Followers

మట్టి కుండ ఆరోగ్యానికి అండ

 మట్టి కుండ ఆరోగ్యానికి అండ

మట్టి పాత్రలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నా పట్టణ వాసులు

ప్లాస్టిక్ పాత్రలకు గుడ్ బాయ్

లక్షెట్టిపెట్,పెన్ పవర్



ప్లాస్టిక్ పాత్రలకు గుడ్ భాయ్ చెప్పి మట్టితో తయారు చేసిన పాత్రలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పట్టణంలోని జాతీయ రహదారిలపై మట్టితో తయారు చేసిన వివిధ రకాల పాత్రలు విక్రయాలకు సిద్ధంగా ఉన్నాయి.అందులో మట్టితో తయారు చేసిన వాటర్ బాటిళ్లు,కుండలు,కూజాలు,టి కప్పులు,రొట్టె లు చేసుకోవడానికి  తావ వంటి పాత్రలు అందుబాటులో ఉన్నాయి.నల్లటి కుండలు మూతతో సహా రూ.120 నుండి రూ.200 వరకు,టీ కప్పులు అర డజన్ రూ.250.వాటర్ బాటిల్ రూ.200,కుజ రూ.150 ధరలు పలుకుతున్నాయి.వీటిని కొనుగోలు చేసేందుకు పట్టణ వాసులు ఆసక్తి కనబర్చుతున్నారు.

14న జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం

 14న జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం

మంచిర్యాల, పెన్ పవర్

మంచిర్యాల జిల్లాలో కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీ నుండి మంచిర్యాల జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం కానున్నట్లు ఏఐసిసి సభ్యులు మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు శుక్రవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ హెచ్సఎ అధ్యక్షులు అజారుద్దీన్, టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎల్సి నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రి డి. శ్రీధర్ బాబు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, సీతక్క హాజరుకానున్నారని ఆయన వివరించారు. టోర్నమెంట్లో పాల్గొనే అన్ని జట్లుకు చెందిన క్రీడాకారులు యూనిఫామ్ ధరించి మధ్యాహ్నం 3 గంటలకు బాయ్స్ హైస్కూల్ గ్రౌండ్ కు హాజరుకావాలని ఆయన సూచించారు. పోటీల ప్రారంభంలో భాగంగా డ్రా జ్యోతిపజ్వల, టర్చ్ మార్చ, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, టిపిసిసి అధికార ప్రతినిధి చిట్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

17న తైబజార్ నిర్వహణకు బహిరంగ వేలం

 17న తైబజార్ నిర్వహణకు బహిరంగ వేలం

మంచిర్యాల ,పెన్ పవర్ 

మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో 2021 - 22 సంవత్సరానికి మేకల మండి, తైబజార్, ఫ్లాట్ ఫామ్స్, మున్సిపల్ దుకాణాల నిర్వాహకులు ఈ నెల 17న బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కమిషనర్ జి స్వరూప రాణి తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఈ నెల 10వ తేదీన జరగాల్సిన వేలం పాటకు దరఖాస్తులు తక్కువగా రావడంతో మున్సిపాలిటీ ఆదాయానికి నష్టం జరిగే అవకాశం ఉండడంతో వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. ఈ నెల 17న జరిగే బహిరంగ వేలంలో ఆసక్తి ఉన్న వారు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కమిషనర్ కోరారు.

ఎమ్మెల్సీ గెలుపు కోసం టిఆర్ఎస్ విస్తృత ప్రచారం

 ఎమ్మెల్సీ గెలుపు కోసం టిఆర్ఎస్ విస్తృత ప్రచారం


కేసముద్రం , పెన్ పవర్ 

 టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని టిఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కేసముద్రం పట్టణ అధ్యక్షులు గుగులోతు వీరు నాయక్  ఆధ్వర్యంలో కో ఆప్షన్ సభ్యులు నజీర్ అహ్మద్, ఉపసర్పంచ్ ముత్యాల నాగమణి శివకుమార్  మండల  నాయకులు నల్ల కిరణ్, వార్డు సభ్యుడు నర్సింగం వెంకటేశ్వర్లు, రేవంత్, బద్రు నాయక్, బట్టు రమేష్, బాలుమోహన్ , నర్సింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా వైయస్సార్ సిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

 ఘనంగా వైయస్సార్ సిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 


పెన్ పవర్, కందుకూరు

శుక్రవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వై ఎస్ ఆర్ సి పి జెండా ఎగురవేసి ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ ఎన్ని సంవత్సరాలు నుండి స్థాపించామని కాదని స్థాపించిన అనతికాలంలోనే దేశంలోనే మంచి గుర్తింపు వచ్చిందన్నారు. తను తీసుకుంటున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వల్ల ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని యావత్ ప్రపంచం ప్రశంసలతో ముంచెత్తుతున్నారు అని అన్నారు. ఇటీవల ప్రశాంతత పోకుండా  ఎన్నికలు జరిగిన తీరు ఇంతకుముందు ఎప్పుడూ మన జిల్లాలో ఇలా జరగలేదన్నారు. చిన్న ఘర్షణలకు ఎలాంటి తావు లేకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకున్నారని అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముఖ్యమంత్రి జగన్ కు జై కొట్టి పంచాయతీ ఎన్నికల ఫలితాలు నిదర్శనమన్నారు. రేపు జరగబోయే  మున్సిపల్ ఫలితాలు కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రజలు జై కొడుతున్నారని సర్వేలు చెబుతున్నాయి అన్నారు. ఒకే వ్యక్తి తాను తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్ర భవిష్యత్తుకు పార్టీకి భవిష్యత్తుకై పునాదులు వేస్తూ అన్ని తానై రాష్ట్రంలో పేద వారి కళ్ళల్లో వెలుగు చూసేలా రాష్ట్రంలో పథకాలు ఉన్నాయన్నారు. కొంతమంది నిరాశా నిస్పృహలతో రాజకీయాలు చేస్తున్నారని అలాంటి వారిని ఎవరిని ప్రజలు నమ్మరు అని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ నమ్మినవారిని, పార్టీని నమ్ముకున్న వారిని చేరదీస్తూ అందలం ఎక్కిస్తూ ఉన్నారని అన్నారు. అంతకుముందు పార్టీ జెండా ఎగురవేసి అందరికీ వై ఎస్ ఆర్ సి పి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్వీట్లు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు వసంతరావు, గంగిరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, శివ, తొట్టెంపూడి శ్రీనివాసులు, పొడపాటి నరసింహం, గుమ్మడి నరసయ్య, చీమల రాజా, దారం మాల్యాద్రి, కుమ్మర బ్రహ్మయ్య, ఆవుల మాధవరావు, శ్రీనివాసులు రెడ్డి, బ్రహ్మారెడ్డి, వెంకా రెడ్డి, గోనుగుంట వెంకటేశ్వర్లు (తిమోతి), మద్దాలి జగదీష్, నవులూరి శ్రీనివాసరావు, కృష్ణారెడ్డి, మేకనబోయిన శ్రీనివాస రావు, కోటప్ప నాయుడు, తల్లపనేని వెంకటేశ్వర్లు, కామాక్షి నాయుడు, చింతలపూడి మోహన్ రావు, మద్దెల కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

కృత్రిమ గర్భధారణ పై పశుపోషకులకు అవగాహన

 కృత్రిమ గర్భధారణ పై పశుపోషకులకు   అవగాహన

పెన్ పవర్,వలేటివారిపాలెం

 మండలంలోని చుండి  గ్రామంలో జాతీయ కృత్రిమ గర్భదారణ కార్యక్రమము   పై  పశుపోషకులకు అవగాహన  శుక్రవారం నిర్వహించారు. పోకూరు పశు   వైద్యాధికారి డాక్టర్ జె శివరామకృష్ణ  అధ్వర్యంలో  ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమములో ముఖ్య అతిథిగా వలేటివారిపాలెం పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ కె వి బ్రహ్మయ్య పాల్గొన్నారు.  ఈకార్యక్రమంలో పోకూరు పశువైద్యులు మాట్లాడుతూ ఈ పధకం కింద గ్రామంలో 300 పశువుల కు ఎద సూదులు చేసి  100మేలు జాతి దూడలను పుట్టించడమే ఈ  పధకం ముఖ్య ఉద్దేశం అన్నారు.    సాధారణ వ్యాధులు , దూడలకు నట్టల నివారణ   మందులు పంపిణీ చేశారు.  సర్పంచ్ ఇరపని సతీష్ మాట్లాడుతూ పశుసంవర్ధక శాఖ అమలు చేస్తున్న పధకాలను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పధకాల సద్వినియోగం తో మేలుజాతి పశు సంపదను పెంపొందించుకోవాలని అన్నారు. అనంతరం సహాయ సంచాలకులు డాక్టర్ బ్రహ్మయ్య     రైతులకు పశువుల లో వచ్చు వ్యాధుల గురించి  అవగాహన కల్పించారు.  పశుసంవర్ధక శాఖ సహాయకులు కిరణ్, రమేష్,తిరుణ్, అశోక్, వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.

పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలి

 పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలి           


   పెన్ పవర్, కందుకూరు

 పొగాకు రైతులకు ఈ సంవత్సరం అధిక వర్షపాతం వల్ల పెట్టుబడి ఎక్కువైందని కావున ప్రారంభ ధర 200 రూపాయలు గా ఉండాలని పొగాకు రైతుల ఉత్పత్తిదారుల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ మాదాల వెంకటరమణయ్య కోరారు. శుక్రవారం పట్టణంలోని 27 వేలం కేంద్రంలో రైతు సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  మాదాల వెంకట రమణయ్య మాట్లాడుతూ పొగాకు సరాసరి ధర 180 రూపాయలు తగ్గకుండా చూడాలని అన్నారు. రైతులు అమ్మకం నందు గ్రేడ్ సక్రమంగా చేయించి బేల్లలను అమ్మకమునకు తెచ్చి మంచి ధర రాబట్టుకోవాలి అన్నారు. ఇండెంట్ ఇచ్చిన ప్రతి వ్యాపారస్తుడు తొలి రోజు నుండే వేలంలో  పాల్గొనాలని అన్నారు. కొంతమంది ప్రైవేటు వ్యక్తులు 27వ  వేలం కేంద్ర  అధికారులు సక్రమంగా పనిచేయడం లేదని, రైతుల రిజిస్ట్రేషన్ నందు జాప్యం చేస్తున్నారని, వ్యాపారస్తులు రైతులు సిబ్బంది మధ్య ఘర్షణ ఉన్నాయని ప్రధాన అధికారి ని తక్షణమే బదిలీ చేయాలని రైతులు కోరినట్లుగా పత్రికలో ప్రకటించారని, దానిలో ఎలాంటి వాస్తవం లేదని రైతు సంఘం కొట్టిపారేసింది. ఎటువంటి రైతు వ్యతిరేక కార్యక్రమాలు ఇక్కడ జరగడం లేదని, ఒకవేళ అలాంటి ఏమైనా ఉంటే రైతు సంఘం రైతుల దృష్టికి తీసుకువస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాదాల వెంకటరమణయ్య, వడ్లమూడి రామకృష్ణ, తానికొండ రమణయ్య, మల్లికార్జున, కృష్ణారెడ్డి, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...