Followers

వనపర్తి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం దగ్గర ఆధార్ కేంద్రం

వనపర్తి జిల్లా  కలెక్టరేట్  కార్యాలయం దగ్గర ఆధార్ కేంద్రం 

వనపర్తి, పెన్ పవర్

వనపర్తి పట్టణ ప్రజలకు అందుబాటు లో ఉండే విధంగా వనపర్తి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన ఆధార్ నమోదు కేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ప్రజలను కోరారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఆధార్ సేవా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ఏవో అడ్మిన్, కలెక్టరేట్ టెక్నికల్ సిబ్బంది ఆధార్ సేవా కేంద్రం నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

రైట్ రెవ.డాక్టర్ కె.ప్రశాంత్ కుమార్ మరణం

 రైట్ రెవ.డాక్టర్ కె.ప్రశాంత్ కుమార్ మరణం 


రాజమహేంద్రవరం, పెన్ పవర్

ప్రముఖ క్రైస్తవ నాయకులు, అంతర్జాతీయంగా మరియు భారతదేశంలో ప్రముఖ దైవ జనులుగా పేరు గాంచిన రైట్. రెవ. డా. కె. ప్రశాంత్ కుమార్ (82 సంవత్సరాలు) ఏప్రిల్ 9వ తేదీ శుక్రవారం,2021న మరణించి యున్నారు.వీరు ఆల్ ఇండియా క్రిస్టియన్ అసోసియేషన్ అధ్యక్షులుగాను,రాష్ట్ర బైబిల్ సొసైటీ అధ్యక్షులుగాను, బ్రదరన్ మిషన్ ఇండియా వ్యవస్థాపకులు, అధ్యక్షులుగాను మరియు అనేక వివిధ సంస్థలలో అధ్యక్షులుగాను వ్యవహరించి యున్నారు.వీరి యొక్క అంతిమ యాత్ర ఏప్రిల్ 10వ తేదీ శనివారం ఉదయం 9 గంటలకు రాజమండ్రి, ఎయిర్ పోర్ట్ రోడ్డులో గల బ్రదరన్  చర్చి నుండి ప్రారంభమగునని కుటుంబ సభ్యులు తెలియపరచడమైనది.

రాజమహేంద్రవరం వార్డుల్లో పర్యటించి ,సమస్యలు తెలుకున్న- వైస్సార్సీపీ కో ఆర్డినేటర్ డాక్టర్ ఆకుల

 రాజమహేంద్రవరం వార్డుల్లో పర్యటించి ,సమస్యలు తెలుకున్న- వైస్సార్సీపీ కో ఆర్డినేటర్ డాక్టర్ ఆకుల

రాజమహేంద్రవరం, పెన్ పవర్

రాజమహేంద్రవరం మాజీ ఎమ్మెల్యే వై ఎస్ ఆర్ సి పి అర్బన్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆకుల సత్యనారాయణ ఎం.ఎస్ ఆర్థో ఆనాల వెంకటప్పరావు రోడ్డు నందుగల వాంబే గృహాలు,గృహాల పరిసర ప్రాంతాలను సందర్శించి వారి సమస్యలు తెలుసుకుని వారు ఇచ్చిన వినతి పత్రాలను సమస్యలను స్వీకరించి వెంటనే ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని హామీ ఇచ్చారు.ఇంకా చుట్టుపక్క పలు ప్రాంతములలో పర్యటించి అక్కడి సమస్యలను పర్యవేక్షించి పరిశీలించి అక్కడి ప్రతి వారిని  పలకరిస్తూ ,అక్కడి సమస్యలు వారి సమస్యలను కూడ తెలుసుకుంటూ,ఆ సమస్యలకు త్వరలోనే పరిష్కరించడం జరుగుతుందని తెలియజేయడం జరిగినది.ఈ పర్యటన లో వైస్సార్సీపీ నగర అధ్యక్షులు నందెపు శ్రీను,నగర వైస్సార్సీపీ మహిళ నాయకురాలు పొలు విజయ్ లక్ష్మీ  ,రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ ఛైర్మెన్ పాలిక శ్రీను,ఇసుకపల్లి శ్రీనివాస్ ,నిర్మల రాణి,అప్సర్ సుధా రెడ్డి,వైయస్సార్ సిపి నాయకులుఅడపా హరి తదితరులు పాల్గొన్నారు.

నెలకు 2వేలు..25 కిలోల బియ్యం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

 నెలకు 2వేలు..25 కిలోల బియ్యం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం.. 

ప్రైవేట్ టీచర్లకు అండగా నిలిచిన టీఆర్ఎస్ ప్రభుత్వం... 

స్కూళ్ళు తెరిచే వరకు నెలకు రూ.2 వేలు, 25 కిలోల బియ్యం ఉచితంగా పంపిణీ... 

కుత్బుల్లాపూర్ లో హర్షం వ్యక్తం చేస్తూ.. ఎమ్మెల్యేతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన టీచర్లు... 

ఆపత్కాలంలో మమ్మల్ని ఆదుకున్న సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటామన్న ప్రైవేట్ టీచర్లు... 


కుత్బుల్లాపూర్, పెన్ పవర్ 

కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన సందర్భంగా రాష్ట్రంలోని విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో  ఇబ్బందులు ఎదుర్కుంటున్న గుర్తింపు పొందిన ప్రైవేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలిచింది. స్కూళ్ళు మళ్లీ తెరిచే వరకు నెలకు రూ.2000 ఆపత్కాల ఆర్ధిక సాయంతో పాటు కుటుంబానికి నెలకు ఉచితంగా 25 కేజీల బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా అందించాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్  నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ప్రైవేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ తమ సమస్యలు అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్  దృష్టికి తీసుకెళ్ళినందుకు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ను తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ తో కలిసి తన నివాసం వద్ద సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రైవేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది కుటుంబాలను మానవీయ దృక్ఫథంతో ఆదుకోవాలని సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న కుటుంబాలకు ఎంతో లబ్ధిచేకూరుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో క్యుఎంఆర్ఎస్ఎంఏ అధ్యక్షులు వరప్రసాద్, మేడ్చల్ జిల్లా ట్రస్మా అధ్యక్షులు శివరాత్రి యాదగిరి, ముఖ్య సలహాదారులు మండవ శ్రీనివాస్ గౌడ్, కార్యదర్శి సీహెచ్ మహేష్ కుమార్, కోశాధికారి జే. దయాకర్, ట్రస్మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్ మల్లేశం, ఆర్ఎన్ చారి, సీహెచ్ కనక దుర్గారావు, నరసింహులు గౌడ్, ఛాయాదేవి, వనజ, అశోక్ మరియు ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

హైస్కూల్ లో ఆకసిమిక తనిఖీ చేసిన మున్సిపల్ ఛైర్మెన్ & వైస్ చైర్మన్

 హైస్కూల్ లో ఆకసిమిక తనిఖీ చేసిన మున్సిపల్ ఛైర్మెన్ & వైస్ చైర్మన్

పెన్ పవర్, కొవ్వూరు

ఈ రోజు కొవ్వూరు లోనీ మున్సిపల్ హై స్కూల్ లోనీ గౌరవ మున్సిపల్ ఛైర్మన్ శ్రీమతి బావన రత్నకుమారి గారు మరియు వైస్ చైర్మన్ శ్రీమతి మన్నే పద్మా గారు అకస్మిక తనిఖీలు చేపట్టారు. హై స్కూల్ లోనీ విద్యార్థులకి కరోనా వైరస్ పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని మరియు స్కూల్ లోనీ తరగతులు గదులు మరియు బాత్ రూమ్స్ పరిశీలించారు . స్కూల్ లోనీ పలు సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కారం చేస్తానని అన్నారు ఈ కార్యక్రమం లో స్కూల్ టీచర్స్ అందరూ కలిసి చైర్మన్ మరియు వైస్ చైర్మన్ లను సన్మానం చేయటం జరిగింది.

వాడపల్లి వెంకన్న ఆలయాన్ని శానిటేషను తో శుభ్రం చేస్తున్న సిబ్బంది

 వాడపల్లి వెంకన్న ఆలయాన్ని శానిటేషను తో శుభ్రం చేస్తున్న సిబ్బంది

పెన్ పవర్, ఆత్రేయపురం 

 వాడపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అలివేలుమంగ  పద్మావతి సమేత ఇక్కడ కొలువై ఉన్నారు వెంకటేశ్వర స్వామి దర్శించుకోడానికి ఎక్కడెక్కడి నుండో భక్తులు తరలివస్తున్నారు భక్తులను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కరోనా దృశ్య ఆలయ ఈవో ఆలయం అంతా భక్తులకు ఇబ్బంది కలగకుండా శానిటేషన్ చేయిస్తున్నారు ఇప్పటికే దేశంలో కరోనా విజృంభన కొనసాగుతున్న నేపథ్యంలో ఆలయం ఆలయ ఆవరణ అంతా శుభ్రం  చేయిస్తున్నారు.

ప్రజా సేవలో ముందుకు సాగుతున్న తుళ్లి దంపతులు

 ప్రజా సేవలో ముందుకు సాగుతున్న తుళ్లి దంపతులు

రాజమహేంద్రవరం, పెన్ పవర్

రాజమహేంద్రవరం స్థానిక రామచంద్ర పేట ప్రముఖ ప్రాంతంలో నాయకులు తుళ్ళి సూర్యచంద్ర రావు ప్రముఖ సేవకురాలు మరియు యాదవ్ సంఘ రాజమహేంద్రవరం ప్రధాన కార్యదర్శి,టి.డి.పి మహిళ విభాగం నాయకురాలు తుళ్ళి పద్మావతి యాదవ్  దంపతుల చే 36మరియు39వార్డ్ లో ముగ్గురు నిరుపేద కుటుంబలకు ఒక నెల సరిపడా  నిత్యావసర సరుకులు,బియ్యం పంపిణీ చేయడం జరిగింది.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...