Followers

సింగరేణి పరిరక్షణ టీఎన్టీయుసీ తోనే సాధ్యం

 సింగరేణి పరిరక్షణ టీఎన్టీయుసీ తోనే సాధ్యం

మందమర్రి, పెన్ పవర్

సింగరేణి సంస్థ పరిరక్షణ తెలుగుదేశం పార్టీ అనుబంధ  టిఎన్టియుసి తోనే సాధ్యమని టిఎన్టియుసి కేంద్ర ఉపాధ్యక్షులు ఠాకూర్ మణిరాంసింగ్ పేర్కొన్నారు. బుధవారం మందమర్రి ప్రెస్ క్లబ్  లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సింగరేణి సంస్థ గతంలో నష్టాల బాట పట్టినప్పుడు సంస్థకు మారిటోరియం కల్పించి సంస్థను పరిరక్షించారని, అదే విధంగా సంస్థకు లాభాలు వస్తే కార్మికులకు లాభాల వాటా చెల్లిస్తానని మాట ఇచ్చి, ఇచ్చిన మాట ప్రకారం కార్మికులు లాభాల వాట చెల్లించాడని, నేటికీ కార్మికుల లాభాల వాట కల్పనకు చంద్రబాబే కారణమని పేర్కొన్నారు. సింగరేణిలో గతంలో లక్ష 16 వేల మంది కార్మికులు ఉండగా ప్రస్తుతం 42 వేల మంది కార్మికులు మాత్రమే పనిచేస్తున్నారని, సుమారు 30 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు సింగరేణిలో పనిచేస్తున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు పెంపొందించేందుకు సింగరేణి ఆరో దఫా గుర్తింపు ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు నూతన భూగర్భ గనుల ప్రారంభించి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం వర్తింపజేయాలని కోరారు. సింగరేణి కార్మికులకు ఐటి మినహాయింపు కొరకు తెలంగాణ ప్రాంత ఎంపీలు పార్లమెంటులో పోరాటం చేయాలని, రాష్ట్ర పరిధిలోని అలవెన్స్ లపై ఐటి రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సంస్థలో అన్ని రకాల పనులు చేసే జనరల్ మజ్దూర్ కార్మికులను ఎంజేడబ్ల్యు కేటగిరి అమలు చేయాలని అన్నారు. త్వరలో 11వ వేజ్ బోర్డ్ కాలపరిమితి ప్రారంభం కాబోతుంది కావున జాతీయ సంఘాలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి గడువులోపు వేజ్ బోర్డును పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు అమానుల్లాఖాన్, ఎండి జాఫర్, జక్కుల సమ్మయ్య, బైరాజు శ్రీనివాస్, వాసాల సాగర్, కల్లేపల్లి సాగర్, ఎదులపురం సతీష్, ఎండి సలీం తదితరులు పాల్గొన్నారు.

పెద్దాపురం మున్సిపల్ పోలింగ్ ప్రశాంతం

 పెద్దాపురం మున్సిపల్ పోలింగ్ ప్రశాంతం 

 పెద్దాపురం,పెన్ పవర్ 

పెద్దాపురం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో భాగంగా 29 వార్డులో నమోదైన 40,559  మంది ఓటర్లు లో 28,736 మంది   ఓటు హక్కు వినియోగించుకోగా 70.85 శాతం పోలింగ్ నమోదైందని మున్సిపల్ ప్రత్యేక అధికారి మరియు ఆర్డిఓ యస్. మల్లిబాబు  బుధవారం పాత్రికేయులతో చెప్పారు. పోలింగ్ సరళిని గురించి మాట్లాడుతూ 29 వార్డుల్లో ఉదయం 9 గంటలకు 7701ఓటర్లు గాను, 18.99 శాతం , 11 గంటలకు 16630 మంది ఓటర్లు కు 41 శాతం, మధ్యాహ్నం ఒంటిగంటకు 2290 మంది ఓటర్లు కు 54.96 శాతం , మద్యాన్నం 3 గంటలకు 26051 మంది ఓటర్లు కు 64.23 శాతం సాయంత్రం 5 గంటలకు 28736 మంది ఓటర్లు కు 70.85 శాతం పట్టణ ఓటర్లు తమ ఓటు ను వినియోగించుకున్నారని ఆర్డిఓ తెలిపారు.బుధవారం జరిగిన పోలింగ్ ప్రక్రియ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా సజావుగా ప్రశాంత వాతావరణంలో జరిగింది. ఉదయం 7 గం.లకు పోలింగ్ ప్రారంభం నుండే ఓటర్లు ఉత్సహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు.మున్సిపల్ ఎన్నికల అధికారి మరియు మున్సిపల్ కమీషనర్  జి. సురేంద్ర మాట్లాడుతూ ఎన్నికల పరిశీలకులు డాక్టర్  అంబేద్కర్ పాత పెద్దాపురం లో ఉన్న పోలింగ్ బూత్ లను పరిశీలించడం జరిగిందని తెలిపారు అలాగే ఆర్డిఓ మరియు మున్సిపల్ స్పెషల్ అధికారి  ఎస్ మల్లి బాబు  పోలింగ్ బూతుల పరిశీలించి  తగు సూచనలు ఇచ్చారని తెలిపారు. పోలింగ్ పక్రియలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులు సిబ్బంది ఎంతో కృషి చేశారని,  వృద్ధులు వికలాంగులు, యూత్ అందరూ ఓటు హక్కును వినియోగించుకున్నారని .పోలింగ్ కు సహకరించిన పట్టణ ఓటర్లు కు,మున్సిపల్, రెవెన్యూ ,పోలీస్ ,అధికారులు,సిబ్బందికి, వివిధ రాజకీయ పార్టీలకు కమిషనర్ జి సురేంద్ర కృతజ్ఞతలు తెలిపారు.

గ్రామ సమస్యలు పై దృష్టి సారించిన గ్రామ పెద్దలు

 గ్రామ సమస్యలు పై దృష్టి సారించిన గ్రామ పెద్దలు

తాళ్ళపూడి, పెన్ పవర్

తాళ్ళపూడి మండలంలో ప్రక్కిలంక పంచాయితీ పరిధిలోని పైడిమెట్ట గ్రామ సమస్యలపై దృష్టి సారించారు వైసీపీ నియోజకవర్గ ఎస్ సి సెల్ అధ్యక్షులు యాళ్ళ బాబురావు. ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల్లో ప్రక్కిలంక పంచాయితీ నుండి బాబురావు కుమార్తె స్వప్న సర్పంచ్ గా ఎన్నిక కావడం తెలిసిందే. బుధవారం ఉదయం స్థానిక వార్డు మెంబర్లు కొప్పాక గ్రేస్ కుమారి, కొడమంచిలి రేఖ ల సమక్షంలో గ్రామ పెద్దలతో బాబురావు సమావేశం నిర్వహించారు. ఎన్నికల సమయంలో  ఇచ్చిన హామీలతో పాటుగా గ్రామంలో ఉన్న మౌళిక సమస్యల గూర్చి చర్చించారు. కార్యక్రమంలో గ్రామ వైసీపీ కన్వీనర్ కొల్లి దుర్గారావు, మాజీ వార్డు మెంబర్ జొన్నకూటి జార్జ్, కొప్పాక సురేష్, జొన్నకూటి నాగేశ్వరరావు, పసలపూడి ఆశీర్వాదం , కొప్పాక సురేష్, జొన్నకూటి రాము, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

ప్రజాస్వామ్యం లో ఓటుహక్కు వజ్రాయుధం

 ప్రజాస్వామ్యం లో ఓటుహక్కు వజ్రాయుధం

పెన్ పవర్,ఆలమూరు 

ప్రజాస్వామ్యం లో ఓటుహక్కు ప్రజలకు వజ్రాయుధమని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. మండపేట లో బుధవారం జిల్లా కలెక్టర్ పర్యటించారు. మునిసిపల్ ఎన్నికల సందర్భంగా మండపేట వేగుళ్ళ సూర్యారావు ప్రభుత్వ జూనియర్ కాలేజి లో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ లను ఆయన తనిఖీ చేశారు. 23,24,25వార్డుల కు సంబంధించిన ఆరు గదుల్లో పోలింగ్ స్టేషన్ లు పరిశీలించారు. అలాగే రాజీవ్ గృహ కల్ప ఏరియా ఓటర్ల కు 30 వ వార్డు పరిధి లో ఇక్కడ ఓ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయగా ఆ కేంద్రాన్ని తనిఖీ చేశారు.ఈ సందర్భంగా అక్కడ క్యూ లైన్ లో ఉన్న ఓటర్ల తో కలెక్టర్ నేరుగా మాట్లాడారు. ఓటర్ స్లిప్ ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఉంటున్న వారు ఎవరైనా వచ్చారా అని అడగ్గా తాము స్థానికులమని ఓటర్లు సమాధానం ఇచ్చారు. అలాగే ఎన్నికల ఏర్పాట్లు పై సంతృప్తి వ్యక్తం చేశారు. కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ ను అభినందించారు. కలెక్టర్ వెంట పలువురు అధికారులు ఉన్నారు.

పైడిమెట్టలో కొప్పాక గ్రేస్ కుమారి అభివృద్ధి కార్యక్రమాలు

 పైడిమెట్టలో కొప్పాక గ్రేస్ కుమారి అభివృద్ధి కార్యక్రమాలు

తాళ్ళపూడి, పెన్ పవర్

పైడిమెట్ట గ్రామంలో నూతనంగా పంచాయతీ వార్డు సభ్యులుగా ఎన్నికైన కొప్పాక గ్రేస్ కుమారి స్థానిక యువకులను కూడగట్టి స్వచ్ఛ పైడిమెట్ట కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామంలో వాటర్ ట్యాంక్ ప్రాంతంలో గడ్డి చెత్త చెదారం పేరుకుపోవడం తో బుధవారం ఉదయం ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి చెత్తను తొలగించారు. గ్రామంలో మరిన్ని పారిశుధ్య కార్యక్రమాలను స్థానిక యువకులు, నాయకులతో కలిసి చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో గ్రామ వైసీపీ కన్వీనర్  కొల్లి దుర్గారావు, గ్రామస్తులు కొప్పాక రాజు, సుబ్రహ్మణ్యం, జొన్నకూటి మనోహర్, చిట్టిబాబు, మధు, దేవరపల్లి రమేష్, తదితరులు  పాల్గొన్నారు.

పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరగడం హర్షదాయకం

పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరగడం హర్షదాయకం

ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి

విజయనగరం,పెన్ పవర్

పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరగడం హర్షదాయకం ఇందుకు అధికారులు, పోలీసులు తీసుకున్నాచర్యలు ఆనందాన్ని కలిగించాయి.జగన్ పాలనపై నమ్మకంతో ప్రజలు ఉన్నారన్న విషయాన్ని ఈ ఎన్నికలు స్పష్టం చేశాయి.కార్పొరేషన్ లో 40 డివిజన్లు పైగా వైసిపి గెలుస్తుంది.ఈ ఏడాదిన్నర జగన్ పాలన లో జరిగిన ఎన్నిక నీతికి అవినీతికి మధ్య జరిగాయి.టీడీపీ హాయన అంతా అవినీతిమయం అశోకగజపతి మాటలను ప్రజలు నమ్మలేదు. ప్రజలు స్వచ్చందంగా ఓట్లు వేశారు.ఇది అధికార పార్టీపై ప్రజలకు ఉన్న నమ్మకానికి   నిదర్శనం.

కరోనా వ్యాక్సినేషన్ పరిశీలన

 కరోనా వ్యాక్సినేషన్ పరిశీలన

తాళ్ళూరు,పెన్ పవర్

తాళ్ళూరు మండలం కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను జిల్లా క్షయా నివారణ అధికారి కె.సురేష్ కుమార్, బుధవారం తాళ్ళూరు, తూర్పు గంగవరం ,ప్రాథమిక ఆరోగ్య కేంద్రలలోని వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు.  పేర్లు నమోదు చేసుకున్న వారంతా వ్యాక్సిన్ వేయంచుకోవాలని సూచించారు. మిగతా వాళ్లు కూడా త్వరగా పేర్లు నమోదు చేసుకోవాలి అన్నారు. అనంతరం వ్యాక్సిన్ వేయించుకున్న  వారికి పలు సలహాలు,సూచనలు చేశారు.  తాళ్ళూరు పీ హెచ్ సీ వైద్యాధికారిణి ఖద్దర్ మస్తాన్ బీ మాట్లాడుతూ  67 మంది వ్యాక్సిన్ వేయించుకునట్లు తెలిపారు. తూర్పు గంగవరం  పీ హెచ్ సీ వైద్యాధికారి బంక రత్నం మాట్లాడుతూ ఇప్పటి వరకు వృద్ధులు 150 మంది వ్యాక్సిన్ వేయించుకునట్లు తెలిపారు.60 ఏళ్ల  వయస్సు పై బడిన వారు,అలాగే 45 నుంచి 59 ఏళ్లలోపు ఉన్న వారిలో దీర్ఘకాల వ్యాధులున్న వారు పేర్లు నమోదు చేసుకోవచ్చు అన్నారు.60 ఏళ్ల పై వారు వయస్సు ధ్రువీకరణ పత్రం చూపిస్తే టీకా వేస్తామని, అదే 45 ఏళ్ల పై బడ్డ వారిలో దీర్ఘకాల వ్యాధులు ఉన్నట్లు కనీసం ఎంబీబీఎస్ డాక్టర్ నుంచి సర్టిఫికెట్ తీసుకొస్తే టీకా వేస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో  వైద్య  సిబ్బంది వాణి,అనిత,అంజిరెడ్డి, శ్రీనివాసరావు, సుశీల,మస్తానమ్మ పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...