Followers

వైసిపి జిల్లా కార్యదర్శి తోట ఆధ్వర్యంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

 వైసిపి జిల్లా కార్యదర్శి తోట ఆధ్వర్యంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

తాళ్ళపూడి, పెన్ పవర్

రాష్ట్ర మహిళ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ తానేటి వనిత  ఆదేశాల మేరకు తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామంలో వైఎస్ఆర్సిపి జిల్లా కార్యదర్శి మరియు వైస్ ప్రెసిడెంట్ తోట రామకృష్ణ  ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు పూర్తిచేసుకుని 11 సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంలో పెద్దేవం సినిమా హాల్ సెంటర్ వైఎస్ఆర్ విగ్రహం వద్ద పూలమాలవేసి ఘనంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు జరిగాయి. అనంతరం తోట రామకృష్ణ మాట్లాడుతూ నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుని ఎనలేని సేవలు రాష్ట్ర ప్రజలకు అందజేస్తున్న ఇలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఎన్నడూ చూడలేదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పెద్దేవం గ్రామ ప్రెసిడెంట్  తిగిరిపల్లివెంకటరావు, గ్రామకమిటీ అధ్యక్షులు నరాల శెట్టి వీర వెంకట్రావు, వార్డు మెంబర్లు తిగిరిపల్లి రమేష్, యండపల్లి లక్ష్మణరావు, స్వర్ణకుమారి, కంకిపాటి రవి, వైఎస్ఆర్సీపీ నాయకులు వేము రామారావు, నల్లాకుల వేణు, కోడి గంగారావు, బెజవాడ వీర్రాజు, యండపల్లి పెద్దకాపు, చామకూర సత్యనారాయణ,  ఇంటి వెంకటేశ్వర్లు, యండపల్లి కృష్ణార్జునులు, కవల నాగేశ్వరరావు, జొన్నకూటి పోసిరాజు, పేరుగుల వీర్రాజు, నామన వెంకటేశ్వరరావు,గెడ్డం వెంకటేశ్వరరావు, మరియు కార్యకర్తలు, అభిమానులు, గ్రామ వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా పెద్దేవం హై స్కూల్ లో మిడ్ డే మీల్స్ లో స్కూల్ పిల్లలకు స్వీట్లు పంచి పెట్టి వాళ్లతో కలిసి భోజనం చేసిన ప్రెసిడెంట్ తిగిరిపల్లి వెంకట్రావు,  వైఎస్ఆర్సిపి జిల్లా కార్యదర్శి మరియు వైస్ ప్రెసిడెంట్ తోట రామకృష్ణ, మరియు వైఎస్ఆర్సిపి నాయకులు.

కొండెంగల భయం తో కోతులు పరార్ అయినాయి

 కొండెంగల  భయం తో  కోతులు  పరార్  అయినాయి 

నర్మాల గ్రామం లో కనిపించడం లేదు  కోతులు

వనరులతో కష్టాలు పోయినాయి

గంభీరావుపేట,పెన్ పవర్

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామం లో  వానర  చేష్టలకు  గ్రామ ప్రజలు  విసిగి పోయారు.  కిష్కీoదకాండకు కోతుల తో  ఇల్లు గుల్లవుతున్నాయి , ఇల్లు కప్పు ను పాడుచేస్తున్నా యిపంటలు  పొలం లో పాడుచేస్తూన్నాయి. ఊళ్ళో  పంట పొలం లో అని తేడా లేకుండా  కోతులు  చేస్తున్నా బీభత్సా నికి  అడ్డు కట్ట వెయ్యాలని  భావించారు కోతుల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.   గ్రామపంచాయతీ నర్మాల గ్రామ సర్పంచ్ఎడబోయినరాజు,సిబ్బంది,  గ్రామ వార్డు సభ్యులు సిబ్బంది.పాలక వర్గం గ్రామస్తులు   గ్రామస్తూలoతాచర్చిoచి  ఒక నిర్ణయనికివచ్చారు. తల కొంత డబ్బులు పోగు చేసి సుమారు  40  వేల రూపాయలతో  రెండు కొండెంగలు , కొండేమచ్చులు కొనుగోలు చేసి నర్మాల గ్రామం కు  తీసుకొని వచ్చారు ఇద్దరు కూలీ లను ఏర్పాటు చేసినారు  సకాలి  దాసరం  , వనం  సత్యనారాయణ ,  వీరు  కొండెంగలను వాటిని ప్రతి రోజు   ఉదయం  మరియు  సాయంత్రం   గల్లీ గల్లీ  సంధి విధుల్లో తిరుగుతూన్నారు. ఇళ్లల్లో  కోతులు   కానీపియ్యడం లేదు అంతే కాకుండా  గ్రామ ప్రజల పొలం వద్దకు సమీపంలో ఉన్నా పంట పొలం వద్దకు  తీసుకెళ్తున్నారు  అక్కడ  గుంపు గుంపులు ఉన్న కోతులు  కొండెంగలను చూసి  ఒక్క ఒక్క టి  పరార్  అయినాయి.  కావునా 25 రోజు లనుండి  గ్రామం లో  కోతులు కనిపించడం  లేదు మచ్చుకుక్కకు చూద్దాం మన్నా ఒక కోతి  గ్రామంలో కనిపించడం లేదుఅని అందరూ గ్రామస్తులు  ఊపిరిపీల్చుకున్నారు. ఇంటికి కొంత పోగు చేసి కొండేoగలను త్రిప్పే వారికీ కూలీ  డబ్బులు చేస్తున్నారు   కానీ  వారు డబ్బులు తీసుకొకుండడబ్బులు  వద్దు  అంటున్నారు ఖుషి కొద్ధి  కొండెంగలను తీసుకొని  తిరుగుతున్నారు. ప్రస్తుతంనికి  కోతులబేడద లేదని తప్పి ప్రశాంతంగాఉన్నాం అని  వ్యక్తం చేసున్నాము  అని  అన్నారు  అంతకు  ముందు  రోడ్డు పై పోదాం అన్న  భయం పొలంవద్దకు  వెళ్దాంమన్నా కోతుల తో  విపరీతంగా  భయం గా ఉండేది  ఇప్పుడు  బాధా  తప్పిపోయినది ప్రజలు  అంటున్నారు. సమిష్టి  సహకారం తో నే  చేసుకుంటు న్నా మని  గ్రామ  సర్పంచ్ఎడబోయిన రాజు అన్నారు.  సకాలి  దసారం , వనం  సత్యం ,  రోజు,ఉదయం  , సాయంత్రం    కొండెంగలను త్రిప్పుతు కరాబ్ ఐనా  కూరగాయలు ,  ఏవి  అయినా  పాడవెయ్యద్దు కొండెంగలకు  ఎయ్యాలని  వారు  అన్నారు ,  గ్రామం లో   ఆడుతూ  పడుతూ   ఇద్దరు సంతోషం గా  తిరుగుతు సకాలి దసారం , వనం సత్యంవాళ్లకు కు, నర్మాల గ్రామస్తులు పాలక వర్గం  సభ్యులు  పెద్ద లు వారికీ ఎంతగానో కృతజ్ఞతలు  తెలిపారు.

తాళ్ళపూడిలో వైభవంగా లింగోద్భవ జ్యోతి దర్శనం

 తాళ్ళపూడిలో వైభవంగా లింగోద్భవ జ్యోతి దర్శనం

తాళ్ళపూడి, పెన్ పవర్

తాళ్లపూడి లో మహా శివరాత్రి లింగోద్భవ జ్యోతి దర్శనం భక్తులకు కనువిందు చేసింది.  మహా శివరాత్రి వేడుకలను గురువారం  గంగా పార్వతీ సమేత గౌత మేశ్వర స్వామి సన్నిధి లో విన్నూత్న రీతిలో నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానాలు హిందూ ధర్మ ప్రచార పరిషత్ పశ్చిమగోదావరి జిల్లా వారిచే పార్వతీ కల్యాణం హరికథ ,గో పూజ, ప్రసాద వితరణ జరిగింది.   హరికథా భాగవతారిణి కి మహిళా సభ్యులు సన్మానం చేసారు. లోల్లా భట్ ఉమా మహేశ్వర బాల భక్త భజన మండలి సభ్యులు, గౌతమేశ్వర స్వామి ఆలయ పరిరక్షణ అభివృద్ధి కమిటీ, గణపతి యువజన సంఘం  సభ్యుల ఆధ్వర్యం లో మహా శివరాత్రి వేడుకలను టి.టి.డి.పురాణ ఉపన్యాసకులు పరస రాధా కృష్ణ జాగరణ పూజలు నిర్వహించారు. సీతా రాముల తో కూడిన ద్వాదశ జ్యోతిర్లింగాలను ఊరేగింపు గా తీసుకు వచ్చి సామూహిక పూజలు,అభిషేకాలు  జరిపారు.లింగోద్భవ సమయంలో అర్ధ రాత్రి పన్నెండు గంటలకు ముప్పై అడుగుల ఎత్తులో ఒకే రీతిలో మూడు నిమిషాలు వెలిగే లింగోద్భవ జ్యోతి ని వెలిగించారు. వందలాది భక్తులు జ్యోతిని దర్శిస్తూ శివ నామ స్మరణ చేసారు. పరస రాధా కృష్ణ వ్యాఖ్యానం చేసారు.కవల శ్రీనివాస్, శింగం శివ రామ కృష్ణ, డివివి సత్య నారాయణ, కిల్లాని లక్ష్మణ రావు,రేకపల్లి వీరాస్వామి, జగన్నాధం మాస్టారు, దూడల గోపాల రావు, కాసాని వేంకటేశ్వరరావు, అప్పారావు, తదితరులు  ఏర్పాట్లు పర్యవేక్షించారు.

గజ్జరం సర్పంచ్ గండి రాంబాబు ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం

 గజ్జరం సర్పంచ్ గండి రాంబాబు ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం

తాళ్ళపూడి, పెన్ పవర్

గజ్జరం గ్రామంలో వైయస్సార్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సెంటర్ లో  ఉన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి గ్రామ సర్పంచ్ గండి రాంబాబు   పూలమాల వేసారు. అనంతరం  గ్రామ కన్వీనర్ గన్నిన రత్నాజీ, నాయకులు వల్లభనేని శ్రీహరి, కాకర్ల చంద్రశేఖ, గుంటు చిన్నబ్బాయి, మరియు వైయస్సార్సీపీ కార్యకర్తలు  తమ అభిమాన నాయకులకు పూల మాలలు వేసారు. వచ్చిన నాయకులు, కార్యకర్తలు పార్టీ పట్ల వారికున్న ప్రేమాభిమానాన్ని స్వీట్స్ పంచి చాటుకున్నారు. అనంతరం పంచాయతీ ఆఫీస్ నందు నాయకులు దివంగత ముఖ్యమంత్రి   రాజశేఖరరెడ్డి,  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  చిత్రపటాలకు పూల మాలలతో తమ అభిమానాన్ని ఘనంగా చాటారు.

శివపార్వతుల కళ్యాణం వీక్షించిన పరిగి ఎమ్మెల్యే

 శివపార్వతుల కళ్యాణం వీక్షించిన పరిగి ఎమ్మెల్యే

వికారాబాద్ , పెన్ పవర్

వికారాబాద్ జిల్లా పరిగి మండలం లోని సయ్యాద్ పల్లి గ్రామంలొ మహాశివరాత్రి సందర్భంగా పర్వతి పరమేశ్వరి కళ్యాణం సందర్భంగా పరిగి శాసన సభ్యులు కే.మహేష్ రెడ్డి హజర్తెనారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్వతీ పరమేశ్వరులు కల్యాణం కు చూడడం ఎంతో పూన్య మని అయన అన్నారు.అనంతరం గ్రామంలోని పట్ట బద్రులను కలసి వాణిదేవికి ఓటు వెయ్యాలని మహేష్ రెడ్డి కోరారు.

ఎమ్మెల్సీ ఎన్నికలకు వామపక్షాల ప్రచారం

 ఎమ్మెల్సీ ఎన్నికలకు వామపక్షాల ప్రచారం                                             

 కేసముద్రం ,పెన్ పవర్     

వామపక్షాలు బలపరిచిన నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి బి జయ సారధి  రెడ్డి.  విజయాన్ని కాంక్షిస్తూ ఈరోజు ఇనుగుర్తి గ్రామంలో గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత ఒద్దిరాజు కిషన్ వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల ఓట్లను పలు గ్రామాలలో తిరిగి పట్టభద్రులను అభ్యర్థిస్తున్నారు వామపక్ష నాయకులు. ఈ కార్యక్రమంలో మారుతి నేనే పాపారావు, చాగంటి కిషన్ చెప్పు శ్రీధర్ స్టాలిన్ ఇమామ్ అలీ తదితరులు పాల్గొన్నారు

 పోరాడే వ్యక్తి ని గెలిపించండి

నెల్లికుదురు,పెన్ పవర్

  వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి ప్రజా సమస్యల కోసం  పోరాడే వ్యక్తి  అయినా జయసారథి రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వెసి గేలిపించాలని కోరుతూ శుక్రవారం మండలంలోని నైనాలలో ఇంటింటికి తిరిగి ఓటర్లను కలిసి ప్రచారంనిర్వహించారు. ప్రజా సమస్యలపై పోరాడేది వామపక్షాలుమాత్రమే  అన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో సీపీఐ,సిపిఎం మండల కార్యదర్శులు వరిపల్లి వెంకన్న,తిలక్ బాబు నాయకులు పెరుమాండ్లబాబుగౌడ్,రామరాజు సమ్మయ్య,గార అనిల్,వీరన్న ఉప్పలయ్య,వెంకన్న తోపాటు తదితరులు పాల్గొన్నారు

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...