ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ
పెద్దాపురం,పెన్ పవర్
ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పెద్దాపురం రెవిన్యూ డివిజనల్ అధికారి ఎస్ మల్లి బాబు తెలిపారు. శనివారం పెద్దాపురం డివిజన్లకు సంబంధించి స్థానిక ఆర్ డి ఓ కార్యాలయంలో 14వ తేదీ జరగబోవు ఎమ్మెల్సీ పోలింగ్ కు సంబంధించి 12 మండలాలకు, పోలింగ్ సిబ్బందికి పోలింగ్ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఆర్ డి ఓ ఎస్ మల్లి బాబు విలేకరులతో మాట్లాడుతూ 14వ తేదీ ఆదివారం డివిజన్లోని 11 మండలాల్లో ఎంపీడీవో కార్యాలయంలోను, రంగంపేటలో తాసిల్దారు కార్యాలయంలో ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు 1,039 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కును నమోదు చేసుకున్నారని తెలిపారు ఈరోజు ప్రత్యేకమైన బస్సులలో పోలింగ్ సిబ్బందికి పోలింగ్ సామాగ్రి అందజేసి వారిని పోలింగ్ కేంద్రాలకు తరలించామని చెప్పారు పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించామని, ఎటువంటి సమస్యలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు పోలింగ్ ఉదయం ఎనిమిది గంటల నుండి ప్రారంభమై 4గంటలకు ముగుస్తుందని, ఎమ్మెల్సీ కౌంటింగ్ సంబంధించి ఈనెల 17వ తేదీన కాకినాడ జేఎన్టీయూలో కౌంటింగ్ పక్రియ ప్రారంభం అవుతుందని ఆర్డిఓ తెలిపారు.








