Followers

Showing posts with label HEALTH. Show all posts
Showing posts with label HEALTH. Show all posts

గిరిజన ‌ బంధువులను దూరం చేస్తున్న కరోనా

గిరిజన ‌ బంధువులను  దూరం చేస్తున్న కరోనా

చింతూరు,  పెన్ పవర్

గిరిజనుల్లో లో శుభకార్యాలు జరిగినా, అశుభ కార్యాలు జరిగినా ఒక పండుగ జరిగినా బంధువులందరూ పెద్ద ఎత్తున వేడుకకు రావడం జరుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో కరోనా కు గురై మృతి చెందిన గిరిజనుల కుటుంబాల వద్దకు బంధువులు ఎవరూ రాకపోవడం హృదయవిదారకమైన విషయం. చింతూరు మండలంలో ఇంచుమించు ప్రతి గ్రామానికి కరోనా సోకింది. ప్రతి గ్రామంలోనూ లాక్ డౌన్ విధించటం గ్రామంలో శానిటేషన్ చేయించటం సెక్రటరీల పని వంతు అయింది. 12:00 తర్వాత లాక్ డౌన్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం  ఆజ్ఞలు జారీ చేసింది. గత రాత్రి  మండలంలోని కొత్తపల్లి గ్రామంలో సోడి కాంతమ్మ (50) కరోనాతో చింతూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన కొద్దిసేపటికే మృతి చెందింది. కాంతమ్మ మృతదేహానికి  సంస్కారాలు చేయడానికి బంధువులు ఎవరూ రాలేదు. కాంతమ్మ మరిది కొడుకులు మరో వ్యక్తి అంతిమ సంస్కారాలు చేశారు. కరొన తీవ్రతరం కావడంతో ప్రతి ఒక్కరూ జంకుతున్నారు. అంతిమ సంస్కారాలు చేయడానికి తన సాంప్రదాయాన్ని కూడా పక్కన పెట్టాల్సి వస్తుంది. ఇది హృదయ విదారక దృశ్యం.


కరోనా పట్ల అవగాహన కల్పిస్తున్న సర్పంచ్

కరోనా పట్ల అవగాహన కల్పిస్తున్న సర్పంచ్ 

మెంటాడ, పెన్ పవర్

మెంటాడ మండలం, చింతలవలస గ్రామపంచాయతీ సర్పంచ్ కలిశెట్టి సూర్యనారాయణ, వైద్య ఆరోగ్య సిబ్బంది,  గ్రామ వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి గురువారం కరోనా పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇళ్లలో ఉండి పరిసరాల, పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని వారు గ్రామస్తులకు అవగాహన కల్పించారు. తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, చేతులు శుభ్రం చేసుకోవాలని,    ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాస్కులు ధరిస్తే మంచిదని వారు గ్రామస్తులకు సూచించారు. బహుదూరం పాటిస్తూ ప్రతి ఒక్కరూ ఇళ్లలో ఉండాలని, అవసరమైతే మాస్కులు ధరించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రము నిర్లక్ష్యం చేసిన కరోనా మహమ్మారి మనపై దాడి చేస్తుందని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


పాడేరు ఏరియా ఆసుపత్రిలో ఆక్సిజన్ వెంటిలేటర్లు ఏర్పాటు చేయాలి

 పాడేరు ఏరియా ఆసుపత్రిలో ఆక్సిజన్ వెంటిలేటర్లు ఏర్పాటు చేయాలి

 పాడేరు,  పెన్ పవర్

 పాడేరు ఏరియా ఆస్పత్రిలో ఆక్సిజన్ వెంటిలేటర్లు అపరేటర్లు సిబ్బందిని తక్షణమే నియమించాలని, ఆదివాసి జేఏసి జిల్లా కన్వీనర్ రామారావు దొర , కో-కన్వీనర్: కూడ రాధాకృష్ణ బూడిద సుమన్ ,ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గురువారం వారు మాట్లాడుతూ ఏజెన్సీ 11 మండలాలకు ఏకైక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి పాడేరు లోనే ఉంది. నిత్యం వందలాది మంది వైద్యం పొందుటకు పాడేరు జిల్లా ఆస్పత్రికి వస్తూ ఉంటారు. అలాంటి ఆసుపత్రిలో పాడేరులో వైద్యం చేయవలసిన పరిస్థితి ఉన్నప్పటికీ, ఇక్కడ సరైన సిబ్బంది లేక కెజిహెచ్ కు రిఫరల్ చేస్తూ ఉంటారు. దానివల్ల మార్గమధ్యంలోనే అనేక మంది చనిపోతున్నా ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఆక్సిజన్ వెంటిలేటర్ అందక ఒక వ్యక్తి పాడేరు ప్రభుత్వ ఆసుపత్రిలో గంట వ్యవధిలోనే మరణించిన పరిస్థితి ఉందని, తక్షణమే ఆదివాసీల ప్రాణాలు కాపాడుటకు ఆక్సిజన్ వెంటిలేటర్ సిబ్బందిని నియమించాలని, ఆదివాసి జేఏసి జిల్లా నాయకులు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.


ఏజెన్సీలో మొక్కుబడిగా నడుస్తున్న అంగన్ వాడి కేంద్రాలు.

ఏజెన్సీలో  మొక్కుబడిగా నడుస్తున్న అంగన్ వాడి కేంద్రాలు.


గిరిజన పిల్లలకు  కల్లిపోయిన గుడ్లు పంపిణీ. 

అంగన్వాడి కేంద్రాలపై  కొరవడిన పర్యవేక్షణ.

విశాఖపట్నం, పెన్ పవర్ 

 విశాఖ ఏజెన్సీలో అంగన్ వాడి కేంద్రాలు మొక్కుబడిగా నడుస్తున్నాయి. కేంద్రాల ద్వారా గిరిజన పిల్లలకు అందించాల్సిన పౌష్టికాహారం సక్రమంగా అందడం లేదని తల్లిదండ్రులు  ఆరోపిస్తున్నారు. ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో అంగన్ వాడి కేంద్రాలు తూతూ మంత్రంగా నడుస్తున్నాయి. గిరిజనులకు అందాల్సిన పౌష్టిక ఆహార పదార్థాలు  మొక్కుబడిగ  ఇస్తున్నారని ఆరోపణలు బాహటంగా వినిపిస్తున్నాయి.  గిరిజన చిన్నారులకు  గర్భిణీలు బాలింతలకు  నిబంధనల ప్రకారం అందించాల్సిన  కోడిగుడ్లు పాలు  గోధుమపిండి  చెనగ చెక్కులు  ఎండు ఖర్జూరం   బియ్యం నూనె పప్పులు పంపిణీ  సక్రమంగా లేదని  గిరిజన మహిళలు  గిరిజన సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీలోని 11 మండలాల్లో ఐసిడిఎస్ ప్రాజెక్టు కేంద్రాలు ఉన్నప్పటికీ ప్రాజెక్ట్ అధికారులు మాత్రం పట్టణాలనుంచి అడపాదడపా వచ్చి పోతున్నట్లు సమాచారం. అధికారి రాలేదని ఎవరైనా ప్రశ్నిస్తే మీటింగ్ కు వెళ్లారన్న  సమాధానం కార్యాలయ సిబ్బంది నుంచి వస్తున్నది.  ఇక  సిబ్బంది  విధులు చెప్పనవసరం లేదు.పర్యాటక కేంద్రం ఐన అరకు ఐసిడిఎస్ ప్రాజెక్టు ప్రత్యేక నిదర్శనం. అంగన్ వాడీ కేంద్రాల పనితీరు వర్ణనాతీతం. వర్రా గ్రామ అంగన్ వాడీ కేంద్రం లో గిరిజన చిన్నారులకు కుల్లిన కోడి గుడ్లుని కార్యకర్త పంపిణీ  చేసిందని తల్లులు ఆరోపించారు. పీఓ పట్టించుకోక పోవడం వలన కార్యకర్త లు ఇష్టానుసారం గా తెరుస్తున్నరని మండి పడుతున్నారు. కుల్లిన గుడ్లు పంపిణీ పై అరకు ఐసిడిఎస్ పీఓని వివరణ  కోరేందుకు ప్రయత్నించగా ఆమే అందుబాటులో లేరు.

విశాఖ కెజిహెచ్ క్యాంటీన్ వద్ద కానరాని కోవిడ్ నిబంధనలు.

 విశాఖ కెజిహెచ్ క్యాంటీన్ వద్ద కానరాని కోవిడ్ నిబంధనలు.

                                                                                      నగరంలో పిట్టల్లా రాలిపోతున్న కరోనా రోగులు

 పట్టించుకోని కేజిహెచ్ యాజమాన్యం.

విశాఖపట్నం,పెన్ పవర్,

విశాఖ నగరంలో పెద్దాస్పత్రి కేజీహెచ్ క్యాంటీన్ వద్ద కరోనా నిబంధనలు పాటించడంలేదు. క్యాంటీన్లో  భోజనం టీ టిఫిన్ కోసం ప్రజలు ఎగబడుతున్నారు. కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తూ ప్రాణాలను హరించి వేస్తుంటే  ప్రజలకు చీమ కుట్టినట్లయినా లేదని    ఆక్షేపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే బుధవారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత క్యాంటీన్ వద్ద జనం రద్దీ ఎక్కువయింది. తోపులాటలు ఒకరిపై ఒకరు ఢీ కొంటూ  ఆహార పదార్థాలకు ఎగబడ్డారు. జనం గుంపుగా  కుమ్ము లాడు  కుంటున్న   క్యాంటీన్ నిర్వాహకులు గాని  ఆస్పత్రి యాజమాన్యం గానీ  పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉంది. నగరంలో కరోనా కేసులు గంట గంటకు పెరిగిపోతున్నాయి మరోపక్క మరణాల సంఖ్య విస్మయాన్ని కలిగిస్తోంది. ఇంత జరుగుతున్నా  జనంలో మాత్రం చలనం లేదు. భయం కనిపించలేదు. కాంటీన్ లో  ఆసుపత్రికి వచ్చిన జనం కిక్కిరిసి పోవడం చూస్తుంటే  కరోనా మహమ్మారి  కోరలు చాస్తుందని  అంటున్నారు.


కేసులు పెరుగుతున్న దృష్ట్యా  ప్రభుత్వం మధ్యాహ్నం పన్నెండు తర్వాత  తెల్లవారు 6  వరకు  బుధవారం నుంచి కర్ఫ్యూ విధించినా విషయం తెలిసిందే. ఒకపక్క కర్ఫ్యూ అమలులో ఉన్నా కేజీహెచ్ ఆస్పత్రి వద్ద  మరియు క్యాంటీన్ లో  జనాలు నిబంధనలకు విరుద్ధంగా ఎగబడటం పై  ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండో దశ కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో  క్యాంటీన్ వద్ద జనం తోపులాటలు  అవసరమా అని ప్రత్యక్షంగా  సాక్షి అరకు వైయస్సార్ సిపి నాయకుడు   జీవన్ కుమార్   ఆగ్రహం వ్యక్తం చేశారు.  కేజీహెచ్ అధికారులు పోలీసులు చొరవ తీసుకోవాలని లేనిపక్షంలో భోజనం క్యాంటీన్   కరోనా క్యాంటీన్ గా  పోతుందని జీవన్ కుమార్ అన్నారు.

మేయర్ కు వినతి పత్రం సమర్పించిన విశాఖ సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్

 మేయర్ కు వినతి పత్రం సమర్పించిన విశాఖ సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్

మహారాణి పేట, పెన్ పవర్

గ్రేటర్ విశాఖపట్నం మహానగర కార్పొరేషన్ కి మేయర్ గా ఎన్నికైన సందర్భంగా ముందుగా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సచివాలయం వ్యవస్థలో పనిచేస్తున్న సచివాలయం సిబ్బంది, శానిటేషన్ వర్కర్లు, హెల్త్ వర్కర్లు, మిగిలిన అన్ని డిపార్ట్మెంట్ లు సిబ్బంది సి.ఎం జగన్ మోహన్ రెడ్డి  ఆశయ సాధన కోసం ఈ కరోనా సమయంలో ఎవరికి వాళ్ళు వారి శక్తి కొలది,అహర్నిశలు ప్రజా సంక్షేమము కోసం విధులు నిర్వహిస్తున్నారు.ఈ సమయంలో కరోనా నుండి రక్షణకు సచివాలయం సిబ్బంది, వాలంటీర్స్ కు సేఫ్టీ కిట్స్ అవసరం ఎంతైనా వుంది కనుక తమ పై దయవుంచి ఉద్యోగులు, కుటుంబాల ఆరోగ్య పరిరక్షణ కు మాస్క్ లు,గౌజులు,శానిటైజర్ లు, అందజేయవలసిందిగా కోరుతూ బుధవారం వినతి పత్రాన్ని సమర్పించారు విశాఖపట్నం సచివాలయం ఎంప్లాయిస్ ఫెడరేషన్. ఈ సందర్భంగా మేయర్ , కమిషనర్ తో మాట్లాడి  అందరికి వీలైనంత తొందరగా హెల్త్ కిట్లు అందించటం జరుగుతుంది అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైజాగ్ జిల్లా  ప్రెసిడెంట్ గణేష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ పి.వి.కిరణ్ కుమార్,జిల్లా కో ఆర్డినేటర్ ఈ.పవన్ కుమార్,షాహిద్, వెంకట్,అశోక్  వాలంటీర్ లు  నవీన్,కుశవంత్  తదితరులు పాల్గొన్నారు.

సింహాచల ఉద్యోగులకు వ్యాక్సినేషన్

 సింహాచల ఉద్యోగులకు వ్యాక్సినేషన్

విశాఖపట్నం సింహాచలం 


శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి ఆలయ ధర్మకర్త సంచయిత గజపతి సహా ఉద్యోగులందరికీ వ్యాక్సినేషన్. ఆలయ ధర్మకర్త సంచయిత గజపతి సలహామేరకు ఈ ఓ సూర్యకళ ఉద్యోగులందరికీ వ్యాక్సినేషన్ వేయించాలని ఆదేశించారు. దీంతో తొలిరోజు 150 మందికి వ్యాక్సినేషన్ వేయించారు ఆలయ ఉద్యోగులందర్నీ ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టారు.

వాలంటీర్లకు వందనం

  వాలంటీర్లకు వందనం


కరోనా సేవలలో మేము సైతం అంటున్న వాలంటీర్లు

కోవిడ్ సేవలలో మహిళా వాలంటీర్లు ముందంజ

మగవారికి దీటుగా సేవలకు సిద్ధం

ప్రజల మన్ననలు పొందుతున్న గ్రామ వాలంటీర్లు

గుమ్మలక్ష్మీపురం, పెన్ పవర్,


గుమ్మలక్ష్మీపురం పంచాయతీలో గ్రామ వాలంటీర్లు కోవిడ్ సేవల్లో నిమగ్నమయ్యారు. కోవిడ్ రెండవ దశ ప్రజల జీవితంపై తన పంజా విసురుతున్నప్పటికి వాలంటీర్లు మాత్రం కోవిడ్ కు భయపడకుండా వారి సేవలను ముమ్మరం చేసారు.గుమ్మలక్ష్మీపురం పంచాయతీ లోని పలువీధుల్లో కోవిడ్ బారిన పడిన బాధితులకు మేమున్నమే భరోసా కల్పిస్తూ ఆ బాధితుల నుండి వైరస్ వ్యాప్తి ఇతరులకు సోకకుండా జాగ్రత్తలు పాటిస్తు పారిశుద్యం పై దృష్టి సారిస్తున్నారు. కోవిడ్ బాధితుల పరిసర ప్రాంతాల్లో హైపో క్లోరైడ్ ద్రావనాలను పిచికారీ చేయడంతో పాటు డిస్ ఇన్ఫెక్షన్ పౌడర్లను జల్లుతున్నారు. గుమ్మలక్ష్మీపురం సచివాలయంలో  గ్రామ వాలంటీర్లు 25మంది తో పాటుగా 10మంది సచివాలయ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఈ 35మందిలో 19మంది మహిళలు 16మంది పురుషులు కోవిడ్ విధుల్లో పాల్గొంటున్నారు. ఈ పంచాయతీలోని మగవారితో సమానంగా మహిళ వాలంటీర్లు,ఉద్యోగులు కోవిడ్ సేవల్లో ఎండనక వాననక ముందంజలో ఉంటూ గ్రామ ప్రజల మన్ననలు పొందుతున్నారు.గ్రామంలో ఎక్కడ పాజిటివ్ కేసులు నమోదైన తక్షణమే అక్కడకు చేరుకుని పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతూ హైపో క్లోరైడ్ ద్రావనాలను పిచికారీ చేస్తూ కోవిడ్ వ్యాప్తిని అరికట్టే చర్యలను చేపడుతున్నారు.గుమ్మలక్ష్మీపురం గ్రామ సచివాలయంలో వాలంటీర్లతో పాటుగా సచివాలయ సిబ్బంది కూడా వారి విధులను ముగించుకుని వాలంటీర్లతో పాటుగా పారిశుధ్య కార్యక్రమాల్లో పాల్గొవడంతో గ్రామ ప్రజలు వారి యొక్క విధినిర్వహనలను కొనియాడుతున్నారు.గుమ్మలక్ష్మీపురం గ్రామ సర్పంచ్ బొత్తాడ. గౌరీశంకర్ సూచనల మేరకు మేమందరం మా విధులను నిర్వహించడానికి  సిద్ధంగా ఉన్నామని కరోనా కష్టకాలంలో మేము ఎంత సేవచేయడానికైన వెనుకాడమని కానీ గ్రామంలో ప్రజలందరూ సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులను ధరించి కరోనా వ్యాప్తిని అరికట్టడానికి సహకరించాలని కోరారు.

కోవిడ్ కష్ట కాలలో ప్రాణాలకు తెగించి వైద్య సేవలు అందిస్తున్నాం

 కోవిడ్ కష్ట కాలలో ప్రాణాలకు తెగించి వైద్య సేవలు అందిస్తున్నాం

మెంటాడ, పెన్ పవర్ 

ప్రాణాలకు తెగించి రేయింబవళ్ళు వైద్య సేవలు అందిస్తున్నామని, మాపై లేనిపోని ఆరోపణలు చేయడం విశాఖ ఎక్స్ప్రెస్ పత్రికల్లో డబ్బులు తీసుకున్నట్లు, కోవిడ్ టీకా డోసు తక్కువ చేసి ఇంజెక్షన్లు ఇస్తున్నట్లు వచ్చిన అవాస్త వార్తకు ఆమె స్పందించారు.   స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర లో కరోనా కష్ట కాలం లో అనేక సేవలు తనతో పాటు సిబ్బంది ఒకవైపు కోవిడ్ పరీక్షలు వాటి ఫలితాలు అందించడం,మరో వైపు వ్యాక్సినేషన్ చేయడం, అంతే కాకుండా ముఖ్యంగా అనేక సమస్యలు తో వచ్చే రోగులకు సేవలు అందించడం ,గర్భిణీ స్త్రీలు కు ప్రసవాలు జరపడం,కోవిడ్ లక్షణాలు ల తో టెస్ట్ లు చేసుకోకుండా వచ్చిన వారికి కూడా ప్రధమ చికిత్స అందించడం అనంతరం టెస్ట్ లు జరిపి పాజిటివ్  వస్తే రిఫర్ చేయడం లాంటి సేవలు అందిస్తున్నామని మాపై లేనిపోని ఆరోపణలు చేయడం వల్ల మెంటాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెడ్డ పేరు రావడంతో పాటు రోగులకు నమ్మకం పోతుందని ఆమె పేర్కొన్నారు. మాకు కుటుంబాలు ఉన్నాయి వారిని పక్కనబెట్టి ప్రజలకు సేవ చేయడానికి వైద్య వృత్తిని చేపట్టామని తెలిపారు. మీరు సహకరించక పోయినా పర్వాలేదు కానీ ప్రజల్లోకి తప్పుడు సమాచారం తీసుకెళ్తుందని ఆమె విజ్ఞప్తి చేశారు. ఏడాదిలో మెంటాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సేవలు గుర్తించి జిల్లా కలెక్టర్ చేతుల మీదగా ప్రశంస పత్రాలు, అవార్డులను అందుకున్న ఘనత మెంటాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఉందని ఆమె పేర్కొన్నారు.  తప్పు చేస్తే నిలదీయండి, అలాగే మేము తప్పు చేసినట్లు మీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయో చూపించాలని ఆమె పేర్కొన్నారు. విశాఖ ఎక్స్ప్రెస్ పత్రిక రిపోర్టర్ ఎవరో కూడా నాకు గాని, మా సిబ్బందికి గాని తెలియదని అటువంటి వ్యక్తి ఏ ఆధారాలతో వార్త రాశారు అని ఆమె ప్రశ్నించారు.

నిజంగా తప్పు చేస్తే ఎవరైనా వార్త రాయవచ్చని ఆమె పేర్కొన్నారు. మాతోపాటు మీడియా మిత్రులు సహాయం కూడా అవసరం ఎంతో ఉందని వారు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తే కరోనా ను విజయవంతం ఎదుర్కోగల మని ఆమె పేర్కొన్నారు. అనుమానితులు, పాజిటివ్ కేసులు మధ్య లో ఉండి సేవలు అందిస్తున్న సిబ్బంది సేవలు మరిచిపోలేం అని గ్రామస్తులు, పలువురు రోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు సహకారం అందిస్తే ఇంకా ఉత్తమ సేవలు అందిస్తాం అని తెలియచేశారు.  ఎవరికి వారే స్వచ్చంద లాక్ డౌన్ ఏర్పాటు చేసుకోవాలని ఆమె సూచించారు. ప్రజలు తీసుకున్న జాగ్రత్త లే వారి  కుటుంబాలకు శ్రీ రామ రక్ష అని అన్నారు. అందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎక్కువ శాతం బయటకు రాకుండా ఉండటానికి ప్రయత్నం చేయాలి అన్నారు. వైద్యాధికారులు, సిబ్బంది, గ్రామ ,మండల , జిల్లా అధికారులు విధులు ముగించుకొని ఇంటికి వెళ్లి కుటుంబాలు తో ఆనందంగా గడుపుతున్నారని అనుకుంటున్నా రేమో కానే కాదు. ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరు తమ ఇంటికి చేరి వేరేగానే ఉంటారు ఎందుకు అంటే తమకు కోవిడ్ సోకె ప్రమాదం ఎక్కువ కావున ఇంటికి వెళ్లి తమ బిడ్డలను కూడా ఎత్తుకునే పరిస్థితి లేదు అని ఆమె పేర్కొన్నారు. పక్క ఇంటిలో కోవిడ్ పేషంట్ ఉంటేనే మనం తట్టుకోలేని పరిస్థితి లో ఉన్నాం అని అన్నారు. ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న మా మీద లేనిపోని ఆరోపణలు చేయడం ఎంత వరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. కరోనా రెండో దశలో ఉన్నందున ప్రజలు అందరు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సహకారం అందిస్తారని ఆమె విజ్ఞప్తి చేశారు.

దివీస్ ల్యాబ్ నుండిఆక్సిజన్ సిలిండర్లు సహాయం

 దివీస్ ల్యాబ్ నుండి ఆక్సిజన్ సిలిండర్లు సహాయం

విశాఖపట్నం, పెన్ పవర్

జిల్లాలో కోవిడ్ ఉద్రిక్త పరిస్థితులను ఎదుర్కొనేందుకు చేపడుతున్న వివిధ జాగ్రత్తలలో భాగంగా దివీస్ ల్యాబ్ నుండి వివిధ ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరా నిమిత్తం జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ కు,దివీస్ ల్యాబ్, జనరల్ మేనేజర్ కోటీశ్వరరావు సుమారు 80 లక్షల రూపాయల చెక్కును అందజేశారు.సోమవారం కలెక్టరేట్ లోని ఆయన చాంబర్ లో అందించి,విశాఖ ఇండస్టియల్ గ్యాసెస్ నుండి వివిధ ఆసుపత్రులకు ఇప్పటికే 350 సిలిండర్లు సరఫరా చేసినట్లు తెలిపారు.  కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బలిటీ కింద ఈ ఆక్సిజన్ సిలిండర్లు ను సరఫరా చేస్తున్నట్లు వివరించారు.దివీస్ ల్యాబ్ లేటరీ నుండి సి.ఎస్.ఆర్. మేనేజర్ డి. సురేష్ కుమార్, పి.అశోక్ మరియు సీనియర్ లైజన్ కన్సల్టెంట్  వరహాలరెడ్డి పాల్గొన్నారు.

కరోనా పై గిరిజనులకు కళజాత మైకుల ద్వారా అవగాహన

 కరోనా పై గిరిజనులకు కళజాత మైకుల ద్వారా అవగాహన

పెన్ పవర్, విశాఖపట్నం

 విశాఖ ఏజెన్సీలో విజృంభిస్తున్న రెండో విడత  కరోనా  తీవ్రతపై  గిరిజనులకు కళాజాత  మైకుల ద్వారా అవగాహన  కల్పిస్తామని  పాడేరు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ( ఐ టి డి ఎ) ప్రాజెక్ట్ అధికారి వెంకటేశ్వర్ సలిజామల  అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ సెకెండ్ వేవ్  కరోనా మహమ్మారి గిరిజన ప్రాంతంలో  విలయ తాండవం ఆడుతుందని  దీనిని నియంత్రించేందుకు ప్రజా సహకారం అవసరం అన్నారు. ప్రజలు అధికారులు సమిష్టిగా కరోనా వైరస్ ని ఎదుర్కోవలసి ఉందన్నారు. గిరిజన ప్రాంతాల్లో కరోనా మహమ్మారి పై అవగాహన కల్పించేందుకు 11 మండలాల్లో కళాజాత లు  మైకులు ద్వారా ప్రచారం చేస్తామని గిరిజనులు  అవగాహనతో ఉండాలన్నారు. మాస్కులు భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని కోరారు. మండల కేంద్రాలకు శివారు గ్రామాలు మైళ్ల దూరంలో ఉండటం వల్ల వైద్య సేవలు సకాలంలో అందుకో లేరని గిరిజనులు కారోనా ఆ నిబంధనలు  తప్పక పాటించాలన్నారు. ఎవరికైనా అనారోగ్యం వస్తే ఆశ కార్యకర్త ఏఎన్ఎం లకు సమాచారం ఇవ్వాలని కోరారు.  ఏజెన్సీలో కొన్ని మండలాలు కర్ఫ్యూ అమలు చేస్తున్నారని  రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 5వ తేదీ నుండి రెండు వారాల పాటు అమలు  చేయమన్నా  లాక్ డౌన్ ను  పాటించాలన్నారు. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు  మాత్రమే దుకాణాలు తెరుచుకుంటాయి అని  ఆ సమయంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది అన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి తెల్లవారు ఐదు గంటల వరకు లాక్ డౌన్ కర్ఫ్యూ అమలు జరుగుతుందన్నారు. ప్రభుత్వం విధించిన నిబంధనలను అందరూ తప్పకుండా పాటించాలని ఎవరు ఉల్లంఘించిన చట్టపరమైన చర్యలకు బాధ్యులు అవుతారని  పీవో హెచ్చరించారు. వ్యాపారులు వర్తక సంఘాలు నిబంధనలకు సహకరించాలని వెంకటేశ్వర్ అన్నారు.

మేమూ మనుషులమే...

 మేమూ మనుషులమే...

విరామం లేకుండా విధులేలా....
రిమ్స్ స్టాఫ్ నర్సుల ఆందోళన...

పెన్ పవర్, శ్రీకాకుళం

విరామం లేకుండా త‌మ‌తో రిమ్స్ న‌ర్సింగ్ సూప‌రెండింట్  విధులు నిర్వ‌హించేలా త‌మ పై ఒత్తిడి తెస్తున్నార‌ని ఆరోపిస్తూ  ఆదివారం స‌ర్వ‌జ‌న ఆసుప‌త్రి ప్రాంగ‌ణంలో నిర‌స‌న కార్య‌క్ర‌మాన్ని స్టాప్ నర్సులు ఐక్యంగా నిర్వ‌హించారు.తామంతా కోవిడ్ విధులు నిర్వ‌హిస్తున్నామ‌ని, ఇప్ప‌టికే త‌మ‌లో కొంత‌మంది కోవిడ్ బారిన ప‌డి ఇబ్బందులు ప‌డుతున్నార‌ని స్టాప్ న‌ర్సులు వాపోయారు. త‌మ‌కు శెలవులు ఇవ్వ‌కుండా న‌ర్సింగ్ సూప‌రెండెంట్ ఇష్టానుసారంగా ప్ర‌వ‌ర్తిస్తున్న‌ట్లు విమ‌ర్శించారు.ఈ నేప‌ధ్యంలో తామంతా నిర‌స‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టాల్సి వ‌చ్చిందని వారంతా పేర్కొన్నారు.స్టాప్ న‌ర్సుల నిర‌స‌న కార్య‌క్ర‌మం ద‌గ్గ‌ర‌కు విచ్చేసిన జేసి సుమిత్ కుమార్‌కు త‌మ స‌మ‌స్య‌ల‌ను స్టాప్ న‌ర్సులు విన్న‌వించారు. సీనియ‌ర్ ఉద్యోగుల‌కు అయితే శెల‌వులు ఇస్తున్నార‌ని, కొత్త‌గా చేరిన త‌మ‌కు నిబంద‌న‌లు ప్ర‌కారం ఇవ్వాల్సిన శెలువులు కూడా ఇవ్వ‌డం లేద‌ని జేసి కి వివ‌రించారు. శెలవులు లేకుండా తామెలా ప‌నిచేయ‌గ‌ల‌మ‌ని, ఒత్తిడితో తీవ్రంగా బాద‌ప‌డుతున్న‌ట్లు చెప్పారు. స్పందించిన జేసి  స్టాప్ న‌ర్సుల‌తో మాట్లాడుతూ  శెలవులు లేకుండా ప‌నిచేయ‌డం ఏంట‌ని, డ్యూటీ దిగాక 5 రోజులు పాటు శెలవులు ఉండేలా  చేయాల‌ని, ఆ విధంగా విధులు నిర్వ‌హించాల‌ని,ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉద్యోగాలు చేయాల‌ని కోరారు. సెకెండ్ వేవ్ దృష్ట్యా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని జేసి సుమిత్ సూచించారు.రు. జేసి హామితో స్టాప్ న‌ర్సులు శాంతించి నిర‌స‌న కార్య‌క్ర‌మాన్ని విడిచి జేసికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.


మూర్రాట తో అమ్మవారికి పూజలు

 మూర్రాట తో అమ్మవారికి పూజలు

శ్రీకాకుళం, పెన్ పవర్

 స్థానిక పెదరెల్లి వీధి  శబరి యువ జనసేవ సంఘం యువకులు ఆదివారం  కరోనా వైరస్ మహమ్మారి  నుండి జిల్లాని  రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడాలని మహిళలతో కలిసి అమ్మవార్లకు మూర్రాట లతో పాదయాత్ర నిర్వహించారు. శ్రీ విజయదుర్గా అమ్మవారి కి మూర్రాటతో అమ్మవారికి చల్లదనం చేశారు. అక్కడి నుండి  ముత్యాలమ్మ, నూకాలమ్మ, మరిడమ్మా లకు మూర్రాటలతో  చల్లదనం చేసారు. ఈ సందర్బంగా జిల్లా నాల్గవ తరగతి అధ్యక్షులు అరుగుల తారకేశ్వరరావు మాట్లాడుతూ  దేశాన్ని  కరోనా మహమ్మారి కమ్మేస్తోందని, ఈ విపత్తు నుండి కాపడాలని  నగరం లొ ఉన్న  అమ్మవార్లకు మూర్రటలు సమర్పిచడం జరిగిందన్నారు. ప్రజలందరూ  భయానికి గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని  ఈ వైరస్ ను  ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.  విధిగా మాస్క్, శానిటైజర్ ని వాడాలని, భౌతిక దూరం పాటించాల అన్నారు. ప్రభుత్వం వారి సూచనలను తప్పని సరిగా పాటించాలని కోరారు.


కరోనా లో కాసుల కక్కుర్తి

 కరోనా లో కాసుల కక్కుర్తి

కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీ కి  అడ్డేది...

పెన్ పవర్, శ్రీకాకుళం

 సెకండ్ వెవ్ కరోనా మరణమృదంగం లో ధనిక, పేద, భేదం, లేకుండా  జనం పిట్టల్లా రాలిపోతున్నారు. కనీస వైద్య సదుపాయం అందించడం లో నిర్లక్షం ­వైఫల్యం కారణంగా ఆక్సిజన్ లభ్యత కొరత ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రిల దోపిడికి నిరుపేదల  ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు రిమ్స్ తో సహా పలు ఆసుపత్రులను కోవిడ్ ఆసుపత్రులగా ప్రకటించినా కరోనా బాధితులకు ఆ స్థాయి లో వైద్యం అండటంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అన్ని  ఆసుపత్రుల నుండి ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులలో   కోవిడ్ వైద్యం కోసం లక్షల్లో దోచేస్తున్నాయి. 

కోవిడ్ సోకిన రోగికి ఏ వైద్యం అందిస్తున్నారు. ఏ ఇంజక్షన్ ఇస్తున్నారో ఆ దేవుడికే తెలియాలి. ఎలాగైనా ప్రాణాలు నిలవాలని ఆసుపత్రికి తీసుకెళితే తిరిగి క్షేమంగా ఇంటికి వస్తామో రామో తెలియక  కోవిడ్ బాధిత   కుటుంబాలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ప్రభుత్వం  జిల్లా యంత్రాంగం ఇప్పటికైనా స్పందించి కోవిడ్ ఆసుపత్రుల్లో బెడ్లససంఖ్య పెంచి రోగులకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని ఆక్షిజన్ లభ్యత పెంచి కోవిడ్ రోగుల  ప్రాణాలు కాపాడాల్సిన.అవసరం ఎంతైనా ఉంది. లేదంటే కరోనా మరణ మృదoగానికి ప్రభుత్వం భాద్యత వహించాలి.


మంత్రి వనిత కు 2 వ విడత కోవిడ్ వ్యాక్సిన్

 మంత్రి వనిత కు  2 వ విడత కోవిడ్ వ్యాక్సిన్

తాడేపల్లిగూడెం, పెన్ పవర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత శనివారం  తాడేపల్లిగూడెంలో కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ లో భర్త డాక్టర్ తానేటి శ్రీనివాస్ తో 2 వ విడత కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవడం జరిగింది. మంత్రి వనిత మాట్లాడుతూ కరోన సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో అర్హత కలిగిన ప్రతీ ఒక్కరు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని తెలిపారు. ప్రతీ ఒక్కరు కరోన నియంత్రణ నిబంధనలు పాటిస్తూ, అవసరమైతే తప్ప మిగిలిన సమయాల్లో బయటకు రాకూడదని తెలిపారు. బయటకు వచ్చినప్పుడు మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించి, మనల్ని, మనకుటుంబాన్ని, మనసమాజాన్ని కరోన నుండి కాపాడుకోవాలని తెలియజేశారు.

రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు

 రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు 

 పెన్  పవర్, ఆత్రేయపురం 

 ఆత్రేయపురం   ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు శుక్రవారం 19 మందికి ట్రూ నాట్ పరీక్షలు నిర్వహించారు. వాటిలో ఈరోజు వచ్చిన రిపోర్టులో 19  గాను తొమ్మిది మంది పాజిటివ్ గా నిర్ధారణ అయినది.  ఈరోజు నిర్వహించిన రాపిడ్ యాంటిజెన్ కిడ్ పరీక్షల్లో పదిమందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినది.  మొత్తం 19 మందికి గాను పాజిటివ్గా ఆధారమైనది వీటిలో ఆత్రేయపురం 8 వాడపల్లి 3 పేరవరం 2 పులిదిండి 1 బొబ్బర్లంక 1 రాజవరం 1 వసంతవాడ 1 అంకంపాలెం 1 గా   నిర్ధారణ అయినవి.

ఇంటి వద్దే కోవిడ్ టెస్టులు నిర్వహించాలి

ఇంటి వద్దే కోవిడ్ టెస్టులు నిర్వహించాలి

అరకు, పెన్ పవర్

18 నుంచి 45 సంవత్సరాల వయసు కలిగిన వారికి మే 1వ తేదీ నుంచి వ్యాక్సిన్‌ అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి  తెలిసిందే.అయితే, వ్యాక్సిన్‌ తీసుకునేవారు తప్పనిసరిగా కొవిన్‌ వెబ్‌ పోర్టల్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాల్సిందేనని ఉన్నతాధికారులు తెలిపడం జరిగింది.అయితే దేశవ్యాప్తంగా ఒక్కసారిగా కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ‘వ్యాక్సిన్‌ అందరికీ అందుబాటులోకి తెచ్చే క్రమంలో ఒక్కసారిగా డిమాండ్‌ పెరుగుతున్న సందర్భంలో వ్యాక్సినేషన్‌ కేంద్రాల వద్ద జనాభా తాకిడి ఎక్కువవుతుందని  నేరుగా ఆయా కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్‌ తీసుకోవడానికి ఆదివాసి గిరిజన మారుమూల గ్రామాల ప్రజలకు చాలా ఇబ్బందికరంగా  ఉంటుందని వారికి ఫోను గాని సిగ్నల్ గాని అందుబాటులో ఉండదని 18 సంవత్సరాల వయసు దాటిన వారందరూ కొవిన్‌ పోర్టల్‌, ఆరోగ్యసేతు యాప్ ద్వారా నమోదు చేసుకోవడానికి చాలా ఇబ్బందికరంగా అసౌకర్యంగా ఉంటుందని దీనికోసం బయటకు వెళ్ళినప్పుడు సామాన్యులు కూడా కోవిడ్ బారిన పడే అవకాశం ఉందని కావున విధంగా కాకుండా డైరెక్ట్ గా వారి గ్రామాలకు వెళ్లి వారి ఇళ్ల వద్దే అందరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని తక్షణమే వారికి ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ ఇంటివద్దే ఇవ్వాలని ఏపీసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ మరియు అరకు పార్లమెంట్ డిస్ట్రిక్ట్ ఇంచార్జ్ పాచిపెంట శాంతకుమారి డిమాండ్ చేశారు.‘కొవాగ్జిన్‌’ టీకాను రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్కో డోసు రూ.600లకు, ప్రైవేటు ఆస్పత్రులకు ఒక డోసు టీకా రూ.1200 ధరకు ఇస్తుందని. ఎగుమతి ధర 15 డాలర్ల నుంచి 20 డాలర్ల (దాదాపు రూ.1100-1500) వరకూ ఉంటుందని. ఇలా ప్రభుత్వాలు కమర్షియల్ గా ప్రజల ప్రాణాలతో వ్యాపారాలు చేసుకోవడం మూర్ఖత్వమని ఇటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో సామాన్య గిరిజన ఆదివాసీ ప్రజలు తమ సొంత డబ్బులు పెట్టి వ్యాక్సిన్ వేయించుకోలేరని దీనిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే ఆ డబ్బులు భరించి సామాన్య ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ అందించాలని కోవిడ్ టెస్టులు వ్యాక్సిన్ ఉచిత పంపిణీ కై తక్షణమే ప్రజా ప్రతినిధులు అధికారులు స్పందించి తగు కార్యాచరణతో చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు. రిజిస్ట్రేషన్‌ కోసం https://selfregistration.cowin.gov.in/ ప్రజలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కోవిడ్ టెస్టులు చేయించుకుని వ్యాక్సిన్ తీసుకోవాలని ఆమె కోరారు.


ప్రజల ప్రాణాల పై దృష్టి పెట్టండి....

 ప్రజల ప్రాణాల పై దృష్టి పెట్టండి....

విజయనగరం, పెన్ పవర్

ప్రజల ప్రాణాల మీద దృష్టిపెట్టాలని,పథకాలమీదకాదని సన్మానాలు మరియు పార్టీ నాయకుల ఆడంబరాలు మీదకాదని జమ్ము ఆదినారాయణ పీసీసీ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభుత్వానికి హితవుచెప్పారు. శనివారం మీడియాతో అయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉప ముఖ్యమత్రులు మరియు మంత్రులు ఇంట్లో నుంచి కాలు బయటపెట్టకుండా పథకాలపేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా ధాటికి అనేకమంది విగతజీవులుగా మారుతున్నా తగిన చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారన్నారు. 

ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క,మందులు లేక,ఆక్సిజన్ కొరతతో అనేకమంది ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదన్నారు. మద్యం దుకాణాలు కరోనా వ్యాప్తి కేంద్రాలుగా మారుతున్నాయని. కనీస జాగ్రత్తలు కూడా తీసుకోవట్లేదని విమర్శించారు. వాక్సిన్ సెంటర్ల వద్ద కూడా సరైన ఏర్పాటు చెయ్యకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. రాష్ట్రంలో జిల్లాలో ఆక్సిజన్, బెడ్స్ లేక క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలు జీవిస్తున్నారని, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు అధికారులు ఇప్పటికైనా కళ్లుతెరిచి ప్రజా సమస్యలపై స్పందించాలని కోరారు. పధకాల సన్మానాలు కంటే ముందు ప్రజల ప్రాణాలు నిలబెట్టేలా వైద్య సౌకర్యాలు మెరుగుపర్చాలని జమ్ము డిమాండ్ చేసారు.


ఉద్యానవన కళాశాలలో క్వారైంటిన్ కేంద్రం ఏర్పాట్లు పరిశీలన

 ఉద్యానవన కళాశాలలో క్వారైంటిన్ కేంద్రం ఏర్పాట్లు పరిశీలన

మన ఇంటి నుండే మొదలవ్వాలి
మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆన్ని ఏర్పాట్లు
పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలి
ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి కూర్మనాథ్

గరుగుబిల్లి, పెన్ పవర్

కరోనా వైరస్ రాకముందుతో పోలిస్తే మన దైనందిన కార్యక్రమాలలో ఊహించని మార్పులు వచ్చాయి. కరోనా వైరస్ వ్యాప్తిని ఆరికట్టెందుకు మనలో మనం ఎన్నో మార్పులు చేసుకున్నాం ఇవి రాబోయే రోజుల్లోనూ కొనసాగించాలి అందుకు ముఖ్యంగా మన ఇంటి నుంచే మార్పు మొదలవ్వాలి అని ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్   పేర్కొన్నారు.   శనివారం ఐ.టి.డి.ఎ  ప్రాజెక్ట్ అధికారి గరుగుబిల్లి  మండలం ఉల్లిభద్ర ఉద్యానవన కళాశాలలో 350 పడకల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన కోవిడ్ క్వారైంటిన్ సెంటర్లో నిర్వహిస్తున్న పనులు పరిశీలించారు. కేంద్రంలో చేపడుతున్న పనుల పై అరా తీశారు. 

ప్రాజెక్ట్ అధికారి మాట్లాడుతూ కరోనా సోకినా ఆందోళన చెందొద్దని ధైర్యంగా ఉంటే కరోనా జయించడం సాధ్యం అన్నారు.  ఎక్కడ ఎటువంటి పొరపాట్లు జరుగ కుండా  ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కేంద్రంలో చికిత్స పొందుతున్న వారికి ఎటువంటి అసౌకర్యం కలుగ కుండా చూడాలని అన్నారు. 24 గంటలు  త్రాగునీరు, విద్యుత్ కు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి అన్నారు. కేంద్రంలో, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే కేంద్రం నిర్వహణకు సంబంధించి వైద్యులు, సిబ్బంది, మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. చికిత్స తీసుకుంటున్న వారికి సకాలంలో వైద్యం, నిర్దేశిత మెనూ ప్రకారం పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని ఆదేశించారు.   ఈ కార్యక్రమంలో గరుగుబిల్లి మండల తహశీల్దార్ రెవెన్యూ అధికారులు, సిబ్బంది, ఉద్యానవన కళాశాల ప్రిన్సిపాల్, సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్లు సిబ్బంది, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నేడే వంద పడకల కోవిడ్ కేర్ సెంటర్ ప్రారంభం

నేడే వంద పడకల కోవిడ్ కేర్ సెంటర్ ప్రారంభం 

పార్వతీపురం,  పెన్ పవర్

 పార్వతీపురం డివిజన్ పరిధిలో రోజు రోజుకు వందల సంఖ్యలో పెరిగిపోతున్న కరోనా కేసుల మూలంగా ఆసుపత్రులలో బెడ్లు ఖాళీ లేని పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బాధితులకు సకాలంలో వైద్యం అందించేందుకు గాను పార్వతీపురం డివిజన్లో "కోవిడ్ కేర్ సెంటర్" ఏర్పాటుకు ప్రభుత్వం ఇటీవల చర్యలు తీసుకున్న సందర్భంగాను ఈరోజు ఉదయం శాసన సభ్యులు అలజంగి జోగారావు, పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అర్ కూర్మనాధం, ఎంపీడీవో, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు, సిబ్బందితో కలిసి పార్వతీపురం మండలం నర్సిపురం  గ్రామం రెవెన్యూ పరిధిలో గల జనహిత డైట్ కళాశాలలో ఏర్పాటు చేసిన "వంద పడకల కోవిడ్ కేర్ సెంటర్" ను పరిశీలన చేయటం జరిగినది. కేర్ సెంటర్లో సమకూర్చిన మౌలిక సదుపాయాలు పరిశీలనలో భాగంగా వారితో కలసి శాసన సభ్యులు కేంద్రంలో పడకలను, మంచి నీటి సరఫరా, విద్యుత్ వంటి సదుపాయాలను పరిశీలన చేసి అందరికీ మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నాయా తదితర అంశాల పై అరా తీశారు, అలానే కేంద్రంలో  24 గంటలూ నీరు, విద్యుత్ అందుబాటులో ఉండేటట్లు చూడాలి అని ఆదేశించారు. 

ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు మాట్లాడుతూ క్వారైంటిన్ కేంద్రం తక్షణమే ప్రారంభించేందుకు చర్యలు తీసుకొవాలని ఇంకా అవసరమైన మౌలిక సదుపాయాలను త్వరితగతిన ఏర్పాటు చేయవలసిందిగా రెవెన్యూ అధికారులకు శాసన సభ్యులు సూచించారు. ఈ సందర్భంగా ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి స్పందిస్తూ ఆదివారం ఉదయానికి ఈ సెంటర్ కోవిడ్ సేవలకు అందుబాటులోకి రానుందని, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇక్కడ వంద పడకలను ఏర్పాటు చేయడం జరిగినది అని తెలియపరిచారు. ఈ పర్యటనలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్.కూర్మనాథ్, రెవెన్యూ అధికారులు, ఎంపీడీవో, పోలీస్ అధికారులు, సిబ్బంది, డైట్ కళాశాల కరస్పాండెంట్ పల్లి భాను ప్రకాష్, వైసిపి సీనియర్ నాయకులు ఎక్స్ వైస్ చైర్మన్ బి జయబాబు, నాయకులు ఆర్ వి ఎస్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...