Followers

ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఉద్రిక్తత...

 ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఉద్రిక్తత...

సామర్లకోట, పెన్ పవర్

సామర్లకోట మున్సిపాలిటీల పరిధిలో జరిగిన ఎన్నికల లెక్కింపు కేంద్రం వద్ద ఆదివారం ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది.లెక్కింపు కేంద్రమైన ఎన్టీఆర్ క్రీడా భవనం వద్ద మెయిన్ రోడ్డుపై చర్చి నిర్వహణకు గానూ యువకులు రోడ్డు వద్ద వారి వాహనాలను పార్కింగు చేస్తూ పోలీసులతో వాగ్వివాదానికి దిగిన సంఘటనలో లెక్కింపు కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం ఎదురైంది. దానితో పోలీసులు ఎన్నికల నిబందనలు మీరిన సెక్షన్లపై ఇద్దరు యువకులను అరెస్టు చేసి కేసులు నమోదు చేసారు. 

వివరాల్లోకి వెళితే స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్స్ లోని క్రీడా భవనంలో ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభించగా 8.30 గంటల ప్రాంతంలో లెక్కింపు కేంద్రానికి ఎదురుగా ఉన్న ఒక చర్చిని నిర్వహించే కుటుంబానికి చెందిన యువకులు వారి వాహనాలను రోడ్డు ప్రక్కన పెట్టగా స్థానిక ఎస్ ఐ  సుమంత్ వాహనాలు పెట్టరాదని, ఎన్నికల నిబంధనల ప్రకారం కౌంటింగు కేంద్రానికి వంద మీటర్లు దూరం వరకు 144 సెక్షన్ అమలులో ఉన్నందున చర్చి నిర్వహణ ఈరోజు నిలిపి వేయాలని తెలిపారు. దానికి ముందుగా తమకు నోటీసులు ఇవ్వకుండా ఎలా చర్చిలో ఆరాధన నిలిపి వేస్తామని యువకులు ప్రశ్నిస్తూ పోలీసులతో వాదనకు దిగారు. దానితో ఎస్ఇ మాట్లాడుతూ ముందురోజే లెక్కింపు కేంద్రం చుట్టు ప్రక్కల అందరికీ సమాచారం అందించామన్నారు. కాగా ఈ సందర్భంగా మాటామాటా పెరిగి ఎస్ ఐ  సుమంతకు యువలకులకు మద్య తోపులాట జరగడంతో ఎన్నికల నిబందనలు మిరారు అనే నేరంతో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. తదుపరి వారి పై ప్రత్యేక కేసులను నమోదు చేసినట్లు ఎస్ఐ చెప్పారు.ఈ సంఘటనతో సుమారు అరగంట పాటు లెక్కింపు కేంద్ర వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది పెద్దాపురం డి ఎస్ పి ఎ శ్రీనివాసరావు ఈ వివాదం పై సంఘటన స్థలంలో విచారణ నిర్వహించారు.

పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన సిపి సజ్జనర్

 పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన సిపి సజ్జనర్ 

కూకట్ పల్లి,పెన్ పవర్

ఆదివారం జరిగిన హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎన్నికలలో భాగంగా కూకట్ పల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తనిఖీ చేశారు. ఓటు వేయడానికి క్యూ లైన్లలో నిలబడినవారికి అభివాదం చేస్తూ ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రంలో వయో వృద్దులు నిలబడి ఉండటాన్ని గమనించిన ఆయన వారు కూర్చోడానికి కుర్చీలు, ఎండ తగలకుండా టెంట్ లు ఏర్పాటు చేయాలని ఎన్నికల సిబ్బందికి సూచించారు. రంగారెడ్డి జిల్లా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నుటయాభై పోలింగ్ కేంద్రాల నుండి లక్ష ఇరవై రెండు వేల ఏడువందల డెభై నాలుగు మంది పట్టభద్రులు తమ ఓటు నమోదు చేసుకున్నరని, ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సజ్జనార్ అభ్యర్ధించారు.

 తప్పకుండా ప్రతి ఒక్కరు ఓటు వేసి ప్రజాస్వామ్యని గెలిపించాలని, గత ఎన్నికల్లో 34 శాతం మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, పట్టభద్రులు అధిక సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని తెలియజేసారు.  సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎన్నికలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఏర్పాట్లు చేశామని ఈ సందర్భంగా ఆయన తెలియజేసారు. ఈకార్యక్రమంలో మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు, కూకట్ పల్లి ఏసిపి, భుజంగరావు, కూకట్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ నర్సింగ్ రావు, ఎస్.ఐ సురేష్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస బీజేపీ నాయకులమధ్య ఘర్షణ

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస బీజేపీ నాయకులమధ్య ఘర్షణ

బీజేపీ నాయకులు రోడ్డు పై బైఠా యుంపు

ఎస్పీ రాకతో సద్దు మణిగిన అల్లరి

నెల్లికుదురు,పెన్ పవర్

మహుబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో ఆదివారం నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికలలో తెరాస బీజేపీ నాయకులమధ్య తోపులాట జరిగింది.మండలకేంద్రానికి సమీపంలో నెల్లికుదురు, మహుబూబాద్ ప్రధాన రహదారికి సమీపంలోఉన్న ఫంక్షన్ హాల్ లో  తెరాస కార్యకర్తలు ఓటర్స్ కు డబ్బులు పంచుతున్నారని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి, గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు జాటోత్ హుస్సేన్ నాయక్ బీజేపీ కార్యకర్తలతో అక్కడికి చేరుకోగా అక్కడ ఉన్న తెరాస కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలతో గొడవపడి ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది

ఈ విషయం తెలుకున్న బీజేపీ కార్యకర్తలు అక్కడికి చేరుకొని నెల్లికుదురు మహుబూబాద్ ప్రధానరహదారిపై హుస్సేన్ నాయక్ ప్రేమేందర్రెడ్డితొ కలిసి బైఠాయుoచి తెరాస కు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ కోటిరెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాలకు సర్దిచెప్పి అక్కడినుండి పంపించి వేశారు. అనంతరం బీజేపీ కార్యకర్తలు తెరాస నాయకులపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ ముందు కొద్దిసేపు ఆందోళనకు దిగారు.

ప్రజాస్వామ్య పద్దతిలోనే ఓట్లు వేసేటట్లు సహకరించాలి

ప్రజాస్వామ్య పద్దతిలోనే ఓట్లు వేసేటట్లు సహకరించాలి

కుత్బుల్లాపూర్,పెన్ పవర్

పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రజాస్వామ్య పద్దతిలోనే ఓట్ల ప్రక్రియ కొనసాగేటట్లు ప్రతిఒక్కరు సహకరించాలని బిజెపి నాయకులు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సుభాష్ నగర్ డివిజన్, రంగా రెడ్డి నగర్ డివిజన్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల డివిజన్లలో పోలింగ్ బూత్ల వద్ద పర్యటించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ పట్టభద్రులు అందరూ కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఓట్లు వేసేటట్టు మన నాయకులు అందరు కూడా సహకరించాలని సూచించారు.

నిర్విఘ్నంగా లారి అసోసియేషన్ ఎన్నికలు

 నిర్విఘ్నంగా లారి అసోసియేషన్ ఎన్నికలు

మందమర్రి,పెన్ పవర్ 

కోల్ బెల్ట్ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు ఆదివారం మందమర్రి పట్టణంలోని ఇందూ గార్డెన్ లో నిర్విఘ్నంగా జరిగాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం సైతం మందమర్రి, శ్రీరాంపూర్ రెండు డివిజన్ లకు  ఎన్నికల నిర్వహిస్తామని అసోసియేషన్ అడహక్ కమిటీ చైర్మన్ మారపల్లి రవీందర్ పేర్కొన్నారు. గత సంవత్సరం కరోనా లాక్ డౌన్ కారణంగా ఎన్నికలు నిర్వహింలేక పోవడంతో అడహక్ కమిటీని ఏర్పాటు చేసి, ఈ సంవత్సరం యథావిధిగా ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. అసోసియేషన్ లో 272 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటుండగా, 16 మంది సభ్యులు పోటీలో ఉన్నట్లు ఆయన తెలిపారు. శనివారం  పోస్టల్ బ్యాలెట్ ద్వారా దూర ప్రాంత సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, ఓటింగ్ ప్రక్రియ పూర్తి అయిన అనంతరం కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటించడం జరుగుతుందని ఆయన తెలిపారు.

కరాటే ఓవరాల్ చాంపియన్ ట్రోఫీ ఆవిష్కరణ

 కరాటే ఓవరాల్ చాంపియన్ ట్రోఫీ ఆవిష్కరణ

సామర్లకోట, పెన్ పవర్ 

సామర్లకోట పట్టణంలో ఏప్రిల్ 18వ తేదీన నిర్వహించనున్న కరాటే సౌత్ జోన్ గోర్నంమెంటుకు చెందిన ఓవరాల్ చాంపియన్ షిప్ ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని స్థానిక లయన్స్ కలబ్ భవనంలో శనివారం నిర్వహించారు. కరాటే పాఠశాల కోచ్ ది శంకర్రావు ఆధ్వర్యంలో ఇటీవల కరాటే బెల్ట్ గ్రేడింగు పరీక్షలు రాజమహేంద్రవరంలో నిర్వహించగా దానిలో ప్రతిభను కనపరిచిన 34 మంది విద్యార్థులకు ప్రమోషన్ బెల్టులు, సర్టిఫికేట్ల పంపిణీతో ఏప్రిల్ నెలలో స్థానిక గాంధీబొమ్మ సెంటర్లోని రైతు భవనంలో నిర్వహించే సౌత్ జోన్ కరాటే టర్నమెటు ఓవరాల్ చాంపియన్ షిప్ ట్రఫీ ఆవష్కరణ కార్యక్రమాలను నిర్వహించారు. దానిలో ముఖ్య అతిధులుగా లయన్స్ క్లబ్ జిల్లాచైర్ పర్సన్ ఈదల ఈశ్వరకుమార్, లయన్స్ రీజియన్ చైర్మన్ చిత్తులూరి వీర్రాజు (రాజా)లు పాల్గొని ట్రఫీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుతో పాటు విద్యార్థులకు క్రీడలు కూడా అవసరమన్నారు. శారీరక, మానసిక వికాశంతో పాటు ప్రస్తుతం కరాటే క్రీడను ఒలింపిక్ లో కూడా చేర్చినందున దానిలో ప్రతిభను కనపరిచిన విద్యార్థులకు 5 శాతం రిజర్వేషన్లు ప్రభుత్వం కల్పిస్తున్నట్టు చెప్పారు. దానికి ప్రతి విద్యార్థి ప్రయత్నించాలన్నారు. అలాగే ప్రస్తుతం ఆవిష్కరిస్తున్న ఓవరాల్ చాంపియన్ షిప్ టీవీని సామర్లకోట విద్యార్థులు కైవశం చేసుకోవాలన్నారు. కాగా ఈ సందరంగా కోచ్ శంకర్ మాట్లాడుతూ ఏప్రిల్ 18న నిర్వహించే సౌతజోన్ గోరనమెంటులో 6 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు, కోచ్లు విచ్చేస్తున్నట్టు చెప్పారు. అలాగే గత ఆదివారం రాజమహేంద్రవరంలో నిర్వహించిన కలర్ బెల్ట్ గ్రేడింగు పరీక్షలో సుమారు వందమంది విద్యార్ధులను, సామర్లకోట, కాకినాడల నుంచి తీసుకెళ్ళగా వారిలో సామర్లకోట విద్యార్థులు 34 మంది అత్యంత ప్రతిభను కనపరచి పెద్దగ్రడ్ బెల్టులు, సాధించినట్టు ఆయన చెప్పారు ఈ సందర్భంగా తొలుత విద్యార్థులకు వారు సాధించిన బెల్టులు, సర్టిఫికెట్లను అందించి లయన్స్ నాయకులు అభినందించారు. అనంతరం టోర్నమెంటు ఓవరాల్ ఛాంపియన్ షిప్ ట్రోఫీని వారు ఆవిష్కరించి ప్రదర్శించారు.ఈ కార్యక్రమంలో ఇంకా లయన్స్ పాస్ట్ ప్రెసిడెంట్ గుండు శంకర్రావు, టోర్నమెంటు కమిటీ సభ్యులు బి రామారావు, బి సత్యనారాయణ, ఎం లోవరాజు, టివి రమణ, అధిక సంఖ్యలో కరాటే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

కొవ్వూరు మున్సిపల్ ఎన్నికల ఓట్లలెక్కింపుకు ఏర్పాట్లు పూర్తిఆర్ డి ఓ లక్ష్మారెడ్డి

 కొవ్వూరు మున్సిపల్ ఎన్నికల ఓట్లలెక్కింపుకు ఏర్పాట్లు పూర్తిఆర్ డి ఓ లక్ష్మారెడ్డి

పెన్ పవర్, కొవ్వూరు

   కొవ్వూరు మున్సిపల్ ఎన్నికల ఓట్లలెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది అని కొవ్వూరు ఆర్డీవో డి. లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం కొవ్వూరు దీప్తి స్కూల్ లో మున్సిపల్ ఎ న్నికల ఓట్లలెక్కింపు సిబ్బంది కి ఓట్ల లెక్కింపు పై శిక్షణా తరగ తులు లో ఆర్డీవో లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ మున్సి పల్ ఎన్నికల ఓట్లలెక్కింపు పారదర్శకంగా, నిస్పక్షపాతం గా, త్వరితగతిన ఫలితాల వెల్లడికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. ఈ నెల 14 వతేది ఉదయం 8గంటల కు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అ వుతుందని అన్నారు. ఫలితా లు త్వరిత గతిన వెల్లడించేం దుకు వీలుగా అన్ని ఏర్పాటు చేశామని అన్నారు. 

ఉదయం 8గంటలకు ప్రారంభమ య్యే లెక్కింపు కు గంట ముం దుగా అనగా ఏడుగంటలకే కౌంటింగ్ ఏజెంట్లు,కౌంటింగ్ స్టాఫ్ హాజరు కావాలని అదేశిం చామని అ న్నారు. కౌంటింగ్ కేంద్రంలో పటిష్ఠ బ్యారికేడింగ్ చేశామని అన్నారు. త్రాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతు లు కల్పిం చామని అన్నారు. కౌంటింగ్ ప్రక్రియ మొత్తాన్ని వీడియోగ్రఫీ, వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నామ ని తెలిపారు. కౌంటింగ్ ఫలితా లను ఎప్పటికప్పుడు త్వరితగ తిన ప్రకటించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.ఆదివారం  ఉదయం 8గంటలకు  దీప్తి ఇంగ్లీష్ మీడి యం హై స్కూల్ నందు మున్సి పల్ ఎన్నికల ఓట్లలెక్కింపు ప్రారంభం.పలితాలు త్వరిత గతిన వెల్లడించేందుకు వీలుగా మొత్తం 10 వార్డులకు - 19 టేబుల్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి టేబుల్ కు ముగ్గురు అధికారులు,  ఒకే రౌండ్ లో పలితాలు వెల్లడి చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది అన్నారు. ఓట్ల లెక్కిం పుకు  23 మంది కౌంటింగ్ సూ పరవైజర్సు, 57 మంది కౌంటిం గ్ అసిస్టెంట్లు, 5 గురు ఎలక్షన్ అధికారులు ని యమించామ న్నారు. ఉదయం 8గంటలకు ప్రారంభమయ్యే లెక్కింపు కు గంట ముందుగా అనగా ఏడు గంటలకే కౌంటింగ్ ఏజెంట్లు,కౌంటింగ్ స్టాఫ్ హాజరు కావాలి అని అన్నారు. కౌంటింగ్ కేంద్రం లోపటిష్ఠ బ్యారికేడింగ్ ఏర్పా ట్లు,త్రాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులు కల్పిం చా మన్నారు. కౌంటింగ్ ఫలితా లను ఎప్పటికప్పుడు త్వరిత గతిన ప్రకటించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాము అని అన్నారు. అభ్యర్థులు, ఏ జెంట్లు అందరూ కూడా సమ న్వయంతో ఓటింగ్ పక్రియ పూ ర్తి చేయడానికి సహ కరించా లి అని అన్నారు. ఎన్నికల పాస్ లు తప్పనిసరిగా తెచ్చుకోవాలి అని అన్నారు. మీడియా సెంటర్ ఏర్పాటు చేశామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కొవ్వూరు మున్సిపల్ కమిషనర్ కె. టి. సుధాకర్ పట్టణ సీఐ, ఎం. వి. వి. ఎస్.ఎన్. మూర్తి, సంబంధి త అధికారులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...