Followers

నక్కా ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

 నక్కా ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

తాళ్ళపూడి, పెన్ పవర్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి నేటికి పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తాళ్ళపూడి గ్రామ పంచాయితీ సర్పంచ్ నక్కా వెంకట అనురాధ ఆధ్వర్యంలో  ఘనంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మెయిన్ రోడ్ మదనగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న  వైఎస్ఆర్ విగ్రహానికి  సర్పంచ్ అనూరాధ పూలమాల వేశారు. అనంతరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ  నాయకులు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా పలువురు వైఎస్సార్సీపీ నాయకులు మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసమే వైఎస్ఆర్సిపి పార్టీ పనిచేస్తుందన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం ఒక ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే వినూత్నమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కష్టపడి పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషి చేసిన వారికి పార్టీలో తప్పకుండా భవిష్యత్తు ఉంటుందన్నారు. సర్పంచ్ నక్కా వెంకట అనురాధ  కేక్ కటింగ్ చేసి, స్వీట్లు పంపిణీ చేసి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ గోలి వీర వెంకట సత్యనారాయణ, ఎఎంసి డైరెక్టర్ కంకిపాటి బాబురావు,  వైయస్సార్సీపీ  మండల యువజన విభాగం అధ్యక్షులు వంబోలు పోసిబాబు, వైయస్సార్సీపీ నాయకులు నక్కా ఆనంద్, బండ్రెడ్డి వెంకటేశ్వరరావు, గూడా విజయరాజు, సిద్దంశెట్టి కృష్ణ, మైగాపుల రాజారావు, బండారు సత్తిబాబు, చిట్టాల రాము, కోదాటి సత్యనారాయణ, బ్యాంక్ సత్యనారాయణ, కొక్కిరాల గాంధీ, మైగాపుల ఆంజనేయులు, నాయుడు రత్నాజీ, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

ఆదిత్యలో ఇంటర్న్ షిప్ అవకాశాలపై అవగాహనా సదస్సు

 ఆదిత్యలో ఇంటర్న్ షిప్ అవకాశాలపై అవగాహనా సదస్సు

గండేపల్లి,పెన్ పవర్

గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో బి.టెక్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులకు ఎ.ఐ.సి.టి.ఇ అధీకృత సంస్థ ఇంటర్న్ శాల వారు నిర్వహించే ఇంటర్న్ షిప్ అవకాశాలపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు కళాశాల ప్రిన్సిపాల్ డా. ఆదిరెడ్డి రమేష్ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ ఇంటర్న్ షిప్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం,మరియు వాటి లాభాలను గురించి సోదాహరణలతో వివరించారు. ఈ సదస్సులో పాల్గొన్న జె.బాలరాజు,మేరీ జ్యోతి విద్యార్థులకు ఇంటర్న్ షిప్ లకు ఎలా  ధరఖాస్తు చేయాలి, ఎలాంటి ఇంటర్న్ షిప్ లు ఎంచుకోవాలి వంటి విషయాలపై అవగహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్లేస్ మెంట్ ఆఫీసర్ మధు మాణిక్యం పాల్గొనగా సుమారు 500మంది విద్యార్థులు ఈ సదస్సుకు హాజరయ్యారు.

తాణాం లో ఘనంగా నిర్వహించిన మహా శివరాత్రి వేడుకలు

 తాణాం లో ఘనంగా నిర్వహించిన మహా శివరాత్రి వేడుకలు

పరవాడ,పెన్ పవర్

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా తాణాం గ్రామంలో  శ్రీమతి&శ్రీ కన్నూరు దేవి వెంకటమణ(నూతన సర్పంచ్)మరియు  కన్నూరు యువసేన వారు ఆధ్వర్యంలో మహాశివరాత్రి పండగ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జరిగిన  పూజలో రుద్రాభిషేకము,హోమం, సహస్ర లింగార్చన,తదితర కార్యక్రమాలు నిర్వహించారు.ఈ పూజ కార్యక్రమాలకు శ్రీమతి&శ్రీ కన్నూరు దేవి వెంకటమణ దంపతుల చేతులమీదగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎంపిటి అభ్యర్థి రొంగలి గోపాలకృష్ణ,కన్నూరి యువసేన మరియు తాణాం గ్రామం ప్రజలు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మహాశివుని భక్తి శ్రద్ధలతో కొలిచారు.

చంద్రబాబుకు రాజకీయ సన్యాసం తప్పదు

 చంద్రబాబుకు రాజకీయ సన్యాసం తప్పదు

విజయనగరం,పెన్ పవర్

చంద్రబాబుకు రాజకీయ సన్యాసం తప్పదని విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. శుక్రవారం నాడు నగరంలోని ఐదవ డివిజన్కు సంబంధించి బాబామెట్ట లో జరుగుతున్న ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పరిశీలించడానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. విజయనగరం మేయర్ పీఠాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని  అన్నారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ పలు పదవులు నిర్వహించిన అశోక్ గజపతిరాజు నగరానికి చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. గతంలో చైర్మన్ గా చేసిన వ్యక్తులు చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. నీతికి, అవినీతికి మధ్య జరుగుతున్న ఈ ఎన్నికలలో ప్రజలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్ట పోతున్నారని అన్నారు. కరోనా విపత్కర పరిస్థితులలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలకు అండగా ఉంటూ, సేవా కార్యక్రమాలు చేపడుతూ, సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు. చేసిన సేవ తో తప్పక అత్యధిక స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని అన్నారు. 5వ డివిజన్ అభ్యర్థి గాదం మురళి నిత్యం ప్రజలతో మమేకమై వార్డులో పార్టీలకతీతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని, తప్పక విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. నగరపాలక ఎన్నికల లో నలభై డివిజన్ల లో  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవడం ఖాయం అన్నారు.

వైసీపీ కాంగ్రెస్ పార్టీకి పదవుల కన్నా, ప్రజా శ్రేయస్సే ముఖ్యం

వైసీపీ పార్టీకి పదవుల కన్నా, ప్రజా శ్రేయస్సే ముఖ్యం

 విజయనగరం,పెన్ పవర్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పదవుల కన్నా, ప్రజా శ్రేయస్సే ముఖ్యం అని విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుక్రవారం నాడు నగరంలోని 16 వ డివిజన్ పరిధిలో కమ్మ వీధి లో ఏర్పాటుచేసిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా పార్టీ జెండాను ఎమ్మెల్యే కోలగట్ల ఆవిష్కరించారు. పార్టీ నాయకులు ,కార్యకర్తలు జోహార్ వైయస్ఆర్ ఆర్, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ  నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోలగట్ల మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి  వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశలకు, ఆశయాలకు అనుగుణంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది అన్నారు. మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశయా లే ఊపిరిగా, ఆయన ఆలోచనలే శ్వాసగా వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో ఏర్పాటైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేడు పదకొండవ వసంతంలో అడుగు పెట్టడం సంతోషకరమన్నారు. ప్రజా బలమే పునాదిగా, అధికారం చేపట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. పదేళ్లుగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని బలమైన శక్తిగా ఎదిగింది అన్నారు. ప్రజలే దేవుళ్ళు గా, ప్రజా క్షేత్రమే దేవాలయం గా భావించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళింది అన్నారు. అరాచక పాలనలో మగ్గుతున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నేనున్నానని నమ్మకాన్ని ప్రజలలో వైయస్ జగన్మోహన్ రెడ్డి  కల్పించారని అన్నారు. విశ్వసనీయత, విలువలకు ప్రాధాన్య ఇచ్చే పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. పార్టీ నగర  పాలక అధ్యక్షులు ఆశ పు వేణు, డివిజన్ పార్టీ పోటీ అభ్యర్థి గుజ్జల నారాయణరావు లు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలన కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావించి ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా జోన్ల ఇన్చార్జిలు ఎస్. వి. వి. రాజేష్, ముచ్చు శ్రీను, వై. కుమారస్వామి, అల్లు చాణక్య, జిల్లా సేవాదళ్ అధ్యక్షు లు  లు మారం బాల బ్రహ్మారెడ్డి లతోపాటు పార్టీ నాయకులు రంగబాబు దొర, సన్నీ బాబు దొర, వెంపటాపు శ్రీనివాసరావు, షకీల్, శ్రీమతి మీసాల రమాదేవి  పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఘనంగా వైసిపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

 ఘనంగా వైసిపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

పరవాడ,పెన్ పవర్

పరవాడ గ్రామం లో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సంతబయులు వద్ద దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళ్ళు అర్పించి, అనంతరం కేక్ కటింగ్ చేసిన రాష్ట్ర సీఈసీ సభ్యులు పయిల శ్రీనివాసరావు,సర్పంచ్ సిరిపురపు అప్పలనాయుడు.ఈ సందర్భంగా రాష్ట్ర సీఈసీ సభ్యులు పయిల శ్రీనివాసరావు మాట్లాడుతూ వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికి వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ,మహానేత రాజశేఖరరెడ్డి ఆశయ సాధనే లక్ష్యంగా విలువలు విశ్వసనీయత, పునాదులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం జరిగిన ఈ పదేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో కష్ట సుఖాలలో మన ఎమ్మెల్యే అదీప్ రాజ్ కి అహర్నిశలు తోడుగా అండగా ఉన్న కార్యకర్తలకు నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్క రాము నాయుడు,జడ్పీటీసీ అభ్యర్థి పి.ఎస్ రాజు,ఉప సర్పంచ్ బండారు రామారావు,చల్ల కనకరావు,గొర్ల గోపి,పి.ఎమ్.సి చైర్మన్ పయిల హరీష్, వెన్నలపాలెం సర్పంచ్ వెన్నెల అప్పారావు, పరవాడ మండల వ్యవసాయ కమిటీ చైర్మన్ కోన రామారావు, బురద రాజు,పల్లా గోవింద్, బంధం నాగేష్ ,పయిల సత్యనారాయణ( బొబ్బిలి) ,దాలయి రాము, బండారు కృష్ణ బాబు, యమహా నాయుడు , కుండ్రపు తాతజి, పోతల అప్పలనాయుడు,పయిల పైడం నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

రైతులను మోసం చేస్తున్న మోడీ ప్రభుత్వం

 రైతులను మోసం చేస్తున్న మోడీ ప్రభుత్వం

మందమర్రి ,పెన్ పవర్

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడు రైతు చట్టాలను తీసుకు వచ్చి, రైతులను మోసం చేస్తూ,కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తుందని ఐఎఫ్టీయు జిల్లా నాయకులు ఎండీ జాఫర్ ఆరోపించారు. శుక్రవారం పట్టణంలోని ఐఎఫ్టీయు కార్యాలయంలో రైతులకు మద్దతుగా మార్చి 23న మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన రైతు గర్జన ప్రదర్శన, సభ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రకృతి వైపరీత్యాల వల్ల, విత్తనాల వలన నష్టపోయిన రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని, సబ్సిడీ రద్దు చేయకుండా, రైతులపై విద్యుత్ భారాన్ని మోపేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను మానుకోవాలని, అధిక ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో జరుగు రైతు గర్జనకు రైతులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయు నాయకులు డి కుమార్, జే కనకయ్య, ఆర్ అజయ్, సాయి ఏ కొమురయ్య, మీనా తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...