్వచ్ఛంద సంస్థలు, మేధావులు ,కూడా మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు కూడా నడుం బిగించాలనని వైద్యులు అంటున్నారు, ఎవరు ఎంత పని చేసి ఇ ప్రజల ప్రాణాలను ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుని పని చేసి ప్రజల కోసం పాటు పడి యోగక్షేమాలను ఆలోచించి ఈ గుట్కా తంబాకు అంబర్ లాను నిషేధించేందుకు పాటుపడతారొ వేచి చూద్దాం.

జాతీయ యోగా పోటీలకు ఎంపికైన శ్రీ బాలాజీ విద్యా మందిర్ విద్యార్థులు

 జాతీయ యోగా పోటీలకు ఎంపికైన  శ్రీ బాలాజీ విద్యా మందిర్ విద్యార్థులు

 ఆదిలాబాద్ ,  పెన్ పవర్

 తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ద మినిస్టర్ ఆఫ్ యూత్ అఫైర్ అండ్ స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈనెల 13 నుండి 16 వరకు  ఆన్లైన్లో రాష్ట్ర స్థాయి యోగా పోటీలను నిర్వహించగా ఈ పోటీల్లో ఆదిలాబాద్   జిల్లాకు చెందిన శ్రీ బాలాజీ విద్యా మందిర్ విద్యార్థులు జూనియర్ గర్ల్స్ విభాగంలో వాడ్కర్ వైష్ణవి నాలుగో స్థానంలో, జూనియర్ బాయ్స్ విభాగంలో వాడ్కర్ శ్రీనివాస్ మొదటి స్థానంలో విజయం సాధించారు. వీరు ఈనెల 24 నుండి 26 వరకు జరిగే ఆన్లైన్ జాతీయ స్థాయి యోగా పోటీలకు హాజరుకానున్నారు. అని  గురువారం స్కూల్ డైరెక్టర్ రంగినేని పవన్ రావు, ప్రిన్సిపాల్  కే. సచింద్రనాథ్,యోగా శిక్షకుడు సిహెచ్ చేతన్ వారిని అభినందిస్తూ తెలిపారు.

అత్యవసర పరిస్థితుల్లో రక్తం డొనేట్ చేసిన పాయల శరత్

అత్యవసర పరిస్థితుల్లో రక్తం డొనేట్ చేసిన పాయల శరత్...

 ఆదిలాబాద్ ,  పెన్ పవర్

 రిమ్స్ ఆస్పత్రిలో అత్యవసర సమయంలో రక్తం దొరకకపోవడంతో బిజెపి యువ నాయకుడు ఆడ సర్పంచ్ పాయల శరత్ విషయం తెలుసుకొని గురువారం జిల్లా కేంద్రంలోని రిమ్స్ లో రక్తదానం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం దొరకటంతో బాధితులు సంతోషం హర్షం వ్యక్తం చేశారు.

ఉచిత మెగా హెల్త్ క్యాంపును ప్రారంభించిన విశాల్ గౌడ్

 ఉచిత మెగా హెల్త్ క్యాంపును ప్రారంభించిన విశాల్ గౌడ్..




జీడిమెట్ల, పెన్ పవర్

132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని యం.ఎన్.రెడ్డి నగర్ లో ఫిలిడెల్ఫియా ప్రేయర్ హౌస్ పాస్టర్ భాగ్యరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ను టిఆర్ఎస్ నాయకుడు కే.పీ.విశాల్ గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.. పేద ప్రజలు ఇలాంటి హెల్త్ క్యాంపును ఉపయోగించుకోవాలని విశాల్సూచించారు.. సుమారు 450 మంది ప్రజలు ఈ ఉచిత మెగాహెల్త్క్యాంపు  ఉపయోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉచిత మెగా హెల్త్ క్యాంపు ఇంచార్జ్ ఆంజనేయులు, యం.ఎన్. రెడ్డి నగర్ కాలనీ ప్రెసిడెంట్ కర్నే శ్యామ్, విటల్ నాయక్ మరియు పాస్టర్స్ శౌరి, విజయభాస్కర్, సత్యనారాయణ, జో బాబు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

పోషణపై అవగాహన

 పోషణపై అవగాహన

అదిలాబాద్ , పెన్ పవర్  

 ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం లో పోషణ పక్షొత్సవాలలో భాగంగా శ్యాంపూర్ సెక్టార్ పరిధిలోని గర్భిణులకు బరువు, కొలతలు తిసి వారి ఆరోగ్య వివరాలను తెలుపడంతో పాటు వారి భర్తలకు గ్రామ పెద్దలు సర్పంచులతో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించరు.మార్చి 16 నుండి 30 మార్చి వరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఉట్నూర్ ఐసిడిఎస్ సూపర్ వైజర్ ధనలక్ష్మి అన్నారు. గురువారం ఉట్నూర్ మండలం చింతకర్ర గ్రామంలోని అంగన్ వాడి కేంద్రంలో పోషణ పక్షోత్సవాలలో భాగంగా పాల్గొని అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఉట్నూర్ ఐసిడిఎస్ సూపర్వైజర్ ధనలక్ష్మి మరియు చింతకర్ర గ్రామ ఉప సర్పంచ్ సిడం పులాబాయి  లు మాట్లాడుతూ పోషణ పక్షోత్సవాలలో భాగంగా నేడు ఉట్నూర్ మండలం చింతకర్ర గ్రామంలోని గర్భిణీలకు వారి ఆరోగ్య వివరాలను భర్తల ముందు బరువు మరియు కొలతలు తిసి వారి ఆరోగ్య వివరాలను తెలిపి అవగాహన కల్పించడం జరిగిందని, రక్తహీనత మరియు పౌష్టికాహారం లోపం తదితర వాటి కారణాలను తెలిపి వారికి తగిన పౌష్టికాహారం అందించే దిశగా గర్భిణులకు, బిడ్డకు మెరుగైన ఆరోగ్యం చేకూరడం కోసం తగిన జాగ్రత్తలు పాటించాలని పౌష్టికాహారం తిసుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో చింతకర్ర సర్పంచ్ పెందూర్ పారుబాయి, ఉప సర్పంచ్ సిడం పూలాబాయి, వీఓ మరప నాగుబాయి, గ్రామ పటెల్ మరప మారుతీ, ఆశ కార్యకర్త మడావి మానుబాయి, అంగన్ వాడి టీచర్ పెందూర్ విజయ, గ్రామ గర్భిణులు మరియు వారి భర్తలు తదితరులు పాల్గొన్నారు.

సకల వర్గాల సంక్షేమ బడ్జెట్ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

 సకల వర్గాల సంక్షేమ బడ్జెట్ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

పెన్ పవర్ , జగిత్యాల

రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అత్యంత ఆశాజనకంగా ఉందని, సామాన్యప్రజలకు సైతం ఎంతో మేలు చేసేలా ఉందని ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు,ముఖ్యమంత్రి కేసీఆర్ లకు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్.రాష్ట్ర జీడీపీ ఆశాజనకంగా ఉండటంతో ఈసారి అన్ని వర్గాలకు మేలు చేకూరనుందని ఒక్క జగిత్యాల జిల్లాకే ఈ సంవత్సరంకు 250 కోట్లు రావటం సంతోషంగా ఉందని అన్నారు. ఎప్పటి మాదిరిగానే పల్లెల్లో మౌళిక సదుపాయాలకు నిధులు కేటాయిస్తూనే..జిల్లా పరిషత్,మండల పరిషత్ లకు నిధులు కేటాయించటం పై హర్షం వ్యక్తం చేశారు.ఎమ్మెల్యేలకు సైతం 5 కోట్లు కేటాయింపులు జరిపారని,విద్య,వైద్యానికి ప్రాధాన్యం ఇస్తూనే వ్యవసాయ పనిముట్ల యాంత్రీకరణ,రైతు భీమా కు,మార్కెట్ల అభివృద్ధికి సైతం నిధుల కేటాయింపులతో ఎంతో మేలు జరగనుందన్నారు.సకల వర్గాల సంక్షేమ బడ్జెట్ అని అభిప్రాయపడింది. ఎమ్మెల్యే జిల్లాకు సైతం అత్యధిక మేలు చేకూరుతుండటంపై సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...