ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఉద్రిక్తత...
సామర్లకోట, పెన్ పవర్సామర్లకోట మున్సిపాలిటీల పరిధిలో జరిగిన ఎన్నికల లెక్కింపు కేంద్రం వద్ద ఆదివారం ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది.లెక్కింపు కేంద్రమైన ఎన్టీఆర్ క్రీడా భవనం వద్ద మెయిన్ రోడ్డుపై చర్చి నిర్వహణకు గానూ యువకులు రోడ్డు వద్ద వారి వాహనాలను పార్కింగు చేస్తూ పోలీసులతో వాగ్వివాదానికి దిగిన సంఘటనలో లెక్కింపు కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం ఎదురైంది. దానితో పోలీసులు ఎన్నికల నిబందనలు మీరిన సెక్షన్లపై ఇద్దరు యువకులను అరెస్టు చేసి కేసులు నమోదు చేసారు.
వివరాల్లోకి వెళితే స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్స్ లోని క్రీడా భవనంలో ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభించగా 8.30 గంటల ప్రాంతంలో లెక్కింపు కేంద్రానికి ఎదురుగా ఉన్న ఒక చర్చిని నిర్వహించే కుటుంబానికి చెందిన యువకులు వారి వాహనాలను రోడ్డు ప్రక్కన పెట్టగా స్థానిక ఎస్ ఐ సుమంత్ వాహనాలు పెట్టరాదని, ఎన్నికల నిబంధనల ప్రకారం కౌంటింగు కేంద్రానికి వంద మీటర్లు దూరం వరకు 144 సెక్షన్ అమలులో ఉన్నందున చర్చి నిర్వహణ ఈరోజు నిలిపి వేయాలని తెలిపారు. దానికి ముందుగా తమకు నోటీసులు ఇవ్వకుండా ఎలా చర్చిలో ఆరాధన నిలిపి వేస్తామని యువకులు ప్రశ్నిస్తూ పోలీసులతో వాదనకు దిగారు. దానితో ఎస్ఇ మాట్లాడుతూ ముందురోజే లెక్కింపు కేంద్రం చుట్టు ప్రక్కల అందరికీ సమాచారం అందించామన్నారు. కాగా ఈ సందర్భంగా మాటామాటా పెరిగి ఎస్ ఐ సుమంతకు యువలకులకు మద్య తోపులాట జరగడంతో ఎన్నికల నిబందనలు మిరారు అనే నేరంతో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. తదుపరి వారి పై ప్రత్యేక కేసులను నమోదు చేసినట్లు ఎస్ఐ చెప్పారు.ఈ సంఘటనతో సుమారు అరగంట పాటు లెక్కింపు కేంద్ర వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది పెద్దాపురం డి ఎస్ పి ఎ శ్రీనివాసరావు ఈ వివాదం పై సంఘటన స్థలంలో విచారణ నిర్వహించారు.










