Followers

భీమేశ్వరాలయంలో హైకోర్టు జడ్జి దంపతుల ప్రత్యేక పూజలు

 భీమేశ్వరాలయంలో హైకోర్టు జడ్జి దంపతుల ప్రత్యేక పూజలు

సామర్లకోట,పెన్ పవర్ 

పంచారామా క్షేత్రమైన సామర్లకోట శ్రీ కుమార రామ భీమేశ్వరాలయంలో శనివారం ఉదయం హైకోర్టు జడ్జి కె సురేష్ రెడ్డి దంపతులు ఆ ప్రత్యేక పూజలు చేపట్టారు. మహా శివరాత్రి పర్వదినాలను పురష్కరించుకుని పంచారామాల సందర్శనలో బాగంగా జడ్జి దంపతులు ఆలయానికి విచ్చేయగా వారికి ఆలయ మర్యాదల చొప్పున ఆలయ కార్యనిర్వహణాధికారి పులి నారాయణ మూర్తి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారు ఉపాలయాల్లో దైవతా మూర్తులను దర్శించుకుని భీమేశ్వరుని మూల విరాట్ నందు, స్వామివారీ, అమ్మవారల గర్భాలయాల్లోనూ ప్రత్యేక పూజలను చేపట్టారు. అనంతరం జడ్జి దంపతులను ఆలయ నంది మండపంలో పండితాశీర్వచన కార్యక్రమాలను నిర్వహించి ఘనంగా ఆశీర్వదించారు. ఈ సందర్భంగా హైకోర్టు జడ్జి సురేష్ రెడ్డి మాట్లాడుతూ మహా శివరాత్రి పర్వదినాలు సందర్భంగా వంచారామాలతో పాటు పిఠాపురం పాదగయను సందర్శించి సామర్లకోట భీమేశ్వరాలయానికి విచ్చేసినట్టు చెప్పారు. తదుపరి ద్రాక్షారామా దర్శించుకుని తిరిగి తమ గృహానికి బయలుదేరుతున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో వారి వెంట జిల్లాకు చెందిన పలువురు జడ్జిలు, ఆలయ అధికారులు, పోలీసు అధికారులు, పండితులు ఉన్నారు.

డిటి రాజబాబు ఆధ్వర్యంలో పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి

 డిటి రాజబాబు ఆధ్వర్యంలో పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి

తాళ్ళపూడి, పెన్ పవర్

తాళ్ళపూడి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఆదివారం జరగబోయే ఉభయగోదావరి జిల్లాల టీచర్ ఎం యల్ సి ఎన్నికల కు తహశీల్దార్ మరియు ఎన్నికల అధికారి ఎం.నరసింహమూర్తి ఆదేశాల మేరకు ఏర్పాట్లు సిద్ధం చేయబడ్డాయి. డిటి రాజబాబు మాట్లాడుతూ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ సమయం అని, ఈ సమయంలో ఉపాద్యాయులు ఓటు వేయవచ్చునని, తాళ్ళపూడి మండలం లో ఓటు హక్కు గల ఉపాద్యాయులు 61 మంది అని, శనివారం జరగబోయే ఎన్నికల కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో యస్ఐ జి.సతీష్, పోలీస్ సిబ్బంది, విఆర్వో లు ప్రకాష్, లీలావతి, స్వర్ణ, ప్రిసైడింగ్ ఆఫీసర్, హెల్పర్స్, తదితరులు పాల్గొన్నారు.

పోలింగ్, కౌంటింగ్ సందర్భంగా మద్యం దుకాణాలు బంద్

 పోలింగ్, కౌంటింగ్ సందర్భంగా మద్యం దుకాణాలు బంద్

విశాఖపట్నం, పెన్ పవర్

రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్కు అనుగుణంగా  ప్రభుత్వ GORt.No.70 MA&UD(G2) విభాగం, తేదీ22.02.2021 ననుసరించి జిల్లాలో పోలింగ్ జరిగే్ విశాఖ నగరం, నర్సీపట్నం, ఎలమంచిలి పట్టణప్రాంత పరిధిలో గల మద్యం దుకాణాలను పోల్ ముగియడానికి 48 గంటలు ముందు నుండి అనగా 8వ తేదీ సాయంత్రం నుండి పోలింగ్ రోజు వరకు, ఇంకా ఓట్ల లెక్కింపు జరిగే 14వ తేదీన పూర్తిగా మూసివేస్తున్నట్లు విశాఖ జిల్లా కలెక్టరు, జిల్లా ఎన్నికల అథరిటీ  వి.వినయ్ చంద్  ప్రకటించారు.

ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి పకృతి పరిరక్షణ కోసం పాటుపడాలి


 ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి పకృతి పరిరక్షణ కోసం పాటుపడాలి
సామర్లకోట,పెన్ పవర్

పెదబ్రహ్మదేవం గ్రామం లో గల 6వ వార్డు లో అవార్డు సభ్యులు శ్రీమతి తోటకూర దుర్గా లక్ష్మి గంగాధర్ తమ పెళ్లి రోజు సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.దుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈసంధర్భంగా ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల మీడియా మేనేజర్ జాతీయ పర్యావరణ మిత్ర అవార్డు గ్రహీత తోటకూర గంగాధర్ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడాలి అని అన్నారు.

తమ పెళ్లి రోజు సందర్భంగా శుభాకాంక్షలు శుభాశీస్సులు అందజేసిన బంధు మిత్రులకు శ్రేయోభిలాషులకు మిత్రులకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.ఈకార్యక్రమంలో మలకల సూర్యారావు, వరాలబాబు, తోటకూర సత్తిబాబు, బండారు కొండ, తోటకూర పెదరామారావు,ఆటపాకల సూరిబాబు & బ్రదర్స్,తాడాల దొరబాబు తదితరులు పాల్గొన్నారు.

బడి రుణం తీర్చుకుంటున్నాము పూర్వం విద్యార్థులు

 బడి రుణం తీర్చుకుంటున్నాము పూర్వం విద్యార్థులు

పెన్ పవర్,ఆలమూరు

    లక్షలు పోసి కార్పొరేట్ పాఠశాలల్లో చదివించాలంటే సామాన్యులకు ఎంతో భారం కార్పొరేట్ పాఠశాలల్లో ఆర్భాటాల్లో మునిగి  ప్రభుత్వ పాఠశాలల్లో వసతులుండవనే అపోహలు ఉన్నాయి చదువు, ఆటలు, కళలు అన్నింటితో పాటు కార్పొరేట్ పాఠశాలలను మించేలా ఇక్కడ సదుపాయాలు సమకూర్చుతున్నారు. ఆలమూరు మండలం జొన్నాడ గ్రామంలో  శ్రీ ద్వారంపూడి సత్యనారాయణ రెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2002-03 సంవత్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్థులు శనివారం  పాఠశాల ఆవరణలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. బడి రుణం తీర్చుకోవడంతో పాటు బాలల భవితకు చేయూతనివ్వాలనే ఉద్దేశంతో  తలో చేయి వేసి బడిని అభివృద్ధి బాట పట్టించేందుకు పాఠశాలల్లో చదివే విద్యార్థినుల సౌకర్యార్థం పాఠశాలల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన   గ్రంధాలయంలో సుమారుగా 50 వేల రూపాయల ఖర్చుతో కబోర్డులను (బీరువాలు) అత్యాధునిక హంగులతో  ఏర్పాటు చేసి వాటిని ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆ గ్రామ మాజీ సర్పంచ్ ద్వారంపూడి నాగేంద్ర సత్యన్నారాయణ రెడ్డి (దొరబాబు) ప్రారంభించారు. 

అనంతరం దొరబాబును పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ద్వారంపూడి విక్రమ్ రెడ్డి, నల్లమిల్లి రామారెడ్డి, 2002-03 విద్యార్థులు, ఆ నాటి ఉపాధ్యాయులు, ప్రస్తుత ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. తదినతరం దొరబాబు ని పూర్వ ఉపాధ్యాయులని ఘనంగా సన్మానించితిరి.

కోవిడ్ వ్యాక్సిన్ తో వృద్ధులకు ఉపయోగం

 కోవిడ్ వ్యాక్సిన్ తో వృద్ధులకు ఉపయోగం

తాళ్ళూరు,పెన్ పవర్

తాళ్ళూరు మండలం కోవిడ్ వ్యాక్సిన్ పై అపోహలు పడవద్దని  వైద్యాధికారి ఖద్దర్ మస్తాన్ బీ తెలిపారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 60 సంవత్సరాలు దాటిన 34 మందికి కోవిడ్ టీకాలు శనివారం వేశారు.వ్యాక్సిన్ తీసుకుంటున్న వారంతా ఆరోగ్యం గా ఉన్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 45 సంవత్సరాల వయస్సు దాటి,బీపీ,షుగర్ తో పాటు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు,60 సంవత్సరాలు దాటిన వారందరికి కోవిడ్ వ్యాక్సిన్ వేస్తున్నట్లు ఆమె తెలిపారు. వ్యాక్సిన్ కు వచ్చే వారు ఆధార్ కార్డు ,సెల్ ఫోన్ ను వెంట తెచ్చుకోవాలని అన్నారు. కోవిడ్ యాప్ ద్వారా అప్పటికప్పుడే రిజిస్ట్రేషన్ చేసి వ్యాక్సిన్ వేస్తున్నట్లు డాక్టర్ తెలిపారు.ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

బ్యాంక్ ఉద్యోగుల సమ్మె కు సంపూర్ణ మద్దతు

 బ్యాంక్ ఉద్యోగుల సమ్మె కు సంపూర్ణ మద్దతు  

 పెన్ పవర్, కందుకూరు

ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిరసిస్తూ మార్చి 15,16 తేదీల్లో జరుగుతున్న బ్యాంకు ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మెకు సిపిఎం, సిపిఐ, భీమ్ ఆర్మీ పార్టీలు, సిఐటియు, ఏఐటీయూసీ  సంఘాలు తన సంపూర్ణ మద్దతును తెలియజేశాయి. శనివారం   పట్టణంలోని  సుందరయ్య భవన్ లో బ్యాంకు ఉద్యోగుల సమ్మె కు సంఘీభావంగా సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జి వెంకటేశ్వర్లు,సీఐటీయూ జిల్లా కార్యదర్శి జీవీబీ కుమార్,  సిపిఐ కందుకూరు నియోజకవర్గ కార్యదర్శి పి మాలకొండయ్య, ఏఐటీయూసీ జజిల్లా అధ్యక్షులు బి సురేష్ బాబు, బ్యాంకు ఉద్యోగుల సంఘం నాయకులు పాలేటి కోటేశ్వరరావు, రిటైర్డ్ వార్డెన్  బి వెంకటేశ్వర్లు, భీమ్ ఆర్మీ పార్టీ నాయకులు కసుకుర్తి మాల్యాద్రి, కెవిపిఎస్ నాయకులుమెన్నెం. రమేష్ బాబు లు  పాల్గొని తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సమావేశంలో కందుకూరు బ్యాంక్ ఉద్యోగ సంఘం కందుకూరు పట్టణ నాయకులు సత్యన్నారాయణ,సాయి సురేష్, వలేటివారిపాలెం బ్యాంక్ ఉద్యోగులు నరేష్, చైతన్య కుమార్, పొన్నలూరు బ్యాంక్ ఉద్యోగి సింహాచలం తదితరులు పాల్గొన్నారు. సమ్మె సందర్భంగా కందుకూరు పట్టణం లో 15న స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ వద్ద  శిబిరం ఏర్పాటు, 16న పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. బ్యాంకు ఉద్యోగులు తలపెట్టిన సమ్మెకు ప్రజలంతా సహకారం అందించాలని కోరారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...