*గుండారం లో రెవెన్యూ భూమి పై సర్వే జరపండి *
ఎల్లారెడ్డిపేట,పెన్ పవర్
ఎల్లారెడ్డిపేట మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేసి గుండారం గ్రామంలో రెవెన్యూ భూమి పై సర్వే జరపాలని తాసిల్దార్ శ్రీకాంత్ కు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొమ్మాట నరసయ్య మాట్లాడుతూ గుండారం గ్రామంలో 147 సర్వే నెంబర్లో 159 ఎకరాల రెవెన్యూ భూమి ఉందని ఇట్టి భూమిని గిరిజనులకు దళితులకు పంపిణీ చేయాలన్నారు అటవీశాఖ అధికారులు ఈ భూమిని అటవీశాఖ భూమి అంటూ అక్రమంగా కలుపుకోవడం జరిగిందన్నారు రెవెన్యూ అటవీశాఖ అధికారులు కలసి ఉమ్మడి సర్వే జరిపించి రెవెన్యూ భూమిని వేరు చేయాలన్నారు కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజు నాయకుని అక్రమ కేసుల్లో ఇరికించి అరెస్టు చేసి జైలుకు పంపించడం జరిగిందన్నారు రాజు నాయక్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్ జిల్లా కార్యదర్శి బండ్ల లింగం గౌడ్ నాయకులు కరికెశ్రీనివాస్ .మర్రి శ్రీనివాస్ రెడ్డి ..రాజేందర్ అక్కపురం కృష్ణ . శెట్టిపల్లి బాలయ్య .గజ్జల శ్రీనివాస్. దేవయ్య దండు శ్రీనివాస్ మానుక నాగరాజు సిరిపురం మహేందర్ రాజు రాములు రైతులు పాల్గొన్నారు






