Followers

ఉచిత సర్వీస్ ప్రారంభించిన ఆర్టీసీ

ఉచిత  సర్వీస్ ప్రారంభించిన ఆర్టీసీ
చింతపల్లి,పెన్ పవర్ 

ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతమైన బలపం పంచాయతీ, ఆ చుట్టుపక్కల గ్రామాల గిరిజనులు విశాఖ రూరల్ పోలీసులు ఏర్పాటు చేసిన ఉచిత ఆర్టీసీ బస్సు సర్వీస్ ను సద్వినియోగం చేసుకోవాలని చింతపల్లి ఏ ఎస్ పి విద్యాసాగర్ నాయుడు అన్నారు. మండలంలోని అన్నవరం గ్రామంలో సోమవారం పాడేరు ఆర్ టి సి డిపో మేనేజర్ ఆర్ ఎస్ నాయుడు తో కలిసి ఆయన అన్నవరం నుండి మూల కోత్తూరు మీదుగా బలపం కోరుకొండ కు ఉచిత ఆర్టీసీ బస్సు సర్వీసును జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన్యంలో మారుమూల గిరిజన గ్రామాల ప్రజల సౌకర్యార్థం రూరల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత ఆర్టీసీ బస్సు సర్వీస్ ప్రారంభించ బడిందని, ఇప్పటివరకు ఈ ప్రాంతంలో సరైన రహదారి రవాణా సౌకర్యాలు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తమ శాఖ మారుమూల ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు ఇందులో భాగంగా సమాచార వ్యవస్థను ఏర్పాటు చేయడమే కక నేడు  రహదారి సౌకర్యాన్ని కల్పించి అన్నవరం నుండి మూల కొత్తూరు గ్రామం వరకు ఉచిత ఆర్టీసీ బస్సు సర్వీసును నడపడం జరిగిందన్నారు. ఈ మధ్యకాలంలో రహదారి శిథిలావస్థకు చేరడంతో గతుకుల మాయమైన రహదారిలో  ఆర్టీసీ సర్వీసు తిరగలేని పరిస్థితి నెలకొందన్నారు. అప్పటి నుండి ప్రైవేటు వాహనాలలో పరిమితికి మించి ప్రయాణికులు రాకపోకలు సాధిస్తుండడం తో పలుమార్లు ప్రమాదాలు చోటు చేసుకొని పలువురు గిరిజనులు మృత్యువాత పడిన సంఘటనలు కూడా ఉన్నాయన్నారు.

వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని  బలపం పంచాయతీ పరిధిలో 33 గ్రామాల ప్రజలతో పాటు ఆ పంచాయతీని ఆనుకుని ఉన్న ఒరిస్సా ప్రజలకు కూడా సౌకర్యార్థం గా ఉండేవిధంగా అన్నవరం నుండి కోరుకొండ వరకు అందంగా తయారైన రహదారిని మరమ్మతులు చేయించి ఉచిత ఆర్టీసీ బస్సు సర్వీసులు నడిపేందుకు పాడేరు ఆర్టిసి డిపో మేనేజర్ తో చర్చించి అన్నవరం, కోటగున్నల, నిమ్మపాడు, రాళ్ల గెడ్డ,  మూల కొత్తూరు, మీదుగా కోరుకొండ గ్రామం వరకు ఉచిత ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ సర్వీసు ప్రతిరోజు మూడు సార్లు అన్నవరం నుండి కోరుకొండ వరకు ఉచితముగా  నడుపబడునన్నారు  ఈ ఆర్ టి సి బస్సు సర్వీసును ఈ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకొని సురక్షితమైన ప్రయాణానికి నాంది పలకాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో చింతపల్లి సీఐ శ్రీనివాస్ అన్నవరం ఎస్ఐ ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

రాజకీయాలకు అతీతంగా ఏలేశ్వరం అభివృద్ధి పరుస్తా

రాజకీయాలకు అతీతంగా ఏలేశ్వరం అభివృద్ధి పరుస్తా

ఏలేశ్వరం,పెన్ పవర్

 రాజకీయాలకు అతీతంగా ఏలేశ్వరం నగర అభివృద్ధి పరుస్తానని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ అన్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ ఎన్నికలు లో విజయం అనంతరం స్థానిక బాలాజీ ఛౌక్ సెంటర్లో విజయోత్సవ సభ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యేను వైసీపీ శ్రేణులు వేదికపై ఎమ్మెల్యేకు గజమాల వేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికలు ఎంత వరకు మాత్రమే రాజకీయమని అనంతరం ప్రజలు అంతా సమానమే అని అన్నారు. తమ పార్టీ కౌన్సిలర్ తో సమానంగా ప్రతిపక్ష టిడిపికి చెందిన కౌన్సిలర్ ను కూడా సమానంగా ఆదరిస్తారని పార్టీలకతీతంగా వార్డుల్లో కూడా అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు యథాతథంగా కొనసాగుతాయని అన్నారు. తనపై నమ్మకం ఉంచి నగర పంచాయతీ ఎన్నికల్లో అఖండ విజయం చేకూర్చే ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. సీనియర్ వైసీపీ నాయకులు అలమండ చలమయ్య మాట్లాడుతూ ఇప్పటి వరకు ప్రజలు చాలా నష్టపోయారని తమ ప్రభుత్వ హయాంలో నగర అభివృద్ధి తో పాటు పురప్రజలకు అందరకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందేలా పాలన జరుగుతుందన్నారు. ఈ విజయోత్సవ సభలో వైసిపి నాయకులు శిడగం వెంకటేశ్వరరావు, బదిరెడ్డి గోవిందు, మూది నారాయణస్వామి, తదితరులతో పాటు 16 వార్డుల లో గెలుపొందిన వైసిపి కౌన్సిలర్లు వేదికపై ఉన్నారు.


అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం

 అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం

ఏలేశ్వరం,పెన్ పవర్

మండలం లోని భద్ర వరం గ్రామంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో సర్వము నష్టపోయిన బాధితులకు పలువురు యువకులు ఆర్థిక సాయం అందించారు. భద్ర పురం గ్రామానికి చెందిన సబ్బి చిన్న రాజు కు చెందిన ఇల్లు అగ్నిప్రమాదంలో పూర్తిగా  ఆహుతి అవగా, ఇంట్లో చిన్న రాజు తన కుమారుని గుండె ఆపరేషన్ నిమిత్తం దాచుకున్న నాలుగు లక్షల రూపాయలు అగ్ని లో దహనం అయ్యాయి.

 దీంతో తన కుమారుడికి  ఆపరేషన్ చేయించడానికి ఇబ్బంది పడుతున్న చిన్న రాజు ను చూసి యువకులు చిక్కాల నాని బాబు, ఒంపు గల శ్రీకాంత్, ఉపాధ్యాయుడు గండ్ర టీ వీరబాబు తదితరులు విరాళం సేకరించి, దానికి తమ వంతు సహాయం కలిపి 54 వేల రూపాయలు స్థానిక శాసనసభ్యులు పర్వత శ్రీ పూర్ణ చంద్ర ప్రసాద్ చేతుల మీదుగా చిన్న రాజు కు అందించారు.

తిరుమల వద్ద రోడ్డు ప్రమాదం లో ఏపీఎస్పీ హెడ్ కానిస్టేబుల్ మృతి

 తిరుమల వద్ద రోడ్డు ప్రమాదం లో ఏపీఎస్పీ హెడ్ కానిస్టేబుల్  మృతి

ఏలేశ్వరం,పెన్ పవర్

మండల పరిధిలోని తిరుమల గ్రామం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జంగిడి సూరిబాబు (39) మృతి చెందారు. ఏలేశ్వరం నుండి ఎర్రవరం వైపు వెళ్లే ఆర్అండ్బీ రహదారి పై జరిగిన రోడ్డు ప్రమాదం లో కాకినాడ ఏపీఎస్పీ థర్డ్ బెటాలియన్ కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన ఆదివారం సాయంత్రం తిరుమాలి వద్ద చోటు చేసుకుంది. ఈ మేరకు ఏలేశ్వరం ఎస్ఐ బి సంపత్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కాకినాడ ఏపీఎస్పీ థర్డ్ బెటాలియన్ కు చెందిన కానిస్టేబుల్ జంగిడి సూరిబాబు (39) రాజవొమ్మంగి మండలం జడ్డంగి పోలీస్ స్టేషన్లో గార్డ్ విధులు నిర్వహించి తిరిగి కాకినాడ ఏపీఎస్పీ క్వార్టర్స్ కి వెళుతుండగా ఏలేశ్వరం మండలం తిరుమాలి వద్ద ఎదురుగా వస్తున్న క్వారీలారీ ఢీకొట్టడంతో  ఈ ప్రమాదం సంభవించింది అన్నారు. మృతుడి స్వస్థలం విశాఖ జిల్లా పాడేరు మండలం జల్లుపల్లి గ్రామం కాగా 2007వ సంవత్సరంలో ఏపీఎస్పీ కానిస్టేబుల్ గా విధుల్లో చేరాడన్నారు. మృతునికి భార్య కుమార్తె, కుమారుడు ఉన్నారన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రత్తిపాడు తరలించినట్లు ఆయన తెలిపారు.

తాండూర్ ఇసుక రీచ్ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి

 తాండూర్ ఇసుక రీచ్ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి

ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంతో సంకే శ్రీనివాస్ మృతి

మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

సీపీఎం తాండూరు మండల కార్యదర్శి దాగం రాజారాం 

మంచిర్యాల,పెన్ పవర్


తాండూర్ ఐబి కేంద్రంలో ఏర్పాటు చేసినపాత్రికేయుల సమావేశంలో  సీపీఎం పార్టీ తాండూరు మండల కార్యదర్శి దాగం రాజారాం మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల గోదావరి తీరం నుండి ప్రభుత్వం చేపడుతున్న మల్లన్న సాగర్ ప్రాజెక్టు పేరుతో గోదావరి లో నడుస్తున్న ఇసుక రీచ్ లు,ఈ ఇసుకను మల్లన్న సాగర్ ప్రాజెక్టు కు తరలించే పేరుతో బయట అమ్ముకుంటూ లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నా కాంట్రాక్టర్.ఇదిలా ఉండగా శివరాత్రి పండుగ సందర్భంగా లక్షలాది మంది భక్తులు గోదావరి స్థానానికి వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ ఈ క్రమంలో సంబంధిత అధికారులు కనీసం ఇసుక రీచ్ల ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు రక్షణ చర్యలుమ్ ఏర్పాటు చేయకపోవడం, జాతర ఉన్నా లేకపోయినా ఈ ఇసుక రీచ్ ప్రాంతంను నిషేధిత ప్రాంతంగా లేదా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉన్న ప్రభుత్వం, అధికారులు మాత్రం చర్యలు తీసుకోకుండా కేవలం కొనసాగించే దానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారన్నారు. తప్ప ప్రజల ప్రాణాలు గాలికి వదిలేశారని,అదేవిధంగా హిస్టరీ తిన ఇసుక రీచ్లు ఏర్పాటు చేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందన్నారు.మృతికి కారణమైన అధికారులపై  ఇసుక రీచ్ కాంట్రాక్టర్ పై, చర్యలు తీసుకోవాలని, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందిన సంకె శ్రీనివాస్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, మృతునికి భార్య, ఇద్దరు చిన్న ఆడపిల్లలు ఉన్నారు. వీరిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం, జిల్లా అధికారులపై ఉందని, లేకపోతే ఇసుక రీచ్ ల వద్దనే ఆందోళనకు సిద్ధం అవుతామని,దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు సిపిఎం పార్టీ తాండూరు మండల కార్యదర్శి భాగం రాజారాం,బి రాజేశం,దుర్గం నానయ్య,రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

పురపోరులో గెలిచి ఓడిన వైసిపి

పురపోరులో గెలిచి ఓడిన వైసిపి
ఎమ్మెల్యే ఓటుతో పీఠం కైవసం

నర్సీపట్నం, పెన్ పవర్ 
మున్సిపాలిటీ ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చావు తప్పి కన్ను లొట్ట పోయినట్లయింది. నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఎక్స్ అఫిషియో ఓటింగ్ తో మున్సిపాలిటీ పై తొలిసారి టిడిపి యేతరపార్టీ జెండా ఎగురవేసింది. మున్సిపాలిటీలో 28 వార్డులకు గాను 14 వార్డులు వైసిపి కైవసం చేసుకోగా, టిడిపి 12 వార్డులు, జనసేన 01, స్వతంత్ర అభ్యర్థి ఒక వార్డు కైవసం చేసుకున్నారు. మ్యాజిక్ ఫిగర్ చేరుకునేందుకు ఒక్క సీటు అవసరం కాగా, ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో ఓటుతో వైసిపి బతికి బట్టకట్టింది.  మున్సిపాలిటీ మొత్తం దృష్టిని ఆకర్షించిన 25, 26 వార్డులలో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి, చిన్న కుమారుడు రాజేష్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికలలో పాల్గొని విజయం సాధించారు. 15 వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి పెదిరెడ్ల శ్రీనివాసరావు అధికార పార్టీకి చుక్కలు చూపించారు.  వైసీపీ అభ్యర్థి మాకిరెడ్డి బుల్లిదొర ఆరు ఓట్లతో గట్టెక్కారు. అయితే 14 వ వార్డులో మాత్రం పోరు హోరా హోరీగా సాగింది. 2 పోస్టల్ బ్యాలెట్ లతో సైకిల్ ఒడ్డెక్కింది.  తొమ్మిదో వార్డ్ లో జనసేన బోణీ కొట్టింది. సుమారు 290 ఓట్లతో అద్దేపల్లి సౌజన్య ప్రధాన పార్టీలకు ఝలక్ ఇచ్చారు. 1, 2, 3 వార్డులలో  ఉంగరం గుర్తుపై పోటీచేసిన స్వతంత్ర అభ్యర్థులలో  మూడో వార్డు నుండి చెక్కా బాలమ్మ విజయం సాధించారు.  మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలలో టిడిపి గట్టి పోటీయే ఇచ్చింది. పంచాయతీ ఎన్నికలలో నర్సీపట్నం మండలంలో 12 పంచాయతీలలో ఐదు పంచాయతీలు కైవసం చేసుకోగా, ప్రస్తుతం మున్సిపల్ ఎలక్షన్లలో 12 వార్డులు కైవసం చేసుకొని టిడిపి సత్తా చాటింది. గత సాధారణ ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే ఈ విధంగా స్థానిక ఎన్నికలలో నానా అవస్థలు పడటం రాజకీయ విశ్లేషకులను విస్మయపరిచింది.

పిల్లలు పుస్తకాలు చదవడం అలవర్చుకోవాలి

పిల్లలు పుస్తకాలు చదవడం అలవర్చుకోవాలి





పెన్ పవర్,మద్దిపాడు 

 చిన్న పిల్లలు కూడా గ్రంధాలయంలోని కథలు పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని గ్రంథపాలకులు గర్నెపూడి శాంసన్ పేర్కొన్నారు.మద్దిపాడు శాఖ గ్రంధాలయం నందు చదవటం మా కిష్టం అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు 22 విద్యార్థులు పాల్గొన్నారు ఉదయం 10 గంటలకు ప్రారంభమై 12 గంటలకు ముగిసే ఈ కార్యక్రమంలో ముందుగా పిల్లలకు నీతి కథలలోని ఎవరు మాట వినాలి కథను చదివిన తర్వాత వారిలో దాగివున్న జ్ఞాపకశక్తి వెలికి తీసేందుకు కథలోని ముఖ్యమైన పాయింట్లు గ్రంథపాలకులు అడిగి తెలుసుకున్నారు. గ్రంథపాలకులు గర్నెపూడి సాంసన్ మాట్లాడుతూ విద్యార్థులు పుస్తక పఠనం పట్లా ఆసేక్తి పెంచుకోవలన్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధిక  మంది  పాల్గొని ప్రతి ఆదివారం జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.



Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...