Followers

గన్నెలకోట సర్పంచ్ అనారోగ్యంతో మృతి

గన్నెలకోట సర్పంచ్ అనారోగ్యంతో మృతి

పెదబయలు  పెన్ పవర్

మండలంలోని, గన్నెలకోట పంచాయతీ సర్పంచ్ లకే దేవకుమారి(36)_అనారోగ్యంతో బుధవారం సాయంత్రం చామగడ్డ గ్రామంలో మృతి చెందారు. రెండు రోజులగాా ఆమె అనారోగ్యంతో బాధ పడుతూ ఆమె మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలియజేసారు. మృతురాలు దేవకుమారి గిన్నెెల కోోట సర్పంచ్ గా రెండు దఫాలు ఏక గ్రీవంగా ఎన్నిక య్యారు. వైసిపి పార్టీ ఆవిర్భావం నుంచి ఆమె తన  భర్త చిన్నారావు తో కలిసి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పనిచేస్తూ  పంచాయతీ ప్రజలకు  విశేష సేవలు  అందించారు. ఆమె  మాట అంటే పంచాయతి ప్రజలకు  శిలా సాసనం.




త్రాగునీటికి కటకట లాడుతున్న గిరిజన గ్రామాలు

 త్రాగునీటికి కటకట లాడుతున్న గిరిజన గ్రామాలు

మంచినీటి పథకాలు పుష్కలం ఫలితం మాత్రం శూన్యం
 ఏజెన్సీలో తూతూ మంత్రంగా తాగునీటి నిర్మాణాలు
 జేబులు నింపుకుంటున్న అధికార్లు కాంట్రాక్టర్లు
ఆర్డబ్ల్యూఎస్ అధికారుల పనితీరుపై గిరిజన సంఘం ఆగ్రహం

పెన్ పవర్ , విశాఖపట్నం

 విశాఖ ఏజెన్సీలో తాగు నీరు సదుపాయం లేక ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీరు కోసం ఊటలు గెడ్డలను ఆశ్రయిస్తున్నారు. గిరిజనుల తాగు నీటి పధకాల పేరుతో కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నప్పటికి వీసమెత్తు ఫలితం ఇవ్వడం లేదు.తూతూ మంత్రంగా నిర్మణాలు చేసి కాంట్రాక్టర్లు జేబులు నింపుకుంటున్నారని గిరిజన సంఘం గిరిజన సమైక్య ఆరోపిస్తున్నారు. దీనికి పెదబయలు మచ్చుతునకగా చెప్పవచ్చు. పెదబయలు మండలం 23 పంచాయతీల పరిధిలో నూటికి 80%  గ్రామాలలో సురక్షిత మంచినీరు అందుబాటులో లేదని 48% శాతం పైగా గ్రామాలు గ్రావిటీ ద్వారా ఆధారపడి బతుకుతున్నాయని 30% శాతం గ్రామాల్లో నేటికీ ఊట గడ్డ మీద ఆధారపడి ఉన్నదని కేవలం 28% గ్రామాల్లో మాత్రమే బోర్ పంపులు సోలార్ ద్వారా మంచినీళ్లు తాగుతున్నారని  2014 -2018 మధ్యకాలంలో ప్రతి గ్రామానికి బోర్ పంపుల ద్వారా ఇంటింటికి సురక్షిత మంచినీరు అందించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినప్పటికీ  ఆర్డబ్ల్యూఎస్ అధికారుల నిర్లక్ష్యం, పనిలో నాణ్యత లేకపోవడం వల్ల కోట్ల రూపాయలు డబ్బులు వృధా అవడంతో పాటు, సొమ్ము చేసుకున్నారు దీనిపై ఉన్నతాధికారులు సరి అయిన దర్యాప్తు చేసి గిరిజనులకు నీళ్లు అందించే విషయంలో పూర్తి వైఫల్యం చెందారని  విమర్శించారు. గత మూడేళ్ల క్రితం  గోమంగి  పంచాయితీ సరియపల్లి గ్రామంలో  12 లక్షల రూపాయలు వెచ్చించి బోరు తీసి ఒక మంచినీటి ట్యాంక్ నిర్మించారు కానీ ట్యాంకులో ఒక్క బొట్టు మంచినీరు పడలేదు 12 లక్షలు అప్పనంగా కాంట్రాక్టు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మింగేశారు. 

ఈ విషయంపై ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారి అయిన జగదీష్ గారిని వివరణ కోరితే సంబంధంలేని కారణాలు చెప్పి తప్పించుకున్నారు మిగిలిన గ్రామాలలో కూడా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ ఉన్నత అధికారులు జోక్యం చేసుకోకపోవడం వల్ల ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఆగడాలకు అంతులేకుండా పోయిందనీ అన్నారు. మంచి నీటి సమస్యపై పంచాయతీ కార్యదర్శులకు సర్పంచులకు రిపోర్టు చేస్తే తము పంచాయతీ తీర్మానాలు పెట్టిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులను నుండి సరైన స్పందన ఉండదని  ఎస్టిమేషన్ వేసే విషయంలో అలాగే చేసిన పనికి నిధులు  మంజూరు చేసే విషయంలో తీవ్ర నిర్లక్ష్యం జరుగుతుంది. గోమంగి గ్రామంలో 100 నుండి 150 గిరిజన కుటుంబాలకు  గ్రావిటీ నీళ్లే గతి గ్రావిటీ  ద్వారా వస్తున్న చుక్క చుక్క నీళ్ల కోసం గంటల తరబడి వేచి చూడాలి అది కూడా ఏ సమయంలో వస్తుందో తెలియని పరిస్థితి నీళ్లు రాకపోతే  ప్రతిసారి స్థానిక గ్రామస్తులే వెళ్లి చిన్నచిన్న మరమత్తులు చేసుకుని జీవిస్తున్నారు గ్రావిటీ నుండి నీళ్లు రాకపోతే ప్రత్యామ్నాయంగా మంచినీటి బావి గాని ఊట గడ్డ లు గాని బోర్వెల్ గాని అందుబాటులో లేకపోవడం వల్ల  గత్యంతరం లేక  గడ్డ నుండి కలుషితమైన బురద నీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని దీని ఫలితంగా ప్రస్తుతానికి ప్రతి ఒక్క ఇంట్లో సీజనల్ వాంతులు విరోచనాలు చలి జ్వరం తలనొప్పి అనేక వైరస్ లకు గురవుతున్నారని మండిపడ్డారు.  ఇప్పటికైనా నిధులు దుర్వినియోగం చేయకుండా ఆయా గ్రామ పంచాయతీల ప్రజలకు ఉపయోగపడే విధంగా నిధులు ఖర్చు పెట్టి త్రాగు నీటిని అందించాలని  గోమంగి గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇంటింటికి వెళ్లి వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, సురక్షిత మంచినీరు గ్రామంలో ఉన్న ప్రజలందరికీ పుష్కలంగా అందే విధంగా చర్యలు తీసుకోవాలని మంచినీళ్లు  అందిస్తున్నామనే ఉద్దేశంతో నిధులను దుర్వినియోగంపరుస్తూ జేబులు నింపుకుంటున్నా సంబంధిత అధికారులపై చర్యలు తక్షణమే తీసుకోవాలని. మంచినీళ్ల సమస్య వెంటనే పరిష్కారం చేయకుండా అలసత్వం చేస్తున్న సంబంధిత ఆర్డబ్ల్యూఎస్ అధికారులను విధుల నుండి వెంటనే తొలగించాలని లేనిపక్షంలో అధికారులు ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ పెద్ద ఎత్తున పోరాటం చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి  కొమ్మ పృథ్వీరాజు గిరిజన సమాఖ్య జిల్లా సహాయ కార్యదర్శి కూడా రాధాకృష్ణ గోమంగి   శేఖర్ రుంజాల జయ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

ఏజెన్సీలో మొక్కుబడిగా నడుస్తున్న అంగన్ వాడి కేంద్రాలు.

ఏజెన్సీలో  మొక్కుబడిగా నడుస్తున్న అంగన్ వాడి కేంద్రాలు.


గిరిజన పిల్లలకు  కల్లిపోయిన గుడ్లు పంపిణీ. 

అంగన్వాడి కేంద్రాలపై  కొరవడిన పర్యవేక్షణ.

విశాఖపట్నం, పెన్ పవర్ 

 విశాఖ ఏజెన్సీలో అంగన్ వాడి కేంద్రాలు మొక్కుబడిగా నడుస్తున్నాయి. కేంద్రాల ద్వారా గిరిజన పిల్లలకు అందించాల్సిన పౌష్టికాహారం సక్రమంగా అందడం లేదని తల్లిదండ్రులు  ఆరోపిస్తున్నారు. ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో అంగన్ వాడి కేంద్రాలు తూతూ మంత్రంగా నడుస్తున్నాయి. గిరిజనులకు అందాల్సిన పౌష్టిక ఆహార పదార్థాలు  మొక్కుబడిగ  ఇస్తున్నారని ఆరోపణలు బాహటంగా వినిపిస్తున్నాయి.  గిరిజన చిన్నారులకు  గర్భిణీలు బాలింతలకు  నిబంధనల ప్రకారం అందించాల్సిన  కోడిగుడ్లు పాలు  గోధుమపిండి  చెనగ చెక్కులు  ఎండు ఖర్జూరం   బియ్యం నూనె పప్పులు పంపిణీ  సక్రమంగా లేదని  గిరిజన మహిళలు  గిరిజన సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీలోని 11 మండలాల్లో ఐసిడిఎస్ ప్రాజెక్టు కేంద్రాలు ఉన్నప్పటికీ ప్రాజెక్ట్ అధికారులు మాత్రం పట్టణాలనుంచి అడపాదడపా వచ్చి పోతున్నట్లు సమాచారం. అధికారి రాలేదని ఎవరైనా ప్రశ్నిస్తే మీటింగ్ కు వెళ్లారన్న  సమాధానం కార్యాలయ సిబ్బంది నుంచి వస్తున్నది.  ఇక  సిబ్బంది  విధులు చెప్పనవసరం లేదు.పర్యాటక కేంద్రం ఐన అరకు ఐసిడిఎస్ ప్రాజెక్టు ప్రత్యేక నిదర్శనం. అంగన్ వాడీ కేంద్రాల పనితీరు వర్ణనాతీతం. వర్రా గ్రామ అంగన్ వాడీ కేంద్రం లో గిరిజన చిన్నారులకు కుల్లిన కోడి గుడ్లుని కార్యకర్త పంపిణీ  చేసిందని తల్లులు ఆరోపించారు. పీఓ పట్టించుకోక పోవడం వలన కార్యకర్త లు ఇష్టానుసారం గా తెరుస్తున్నరని మండి పడుతున్నారు. కుల్లిన గుడ్లు పంపిణీ పై అరకు ఐసిడిఎస్ పీఓని వివరణ  కోరేందుకు ప్రయత్నించగా ఆమే అందుబాటులో లేరు.

విశాఖ కెజిహెచ్ క్యాంటీన్ వద్ద కానరాని కోవిడ్ నిబంధనలు.

 విశాఖ కెజిహెచ్ క్యాంటీన్ వద్ద కానరాని కోవిడ్ నిబంధనలు.

                                                                                      నగరంలో పిట్టల్లా రాలిపోతున్న కరోనా రోగులు

 పట్టించుకోని కేజిహెచ్ యాజమాన్యం.

విశాఖపట్నం,పెన్ పవర్,

విశాఖ నగరంలో పెద్దాస్పత్రి కేజీహెచ్ క్యాంటీన్ వద్ద కరోనా నిబంధనలు పాటించడంలేదు. క్యాంటీన్లో  భోజనం టీ టిఫిన్ కోసం ప్రజలు ఎగబడుతున్నారు. కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తూ ప్రాణాలను హరించి వేస్తుంటే  ప్రజలకు చీమ కుట్టినట్లయినా లేదని    ఆక్షేపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే బుధవారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత క్యాంటీన్ వద్ద జనం రద్దీ ఎక్కువయింది. తోపులాటలు ఒకరిపై ఒకరు ఢీ కొంటూ  ఆహార పదార్థాలకు ఎగబడ్డారు. జనం గుంపుగా  కుమ్ము లాడు  కుంటున్న   క్యాంటీన్ నిర్వాహకులు గాని  ఆస్పత్రి యాజమాన్యం గానీ  పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉంది. నగరంలో కరోనా కేసులు గంట గంటకు పెరిగిపోతున్నాయి మరోపక్క మరణాల సంఖ్య విస్మయాన్ని కలిగిస్తోంది. ఇంత జరుగుతున్నా  జనంలో మాత్రం చలనం లేదు. భయం కనిపించలేదు. కాంటీన్ లో  ఆసుపత్రికి వచ్చిన జనం కిక్కిరిసి పోవడం చూస్తుంటే  కరోనా మహమ్మారి  కోరలు చాస్తుందని  అంటున్నారు.


కేసులు పెరుగుతున్న దృష్ట్యా  ప్రభుత్వం మధ్యాహ్నం పన్నెండు తర్వాత  తెల్లవారు 6  వరకు  బుధవారం నుంచి కర్ఫ్యూ విధించినా విషయం తెలిసిందే. ఒకపక్క కర్ఫ్యూ అమలులో ఉన్నా కేజీహెచ్ ఆస్పత్రి వద్ద  మరియు క్యాంటీన్ లో  జనాలు నిబంధనలకు విరుద్ధంగా ఎగబడటం పై  ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండో దశ కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో  క్యాంటీన్ వద్ద జనం తోపులాటలు  అవసరమా అని ప్రత్యక్షంగా  సాక్షి అరకు వైయస్సార్ సిపి నాయకుడు   జీవన్ కుమార్   ఆగ్రహం వ్యక్తం చేశారు.  కేజీహెచ్ అధికారులు పోలీసులు చొరవ తీసుకోవాలని లేనిపక్షంలో భోజనం క్యాంటీన్   కరోనా క్యాంటీన్ గా  పోతుందని జీవన్ కుమార్ అన్నారు.

మేయర్ కు వినతి పత్రం సమర్పించిన విశాఖ సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్

 మేయర్ కు వినతి పత్రం సమర్పించిన విశాఖ సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్

మహారాణి పేట, పెన్ పవర్

గ్రేటర్ విశాఖపట్నం మహానగర కార్పొరేషన్ కి మేయర్ గా ఎన్నికైన సందర్భంగా ముందుగా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సచివాలయం వ్యవస్థలో పనిచేస్తున్న సచివాలయం సిబ్బంది, శానిటేషన్ వర్కర్లు, హెల్త్ వర్కర్లు, మిగిలిన అన్ని డిపార్ట్మెంట్ లు సిబ్బంది సి.ఎం జగన్ మోహన్ రెడ్డి  ఆశయ సాధన కోసం ఈ కరోనా సమయంలో ఎవరికి వాళ్ళు వారి శక్తి కొలది,అహర్నిశలు ప్రజా సంక్షేమము కోసం విధులు నిర్వహిస్తున్నారు.ఈ సమయంలో కరోనా నుండి రక్షణకు సచివాలయం సిబ్బంది, వాలంటీర్స్ కు సేఫ్టీ కిట్స్ అవసరం ఎంతైనా వుంది కనుక తమ పై దయవుంచి ఉద్యోగులు, కుటుంబాల ఆరోగ్య పరిరక్షణ కు మాస్క్ లు,గౌజులు,శానిటైజర్ లు, అందజేయవలసిందిగా కోరుతూ బుధవారం వినతి పత్రాన్ని సమర్పించారు విశాఖపట్నం సచివాలయం ఎంప్లాయిస్ ఫెడరేషన్. ఈ సందర్భంగా మేయర్ , కమిషనర్ తో మాట్లాడి  అందరికి వీలైనంత తొందరగా హెల్త్ కిట్లు అందించటం జరుగుతుంది అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైజాగ్ జిల్లా  ప్రెసిడెంట్ గణేష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ పి.వి.కిరణ్ కుమార్,జిల్లా కో ఆర్డినేటర్ ఈ.పవన్ కుమార్,షాహిద్, వెంకట్,అశోక్  వాలంటీర్ లు  నవీన్,కుశవంత్  తదితరులు పాల్గొన్నారు.

సింహాచల ఉద్యోగులకు వ్యాక్సినేషన్

 సింహాచల ఉద్యోగులకు వ్యాక్సినేషన్

విశాఖపట్నం సింహాచలం 


శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి ఆలయ ధర్మకర్త సంచయిత గజపతి సహా ఉద్యోగులందరికీ వ్యాక్సినేషన్. ఆలయ ధర్మకర్త సంచయిత గజపతి సలహామేరకు ఈ ఓ సూర్యకళ ఉద్యోగులందరికీ వ్యాక్సినేషన్ వేయించాలని ఆదేశించారు. దీంతో తొలిరోజు 150 మందికి వ్యాక్సినేషన్ వేయించారు ఆలయ ఉద్యోగులందర్నీ ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టారు.

మే 6 సమ్మె వాయిదా

 మే 6 సమ్మె వాయిదా 


విశాఖపట్నం, పెన్ పవర్

స్టీల్ కార్మికులకు వేతన ఒప్పందం కోసం మే 6 న తలపెట్టిన సమ్మెను వాయిదా వేస్తున్నామని స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాలు తెలియజేశాయి ఈరోజు స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ డైరెక్టర్ పర్సనల్ కె.సి.దాస్ కలిసి ఆయన కార్యాలయంలో సమ్మె వాయిదా వేస్తున్న వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాలు ప్రతినిధులు మాట్లాడుతూ దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ప్రజలకు ఆక్సిజన్ అందిస్తున్న మహోన్నత కార్యక్రమాల్లో స్టీల్ కార్మికవర్గం ఉందని వారన్నారు. నూతన వేతన ఒప్పందం కోసం సమ్మె చేయవలసిన పరిస్థితులు ఉన్నప్పటికీ  ప్రజలను కాపాడాలన్న ఆశయానికి కట్టుబడి సమ్మెను వాయిదా వేస్తున్నామని వారు వివరించారు. ఇప్పటికైనా స్టీల్ యాజమాన్యం కార్మికులకు న్యాయంగా సంక్రమించాల్సిన వేతన ఒప్పందాన్ని చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో స్టీల్ గుర్తింపు యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు,అయోధ్య రామ్,వైటి దాస్, స్టీల్ ఎన్.జె.సి.ఏస్,సభ్యులు డి.ఆదినారాయణ,నాయకులు కె.సత్యనారాయణ, దొమ్మేటి అప్పారావు,పిట్ట రెడ్డి,కె.సత్య రావు,డి.సురేష్ బాబు,వి.రామ్ మోహన్ కుమార్,ఎన్.కృష్ణా రావు, వి.శ్రీనివాస్,వి.రామ్ కుమార్, మహాలక్ష్మి నాయుడు, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...