Followers

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

 పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

గుడిహత్నూర్,పెన్ పవర్

గుడిహత్నూర్ మండలం మాన్కపూర్ గ్రామానికి చెందిన  విజయ్ కుమార్ (41) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు గుడిహత్నూర్ ఎస్సై ఎల్. ప్రవీణ్  తెలిపారు. పోలీసుల వివరాల మేరకు  మాన్కపూర్ గ్రామానికి చెందిన  విజయ్ కుమార్ కు గత కొన్ని రోజులుగా తమ కుటుంబ సభ్యులతో గొడవలు జరుగుతున్నాయి.మంగళవారం సాయంత్రం 5:30 గం. ల సమయంలో ఆయనకు కుటుంబ సభ్యులకు వాగ్వాదం జరగడంతో   తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లోనే ఉన్న పురుగుల మందు తాగగా  గమనించిన కుటుంబ సభ్యులు రిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు  తెలిపారు. మృతుడి భార్య  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ప్రొఫెసర్ కోదండరామ్ కు తెలంగాణ తెలుగుదేశం మద్దతు

 ప్రొఫెసర్ కోదండరామ్ కు తెలంగాణ తెలుగుదేశం మద్దతు 

పెన్ పవర్, బయ్యారం

ఈరోజు బయ్యారం మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో మహబూబాద్ జిల్లా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బాధ్యులు కొండపల్లి రామచంద్రరావు మాట్లాడుతూ రాష్ట్రం తెలుగుదేశం పార్టీ  ఆదేశానుసారం ఈ నెల 14 వ తారీఖు న జరుగు*ఖమ్మంవరంగల్నల్గొండ*పట్టభద్రుల శాసనమండలినియోజకవర్గ MLC  ఎన్నికలకు టిజేస్ అభ్యర్థి ప్రజాస్వామికవాది, గౌరవనీయులు  శ్రీ #ప్రొఫెసర్_కోదండరాం గారికి మొదటి ప్రాధాన్యత ఓటువేసిఅఖండమెజారిటీతోగెలిపించాలనిమహబూబాబాద్‍ పార్లమెంట్ నియెజకవర్గ పరిదిలోని 7 అసెంబ్లీ నియెజకవర్గ టిడిపినాయకులకు ,కార్యకర్తలకు,మేదావులకు,ఉద్యోగులకు,నిరుద్యోగగ్రాడ్యుయేట్స్ కు తెలుగు దేశం పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ కొండపల్లి రామచంద్ర రావు మరియు బయ్యారం మండలం టిడిపి నాయకులు  పాల్గొన్నారు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికే ఓటేయండి

 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికే ఓటేయండి..కూనా శ్రీశైలంగౌడ్

కుత్బుల్లాపూర్,పెన్ పవర్




నిరంకుశత్వ పాలన కొనసాగిస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీయాలంటె దీటైన పార్టి భారతీయ జనతాపార్టీ అని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు కూనా శ్రీశైలంగౌడ్ పేర్కొన్నారు.. కుత్బుల్లాపూర్ జగద్గిరిగుట్టలోని ఎంకెఆర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన బీజేపీ నాయకుల కార్యకర్తల పట్టభద్రుల సమ్మేళన కార్యక్రమం కూన శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి రామచంద్రరావును భారీ మెజారిటీతో గెలిపించాలని విద్యావంతులకు, మేధావులకు, పట్టభద్రులకు శ్రీశైలంగౌడ్ విజ్ఞప్తి చేశారు, అంతేకాకుండా టిఆర్ఎస్ నాయకుల ఆగడాలను జగద్గిరిగుట్టలో అంతమొందించాలంటె రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కష్టపడి ప్రతి విద్యావంతునీ ఓటు బిజెపి అభ్యర్థికి పడేలాగా కృషి చేయాలని ఆయన మనవి చేశారు. టిఆర్ఎస్ పార్టీకి చరమగీతం పాడాలంటె భీజేపికే ఓటు వేయాలని తెలిపారు.. కార్యక్రమంలో పలువురు జగద్గిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను బిజెపి పార్టీలోకి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గిరి వర్ధన్ రెడ్డి , మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి, శేఖర్ యాదవ్, పున్నారెడ్డి , సురేష్ రెడ్డి, నరేష్ రెడ్డి, సిద్ది రామ్ రెడ్డి, సుధా, అరుణ రెడ్డి, అరుణ్, నర్సింగ్, గణేష్ జా, మురళి, వరలక్ష్మి, హైమావతి, మాధవి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న ఎంపీడీవో నాతి బుజ్జి

 జిల్లా ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న ఎంపీడీవో నాతి  బుజ్జి

పెన్ పవర్,ఆత్రేయపురం

 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవ పురస్కారం అందుకున్న ఎంపీడీవో నాతి  బుజ్జి కి బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో మండలంలో ఉన్న అధికారులు ఉద్యోగులు కార్యాలయం సిబ్బంది ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విధి నిర్వహణలో ఆమె చేసిన సేవలు నిరంతరం శ్రమ కృషి పట్టుదల ప్రణాళిక ఉంటే ఎంతటి కార్యములను సాధించవచ్చని ఆమె నిర్వహించారు ప్రతి ఉద్యోగి తన సేవ కాలంలో ప్రజలకు చేసిన సేవలు సంతృప్తి వస్తాయని అన్నారు.


 మండలంలో వివిధ శాఖల అధికారులు ఉద్యోగులు ఆమెనూ సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి టి. వరప్రసాద్ మండల విస్తరణ అధికారి శ్రీనివాస్ మండల వైద్యాధికారి శ్రీనివాస్ వర్మ ఇంజనీరు అధికారి భద్రరావు మండల పరిషత్ సిబ్బంది వల్లి,భాగ్యలక్ష్మి 17 గ్రామాల కార్యదర్శులు సచివాలయ సిబ్బంది ఉపాధ్యాయులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

అగ్ని బాధితులుకు ఆసరాగా నిలుస్తున్న సామాజిక సేవ

 అగ్ని బాధితులుకు ఆసరాగా నిలుస్తున్న సామాజిక సేవ 

గజపతినగరం,పెన్ పవర్ 

బొండపల్లి మండలం దేవిపల్లి పంచాయతీ పరిధిలో గల కొండ వాని వలస గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదం లో సర్వం కోల్పోయిన సుమారు 50 కుటుంబలుకు బాధితులుకు దేవిపల్లి గ్రామనీకి చెందిన వెంకట గాయత్రి క్లాత్ స్టోర్స్ అధినేత సామజిక సేవ కార్యాకర్త బండారు ప్రసాద్ ఏబై కుటుంబలు కు నిత్యావసర సరుకులు కూరగాయలు. 200మందికి బట్టలు. కంచలు. గ్లాస్లు. పంపిణి చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సర్వం కోల్పోయిన అగ్ని బాధితులుకు సహాయం చేయడం నా పూర్వ జన్మ శుక్రతoమని అన్నారు. ఇటువంటి ప్రమాదలు జరగకుండా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే అప్పలనరసయ్య వెంటనే స్పందించి సకాలంలో బాధితులును ఆదుకున్నా ఎమ్మెల్యే కు రుణపడి ఉంటామనీ అన్నారు ప్రభుత్య పరంగా రావాలిసిన ఆర్థిక సహాయం కోసం ఎమ్మెల్యే దృష్టికి తీసుకోని వస్తామునీ అన్నారు మరల ఏ సహాయం కావాలన్నా చేయడానికి సిద్ధంగా వున్నాం అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాపాక సూర్యప్రకాష్. సర్పంచ్లు.ప్రజాప్రతినిధులు పాల్గున్నారు.

వాడపల్లి వెంకన్నకు లక్ష తులసి పూజ

 వాడపల్లి వెంకన్నకు  లక్ష తులసి పూజ

పెన్ పవర్,ఆత్రేయపురం 

 వాడపల్లి గ్రామం లో వెలిసిన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి అలివేలుమంగా పద్మావతి సమేత స్వయంభు ఆలయ అర్చకులుమాఘ మాసం సందర్భంగా లక్ష తులసి పత్రి తో పూజలు నిర్వహించారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండాఆలయ మండపం ప్రాంగణంలో నిర్వహించారు భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని లక్ష తులసి పూజను కనులారా తిలకించి  ఆ స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగినది.

సి ఎం సహాయనిది చెక్కులు పంపిణీ

 సి ఎం  సహాయనిది  చెక్కులు  పంపిణీ  

గంభీరావుపేట, పెన్ పవర్  

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం  నర్మాల గ్రామo లో పేదలకు  తెలంగాణా ప్రభుత్వం  బుధవారం  ముఖ్యమంత్రి  సహాయనిది చెక్కుల పంపిణీ తెరాస గ్రామ శాఖ అధ్యక్షులు ఎడబోయిన రత్నాకర్ ఆధ్వర్యంలో సి ఎం ఆర్ ఎఫ్  చెక్కులు పంపిణి చేయడం జరిగింది. లబ్ధిదారులు పిట్ల మల్లవ్వ 56000/-  రూపాయలు, ఓరుగంటి లక్ష్మి 50000/-రూపాయలు, ధ్యానబోయిన పూజ 32000/-  పాక చిన్న మల్లయ్య 26000/-జంగం ఎల్లయ్య 16000/-రూపాయల చెక్కులు అందించడం జరిగింది కార్యక్రమం లో గ్రామ  సర్పంచ్  ఎడబోయిన రాజు  ఎంపీటీసీ  బాలమణి,తెరాసమండలఅధ్యక్షలు  పాపగారివెంకటస్వామిగౌడ్ ,ఎం పి  వంగ   కరుణ సురేందర్ రెడ్డి ,  ఆర్ బి ఎస్  రైతు  బందు  సమితి  మండల అధ్యక్షులు ధ్యానబోయిన రాజేందర్,  మార్కెట్ కమిటీ  వైస్ చేర్మెన్  యాదిలాల్,  కె డి సి సి బి  డైరెక్టర్ రాజేశ్వర్ రావు సెస్ డైరెక్టర్ దేవేందర్ యాదవ్  మార్కెట్ కమిటీ డైరెక్టర్ శేఖర్ గౌడ్ తెరాస సీనియర్ నాయకులు  మాజీ  ఎం పి  రాజారాం, లక్ష్మణ్, సురేందర్ రెడ్డీ, కిషోర్, ఆంజనేయులు, మల్లేశం,  మహిళా  సంఘ  అధ్యక్షురా లు  బాల్ లక్ష్మి , నాగరాజు, రాజేందర్, గోవర్ధన్, స్వామి, నర్సింలు , రాజు  మరియు ఇతర తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...