Followers

పార్వతీపురం వైసీపీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ గారు

 పార్వతీపురం వైసీపీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ గారు



పార్వతిపురం,పెన్ పవర్ 

పార్వతిపురం నియోజకవర్గ కేంద్రంలో గల ప్రధాన కార్యాలయానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ శాఖ మాత్యులు బొత్స సత్యనారాయణ గారు, విజయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ బెల్లాన చంద్రశేఖర్ గారు, విజయనగరం జిల్లా ఏమ్ఎల్సి పెనుమత్స సురేష్ బాబు మరియు విజయనగరం జిల్లా వైసీపీ సీపీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గారు, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్ గారు, విజయనగరం జిల్లా డిసిసిబి చైర్మన్ మరిశర్ల తులసి తదితర ముఖ్య అతిదిలును గౌరవ ఎమ్మెల్యే శ్రీ అలజంగి జోగారావు గారు సాదరంగా ఆహ్వానించడం జరిగినది. అందరూ కార్యాలయంలో కాసేపు ముచ్చటించి త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల గురించి చర్చించి అన్ని వార్డుల్లో వైసీపీ అభ్యర్ధులను అఖండ విజయం చేకురేవిదంగా కృషి చేయాలని పార్టీ ముఖ్య నాయకులుకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుతో పాటుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్, వైసీపీ ముఖ్య నాయకులు, కౌన్సిలర్ స్థానాలకు పోటీ చేయు అభ్యర్థులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ల్యాబ్ టెక్నిషన్ పోస్ట్ భర్తీ చేయాలి...

ల్యాబ్ టెక్నిషన్ పోస్ట్ భర్తీ చేయాలి...

గిరిజన సంఘం డిమాండ్

 పెన్ పవర్, విశాఖపట్నం

కొత్త కోట ప్రదమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నిషన్ పోస్ట్ ను తక్షణం భర్తీ చేయాలని గిరిజన సంఘం డిమాండ్ చేసింది. శనివారం ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం 5వ షెడ్యూల్   సాధన కమిటీ ఆధ్వర్యంలో కొత్తకోట పి.హెచ్.సి వద్దా ధర్నా జరిగింది. విశాఖపట్నం జిల్లా రావికమతం మండలం కొత్తకోట పీహెచ్ సీ  పరిధిలో 10 పంచాయతీలు, 28 గిరిజన గ్రామాలు 30 వేల జనాభా కు వైద్య సేవలు అందించడం కోసం ప్రత్యేకంగా కొత్తకోట పి.హెచ్.సి ఏర్పాటు చేశారు.వైద్యం కోసం లక్షల రూపాయలు ఖర్చుపెడుతుంది   ప్రభుత్వం.  వాస్తవానికి ప్రతి బుధవారం గర్భిణీ స్త్రీలకు పరీక్షలు చేయవలసి ఉంది,  అలాగే ప్రతి శనివారం వందలాది మంది ప్రజలు వైద్యం కోసం కొత్తకోట పి.హెచ్.సి ఏర్పాటు చేశారు, ఇక ల్యాబ్ విషయం కు   వస్తే ల్యాబ్ టెక్నీషియన్ లేరని, వైద్యం చేసి పంపిస్తున్నారని,పరీక్షలు మాత్రం ప్రైవేట్ లాబ్ లలో  చేయంచుకోమని  అలా చేసుకుంటే చేయాలంటే వందల రూపాయలు ఖర్చవుతుందని,ఈ పి హెచ్ సి.ప్రధానంగా టి అర్జాపురం. చీమలపాడు గ్రామాల్లో... గిరిజనులు మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలు బారిన పడుతున్నారు. ల్యాబ్ టెక్నీషియన్ లేకపోవడంతో గిరిజనుల వద్ద డబ్బు లేకపోవడంతో. వస్తువులు తాకట్టు పెట్టుకుని ప్రైవేట్ ల్యాబ్ టెక్నీషియన్ వద్ద పరీక్షలు నిర్ణయించుకుంటున్నారు.  వాస్తవానికి ఆరోగ్య కమిటీ ఎంపీడీవో అధ్యక్షతన ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశాలు జరగాలి. ఈ సమావేశంలో హాస్పిటల్ యొక్క స్టాప్. ఇటువంటి సౌకర్యం ఉండాలని చర్చించి ఆస్పత్రి అభివృద్ధికి నిధులు ఖర్చు పెట్టాలి. నేటికీ మూడు సంవత్సరాలు అవుతున్న ప్రత్యేక అధికారులు పరిపాలనలో ఈ ఆస్పిటల్ అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పేషెంట్లు మంచినీరు తాగాలంటే  గ్లాసులు కూడా లేవు. తక్షణమే జిల్లా వైద్య అధికారులు స్పందించి రెండు వారాల్లోగా ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ చేయకపోతే భారీ ఎత్తున ఆందోళన చేస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం. ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు కె గోవిందరావు గిరిజనసంఘం మండల అధ్యక్షులు సిహెచ్ శంకర్రావు. సిహెచ్ రమేష్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సిహెచ్ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రభూమి ఉద్యోగులకు అండగా ఉంటాం:టీయూడబ్ల్యూజే..

 ఆంధ్రభూమి ఉద్యోగులకు అండగా ఉంటాం:టీయూడబ్ల్యూజే..

హైదరాబాదు,పెన్ పవర్


ఆంధ్రభూమి పత్రిక ఉద్యోగులు చేస్తున్న న్యాయ పోరాటానికి తమ సంఘం సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ స్పష్టం చేశారు. 

శనివారం నాడు బషీర్ బాగ్ లోని టీయూడబ్ల్యూజే కేంద్ర కార్యాలయంలో ఆంధ్రభూమి ఉద్యోగులు ఆయనను కలిసి మద్దతును కోరిన సందర్భంలో వారినుద్దేశించి మాట్లాడారు.

కోవిడ్ సాకుతో ఏడాది క్రితం ప్రచురణ నిలిపివేసి, ప్రస్తుతం శాశ్వతంగా మూసివేసేందుకు కుట్రలు చేస్తున్న ఆంధ్రభూమి యాజమాన్యానికి తగిన రీతిలో గుణపాఠం చెప్పకతప్పదని విరాహత్ హెచ్చరించారు.. ఏడాది నుండి ఉద్యోగులకు జీతాలు చెల్లించక పోవడంతో మానసిక ఆందోళన చెందుతున్నారని, ఆర్థిక కష్టాలతో ఇప్పటికే నలుగురు ఉద్యోగులు మృతి చెందడం విచారకరమన్నారు. ఆంధ్రభూమి రాజమండ్రి ఎడిషన్ ఉద్యోగి రాం చందర్ రాజు, అతని భార్య ఆర్థిక కష్టాలతో అనారోగ్యానికి గురై చికిత్స పొందలేక ప్రాణం కోల్పోయిన దుర్ఘటనను ఆయన గుర్తుచేశారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో సంస్థను నమ్ముకొని ప్రత్యక్షంగా, పరోక్షంగా 5వేల మంది జీవనం కొనసాగిస్తున్నారని, ఆ పత్రిక యాజమాన్య వైఖరితో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు విరాహత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాది కాలంగా ఉద్యోగులకు బకాయి ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని,  క్రానికల్, భూమి ఉద్యోగుల మధ్య వ్యత్యాసం చూపవద్దని, క్రానికల్ ఉద్యోగులకు వర్తింపజేస్తున్న అన్నీ సౌకర్యాలు ఆంధ్రభూమి ఉద్యోగులకు కల్పించాలని, ప్రావిడెంట్ ఫండ్ అప్డేట్ చేయాలని, ఆదాయపు పన్నులు చెల్లించాలని, విశ్రాంత ఉద్యోగులకు గ్రాట్యుటీ, వెజ్ బోర్డ్ ఏరియర్స్, బోనస్, ఎల్.టి.సి, లీవ్ ఎన్క్యాష్మెంట్ చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. పై డిమాండ్లను వారం రోజుల్లో పరిష్కరించని పక్షంలో ప్రత్యక్ష పోరాటం తప్పదని విరాహత్ హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆంధ్రభూమి సీనియర్ ఉద్యోగులు వెలిజల చంద్రశేఖర్, బి.వి.ప్రసాద్, రాజేశ్వర్ ప్రసాద్, జె.ఎస్.ఎన్.మూర్తి, డి.రవికుమార్, తిర్మల్ రావు, సి.హెచ్.నగేష్, విజయ్ ప్రసాద్, విశ్రాంత ఉద్యోగులు మల్లయ్య, శర్మ, ఓదయ్య, పి.మధుకర్, ఏ.అవినాష్, టీయూడబ్ల్యూజే కార్యవర్గ సభ్యులు ఎ. రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

ఆజాద్ ఆశయ సాధనలో బాగస్వాములవుదాం

 ఆజాద్ ఆశయ సాధనలో బాగస్వాములవుదాం

కూకట్ పల్లి,పెన్ పవర్


మహానుభావుల జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో కె.పి.హెచ్.బి కాలని మూడో ఫేస్ కట్టా వారి సేవా కేంద్రం వద్ద శనివారం భారతీయ ఉద్యమకారుడు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు చంద్రశేఖర్ ఆజాద్  వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కె.పి.హెచ్.బి కాలనీ 114డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు కొల్లా శంకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి చంద్రశేఖర్ ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భముగా కొల్లా శంకర్, మహానుభావుల జయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షులు కట్టా నరసింగరావు మాట్లాడుతూ చంద్రశేఖర్ ఆజాద్ జీవించినది 25సంవత్సరాలే అయినా స్వాతంత్ర ఉద్యమ కాలంలో  భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ లతో కలిసి భారత స్వాతంత్రం కొరకు పాటుపడిన గొప్ప నాయకుడని, అతిచిన్న వయసులో దేశం కోసం పాటుపడి ప్రాణత్యాగం చేసారని, భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్, పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, ప్రేమ్ కిషన్ ఖన్నాల సహచరుడని, చంద్రశేఖర్ ఆజాద్ కామ్రేడ్ షహీద్ భగత్ సింగ్ కు ముఖ్య అనుచరుడుగా, హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ నిర్మాతగా, శత్రువు చేత చిక్కక తనను తాను ఆత్మాహుతి చేసుకున్న  అమరవీరునిగా భారత ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడయ్యాడని, చంద్రశేఖర్ ఆజాద్ను గుర్తు చేసుకుని ఆయన ఆశయాల సాధనలో మనమందరం భాగస్వాములమవుదామని అన్నారు. ఈ కార్యక్రమములో ముప్పాల్ల సాంబశివరావు, గోపరాజు శ్రవణ్ కుమార్, కలకొండ నరేష్, సందీప్, నరేష్ తదితరులు పాల్గొన్నారు

వైసీపీ ప్రజల ప్రభుత్వం....

వైసీపీ ప్రజల ప్రభుత్వం....




 పెన్ పవర్,విజయనగరం 

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేతల ప్రభుత్వమని, గత తెలుగుదేశం ప్రభుత్వం  మాటలే కాని, చేతలు లేవని ఈ తేడాను ప్రజలందరూ గమనించాలని విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. శనివారం నాడు తన నివాసంలో పూల్ బాగ్ కాలనీ మూడవ వార్డు కు సంబంధించి బాబామెట్ట గట్టు ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు పడగల అప్పారావు, బమ్మిడి పెద్ద బాబ్జి, అయిత ప్రసాద్, ఇప్పిలి కిషోర్, ఎల్లమ్మ, పైలు వరలక్ష్మి ల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన వంద కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి కండువాలు కప్పి ఎమ్మెల్యే కోలగట్ల పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నేటి నుంచి మీరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులని, మీ గౌరవం పెరిగే విధంగా తమ ప్రవర్తన ఉంటుందన్నారు. అందరినీ కలుపుకొని వార్డులో పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, వేముల కృష్ణవేణి విజయానికి కృషి చేయాలన్నారు. కేవలం ఎన్నికల ముందు కనపడే నాయకులు , మీకు కష్టం వచ్చినప్పుడు ఎవరికి చెప్పుకోవాలి, బంగ్లా లో ఎవరిని కలవాలో తెలియని అనిశ్చిత పరిస్థితి తెలుగుదేశం పార్టీలో మీరు చూసారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మీకు అన్ని విధాల తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయి ఎమ్మెల్యే కోలగట్ల వారికి భరోసా ఇచ్చారు. కులం పేరు చెప్పుకొని మూడు సార్లు చైర్ పర్సన్ గా చేసిన గత తెలుగుదేశం పాలకులు, సమస్యలు తీర్చాలి అనే ఆలోచన ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. తాను శాసనసభ్యునిగా పదవీ పగ్గాలు చేపట్టిన సంవత్సర కాలంలో మంచినీటి ట్యాంకర్లను ఏర్పాటు చేసి , వేసవిలో కూడా మంచినీటి సమస్య లేకుండా కృషి చేస్తున్నాం అన్నారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తున్నామని అన్నారు. ప్రజలు మనసుపెట్టి ఆలోచన చేయాలన్నారు. అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ పాలకులు ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు అని ప్రశ్నించారు. ప్రజలను అమాయకులను చేసి, ఓట్ల ద్వారా పదవులు పొంది, ఆ తరువాత చేతులెత్తేసి ప్రజలను అధోగతి పాలు చేసింది తెలుగుదేశం పార్టీ అని అన్నారు. కరోనా విపత్కర పరిస్థితులలో అశోక్ బంగ్లాకు తాళాలు వేసుకున్నారని, విజయనగరం ప్రజలు కరోనాతో భయభ్రాంతులు గురవుతుంటే, ధైర్యం ఇవ్వాల్సిన బాధ్యత గా ,ప్రజా ప్రతినిధిగా  తాను ప్రజలకు అండగా ఉంటూ కరోనా బాధితులకు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. శాసనసభ్యునిగా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం అన్నారు. సుదీర్ఘ కాలం శాసన సభ్యునిగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన అశోక్ గజపతి రాజు ప్రజలను ఏనాడైనా పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. సామాన్య కార్యకర్త గా జీవితాన్ని ప్రారంభించిన తాను, అశోక్ గజపతి రాజు పై తాను గెలిచాం అంటే అది  కార్యకర్తలు, ప్రజల అభిమానంతోనే అని అన్నారు. శాసనసభ్యునిగా కరోనా క్లిష్ట పరిస్థితుల్లో కూడా నగర అభివృద్ధికి కృషిచేసిన వాస్తవాన్ని ప్రజలందరూ గ్రహించాలన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో మూడో డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేముల రాంప్రసాద్, మెండ వెంకటరమణ, జగదీష్ మాస్టారు, గండ్ర టీ సన్యాసిరావు, వేముల ప్రకాష్, కోట మంతి శ్రీను, దారపు సన్ని బాబు, సంతోష్, సంచా న ఆది, బండి రమేష్, లా వా డ శ్రీను, లతోపాటు మహిళలు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సమీకృత వ్యాపార సముదాయాలకు స్థల పరిశీలన చేసిన అడిషనల్ కలెక్టర్.

 సమీకృత వ్యాపార సముదాయాలకు స్థల పరిశీలన చేసిన అడిషనల్ కలెక్టర్..

మల్లంపేట్ సర్వేనెంబర్ 258లో..దొమ్మర పోచంపల్లి 199లో స్థలాన్ని ఎంపిక..

దుండిగల్,పెన్ పవర్




మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ డి.జాన్ శాంసన్.. దుందిగల్ పురపాలక సంఘం పరిధిలోని దొమ్మర పోచంపల్లిలో సర్వేనెంబర్ 199 లో.. మల్లంపేట్ సర్వేనెంబర్ 258లో చేపట్టబోయే సమీకృత వ్యాపార సముదాయం నిర్మాణానికి కావలసిన స్థల పరిశీలన చేశారు..ఈవ్యాపార సముదాయాల వల్లన ఒకేచోట నిత్య అవసరాలు వివిదరకాల వస్తువులు ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు సమీకృత వ్యాపార సముదాయాలు ఎంతగానో ఉపయోగపడుతాయి..ఈ కార్యక్రమములో చైర్ పర్సన్ సుంకరి కృష్ణవేణి కృష్ణ, మున్సిపల్ కమీషనర్ ఎంఎన్ఆర్ జ్యోతి..గండిమైసమ్మ మండల సర్వేయర్, గండిమైసమ్మ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ షణ్ముఖం మరియు మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు,

యువత ఎన్నికల్లో ఉత్సాహంగా పాల్గొనాలి...

 యువత ఎన్నికల్లో ఉత్సాహంగా పాల్గొనాలి...

పౌరవేధిక చైతన్య సదస్సులో భీశెట్టి పిలుపు






  పెన్ పవర్,విజయనగరం

 జిల్లా జరగనున్న మునిసిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికల్లో జిల్లా అంతటా ఓట్లు ఉన్న విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఎన్నికలను విజయవంతం చేయాలని జిల్లా పౌరవేధిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి కోరారు శనివారం ఉదయం ఉమాభారతి డిగ్రీ కళాశాలలో ఎన్నికలు యువత పాత్ర అనే అంశం పై పౌరవేధిక ఆధ్వర్యంలో చైతన్య సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో ముఖ్య అతిధిగా పాల్గొన్న భీశెట్టి మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థను బ్రతికించాలనే తపన యువతీ యువకులకు ఉండాలని నచ్చిన అభ్యర్థులకు ఓటును వేసుకునే అవకాశం తో పాటుగా నచ్చకపోతే నోటా కి ఓటు వేసే అవకాశం మన రాజ్యాంగం కల్పించిందని ప్రతి విద్యార్థి తమ కుటుంబాల్లో ప్రతి ఒక్కరూ ఓట్లు వేసేలా చూడాలని కోరారు పౌరవేధిక ప్రతినిధి ఎస్.శివాజీ మాట్లాడుతు ఎన్నికలను యువతి యువకులు పట్టించుకోకుండా ఉంటే చాలా ఇబ్బందులు ఉంటాయని నచ్చినవారికి ఓటు వేయాలని లేకపోతె కనీసం నోటా కి ఓటు వేసి తమ నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉందని అన్నారు ఓటు ని వజ్రాయుధం గా గుర్తించాలని కోరారు, జిల్లా క్యాన్సర్ ఆసుపత్రి సాధన సమితి కో కన్వీనర్ మమ్ముల తిరుపతి మాట్లాడుతూ మంచి రాజకీయాలు కావాలంటే మంచి వ్యక్తులు గెలుపొందలని అందుకే అందరూ రాజకీయాలు పట్టించుకోవాలని ఓటర్ లిస్టులో పేరు ఉందొ లేదో స్టేట్ ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన లిస్టులో చూసుకొని ఓటు వేయాలని కోరారు,విద్యాసంస్థల అధినేత బి. ఏ.రావు అధ్యక్షత న జరిగిన సమావేశంలో వేదిక ప్రతినిధులు ఇప్పల వలస గోపీ, బసవ మూర్తి,తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...