Followers

పశువుల కృత్రిమ గర్భధారణ పై అవగాహన కార్యక్రమం

 పశువుల కృత్రిమ గర్భధారణ పై అవగాహన కార్యక్రమం

పెన్ పవర్, కందుకూరు 

శుక్రవారం మండలంలోని పలుకూరు గ్రామములో జాతీయ కృత్రిమ గర్భదారణ కార్యక్రమము   పై  రైతులకు  అవగాహన,  పశువుల లో  పునరుత్పత్తి పెంచుటకు   కోవూరు పశు వైద్య అధికారి డాక్టర్ యస్.సుధాకర్  అధ్వర్యంలో  ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.కార్యక్రమములో ముఖ్య అతిథిగా కందుకూరు పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ ఆర్. రమేష్  పాల్గొని మాట్లాడుతూ జాతీయ కృత్రిమ గర్భదారణ కార్యక్రమము పలుకురు గ్రామములో గేదలకు  గర్భకోశ వ్యాధులు  ఉండి దీర్ఘకాలికంగా  తిరగ కడుతున్న, యదకు రాని గెదలకు ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశాము అని తెలియజేశారు.  పశువుల లో సాధారణ వ్యాధులు , దూడలకు నట్టల నివారణ మందులు పరీక్షించి ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమములో మాచవరం పశువైద్య అధికారి డాక్టర్ యి. చెన్నకేశవులు రైతులకు పశువుల లో వచ్చు వ్యాధుల గురించి  అవగాహన కల్పించారు.  పశువైద్య సహాయకులు చైతన్య ,వేణు, విజయ సాగర్, గోపాల మిత్రులు శోభన్ బాబు, మురళి మోహన్ , గ్రామ పెద్దలు ఈదర. రవి , వెంకటేశ్వరరెడ్డి  పాల్గొన్నారు .

రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి ఓ హిస్టరీ క్రియేటర్

రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి ఓ హిస్టరీ క్రియేటర్ 
అనకాపల్లి,పెన్ పవర్ 

 వైయస్సార్ సిపి పార్టీ పుట్టుకతోనే హిస్టరీ క్రియేట్ చేసిన పార్టీగా చెప్పుకోవచ్చని అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బీసెట్టి వెంకట సత్యవతి పేర్కొన్నారు. వైయస్సార్ సిపి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని శుక్రవారం ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ 151 స్థానాల్లో 2019 ఎన్నికల్లో గెలుచుకొని హిస్టరీ క్రియేట్ చేసిన సీఎంగా జగన్మోహన్రెడ్డి నిలిచారన్నారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంధాలు గా భావించి అనతికాలంలోనే ఇచ్చిన హామీలు నెరవేర్చిన నాయకుడిగా ఖ్యాతి గడించారానారు. దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయుడుగా పార్టీ ను నడిపించడమే కాకుండా ప్రజా సంక్షేమ నేతగా ప్రజల మన్ననలు అందుకున్న నాయకుడు జగన్మోహన్రెడ్డి అని పేర్కొన్నారు. పార్టీ కోసం శ్రమపడిన కార్యకర్త నాయకులకు తామంతా రుణపడి ఉంటామన్నారు. కార్యక్రమంలో అనకాపల్లి పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకి రామ రాజు ,అనకాపల్లి పార్లమెంటు పరిశీలకులు దాడి రత్నాకర్ ,రాష్ట్ర పార్టీ కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్ , అనకాపల్లి పట్టణ కార్యదర్శి సూరిశెట్టి రమణ అప్పారావు , సకల గోవింద్ , డాక్టర్ విష్ణుమూర్తి ,81వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిని పీలా లక్ష్మీ సౌజన్య ,82 వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిని మందపాటి సునీత , 83 వ వార్డుకార్పొరేటర్ అభ్యర్థిని జాజుల ప్రసన్న లక్ష్మి , 94వ వార్డ్ కార్పొరేటర్ అభ్యర్థిని పలకా యశోద పాల్గొన్నారు.

శంభో శంకర...వైభవంగా శివరాత్రి వేడుకలు

 శంభో శంకర...వైభవంగా శివరాత్రి వేడుకలు

గుడిహత్నూర్,పెన్ పవర్

హర హర మహాదేవ అంటూ శివ నామస్మరణతో శివాలయాలు అన్నీ మారుమోగాయి.గురువారం మహా శివరాత్రి కావడంతో నియోజకవర్గవ్యాప్తంగా ప్రజలు మహా శివరాత్రి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. గుడిహత్నూర్ మండలంలోని గుడిహత్నూర్, సీతాగొంది, మన్నూర్ లలో శివాలయాలు ఉదయం నుంచే భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాల ఎదుట భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు.

 శివాలయాలను దర్శించుకున్న ఆదిలాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్  రంగినేని మనీషా పవర్ దంపతులు...

 ఆదిలాబాద్ , పెన్ పవర్ 

మహాశివరాత్రిని పురస్కరించుకొని గురువారం  ఆదిలాబాద్ లోని వాల్మీకి నగర్ లో గల శివాలయం, జైనథ్ మండలం లోని గూడా, కోరాట గ్రామాల్లో ని శివాలయ ఆలయాల్లో ఆదిలాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ రంగినేని మనీషా పవన్ రావు టిఆర్ఎస్ నాయకులతో కలిసి  దర్శించుకొని  ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రజలకు, రైతులకు అంతా మంచి జరగాలని కోరారు.  ఈ సందర్భంగా ఆ గ్రామానికి వెళ్లినా మాజీ మున్సిపల్ చైర్మన్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు వార్డు సభ్యులు టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

15 నుంచి స్వేరోస్​ భీం దీక్షలు ప్రారంభం

 15 నుంచి  స్వేరోస్​    భీం దీక్షలు  ప్రారంభం

అదిలాబాద్, పెన్ పవర్ 

 జ్ఞాన సముపార్జన కోసం స్వేరోస్  ఆధ్వర్యంలో  ఈ నెల 15 వ తేదీ నుంచి భీం దీక్షలను చేపట్టనున్నట్లు స్వేరోస్ డిస్ట్రిక్​ ప్రెసిడెంట్ పెంటపర్తి ఊశన్న తెలిపారు.   గురువారం  జైనథ్ మండల కేంద్రంలో భీమ్ దీక్షల వాల్ పోస్టర్లు విడుదల చేశారు.   ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ   భీమ్ దీక్షలనేవే   జ్ఞాన దీక్షలన్నారు.  భీమ్ దీక్షలు  కాన్షీరాం జయంతి మార్చి 15 నుంచి  భారత రత్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి ఏఫ్రిల్ 14  వరకు కొనసాగుతుతాయన్నారు.  వ్యక్తి మానసిక వికాసం,ఇంద్రియ నిగ్రహం, జ్ఞాన సముపార్జన,శారీరక దృఢత్వం,ఆర్యోగ్య పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేయడమే ఈ దీక్షల ముఖ్య ఉద్దేశ్యమన్నారు.   కార్యక్రమంలో జైనథ్ మండల స్వేరోస్ ఉపాధ్యక్షుడు గడుగు మహేందర్, జిల్లా స్వేరో సర్కిల్ ప్రధాన కార్యదర్శి ఆశన్న, స్వేరోస్ నాయకులు దాగిరి భగవాన్  తదితరులు పాల్గొన్నారు.

రాజన్న బిడ్డ షర్మిల గారికి అండగా

 రాజన్న బిడ్డ షర్మిల గారికి అండగా

 ఆదిలాబాద్ , పెన్ పవర్


తెలంగాణ లో రాజన్న రాజ్యం స్థాపనే లక్ష్యంగా,స్వర్గీయ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయసాధనే లక్ష్యంగా దూసుకొస్తున్న రాజశేఖర రెడ్డి గారి ముద్దుల తనయ  వైయస్ షర్మిలమ్మ ను హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో కలిసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టిటిడి ఎల్ ఎ సి మెంబర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంఛార్జి బెజ్జంకి అనీల్ కుమార్ తన పూర్తి మద్దతు తెలిపారు. తుదిశ్వాస వరకు రాజన్న కుటుంబానికి అండగా ఉంటామన్నారు.విద్యార్థి దశలో రాజశేఖరరెడ్డి గారితో, తర్వాత వైయస్ జగన్మోహన్ రెడ్డితో జగనన్న సీఎం అయ్యె వరకు చెప్పులు వేసుకోకుండా తన అభిమానాన్ని చాటుకున్నారు. ఇపుడు షర్మిలమ్మ తో కలిసి నడవబోతున్నారు. తనకు ఆ కుటుంబం పై ఉన్న విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు చాటుతున్నారు.మార్చి నెల చివరి వారంలో జరిగే ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిటిటిడి ఎల్ ఎ సి మెంబర్ తదితరులు పాల్గొన్నారు.

మట్కా స్థావరాలపై కొనసాగుతున్న టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు..

 మట్కా స్థావరాలపై కొనసాగుతున్న టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు..

 ఇద్దరూ మట్కా నిర్వాహకుల అరెస్టు,  టు టౌన్​లో  కేసు నమోదు..

 ఆదిలాబాద్ ,పెన్ పవర్

ఆదిలాబాద్ టు టౌన్  పోలీస్ స్టేషన్ పరిధిలోని సుందరయ్య నగర్ కాలనీలో గురువారం మధ్యాహ్నం మట్కా నిర్వహిస్తున్నారనే  పక్కా  సమాచారం తో   టాస్క్ ఫోర్స్ సిఐ ఈ. చంద్రమౌళి ఆధ్వర్యంలో   ఎస్ఐ కె విష్ణు ప్రకాష్ తో కలిసి చాకచక్యంగా నలువైపుల నుండి మట్కా స్థావరంపై దాడులు నిర్వహించారు.  ఈ క్రమంలో సుందరయ్య నగర్ కాలనీకి చెందిన ఇద్దరు మట్కా నిర్వాహకులు  లహనే సుధాం (42) .షేక్ ఇర్షాద్ (28) లను అదుపులోకి తీసుకున్నారు.  వారి నుంచి  మట్కా మట్కా చిట్టిలు రూ 3,420- నగదు స్వాధీనం చేసుకొని  పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు, ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ ఏఎస్సై ఎస్కే తాజుద్దీన్, హెడ్ కానిస్టేబుళ్లు శోభన్ కుమార్, రమేష్ కుమార్, కానిస్టేబుళ్లు ఠాకూర్ జగన్ సింగ్, సయ్యద్ రహత్, మంగల్ సింగ్, ఎం ఏ కరీం, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...