Followers

Showing posts with label SPORTS. Show all posts
Showing posts with label SPORTS. Show all posts

మండల కేంద్రంలో జాలం సింగ్ అంతర్రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ప్రారంభం

 మండల కేంద్రంలో జాలం సింగ్ అంతర్రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ప్రారంభం

నార్నూర్,  పెన్ పవర్ 

 గురువారం మండల కేంద్రంలో జాలం సింగ్ స్మారకార్థం అంతర్రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఎంపీపీ కనక మోతుబయి మాజీ జెడ్పిటిసి బానోత్ జాలం సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు.ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ బానోత్ జాలం సింగ్ వివిధ హోదాల్లో మండల ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేసి ఆయన ఆశయాలను నెరవేర్చాలన్నారు. క్రీడా పోటీల తో స్నేహభావం ఏర్పడిన మానసిక ఉల్లాసం లభిస్తుందన్నారు. క్రీడా పోటీల్లో మంచి ప్రతిభను కనబరిచి రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించాలని అన్నారు. కార్యక్రమంలో తహేసిల్దార్ దుర్వా లక్ష్మీన్, సర్పంచ్ బానోత్ గజానంద్ నాయక్, ఉపసర్పంచ్  మహేందర్,  పిఎసిఎస్ వైస్ చైర్మన్  ఆడే సురేష్, ఎంపీటీసీ లు పరమేశ్వర్, రేణుక దిలీప్, కనక ప్రభాకర్, కరీం ఖాన్, బాలాజీ కాంబ్లే, బంజారా సేవా సంఘం నాయకులు శ్రీ రామ్ నాయక్, రామారావు, రితేష్ రాథోడ్, మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు చౌహాన్ హరి చంద్, సికిందర్ ,అమరేందర్ ,ప్రతాప్ సింగ్, బిక్షపతి తదితరులు ఉన్నారు.

అంతర్జాతీయ కరాటే పోటీలకు ఎంపికైన విద్యార్థులకు ప్రశంసలు

 అంతర్జాతీయ కరాటే పోటీలకు ఎంపికైన విద్యార్థులకు ప్రశంసలు

మందమర్రి, పెన్ పవర్ 

ఫిబ్రవరి 28న జరిగిన జాతీయ డ్రాగన్ కుంఫు కరాటే పోటిలో గెలుపొంది, గోవాలో జరుగు అంతర్జాతీయ కరాటే పోటీలకు ఎంపికైన మందమర్రి పట్టణానికి చెందిన విద్యార్థులు జి శివాని, డి హర్షిత లను  మందమర్రి పట్టణ ఎస్సై లింగంపల్లి భూమేష్, యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బండి సదానందం యాదవ్ లు విద్యార్థులను వేరువేరుగా ప్రశంసించి, వారిని అభినందించారు. ఈ సందర్భంగా గోవాలో జరిగే పోటీలో పాల్గొనేందుకు ప్రోత్సాహకంగా పట్టణ ఎస్సై భూమేష్ నాలుగు వేల రూపాయలు, బండి సదానందం 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ,చిన్న వయసులోనే అంతర్జాతీయ పోటీలు పాల్గొంటున్నా విద్యార్థులు భవిష్యత్తులో మరింతా పట్టుదలతో మరిన్ని లక్ష్యాలను సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్ వెంకటేష్, ఏం. గట్టయ్య, డి. రాజనర్సు, ఎం. రాజయ్య, హర్షవర్ధన్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

స్విమ్మింగ్ క్రీడలో

స్విమ్మింగ్ క్రీడలో

విజయనగరం,  పెన్ పవర్

 స్విమ్మింగ్ క్రీడలో కూడా జాతీయస్థాయిలో  విజయనగరానికి పేరు తీసుకు రావడం ఎంతైనా అభినందనీయమని విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఈ నెల 21, 22 తేదీలలో బెంగళూరులో జరిగిన జాతీయ పారా స్విమ్మింగ్ పోటీలలో విజయనగరానికి చెందిన దాసరి సూరజ్ సంపత్ కుమార్ సిల్వర్ మెడల్ సాధించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోలగట్ల ను వారి నివాసంలో బుధవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. స్విమ్మింగ్ లో మంచి ప్రతిభ కనబరచి, జాతీయస్థాయిలో సిల్వర్ మెడల్ సాధించడం పట్ల ఎమ్మెల్యే కోలగట్ల సూరజ్ సంపత్ ను, వారి తల్లిదండ్రులను అభినందించారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధించాలని ఎమ్మెల్యే కోలగట్ల అభిలషించారు. సూరజ్ సంపత్ కుమార్ కు అభినందించిన వారిలో సీఈవో నాగేశ్వరరావు, చీఫ్ కోచ్ వెంకటేశ్వరరావు, కార్పొరేటర్ భవి రెడ్డి సతీష్, రామేశ్వర పు రామారావు, స్విమ్మింగ్ కోచ్ నాయుడు, తల్లిదండ్రులు దాసరి కుమార్, శ్రీమతి నవ్య ఉన్నారు...

రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో గోల్డ్ మెడల్స్ సాధించిన మండలానికి చెందిన క్రీడా కారులు

 రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో గోల్డ్ మెడల్స్ సాధించిన మండలానికి చెందిన క్రీడా కారులు

పరవాడ,పెన్ పవర్ 

విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ ఇండోర్ స్టేడియం లో నిర్వహించిన రెండవ రాష్ట్ర స్థాయి కరాటే ఛాంపియన్ షిప్ లో మత్స్యకార గ్రామం ముత్యాలమ్మపాలెం లో కల బ్రుస్ లి మార్షల్ ఆర్ట్స్ అకాడమీ కి చెందిన క్రీడా కారులు టోర్నమెంట్ లో అత్యుత్తమ పోరాట పటిమ తో విజేతలు గా స్వర్ణ పతకాలు సాధించి  బెస్ట్ అకాడమీ ఆఫ్ ద చాంపియన్షిప్ ని కూడా దక్కించుకుని విజేతలు గా నిలిచారు.విజేతలు అయిన క్రీడా కారులు తమ స్వగ్రామం లో గ్రామ సర్పంచ్ అయిన సుజాత ముత్యాలు ను మర్యాద పూర్వకంగా కలిసి మెడల్స్ ను చూపించి టోర్నమెంట్ వివరాలు తెలియ జేశారు.అనంతరం సుజాత ముత్యాలు మాట్లాడుతూ అకాడమీ కి చెందిన 28 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొనగా 23 బంగారు పథకాలు & 8 రజత పతకాలు &14 కాంస్య పతకాలు సాధించి  మొత్తం 45 మెడల్స్  సాధించి ముత్యాలమ్మ పాలెం పేరునే కాకుండా పరవాడ మండల ప్రతిష్టను కూడా మారు మ్రోగేలా చేశారు అని అన్నారు.

ఈసందర్భంగా సుజాత ముత్యాలు ఈ క్రీడా కారుల ఘన విజయానికి దోహద పడిన మాజీ వైస్ ఎమ్.పి.పి.పరవాడ పంచాయతీ రాజ్ ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ మరియు డైరెక్టర్ ఆఫ్ బ్రోమ చింతకాయల ముత్యాలు,చైర్మన్ ఆఫ్  బ్రోమ మైలపిల్లి అప్పన్న ధనలక్ష్మి,అకాడమీ ఫౌండర్ మరియు చీఫ్ కోచ్ సిహాన్ అరిజిల్లి అప్పలరాజు, ప్రెసిడెంట్ సోంబాబు,అకాడమీ బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందించారు.ఈ కార్యక్రమంలో అకాడమీ డైరెక్టర్ చింతకాయ మ్యుత్యాలు,చైర్మన్ మైలిపిల్లి అప్పన్న ధనలక్మి ,ఎమ్.ఎస్.కె.డి.ఏ.వి.పి  ప్రెసిడెంట్ ఎర్రబాబు,జనరల్ సెక్రెటరీ అప్పలరాజు,అకాడమీ ప్రెసిడెంట్ సోంబాబు మరియు అకాడమీ ఫౌండర్ చీఫ్ కోచ్ షిహన్ అరిజిల్లి అప్పలరాజు, సీలంభం స్పెషలిస్ట్ సోంబాబు, జాయింట్ సెక్రటరీస్ శివ, శివాజి, అకాడమీ టీమ్ మేనేజర్ శైలజ పాల్గొన్నారు.

క్రికెట్ విజేతలకు బహుమతులు అందించిన మాజీ ఎమ్మెల్సీ

క్రికెట్ విజేతలకు బహుమతులు అందించిన మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

కన్నెపల్లి,  పెన్ పవర్

మంచిర్యాల జిల్లా  భీమిని కన్నేపల్లి  మండల స్థాయి క్రికెట్ పోటీలు కొక్కీరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో నిర్వహించారు. గత వారం రోజుల నుండి నిర్విరామంగా కొనసాగిన ఈ పోటీలో విజేతలుగా నిలిచిన జట్లకు మాజీ ఎమ్మెల్సీ కొక్కిరల ప్రేమ్ సాగర్ చేతుల మీదుగా బహుమతులు ఇవ్వడం జరిగింది.మొదటి బహుమతి కన్నేపల్లి గ్రామానికి చెందిన జట్టుకు 75000 రూపాయిల చెక్కుని రెండవ బహుమతి వెంకటపూర్ జట్టుకు 40000 రూపాయిలు ,మూడవ బహుమతిగా మడవెల్లి గ్రామ జట్టుకు,నాలుగోవ బహుమతి సర్జపూర్ జట్లకు 20000 రూపాయిల బహుమతి చెక్కులు ఇవ్వడం జరిగింది. తదనంతరం ప్రేమ్ సాగర్ మాట్లాడుతూ యువతలో క్రీడా స్ఫూర్తిని నింపెందికే ఈ పోటీలు నిర్వహించామని యువత మంచి ఆరోగ్యంతో , శరీర పట్టు సాధించాలన్నారు. ఈ కార్య్రమంలో భీమిని జెడ్పీటీసీ పోతు రాజుల గంగమ్మ, నెన్నేల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బ్రమ్మయ్య ,వేంకటపూర్ సర్పంచ్ దారిశెట్టి వెంకన్న ,టీపీసీసీ సోషల్ మీడియా బెల్లంపల్లి నియోకవర్గ కో ఆర్డనేటర్ ఎల్పుల రోహిత్ ,కేశవ్ కందుల బానేశ్,క్రికెట్ క్రీడా కారులు అభిమానులు తదిదరులు పాల్గొన్నారు.

జాతీయ స్థాయి నెట్ బాల్ పోటీలకు రావులపాలెం క్రీడాకారులు

 జాతీయ స్థాయి నెట్ బాల్ పోటీలకు రావులపాలెం క్రీడాకారులు

పెన్ పవర్,రావులపాలెం

రావులపాలెంకు చెందిన ముగ్గురు క్రీడాకారులు జాతీయ స్థాయి నెట్ బాల్ పోటీలకు ఎంపికయ్యారని నెట్ బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కర్రి అశోక్ రెడ్డి తెలిపారు. బాలుర విభాగంలో జి.సాయిబాబా, బాలికల విభాగంలో యం. దీప్తి, పి.సుజాత ఎంపిక కాగా సోమవారం వీరిని రావులపాలెం సి.ఆర్.సిలో జరిగిన కార్యక్రమంలో అశోక్ రెడ్డి తదితరులు అభినందించారు. కృష్ణా జిల్లా నిడమానూరులో జరిగిన 6వ సీనియర్ నెట్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీల్లో జిల్లా బాలికల జుట్టు ద్వితీయ స్థానం, బాలుర జుట్టు తృతీయ స్థానం సాధించాయన్నారు. ఈ పోటీల్లో ఈ ముగ్గురు క్రీడాకారులు ప్రతిభ కనబర్చి ఛత్తీస్ ఘడ్ లోని దుర్గ్ లో ఈనెల 24 నుంచి 27 వరకు జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్లకు ఎంపికయ్యారన్నారు. ఎంపికైన క్రీడాకారులను జిల్లా నెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కర్రి అశోక్ రెడ్డి, కార్యదర్శి పల్లా శ్రీనివాసరావు, ట్రెజరర్ యస్. చంటి, పిఈటిలు రామారావు, సల్మాన్ తదితరులు పాల్గొన్నారు.

వృద్ధులకోసమే ముఖ్యమంత్రి జగన్ తపన.. ఎమ్మెల్సీ సురేష్

వృద్ధులకోసమే ముఖ్యమంత్రి జగన్ తపన.. ఎమ్మెల్సీ సురేష్
విజయనగరం,పెన్ పవర్

 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరంతరం రాష్ట్రంలో ని వృద్ధులకి సహాయం చెయ్యడానికి నిరంతరం ఎంతో తపనతో ఆలోచనలు చేస్తున్నారని అందుకే దేశంలో ఎక్కడా లేనివిధంగా వృద్ధులకి అనేక సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో నే కొనసాగుతున్నాయని రాష్ట్ర ఎమ్మెల్సీ పెనుమత్స సూర్యానారాయణరాజు (సురేష్ బాబు)అన్నారు,జామి మండలం అట్టాడ గ్రామంలోని బి.ఎన్.ఆర్.అశ్రమం ప్రధమ వార్షికోత్సవం కార్యక్రమాలు ఆదివారం,సోమవారం భీశెట్టి ఫౌండేషన్ అధినేత భీశెట్టి బాబ్జి అధ్యక్షత న నిర్వహించారు ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ సురేశ్ మాట్లాడుతూ ఒక అశ్రమం లో సంవత్సరం పొడుగునా వృద్ధులకి బోజనాలను అందించడం చిన్న విషయం కాదని వృద్ధులను అదుకునేవారికి దేవుడి సహాయం ఉంటుందని తాను ఎమ్మెల్సీ గా ప్రమాణం చేసిన వెంటనే తన తండ్రి గారు స్వర్గీయ సాంబశివరాజు పేర ఇదే అశ్రమం లో భోజన వితరణ చేశామన్నారు, అశ్రమం కి తాను ఎప్పుడూ అండగా ఉంటానని అన్నారు,మరో అతిథి ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ జిల్లా స్థాయి మహిళ, పురుషులు  ఆహ్వానపు కబడ్డీ పోటీలను ప్రారంభించారు అనంతరం రఘువర్మ మాట్లాడుతూ జిల్లాలో గొప్ప కబడ్డీ క్రీడాకారులు ఉండేవారని రాష్ట్రంలో కబడ్డీ క్రీడకు విజయనగరం జిల్లా పెట్టింది పేరని ప్రస్తుతం జిల్లాలో ఉన్న ఎంతో మంది గురువులు కబడ్డీ క్రీడను బ్ర తికిస్తున్నారని వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు.
 విశాఖపట్నం జిల్లా ఎల్.ఎన్.నిర్మాణసంస్థ చైర్మన్ భీశెట్టి రామకృష్ణ(రాంకి) మాట్లాడుతూ జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో క్రీడాకారులు కి తగినంత ప్రోత్సహం అవసరమని ముఖ్యంగా గ్రామీణ క్రీడలకు ప్రభుత్వాలు ఆర్థిక సహకారం అందించాలని సూచించారు,జిల్లా స్థాయి ఆహ్వానపు కబడ్డీ పోటీలు హోరాహోరీగా జరగడం తనకి ఆనందంగా ఉందని క్రీడాకారులు గొప్ప ఆటను ప్రదర్శించారని కితాబిచ్చారు, ఈ ప్రారంభ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు,డాక్టర్ ఎం.వెంకటేశ్వరావు,సాయి గ్యాస్ ఏజెన్సీ అధినేత శ్రీనివాసరావు, స్థానిక సర్పంచ్ అమ్మన్న దొర, ఉప సర్పంచ్ బేపల సత్యం,రెడ్డిపల్లి సత్యారావు, షేక్ పీరు,తో పాటుగా గెలుపొందిన క్రీడాకారులకి బహుమతులు విశాఖపట్నం జిల్లా విద్యాశాఖ అధికారి లింగేశ్వర రెడ్డి, జిల్లా మెప్మా పోజక్టు అధికారి కోట్ల సుగుణాకరరావు,సమన్విత అధినేత గొలుగురు నాగిరెడ్డి, లగుడు రవికుమార్, గులిపల్లి జయపాల్, ఆళ్ల లోకేష్,జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు రంగారావు దొర, కమలనాబరావు,లక్ష్మణరావు, గోపాల్,తదితరులు పాల్గొన్నారు, ప్రధమ వార్షికోత్సవం సందర్భంగా వృద్ధులకు బట్టలు అందించారు కబడ్డీ పోటీలు తిలకించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు.

జాతీయ యోగా పోటీలకు ఎంపికైన శ్రీ బాలాజీ విద్యా మందిర్ విద్యార్థులు

 జాతీయ యోగా పోటీలకు ఎంపికైన  శ్రీ బాలాజీ విద్యా మందిర్ విద్యార్థులు

 ఆదిలాబాద్ ,  పెన్ పవర్

 తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ద మినిస్టర్ ఆఫ్ యూత్ అఫైర్ అండ్ స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈనెల 13 నుండి 16 వరకు  ఆన్లైన్లో రాష్ట్ర స్థాయి యోగా పోటీలను నిర్వహించగా ఈ పోటీల్లో ఆదిలాబాద్   జిల్లాకు చెందిన శ్రీ బాలాజీ విద్యా మందిర్ విద్యార్థులు జూనియర్ గర్ల్స్ విభాగంలో వాడ్కర్ వైష్ణవి నాలుగో స్థానంలో, జూనియర్ బాయ్స్ విభాగంలో వాడ్కర్ శ్రీనివాస్ మొదటి స్థానంలో విజయం సాధించారు. వీరు ఈనెల 24 నుండి 26 వరకు జరిగే ఆన్లైన్ జాతీయ స్థాయి యోగా పోటీలకు హాజరుకానున్నారు. అని  గురువారం స్కూల్ డైరెక్టర్ రంగినేని పవన్ రావు, ప్రిన్సిపాల్  కే. సచింద్రనాథ్,యోగా శిక్షకుడు సిహెచ్ చేతన్ వారిని అభినందిస్తూ తెలిపారు.

రాఘపతిరావు ట్రస్ట్ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలు

 రాఘపతిరావు ట్రస్ట్ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలు

తాండూర్, పెన్ పవర్

మంచిర్యాల జిల్లా  తాండూర్  కోక్కిరాల రాఘపతిరావు ట్రస్ట్ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను జిల్లా కాంగ్రెస్ డిసిసి అధ్యక్షురాలు కోక్కిరాల సురేఖ ప్రేంసాగర్ రావు, ప్రారంభించారు. బుధవారం మాదారం సింగరేణి మైదానంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ కు ముఖ్య అతిథిగా. హజరై క్రిడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు.ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఈసా,పార్టీ సినియార్ నాయకులు స్థానిక ఎంపిటిసి సూరం రవీందర్ రెడ్డి, నాయకులు కాపర్తి సుభాష్, మాజీ జేడ్పిటిసి బండి పోషం,మాజీ సింగిల్ విండో వైఎస్ చైర్మన్ దామోదర్ రెడ్డి,పుట్ట శ్రీనివాస్,క్రీడాకారులు, పాల్గొన్నారు.

రాఘపతిరావు ట్రస్ట్ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలు

 రాఘపతిరావు ట్రస్ట్ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలు

తాండూర్, పెన్ పవర్

మంచిర్యాల జిల్లా తాండూర్లో కోక్కిరాల రాఘపతిరావు ట్రస్ట్ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను జిల్లా కాంగ్రెస్ డిసిసి అధ్యక్షురాలు కోక్కిరాల సురేఖ ప్రేంసాగర్ రావు, ప్రారంభించారు. బుధవారం మాదారం సింగరేణి మైదానంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ కు ముఖ్య అతిథిగా. హజరై క్రిడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు.ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఈసా,పార్టీ సినియార్ నాయకులు స్థానిక ఎంపిటిసి సూరం రవీందర్ రెడ్డి, నాయకులు కాపర్తి సుభాష్, మాజీ జేడ్పిటిసి బండి పోషం,మాజీ సింగిల్ విండో వైఎస్ చైర్మన్ దామోదర్ రెడ్డి,పుట్ట శ్రీనివాస్,క్రీడాకారులు, పాల్గొన్నారు.

యువత కు క్రీడా సామగ్రి పంపిణీ

 యువత కు  క్రీడా సామగ్రి పంపిణీ

 నెన్నెల, పెన్ పవర్

మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం లో యువతకు సర్పంచ్ తోట సుజాత శ్రీనివాస్ క్రీడ సామగ్రిని అందించారు సర్పంచ్ మాట్లాడుతూ యువత  చదువుతో పాటు క్రీడల్లో కూడా ముందు ఉండాలని అన్నారు. చెడు వ్యసనాలకు గురికాకూడదని తెలిపారు. భవిష్యత్తులో యువవతకి  తమ సహాయసకారాలు ఉంటాయని  తెలిపారు.తమ వంతు సహాయం కింద క్రికెట్ సామగ్రి అందజేసినారు.ఈ కార్యక్రమానికి హాజరు అయిన  గ్రామ యువత హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు  తెలిపారు. ఈ కార్యక్రమంలో నెన్నెల గ్రామ ఉప సర్పంచ్ పుప్పాల అంజన్న  వార్డు సభ్యులు పాల్గొన్నారు.

క్రీడల్లో ఉన్నత శిఖరాలకు ఎదగాలి

 క్రీడల్లో ఉన్నత శిఖరాలకు ఎదగాలి

కాంగ్రేస్ పార్టీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ




లక్షెట్టిపెట్, పెన్ పవర్

క్రీడల్లో ఉన్నత శిఖరాలకు ఎదగాలని కాంగ్రెస్ పార్టీ డిసిసి అద్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు.పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మంగళవారం కొక్కిరాల రఘుపతిరావు మెమోరియల్ చారిటేబుల్ ట్రస్ట్ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఆమె ప్రారంభించారు.ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు సురేఖ మాట్లాడుతూ యువతను క్రీడల్లో ప్రోత్సహించాలని మండలాల వారిగా ఈ టోర్నమెంట్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.లక్షెట్టిపెట్ మండలంలో మొత్తం ముపైఅరు టీంలు పోటీలో పాల్గొంటున్నారని ప్రతిభ కనబర్చిన వాళ్లలో మొదటి బహుమతి డెభై ఐదువేలు, ద్వితీయ బహుమతి నలభై వేలు, మూడవ బహుమతి ఇరవై వేల రూపాయలు అందజేయడం జరుగుతుందన్నారు.పట్టుదలతో తారతమ్యాలు లేకుండా స్నేహపూర్వకంగా ఆడి విజయం సాదించాలని కోరారు.అనంతరం టాస్ వేసి పావురాలను గాలిలోకి వదిలి క్రికెట్ పోటీని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి అన్నంమంగ,జడ్పీటిసి ముత్తె సత్తయ్య,మున్సిపల్ ఫ్లోర్ మెంబర్ చెల్ల నాగభూషణం, కౌన్సిలర్లు చింత సువర్ణ,రాందేని వెంకటేష్,అరిఫ్, సత్తవ్వ,నాయకులు,చింత అశోక్,ఆయిల్లా విజయ్ కుమార్,పెండం శ్రీలత,ముజ్జు,నవాబ్, శ్రీదర్,శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.


జాతీయ స్థాయి కరాటే పోటీల్లో రాణించాలి

 జాతీయ స్థాయి కరాటే పోటీల్లో రాణించాలి

విజయనగరం,పెన్ పవర్ 

విజయనగరం పట్టణంలోని గిరీశం పాఠశాలలో చదువుతూ, కరాటేలో విశేష ప్రతిభ కనబర్చి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్ధులను జిల్లా ఎస్పీ బి. రాజకుమారి మార్చి 15, సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. పంజాబ్ లోని చండీఘర్ యూనివర్సిటీలో ఈ నెల 20 నుండి 26 వరకు జరగనున్న జాతీయ కరాటే చాంపియన్ పోటీలకు పట్టణంలోని గిరీశం పాఠశాల విద్యార్ధులు ఎం. రేవంత్ సుశీలాష్, వి. లక్ష్మీనారాయణలు ఎంపికైనట్లుగా గిరీశం పాఠశాల ప్రిన్సిపాల్ పి. ధనుంజయరావు తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా నుండి నలుగురు విద్యార్ధులు ఎంపిక కాగా, వారిలో ఇద్దరు తమ పాఠశాలకు చెందిన విద్యార్ధులు ఉన్నారన్నారు. ప్రస్తుతం కోచ్ పి. సాగర్ ఆధ్వర్యంలో కరాటే శిక్షణ పొందుతున్న విద్యార్ధులు జిల్లా ఎస్పీ బి.రాజకుమారిని జిల్లా పోలీసు కార్యాలయంలో కలిసారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బి. రాజకుమారి విద్యార్ధులు ఎం. రేవంత్ సుశీలాస్, వి. లక్ష్మీ నారాయణలను అభినందించి,శుభాకాంక్షలు తెలిపారు. చండీఘర్ లో ఈ నెల 20 నుండి జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో కూడా రాణించి, విజయనగరం జిల్లాకు మంచి పేరును తీసుకొని రావాలన్నారు. గతంలో కూడా శ్రీలంకలో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో కూడా ఈ విద్యార్థులు పాల్గొని, పతకాలను సాధించినట్లుగా పాఠశాల చైర్మన్ ఎ. ఏడుకొండలు జిల్లా ఎస్పీ బి. రాజకుమారికి తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సత్యన్నారాయణరావు, డిసిఆర్ బి సిఐ బి.వెంకటరావు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

కరాటే ఓవరాల్ చాంపియన్ ట్రోఫీ ఆవిష్కరణ

 కరాటే ఓవరాల్ చాంపియన్ ట్రోఫీ ఆవిష్కరణ

సామర్లకోట, పెన్ పవర్ 

సామర్లకోట పట్టణంలో ఏప్రిల్ 18వ తేదీన నిర్వహించనున్న కరాటే సౌత్ జోన్ గోర్నంమెంటుకు చెందిన ఓవరాల్ చాంపియన్ షిప్ ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని స్థానిక లయన్స్ కలబ్ భవనంలో శనివారం నిర్వహించారు. కరాటే పాఠశాల కోచ్ ది శంకర్రావు ఆధ్వర్యంలో ఇటీవల కరాటే బెల్ట్ గ్రేడింగు పరీక్షలు రాజమహేంద్రవరంలో నిర్వహించగా దానిలో ప్రతిభను కనపరిచిన 34 మంది విద్యార్థులకు ప్రమోషన్ బెల్టులు, సర్టిఫికేట్ల పంపిణీతో ఏప్రిల్ నెలలో స్థానిక గాంధీబొమ్మ సెంటర్లోని రైతు భవనంలో నిర్వహించే సౌత్ జోన్ కరాటే టర్నమెటు ఓవరాల్ చాంపియన్ షిప్ ట్రఫీ ఆవష్కరణ కార్యక్రమాలను నిర్వహించారు. దానిలో ముఖ్య అతిధులుగా లయన్స్ క్లబ్ జిల్లాచైర్ పర్సన్ ఈదల ఈశ్వరకుమార్, లయన్స్ రీజియన్ చైర్మన్ చిత్తులూరి వీర్రాజు (రాజా)లు పాల్గొని ట్రఫీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుతో పాటు విద్యార్థులకు క్రీడలు కూడా అవసరమన్నారు. శారీరక, మానసిక వికాశంతో పాటు ప్రస్తుతం కరాటే క్రీడను ఒలింపిక్ లో కూడా చేర్చినందున దానిలో ప్రతిభను కనపరిచిన విద్యార్థులకు 5 శాతం రిజర్వేషన్లు ప్రభుత్వం కల్పిస్తున్నట్టు చెప్పారు. దానికి ప్రతి విద్యార్థి ప్రయత్నించాలన్నారు. అలాగే ప్రస్తుతం ఆవిష్కరిస్తున్న ఓవరాల్ చాంపియన్ షిప్ టీవీని సామర్లకోట విద్యార్థులు కైవశం చేసుకోవాలన్నారు. కాగా ఈ సందరంగా కోచ్ శంకర్ మాట్లాడుతూ ఏప్రిల్ 18న నిర్వహించే సౌతజోన్ గోరనమెంటులో 6 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు, కోచ్లు విచ్చేస్తున్నట్టు చెప్పారు. అలాగే గత ఆదివారం రాజమహేంద్రవరంలో నిర్వహించిన కలర్ బెల్ట్ గ్రేడింగు పరీక్షలో సుమారు వందమంది విద్యార్ధులను, సామర్లకోట, కాకినాడల నుంచి తీసుకెళ్ళగా వారిలో సామర్లకోట విద్యార్థులు 34 మంది అత్యంత ప్రతిభను కనపరచి పెద్దగ్రడ్ బెల్టులు, సాధించినట్టు ఆయన చెప్పారు ఈ సందర్భంగా తొలుత విద్యార్థులకు వారు సాధించిన బెల్టులు, సర్టిఫికెట్లను అందించి లయన్స్ నాయకులు అభినందించారు. అనంతరం టోర్నమెంటు ఓవరాల్ ఛాంపియన్ షిప్ ట్రోఫీని వారు ఆవిష్కరించి ప్రదర్శించారు.ఈ కార్యక్రమంలో ఇంకా లయన్స్ పాస్ట్ ప్రెసిడెంట్ గుండు శంకర్రావు, టోర్నమెంటు కమిటీ సభ్యులు బి రామారావు, బి సత్యనారాయణ, ఎం లోవరాజు, టివి రమణ, అధిక సంఖ్యలో కరాటే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

14న జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం

 14న జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం

మంచిర్యాల, పెన్ పవర్

మంచిర్యాల జిల్లాలో కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీ నుండి మంచిర్యాల జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం కానున్నట్లు ఏఐసిసి సభ్యులు మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు శుక్రవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ హెచ్సఎ అధ్యక్షులు అజారుద్దీన్, టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎల్సి నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రి డి. శ్రీధర్ బాబు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, సీతక్క హాజరుకానున్నారని ఆయన వివరించారు. టోర్నమెంట్లో పాల్గొనే అన్ని జట్లుకు చెందిన క్రీడాకారులు యూనిఫామ్ ధరించి మధ్యాహ్నం 3 గంటలకు బాయ్స్ హైస్కూల్ గ్రౌండ్ కు హాజరుకావాలని ఆయన సూచించారు. పోటీల ప్రారంభంలో భాగంగా డ్రా జ్యోతిపజ్వల, టర్చ్ మార్చ, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, టిపిసిసి అధికార ప్రతినిధి చిట్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

శ్రీసిటీలో ప్రారంభ మైన గోల్ఫ్ క్రీడాలు

 శ్రీసిటీలో ప్రారంభ మైన  గోల్ఫ్ క్రీడాలు

- లాంఛనంగా ప్రారంభించిన జపాన్ కాన్సుల్ జనరల్ 




 శ్రీసిటీ, పెన్ పవర్


ఆధునిక సౌకర్యాలతో కూడిన నూతన గోల్ఫ్ క్రీడా మైదానం శ్రీసిటీలో ప్రారంభమైంది. చెన్నైలోని జపాన్ కాన్సుల్ జనరల్ టగా మసయుకి శనివారం సాయంత్రం దీనిని ప్రారంభించగా, ఇండియన్ గోల్ఫ్ యూనియన్ కోశాధికారి ఈశ్వర్ ఆచంత, ఎపి ప్రభుత్వ ప్రధాన సలహాదారు వీరారెడ్డి, శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, పలు పరిశ్రమల సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ ఇందులో పాల్గొన్నారు. కాన్సుల్ జనరల్ లాంఛనంగా బంతిని కొట్టి గోల్ఫ్ క్రీడా మైదానం ప్రారంభమైనట్లు ప్రకటించారు.  


అతిథులకు సాదర స్వాగతం పలికిన రవీంద్ర సన్నారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, క్రీడా వినోద వసతుల రూపకల్పనలో భాగంగా నేడు గోల్ఫ్ క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేశామని, భవిష్యత్తులో మరిన్ని వసతులను అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. శ్రీసిటీలోని విదేశీ ప్రతినిధులు, పరిశ్రమల ఉద్యోగులు, శ్రీసిటీ పరిధిలోని కళాశాలలు, విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఈ గోల్ఫ్ క్రీడను ఆడడం ద్వారా నైపుణ్యాన్ని పెంచుకోవాలని, మానసిక ఉల్లాసాన్ని పొందాలని ఆయన కోరారు. 


టగా మసయుకి మాట్లాడుతూ, జపాన్ లో ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ క్రీడను ఇక్కడ జపాన్ పరిశ్రమల ప్రతినిధులకు చేరువ చేసినందుకు శ్రీసిటీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. వ్యాపార నగరంలో క్రీడా సదుపాయాలు నెలకొల్పడం మంచి పరిణామమన్న ఆయన, శ్రీసిటీలో సామాజిక వసతుల అభివృద్ధి విషయంలో యాజమాన్య కృషిని అభినందించారు.  


క్రీడలను ప్రోత్సాహం కోసం ప్రవేశపెట్టబడిన కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలను ఈశ్వర్ ఆచంత ప్రస్తావిస్తూ, ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ప్రజలు తమ క్రీడా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కోరారు. శ్రీసిటీ కృషిని అభినందిస్తూ, భవిష్యత్తులో దేశంలోని అత్యుత్తమ గోల్ఫ్ మైదానాలలో ఒకటిగా ఇది మారుతుందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 





ఏపీ ప్రభుత్వ సలహాదారు వీరారెడ్డి మాట్లాడుతూ, కేవలం పరిశ్రమలే కాకుండా క్రీడలు, వినోదంతో సహా అన్ని వసతులతో ఓ మంచి నివాస నగరంగా శ్రీసిటీని అభివృద్ధి చేస్తున్నందుకు శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డిని అభినందించారు. 


గోల్ఫ్ క్రీడా మైదానం ఏర్పాటుకు శ్రీసిటీ కన్సల్టెంట్ ఎస్ పి శర్మ సమన్వయ భాద్యులుగా వ్యవహరించారు. ఆహ్లాదకర వాతావరణంలో 10 ఎకరాలలో విస్తరించి ఉన్న శ్రీసిటీ గోల్ఫ్ డ్రైవింగ్ రేంజ్‌ (గోల్డ్ క్రీడా మైదానం) లో గోల్ఫ్ క్రీడాకారులు తమ క్రీడా నైపుణ్యాలను మెరుగుపరచుకోడానికి, కొత్తవారు ప్రాథమిక శిక్షణ పొందడానికి  అవకాశం ఉంటుంది. అనుభవం కలిగిన గోల్ఫ్ కోచ్ లు అందుబాటులో వుండి శిక్షణ ఇస్తారు.

రైఫిల్ షూటింగ్ లో సత్తా చాటిన స్వరూప్

రైఫిల్ షూటింగ్ లో సత్తా చాటిన స్వరూప్



రాష్ట్ర స్థాయిలో రెండో స్థానంతో సిల్వర్ మెడల్ కైవసం

 పెన్ పవర్, కరప

రైఫిల్ షూటింగ్ లో కరపమండలం నడకుదురు గ్రామానికి చెందిన ముమ్మిడి సాయిరాం స్వరూప్ సత్తా చాటి సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ లో గత నెల 24 నుంచి ఈ నెల 7వ తేదీ వరకు 21వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైఫిల్ షూటింగ్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో తణుకు పట్టణానికి చెందిన ఎం.రామరాజు కు బంగారు పతకం లభించగా తనకు సిల్వర్ మెడల్ లభించినట్టు స్వరూప్ తెలిపారు. ముమ్మిడి శివసాయిరాంస్వరూప్ ఎంసీఏ  చదివి ప్రస్తుతం వ్యాపారం చేస్తున్నారు. రైఫిల్ షూటింగ్ పట్ల ఉన్న అభిరుచితో ఆంధ్రప్రదేశ్ లో 2017లో సభ్యత్వం తీసుకుని ముమ్మర సాధన చేసినట్టు అతను తెలిపారు. ఈ ఏడాది పోటీల్లో పాల్గొని మొదటిసారే రెండో స్థానంలో నిలవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. రైఫిల్ షూటింగ్ లో సత్తా చాటిన స్వరూప్ ను  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఫోన్ లో అభినందించారు. నడకుదురు మాజీ ఎంపీటీసీ సభ్యుడు, వైసీపీ నాయకుడు జవ్వాది సతీష్ , ఇతర గ్రామ పెద్దలు స్వరూప్ ని అభినందించారు.

జాతీయ సీనియర్ సాఫ్టబాల్ జట్టు సాయి సిందూజ ఎంపిక

 జాతీయ సీనియర్ సాఫ్టబాల్ జట్టు సాయి సిందూజ ఎంపిక

పెన్ పవర్, కరప 

అంతర్జాతీయ సాఫ్టబాల్ పోటీలలో ప్రతిభ చూపిన కరప మండలం పెద్దాపురప్పాడు బిరుదా సూర్యనారాయణ (ఫకిర్రావు) జడ్పీ ఉన్నతపాఠశాలకు  చెందిన విద్యార్థిని సాయిసిందూజ (10వ తరగతి) జాతీయ సీనియర్ సాఫ్టబాల్ జట్టుకు ఎంపికైనది. అనంతపురం జిల్లా ఆర్ టిడి క్రీడామైదానంలో ఫిబ్రవరి  26 నుండి ఈ నెల 2 వరకు జరిగిన 7వ సీనియర్ అంతరాష్ట్ర సాఫ్టబాల్ పోటీలలో జిల్లా జట్టు తరపున ప్రతినిధ్యం వహించిన సిందూజ విశేష ప్రతిభ కనబరచినట్టు సాఫ్టబాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి, ప్రసాద్ శుక్రవారం తెలిపారు. అంతరాష్ట్ర పోటీలలో నెల్లూరూపై 0-2, ప్రకాశంపై 2-9, వైజాగ్ పై 0-10 రన్సలో జిల్లా జట్టు విజయమ్ సాధించటానికి సాయి సిందూజ తన పిచ్చింగ్ తో అత్యధిక ఔట్స్, అత్యధిక స్ట్రైకరేట్ తో జాతీయజట్టు లో స్థానమ్ సంపాదించినట్టు పి డి తెలిపారు. ఈ నెల 9వ తెధి నుండి 19వ తేదీ వరకు అనంతపురం ఆర్ టి డి క్రీడామైదానంలో జరిగే శిక్షణ కార్యక్రమంలో పాల్గొటుందన్నారు. ఈ నెల 20 నుండి 24వ తేదీ వరకు రాజస్థాన్ లోని భరతపూర్ లో జరిగె 43వ జాతీయస్తాయి సోదట్బాల్ పోటీలలో పాల్గొంటుందని పిడి ప్రసాద్ తెలిపారు. జాతీయజట్టుకు ఎంపికైన క్రీడాకారిణి సాయిసింధుజ, శిక్షణ ఇచ్చిన పిడి ప్రసాద్ తెలిపారు.వారిని సర్పంచ్ బి.సరస్వతి, తల్లిదండ్రులకు కమిటీ చైర్మన్ రంగారావులు అభినందించారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...