Followers

గుండారం లో రెవెన్యూ భూమి పై సర్వే జరపండి

 *గుండారం లో రెవెన్యూ భూమి పై సర్వే జరపండి *

ఎల్లారెడ్డిపేట,పెన్ పవర్

ఎల్లారెడ్డిపేట మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేసి  గుండారం గ్రామంలో రెవెన్యూ భూమి పై సర్వే జరపాలని తాసిల్దార్ శ్రీకాంత్ కు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొమ్మాట నరసయ్య మాట్లాడుతూ గుండారం గ్రామంలో  147 సర్వే నెంబర్లో 159 ఎకరాల రెవెన్యూ భూమి ఉందని ఇట్టి భూమిని గిరిజనులకు దళితులకు పంపిణీ చేయాలన్నారు అటవీశాఖ అధికారులు ఈ భూమిని అటవీశాఖ భూమి అంటూ అక్రమంగా కలుపుకోవడం జరిగిందన్నారు రెవెన్యూ అటవీశాఖ అధికారులు కలసి ఉమ్మడి  సర్వే జరిపించి రెవెన్యూ భూమిని వేరు చేయాలన్నారు కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజు నాయకుని అక్రమ కేసుల్లో ఇరికించి అరెస్టు చేసి జైలుకు పంపించడం జరిగిందన్నారు రాజు నాయక్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్ జిల్లా కార్యదర్శి బండ్ల లింగం గౌడ్ నాయకులు కరికెశ్రీనివాస్ .మర్రి శ్రీనివాస్ రెడ్డి ..రాజేందర్ అక్కపురం కృష్ణ . శెట్టిపల్లి బాలయ్య .గజ్జల శ్రీనివాస్. దేవయ్య దండు శ్రీనివాస్ మానుక నాగరాజు సిరిపురం మహేందర్ రాజు రాములు రైతులు పాల్గొన్నారు

ఉత్తర నియోజకవర్గ కార్పొరేటర్ లతో సమావేశమైన కె.కె.రాజు

ఉత్తర నియోజకవర్గ కార్పొరేటర్ లతో సమావేశమైన కె.కె.రాజు

విశాఖ, పెన్ పవర్

జీవీఎంసీ ఎన్నికల్లో విజయం సాదించిన ఉత్తర నియోజకవర్గ పరిధి కార్పొరేటర్ ల తో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త  కె కె రాజు ఆయన కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరిని అభినందించారు.ఈ సందర్భంగా కె కె రాజు మాట్లాడుతూ ప్రజలు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చూసి మరియు మనల్ని నమ్మి ఓటువేసి కార్పొరేటర్ లగా గెలిపించారని అదే నమ్మకం మనపై ఎల్లప్పుడూ వుండేలా విశాఖ అభివృద్ధి లో పలుపంచుకుంటూనే మీ ప్రాంతంలో అభివృద్ధి అన్ని విధాలా పని చేయాలని కోరారు. అనంతరం  రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి వద్దకు వెళ్లి ఆయనతో కూడా సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు రవి రాజు,కాయల వెంకట రెడ్డి, వరుదు కల్యాణి,చొక్కాకుల వెంకట రావు, బీశెట్టి  కాశీ విశ్వనాధం, పీలా ఉమా రాణి, మాధవి వర్మ తదితరులు పాల్గొన్నారు.

జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రి లో కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా అరుదైన శస్త్ర చికిత్సలు

 జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రి లో కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా అరుదైన శస్త్ర చికిత్సలు

జగిత్యాల, పెన్ పవర్

జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రిలో నాణ్యమైన చికిత్సలు మెరుగైన సేవలు అందిస్తున్న వైద్యులను అభినందించిన శ్రీమతి దావ వసంతసురేష్,చైర్ పర్సన్ ఆసుపత్రి అభివృద్ది సొసైటీ  మరియు జిల్లా ప్రజా పరిషత్, జగిత్యాల 100 పడకల సామర్థ్యము గల జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రి నకు వివిధరకాల అనారోగ్య సమస్యలతో జిల్లా నలుమూలల నుండి వేలాది మంది నిరుపేదలు వైద్యము నిమిత్తం రావడం జరుగుచున్నది. చాలామంది నిరు పేదలు అవగాహన రాహిత్యముతో ఆత్రుతతో దూరపు కొండలు నునుపు అనే నానుడి మాదిరిగా దూర ప్రాంతములలో నున్న కార్పోరేట్ ఆసుపత్రులలోనే నాణ్యమైన చికిత్సలు అందుబాటులో ఉంటాయని ఎవరో చెప్పిన మాటలను విని అనేక వ్యయ ప్రయాసలకు లోనై పలు ఇబ్బందులు పడుచుచుండడం జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులలో జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రి లో చురుకైన యువ డాక్టర్లు అంకిత భావముతో పేద ప్రజలకు కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా అరుదైన శస్త్ర చికిత్సలు చేపట్టడం హర్షనీయమని శ్రీమతి దావ వసంతసురేష్, చైర్ పర్సన్ ఆసుపత్రి అభివృద్ది సొసైటీ  మరియు జిల్లా ప్రజా పరిషత్, జగిత్యాల  సంతోషం వ్యక్తం చేసినారు.  ఇటివల జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రి లో పెద్దపల్లి జిల్లా ధర్మారం గ్రామానికి చెందిన అనిరుద్ అనే రెండు నెలల అబ్బాయికి కడుపులో పేగు జారుడు (అబ్ స్ట్రక్ టెడ్ హెర్నియా)  శస్త్ర చికిత్స విజయ వంతముగా నిర్వహించడం పట్ల  శస్త్ర చికిత్స నిర్వహించిన వైద్యులు డా.గంగాధర్ రెడ్డి, Mch (పెడిత్రియాటిక్ సర్జన్), డా.కళ్యాణ్,యం.డి.అనేస్తిషియగారల సేవలను గుర్తించి శ్రీమతి దావ వసంతసురేష్, చైర్ పర్సన్ ఆసుపత్రి అభివృద్ది సొసైటీ  మరియు జిల్లా ప్రజా పరిషత్, జగిత్యాల  అభినందిస్తూ వారిని శాలువ తో సత్కరించడం జరిగింది. అదేవిధముగా, ఇటివల ఊపిరితిత్తులకు సంబందించిన వ్యాధి తో బాధపడుచున్న 6 నెలల బాబు కు ఎంపైమా థారిక్స్ వ్యాధి సర్జెరీ తో చికిత్స చేయడం జరిగింది.  మరొకరికి మోషన్ వెళ్ళే పేగు లేకపోవడం వలన ఆపరేషన్ చేసి ప్రేగును  క్రిందికి తీసుకు రావడం మొదలగు ఆపరేషన్లు విజయవంతముగా పూర్తిచేయడం పట్ల శ్రీమతి దావ వసంతసురేష్, చైర్ పర్సన్ ఆసుపత్రి అభివృద్ది సొసైటీ  మరియు జిల్లా ప్రజా పరిషత్, జగిత్యాల  హర్షం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రి లో కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా అరుదైన శస్త్ర చికిత్సలు చేపట్టుచున్న సమస్త వైద్య అధికారులందరి మరియు సిబ్బందిని సేవలను ఈ సంధర్బంలో కొనియాడారు. రాబోయే రోజులలో కూడా ఇలాంటి మెరుగైన సేవలను అందించి జగిత్యాల జిల్లా పేరును రాష్ట్రములో అగ్రగామిగా నిలబెట్టాలని ఆకాంక్షించారు.

చింతపల్లి హాస్టల్ లో బాలికల వెట్టిచాకిరి పై విచారణ

 చింతపల్లి హాస్టల్ లో బాలికల వెట్టిచాకిరి పై విచారణ

పెన్ పవర్,విశాఖపట్నం

జిల్లాలోని చింతపల్లి మండలం గిరిజన సంక్షేమ బాలికల  వసతి గృహంలో జరిగిన సంఘటనపై గిరిజన సంక్షేమ శాఖ  డిప్యూటీ డైరెక్టర్  జి విజయ్ కుమార్ విచారణ చేపట్టారు. చింతపల్లి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో  గత బుధవారం రాత్రి విద్యార్థినిలా చేత  వార్డెన్ ప్రధానోపాధ్యాయుడు  సెక్స్ క్లీనింగ్ చేయించిన విషయం విధితమే. ఈ సంఘటనపై పత్రికలో వెలువడిన కథనాలకు స్పందించిన పాడేరు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ  ప్రాజెక్ట్ అధికారి వెంకటేశ్వర్ సలిజామల  చింతపల్లి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమం  పాఠశాలలో విద్యార్థినిల చేత వెట్టిచాకిరి  వేయించి న సంఘటనపై  సమగ్రమైన విచారణ జరపాలని  పాడేరు గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జి విజయ్ కుమార్ ని  ఆదేశించారు. ఆ మేరకు డి డి చింతపల్లి  గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఆశ్రమ  పాఠశాలను తనిఖీ చేశారు. మొదట వసతి గృహం పరిసరాలను పరిశీలించారు. తర్వాత అర్ధరాత్రి వరకు డ్రైనేజీ క్లీనింగ్  చేసిన బాలికలతో  మాట్లాడి వివరాలు సేకరించారు. అనంతరం వసతి గృహంలో  సిబ్బందిని ఉపాధ్యాయులను ఒకరొకరుగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థినిలు భయపడవలసిన అవసరం లేదని తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదన్నారు.  చింతపల్లి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో జరిగిన సంఘటనపై  విచారణ జరిపి నివేదికను ఐటీడీఏ పీవో సమర్పిస్తామని బీడీ తెలిపారు.

గోలగాని గెలుపు.......అభివృద్ధికి మలుపు

 గోలగాని గెలుపు.......అభివృద్ధికి మలుపు

హరి వెంకట కుమారి ఘన విజయం

ప్రజలు, కార్యకర్తలు ఆనందోత్సాహం 

విశాఖ పొలిటికల్, పెన్ పవర్ 

విశాఖపట్నం  మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఆరిలోవ 11 వ వార్డు  వై.ఎస్.ఆర్. పార్టీ అభ్యర్థిని గోలగాని హరి వెంకట కుమారి ఘన విజయం సాధించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఈ విజయం నాది కాదని, వార్డు ప్రజలదే అని చాటి చెప్పారు. సి.ఎం. జగన్మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాల వలన , తన భర్త  గొలగాని శ్రీనివాస్ సేవా కార్యక్రమాల వలన ప్రజలు నన్ను 4850 ఓట్ల మెజారిటీతో గెలిపించి పట్టం కట్టారని వారందరికీ పేరుపేరునా  కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు. అంతేకాకుండా ప్రజా తీర్పును గౌరవిస్తూ  ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ,కులమత ప్రాంతీయ బేధాలు లేకుండా అన్ని వర్గాల ప్రజాలకూ అన్ని వేళలా అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తామని  విశాఖ నగరంలోనే ఆదర్శవంత మైన వార్డుగా తీర్చిదిద్దుతామని వాగ్దానం చేశారు.

గ్రీన్ క్లైమేట్ టీం ఆధ్వర్యంలో...పిచ్చుకల పరిరక్షణ పై అవగాహన కార్యక్రమం

 గ్రీన్ క్లైమేట్ టీం ఆధ్వర్యంలో...పిచ్చుకల పరిరక్షణ పై అవగాహన కార్యక్రమం

విశాఖపట్నం, పెన్ పవర్

ప్రపంచ పిచ్చుకల పరిరక్షణ పురస్కరించుకొని పిచ్చుకల సంతతి పెరగడానికి పిచ్చుక పరిరక్షణ కార్యక్రమాన్ని  గ్రీన్ క్లైమేట్ టీం తరపున రత్నం సోమవారం పెద్ద జాలరి పేట లోనీ జీవీఎంసీ ప్రాథమిక పాఠశాలలో  ప్రారంభించారు. ఈ సందర్భంగా రత్నం మాట్లాడుతూ నగరంలో పిచ్చుకలు కనిపిస్తున్న ప్రాంతాల సంఖ్య చాలావరకు పెరిగిందని, నగరంలోని వివిధ పాఠశాలల్లో ను, కళాశాలల్లోనూ మార్చి 20 తేదీ ( ప్రపంచ పిచ్చుకల పరిరక్షణా రోజు) వరకు పిచ్చుకల పరిరక్షణ కార్యక్రమాలు, ఆహారం, నీరు ఏర్పాటు చేసే విధంగా అవగాహన కల్పించడం అవి గుళ్ళు పెట్టుకోవడానికి అవసరమైనా మట్టి గూ ళ్లు, కొబ్బరి బొండాల తో, వెదురుతో గూళ్ళు ఏర్పాటు చేసేందుకు అవసరమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అలాగే  పక్షులు గూళ్ళు పెట్టే, పక్షు లకు ఆహారం ఇచ్చే చెట్లు పెంచడం, విత్తనాలు సేకరించి విత్తన బంతుల తయారుచేసి కొండల మీద చల్లడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. రసాయనాల వల్ల నానాటికీ పిచ్చుకల సంఖ్య తగ్గిపోతోందని అన్నారు. మన వంతుగా పిచ్చుకల పరి రక్షణ లొ భాగంగా ఇళ్ళల్లో పిచ్చుక గూళ్లు ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. ప్రపంచ పిచ్చుకల రోజు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే   పిచ్చుకల, ఇతర పక్షుల సంరక్షణ ర్థం పనిచేసే ప్రజలకు ఒక వేదికను ఏర్పాటు   చేయడం, పిచ్చుకలు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో గల మానవ ఆవాసాల తో గట్టి సంబంధాన్ని కలిగి ఉంటాయి అందుచేతనే వాటిని ఇంటి పిచ్చుక అని అంటారు అన్నారు. పక్షులు గూళ్ళను పెట్టుకోవడానికి వీలుగా ఉండే చెట్లను  పెంచడం, ధాన్యపు కంకులను    వేలాడదీయడం, ఈ మంచి పనిలో పిల్లలను భాగస్వామ్యులుగా చేయమన్నారు. దీనిద్వారా వారికి వృక్షజాలం,జంతు జాలం,జీవ వైవిధ్యం ప్రాముఖ్యత తెలుస్తుందని అన్నారు.ఆరోగ్యకరమైన వాతావరణాన్ని మన చిన్నారులకు అందజేద్దామన్నారు.  ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాలప్రధానోపాధ్యాయులు  రవి సిద్ధార్థ, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థిని విద్యార్థులకు ఫ్లకార్డులు ఇచ్చి  పిచ్చుకల ను సంరక్షిద్దాం  పిచ్చు కల సంతతి  పెరగడానికి కృషి చేద్దాం అనే నినాదం  చేయించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేయాలి

 విశాఖ స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణ నిలిపివేయాలి

జీవో నంబర్ 3 పునరుద్ధరించాలి

రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి

గిరిజన సంఘం.ఎస్. ఎఫ్. ఐ.ధర్నా

 పెన్ పవర్,విశాఖపట్నం

  కేంద్రంలో నరేంద్ర మోడీ,(బీజేపీ) చేస్తున్న ప్రైవేటీకరణ విధానాలకు నిరసనగా సోమవారం హుకుంపేటలో గరిజన సంఘం ఆద్వర్యంలో విద్యార్థి సంఘం ఆందోళన చేపట్టారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి, జీవో నంబర్  3 పునరుద్ధరణ చేసి గిరిజన హక్కులు,100 శాతం ఉద్యోగాలు గిరిజనుల కే ఇవ్వాలని,దేశవ్యాప్తంగా రైతులకు నష్టం చేసే 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారీ, ర్యాలీ ,ధర్నా జరిగింది.ఈ కార్యక్రమంలో గిరిన సంఘం మండల నాయకులు పాంగి సోమన్న నేతృత్వంలోజరిగిన   కార్యక్రమంలో సోమన్న,డూరు కృష్ణమూర్తి లు  మాట్లాడుతూ దేశంలోని అన్నీ ప్రభుత్వ కంపెనీలను ప్రైవేటు చేస్తూ,ఉద్యోగాలు,ఉపాధి కోల్పోయి,నిరుద్యోగం పెరిగి, ప్రజలు తీవ్ర దారిద్రం లో వెళ్లేలా కేంద్రంలోని బీజేపీ, మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు.తక్షణమే స్టీల్ ప్లాంట్ అమ్మకం ,ప్రైవేటి కరణ ఆపాలి,జీవో నంబర్ 3 పునరుద్ధరణ చేసి ఏజెన్సీలో 100 శాతం ఉద్యోగాలు గిరిజనులకే చెందేలా చెయ్యాలి.పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి.రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలి,భూమి రక్షణ కల్పించాలి,2020 విద్యుత్ చట్టం రద్దు చెయ్యాలని డిమాండ్ లతో ర్యాలీ,ధర్నా జరిగింది.ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి స హైమావతి, సీపీఎం లీడర్ సుడిపల్లి కొండలరావు, గిరిజన సంఘం మండల నాయకులు వి లక్ష్మణ్ రావు,డి కృష్ణమూర్తి, పాంగి సోమన్న ,విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...