Followers

కొవ్వూరు మున్సిపల్ ఎన్నికల ఓట్లలెక్కింపుకు ఏర్పాట్లు పూర్తిఆర్ డి ఓ లక్ష్మారెడ్డి

 కొవ్వూరు మున్సిపల్ ఎన్నికల ఓట్లలెక్కింపుకు ఏర్పాట్లు పూర్తిఆర్ డి ఓ లక్ష్మారెడ్డి

పెన్ పవర్, కొవ్వూరు

   కొవ్వూరు మున్సిపల్ ఎన్నికల ఓట్లలెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది అని కొవ్వూరు ఆర్డీవో డి. లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం కొవ్వూరు దీప్తి స్కూల్ లో మున్సిపల్ ఎ న్నికల ఓట్లలెక్కింపు సిబ్బంది కి ఓట్ల లెక్కింపు పై శిక్షణా తరగ తులు లో ఆర్డీవో లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ మున్సి పల్ ఎన్నికల ఓట్లలెక్కింపు పారదర్శకంగా, నిస్పక్షపాతం గా, త్వరితగతిన ఫలితాల వెల్లడికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. ఈ నెల 14 వతేది ఉదయం 8గంటల కు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అ వుతుందని అన్నారు. ఫలితా లు త్వరిత గతిన వెల్లడించేం దుకు వీలుగా అన్ని ఏర్పాటు చేశామని అన్నారు. 

ఉదయం 8గంటలకు ప్రారంభమ య్యే లెక్కింపు కు గంట ముం దుగా అనగా ఏడుగంటలకే కౌంటింగ్ ఏజెంట్లు,కౌంటింగ్ స్టాఫ్ హాజరు కావాలని అదేశిం చామని అ న్నారు. కౌంటింగ్ కేంద్రంలో పటిష్ఠ బ్యారికేడింగ్ చేశామని అన్నారు. త్రాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతు లు కల్పిం చామని అన్నారు. కౌంటింగ్ ప్రక్రియ మొత్తాన్ని వీడియోగ్రఫీ, వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నామ ని తెలిపారు. కౌంటింగ్ ఫలితా లను ఎప్పటికప్పుడు త్వరితగ తిన ప్రకటించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.ఆదివారం  ఉదయం 8గంటలకు  దీప్తి ఇంగ్లీష్ మీడి యం హై స్కూల్ నందు మున్సి పల్ ఎన్నికల ఓట్లలెక్కింపు ప్రారంభం.పలితాలు త్వరిత గతిన వెల్లడించేందుకు వీలుగా మొత్తం 10 వార్డులకు - 19 టేబుల్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి టేబుల్ కు ముగ్గురు అధికారులు,  ఒకే రౌండ్ లో పలితాలు వెల్లడి చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది అన్నారు. ఓట్ల లెక్కిం పుకు  23 మంది కౌంటింగ్ సూ పరవైజర్సు, 57 మంది కౌంటిం గ్ అసిస్టెంట్లు, 5 గురు ఎలక్షన్ అధికారులు ని యమించామ న్నారు. ఉదయం 8గంటలకు ప్రారంభమయ్యే లెక్కింపు కు గంట ముందుగా అనగా ఏడు గంటలకే కౌంటింగ్ ఏజెంట్లు,కౌంటింగ్ స్టాఫ్ హాజరు కావాలి అని అన్నారు. కౌంటింగ్ కేంద్రం లోపటిష్ఠ బ్యారికేడింగ్ ఏర్పా ట్లు,త్రాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులు కల్పిం చా మన్నారు. కౌంటింగ్ ఫలితా లను ఎప్పటికప్పుడు త్వరిత గతిన ప్రకటించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాము అని అన్నారు. అభ్యర్థులు, ఏ జెంట్లు అందరూ కూడా సమ న్వయంతో ఓటింగ్ పక్రియ పూ ర్తి చేయడానికి సహ కరించా లి అని అన్నారు. ఎన్నికల పాస్ లు తప్పనిసరిగా తెచ్చుకోవాలి అని అన్నారు. మీడియా సెంటర్ ఏర్పాటు చేశామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కొవ్వూరు మున్సిపల్ కమిషనర్ కె. టి. సుధాకర్ పట్టణ సీఐ, ఎం. వి. వి. ఎస్.ఎన్. మూర్తి, సంబంధి త అధికారులు పాల్గొన్నారు.

భీమేశ్వరాలయంలో హైకోర్టు జడ్జి దంపతుల ప్రత్యేక పూజలు

 భీమేశ్వరాలయంలో హైకోర్టు జడ్జి దంపతుల ప్రత్యేక పూజలు

సామర్లకోట,పెన్ పవర్ 

పంచారామా క్షేత్రమైన సామర్లకోట శ్రీ కుమార రామ భీమేశ్వరాలయంలో శనివారం ఉదయం హైకోర్టు జడ్జి కె సురేష్ రెడ్డి దంపతులు ఆ ప్రత్యేక పూజలు చేపట్టారు. మహా శివరాత్రి పర్వదినాలను పురష్కరించుకుని పంచారామాల సందర్శనలో బాగంగా జడ్జి దంపతులు ఆలయానికి విచ్చేయగా వారికి ఆలయ మర్యాదల చొప్పున ఆలయ కార్యనిర్వహణాధికారి పులి నారాయణ మూర్తి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారు ఉపాలయాల్లో దైవతా మూర్తులను దర్శించుకుని భీమేశ్వరుని మూల విరాట్ నందు, స్వామివారీ, అమ్మవారల గర్భాలయాల్లోనూ ప్రత్యేక పూజలను చేపట్టారు. అనంతరం జడ్జి దంపతులను ఆలయ నంది మండపంలో పండితాశీర్వచన కార్యక్రమాలను నిర్వహించి ఘనంగా ఆశీర్వదించారు. ఈ సందర్భంగా హైకోర్టు జడ్జి సురేష్ రెడ్డి మాట్లాడుతూ మహా శివరాత్రి పర్వదినాలు సందర్భంగా వంచారామాలతో పాటు పిఠాపురం పాదగయను సందర్శించి సామర్లకోట భీమేశ్వరాలయానికి విచ్చేసినట్టు చెప్పారు. తదుపరి ద్రాక్షారామా దర్శించుకుని తిరిగి తమ గృహానికి బయలుదేరుతున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో వారి వెంట జిల్లాకు చెందిన పలువురు జడ్జిలు, ఆలయ అధికారులు, పోలీసు అధికారులు, పండితులు ఉన్నారు.

డిటి రాజబాబు ఆధ్వర్యంలో పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి

 డిటి రాజబాబు ఆధ్వర్యంలో పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి

తాళ్ళపూడి, పెన్ పవర్

తాళ్ళపూడి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఆదివారం జరగబోయే ఉభయగోదావరి జిల్లాల టీచర్ ఎం యల్ సి ఎన్నికల కు తహశీల్దార్ మరియు ఎన్నికల అధికారి ఎం.నరసింహమూర్తి ఆదేశాల మేరకు ఏర్పాట్లు సిద్ధం చేయబడ్డాయి. డిటి రాజబాబు మాట్లాడుతూ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ సమయం అని, ఈ సమయంలో ఉపాద్యాయులు ఓటు వేయవచ్చునని, తాళ్ళపూడి మండలం లో ఓటు హక్కు గల ఉపాద్యాయులు 61 మంది అని, శనివారం జరగబోయే ఎన్నికల కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో యస్ఐ జి.సతీష్, పోలీస్ సిబ్బంది, విఆర్వో లు ప్రకాష్, లీలావతి, స్వర్ణ, ప్రిసైడింగ్ ఆఫీసర్, హెల్పర్స్, తదితరులు పాల్గొన్నారు.

పోలింగ్, కౌంటింగ్ సందర్భంగా మద్యం దుకాణాలు బంద్

 పోలింగ్, కౌంటింగ్ సందర్భంగా మద్యం దుకాణాలు బంద్

విశాఖపట్నం, పెన్ పవర్

రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్కు అనుగుణంగా  ప్రభుత్వ GORt.No.70 MA&UD(G2) విభాగం, తేదీ22.02.2021 ననుసరించి జిల్లాలో పోలింగ్ జరిగే్ విశాఖ నగరం, నర్సీపట్నం, ఎలమంచిలి పట్టణప్రాంత పరిధిలో గల మద్యం దుకాణాలను పోల్ ముగియడానికి 48 గంటలు ముందు నుండి అనగా 8వ తేదీ సాయంత్రం నుండి పోలింగ్ రోజు వరకు, ఇంకా ఓట్ల లెక్కింపు జరిగే 14వ తేదీన పూర్తిగా మూసివేస్తున్నట్లు విశాఖ జిల్లా కలెక్టరు, జిల్లా ఎన్నికల అథరిటీ  వి.వినయ్ చంద్  ప్రకటించారు.

ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి పకృతి పరిరక్షణ కోసం పాటుపడాలి


 ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి పకృతి పరిరక్షణ కోసం పాటుపడాలి
సామర్లకోట,పెన్ పవర్

పెదబ్రహ్మదేవం గ్రామం లో గల 6వ వార్డు లో అవార్డు సభ్యులు శ్రీమతి తోటకూర దుర్గా లక్ష్మి గంగాధర్ తమ పెళ్లి రోజు సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.దుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈసంధర్భంగా ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల మీడియా మేనేజర్ జాతీయ పర్యావరణ మిత్ర అవార్డు గ్రహీత తోటకూర గంగాధర్ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడాలి అని అన్నారు.

తమ పెళ్లి రోజు సందర్భంగా శుభాకాంక్షలు శుభాశీస్సులు అందజేసిన బంధు మిత్రులకు శ్రేయోభిలాషులకు మిత్రులకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.ఈకార్యక్రమంలో మలకల సూర్యారావు, వరాలబాబు, తోటకూర సత్తిబాబు, బండారు కొండ, తోటకూర పెదరామారావు,ఆటపాకల సూరిబాబు & బ్రదర్స్,తాడాల దొరబాబు తదితరులు పాల్గొన్నారు.

బడి రుణం తీర్చుకుంటున్నాము పూర్వం విద్యార్థులు

 బడి రుణం తీర్చుకుంటున్నాము పూర్వం విద్యార్థులు

పెన్ పవర్,ఆలమూరు

    లక్షలు పోసి కార్పొరేట్ పాఠశాలల్లో చదివించాలంటే సామాన్యులకు ఎంతో భారం కార్పొరేట్ పాఠశాలల్లో ఆర్భాటాల్లో మునిగి  ప్రభుత్వ పాఠశాలల్లో వసతులుండవనే అపోహలు ఉన్నాయి చదువు, ఆటలు, కళలు అన్నింటితో పాటు కార్పొరేట్ పాఠశాలలను మించేలా ఇక్కడ సదుపాయాలు సమకూర్చుతున్నారు. ఆలమూరు మండలం జొన్నాడ గ్రామంలో  శ్రీ ద్వారంపూడి సత్యనారాయణ రెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2002-03 సంవత్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్థులు శనివారం  పాఠశాల ఆవరణలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. బడి రుణం తీర్చుకోవడంతో పాటు బాలల భవితకు చేయూతనివ్వాలనే ఉద్దేశంతో  తలో చేయి వేసి బడిని అభివృద్ధి బాట పట్టించేందుకు పాఠశాలల్లో చదివే విద్యార్థినుల సౌకర్యార్థం పాఠశాలల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన   గ్రంధాలయంలో సుమారుగా 50 వేల రూపాయల ఖర్చుతో కబోర్డులను (బీరువాలు) అత్యాధునిక హంగులతో  ఏర్పాటు చేసి వాటిని ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆ గ్రామ మాజీ సర్పంచ్ ద్వారంపూడి నాగేంద్ర సత్యన్నారాయణ రెడ్డి (దొరబాబు) ప్రారంభించారు. 

అనంతరం దొరబాబును పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ద్వారంపూడి విక్రమ్ రెడ్డి, నల్లమిల్లి రామారెడ్డి, 2002-03 విద్యార్థులు, ఆ నాటి ఉపాధ్యాయులు, ప్రస్తుత ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. తదినతరం దొరబాబు ని పూర్వ ఉపాధ్యాయులని ఘనంగా సన్మానించితిరి.

కోవిడ్ వ్యాక్సిన్ తో వృద్ధులకు ఉపయోగం

 కోవిడ్ వ్యాక్సిన్ తో వృద్ధులకు ఉపయోగం

తాళ్ళూరు,పెన్ పవర్

తాళ్ళూరు మండలం కోవిడ్ వ్యాక్సిన్ పై అపోహలు పడవద్దని  వైద్యాధికారి ఖద్దర్ మస్తాన్ బీ తెలిపారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 60 సంవత్సరాలు దాటిన 34 మందికి కోవిడ్ టీకాలు శనివారం వేశారు.వ్యాక్సిన్ తీసుకుంటున్న వారంతా ఆరోగ్యం గా ఉన్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 45 సంవత్సరాల వయస్సు దాటి,బీపీ,షుగర్ తో పాటు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు,60 సంవత్సరాలు దాటిన వారందరికి కోవిడ్ వ్యాక్సిన్ వేస్తున్నట్లు ఆమె తెలిపారు. వ్యాక్సిన్ కు వచ్చే వారు ఆధార్ కార్డు ,సెల్ ఫోన్ ను వెంట తెచ్చుకోవాలని అన్నారు. కోవిడ్ యాప్ ద్వారా అప్పటికప్పుడే రిజిస్ట్రేషన్ చేసి వ్యాక్సిన్ వేస్తున్నట్లు డాక్టర్ తెలిపారు.ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...