Followers

వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రారంభం

 వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రారంభం

చింతపల్లి, పెన్ పవర్ 

వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. అయితే నిర్మాణ స్థలాన్ని ఐటిడిఎ, రెవెన్యూ అధికారులు మార్చు చేశారు. గత ఏడాదిలో చింతపల్లిలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వం రూ.23 కోట్లను మంజూరు చేసింది. దీంతో 2013 ఏప్రిల్లో స్థానిక ఏపిఆర్ కళాశాల దిగువన సర్వే నెంబర్ 63లో 2.3 ఎకరాలు, 12లో నాలుగు ఎకరాల స్థలాన్ని వందపడకల అసుపత్రికి రెవెను్యా అధికారులు వైద్య ఆరోగ్యశాఖకు అప్పగించారు. ఆ స్థలంలో గత ఏడాది నవంబర్ 7వ తేదీన పనులు ప్రారంభించారు. అయితే ఈ స్థలం తమదంటూ ఏపిఎసి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆధారాలు చూపడంతో ప్రత్యామ్నాయ స్థలం రెవెన్యూ అధికారులు అన్వేషించారు. ఖాళీగా ఉన్న పట్టు పరిశ్రమ శాఖకు చెందిన నాలుగు ఎకరాలను వంద పడకల ఆసుషత్రికి కేటాయించాలని ఐటిడిఎ, రెవెన్యూ అధికారులు నిర్ణయించి ఆరోగ్యశాఖకు అప్పగించారు. ఈ మేరకు అంతర్ల సమీపంలో ఉన్న పట్టు పరిశ్రమ స్థలంలో వంధ పడకల ఆసుపత్రి నిర్మాణానికి ఎక్స్కవేటరతో భూమి చదును పనులు ప్రారంభమయ్యాయి. ఈ ఆసుపత్రి నిర్మాణాలు 18 నెలల్లో పూర్తి చేస్తామని సంబంధిత శాఖ అదికారులు చెబుతున్నారు.

శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి రాకతో పులకించిన అనపర్తి భక్తజనం

 శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ  స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి రాకతో పులకించిన అనపర్తి భక్తజనం

అనపర్తి, పెన్ పవర్ 

 విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి బుధవారం అనపర్తి విచ్చేశారు. స్వామివారి దర్శనం తో అనపర్తి భక్తజనం భక్తి పారవశ్యంతో పులకించిపోయారు. స్వామి వారు తొలుత స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గృహానికి విచ్చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి పూర్ణకుంభంతో స్వాగతంచి సూర్యనారాయణరెడ్డి,ఆదిలక్ష్మి దంపతులు పీఠం పారంపర్య పాదుకులకు పూజ గావించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులతో పాటు వారి కుమారుడు డాక్టర్ గౌతమ్ రెడ్డి, ప్రియాంక దంపతులు, వారి బంధు జనం స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఎమ్మెల్యే గృహం నుండి స్థానిక దేవి చౌక్ సెంటర్ వరకు ఏర్పాటుచేసిన పూల మార్గంపై స్వామి వారు పాదయాత్ర చేశారు. భక్తజనం వెంటరాగా దేవీచౌక్ నుండి వాహనంలో బయల్దేరి స్థానిక అయ్యప్ప స్వామి వారి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ప్రాంగణంలో స్వామివారు స్వహస్తాలతో మొక్కలు నాటి అయ్యప్ప స్వామివారి దర్శనం చేసుకుని మంగళ హారతి సమర్పించారు. ఈ సందర్భంగా స్వాత్మానందేంద్ర సరస్వతి భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి వారి ఆలయం ఆంధ్ర ప్రదేశ్ లో మొదటి గొల్లపూడి అని రెండవది అనపర్తి అని ఈ ఆలయం ప్రతిష్టించిన సమయము అత్యంత శక్తివంతమైనది , అనపర్తి అయ్యప్ప స్వామి పూర్తి మహిమాన్వితుడని, ఆలయంలో అత్యంత శక్తి నిఘూడంగా ఉందని పేర్కొన్నారు. అనంతరం భక్తజనులకు మంగళా శాసనాలు చేసిన స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్రాక్షారామం పయనమయ్యారు.

వైయస్సార్సీపి విజయం ఊహించని రీతిలో టీడీపీకి ప్రజా స్పందన

వైయస్సార్సీపి విజయం ఊహించని రీతిలో టీడీపీకి ప్రజా స్పందన

మహారాణి పేట, పెన్ పవర్

వైసిపి ప్రభుత్వము పేద ప్రజల సంక్షేమం కోసం నవరత్నాలు పేరుతో  అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం ప్రకటించింది. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ఆ పధకములలో ప్రజలను భాగస్వాముల చేయుటలో  ప్రభుత్వ యంత్రాంగం విఫలం అయినది. గ్రామ స్వరాజ్యమే నిజమైన స్వరాజ్యం అని మహాత్ముడు సూచించిన మార్గంలో ముఖ్యమంత్రి జగన్ గ్రామ, వార్డు స్థాయిలో వాలంటరీ వ్యవస్థ ను ఏర్పాటు చేశారు.ఈ వ్యవస్థ నుంచి ఆశించిన సత్ఫలితాలు  విశాఖ ఎన్నికలలో  కానరాలేదు.ప్రభుత్వ పథకాల ఆవశ్యకతను ,అర్థమైన రీతిలో ప్రజల వద్దకు చేర్చుట లో ప్రజా ప్రతినిధులు, మంత్రులు, శాసనసభ్యులు,నగర ,వీధి స్థాయి నాయకులు అధికార యంత్రాంగం విఫలం అయినారు.మంత్రి అవంతి ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి నియోజకవర్గ పరిధిలో 9 డివిజన్లకు గాను  ఐదు చోట్ల టీడీపీ భారీ విజయం నమోదు చేసుకుంది.మంత్రి కుమార్తె పోటీచేసిన 6వ వార్డు పరిధిలో వారికి మూడు అంకెల మెజారిటీ నే వచ్చింది .6వ వార్డులో గత సంవత్సరంగా ఓటర్లను ఆకట్టుకొనుటకు మంత్రి గారి కుటుంబ సభ్యులు అనేక రకాల ప్రయత్నాలు చేశారు. అధికార యంత్రాంగం, వాలంటీర్లు, పార్టీ నాయకులు ,కార్యకర్తలు ,కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన మూడంకెల మెజారిటీ దాటలేదు.ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయుటలో అందరూ విఫలం అయినారు. భీమిలి నగర నడిబొడ్డున మంత్రిగారి కార్యాలయం సమీపంలో పోటీ చేసిన టీడీపీ అభ్యర్థికి 2960 ఓట్ల భారీ మెజారిటీతో ప్రజలు విజయం కట్టబెట్టారు.డబ్బే ఎన్నికలలో  ముఖ్యమని భావించారు. ప్రభుత్వ పథకాలు అమ్మ ఒడి,విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, వైయస్సార్ రైతు పథకం, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం,దివ్యాంగుల, వితంతువులకు, ఒంటరి మహిళ పెంచిన పెన్షన్ల పై అవగాహన కల్పించలేకపోయారు.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లో కేంద్రమునకు  రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసినట్లు  ప్రజలు  ప్రగాడంగా నమ్మారు .నాయకులందరూ టిడిపి నాయకులను విమర్శించడానికి సమయమును కేటాయించారు .ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై  ప్రజలకు అవగాహన కల్పించలేకపోయారు.విశాఖ అభివృద్ధికి  ఏ మాత్రం శ్రద్ధ చూపలేదు.నాయకులు ,పోలీసుల అండదండలతో భూకబ్జాలు, రౌడీయిజం ను పెరిగాయి. యువతకు ఉపాధి కల్పన లో విఫలం అయినారు. అవగాహన లేని  సచివాలయ సిబ్బంది , వాలంటీర్ వ్యవస్థలను పూర్తి శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దాలి.పెరిగిన నిత్యావసర ధరలను,లంచగొండితనం,రూపు మాపాలి.మహిళల రక్షణ  కోసం ప్రవేశపెట్టిన దిశ పోలీస్ స్టేషన్ల సేవలను విస్తృతం చేయాలి.ప్రజల పైన పన్నుల భారం తగ్గించాలి.రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసమే ప్రభుత్వము పని చెయ్యాలి.ప్రజల విశ్వాసం పొందిన నాడే  ఇంకా రెండు దశాబ్దాలు పైగా అధికారంలో ఉండగలుగుతారు.

గురజాల జిపి లో వధూవరులకు ధ్రువపత్రాల అందచేత

 గురజాల జిపి లో వధూవరులకు ధ్రువపత్రాల అందచేత

బెల్లంపల్లి , పెన్ పవర్

మండలంలోని గురిజాల గ్రామ పంచాయతీ పరిధిలోని నూతనంగా వివాహం చేసుకున్న వారికి ధ్రువపత్రాలను సర్పంచ్ గాజుల రంజిత వెంకటేషగౌడ్ అందజేశారు .నూతన వధూ వరులు చీకటి నందిని  సాయి కుమార్,నాయిని శిరీష విజయ్ కుమార్ దంపతులకు  అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి లక్ష్మి, మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ. వార్డ్మెం బర్.లక్ష్మి,రవి,నాందేవ్,చంద్రగౌడ్,తదితరులు పాల్గొన్నారు.


దళిత బస్తీ భూములపై సర్వే

 దళిత బస్తీ భూములపై సర్వే


 బేల, పెన్ పవర్

 ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సాంగిడి గ్రామంలో ని దళితుల కోసం కేటాయించిన దళితబస్తీ భూముల సర్వే మంగళవారం బెదొడ గ్రామ శివారులో ఎంసీ గోవిందరావు భూ సర్వే నిర్వహించారు. గ్రామంలో ఎన్ని దళిత కుటుంబాలకు దళితబస్తీ కింద భూములు పంపిణీ చేయాలో దళిత బస్తీ లబ్ధిదారులకు సరిపడ భూమి ఉందో లేదో అనే విషయం తెలుసుకుని భూ సర్వే నిర్వహించినట్లు ఆయన తెలిపారు.  ఆయన వెంట ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర కార్యదర్శి కదరపు ప్రవీణ్, గ్రామ దళిత మహిళలు తదితరులు ఉన్నారు.

జాతర్లలో ట్రైనీ ఐ ఎ ఎస్ ల పర్యటన

 జాతర్లలో ట్రైనీ ఐ ఎ ఎస్ ల పర్యటన

గుడిహత్నూర్ ,  పెన్ పవర్

 ఆదిలాబాద్ జిల్లా  బజార్  హత్నూర్   మండలంలోని  జాతర్ల  గ్రామాన్ని ట్రైనీ ఐఏఎస్ లు కునాల్ అర్వింద్  ప్రతాప్ ( గ్రూప్ లీడర్), శ్రీవాస్తవ,కంటా జంగీర్,సుస్మా నేగి లు మంగళవారం  సందర్శించారు. కాగా  గ్రామంలోని గ్రామపంచాయతీ  ఆఫీస్ లో  వివిధ  డిపార్ట్ మెంట్ల  ఆఫీసర్లతో ఏర్పాటు  చేసిన  మీటింగ్ లో  పాల్గొని గ్రామిణాభివృద్ధి  కోసం  చేపడుతున్న  కార్యక్రమాలను అడిగి  తెలుసుకున్నారు.  ఐసీడీఎస్, స్కూల్స్ , హాస్టల్స్, గ్రామపంచాయతీలలో  రోజువారీగా   జరిగే  ప్రోగ్రామ్స్ లతో  పాటు  వారి విధులను  అడిగి తెలుసుకున్నారు.  ఇక్కడి  సీహెచ్ సీ  సెంటర్ లో   గర్భవతులు, చైల్డ్ ఇమ్యూనైజేషన్, పోష్టికాహార అందజేత లాంటి పథకాలను అడిగి  తెలసుకున్నారు. వీటితో  పాటు  ఇక్కడ  జరుగుతున్న ఆదివాసీ పెళ్లి కార్యక్రమంలో  జరిగే ఆచార,వ్యవహరాలను ప్రత్యేకంగా  గ్రామస్థులు  వివరించారు.  వారితో ఎంపీడీఓ దుర్గం శంకర్, తహశీల్దార్ గంగాధర్, ఐసీడీఎస్ సూపర్ వైజర్  లక్ష్మీ, సర్పంచ్ లక్ష్మీబాయి నాగోరావు, ఎంపీటీసి అందె  సుజాత ప్రకాష్,  వివిధ శాఖల ఆఫీసర్లు ఉన్నారు.

గాడిగూడా మండలంలో పల్లె ప్రకృతి

 గాడిగూడా మండలంలో పల్లె ప్రకృతి వనమును ఆకస్మిక తనిఖీ  చేసిన  అదనపు కలెక్టర్ డేవిడ్


 నార్నూర్,  పెన్ పవర్  

 ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలంలోని పల్లె ప్రకృతి పార్కును మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం  ఎంపీడీఓ కార్యాలయం లో అదనకు కలెక్టర్ డేవిడ్ మండలంలోని  సర్పంచ్ లు,పంచాయతీ కార్యదర్శిలు, ఈజీఎస్  టీ ఏ ల తో రివ్వు మీటింగ్ తీసుకున్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టపంగా ప్రవేశపెట్టిన రైతువేదికలు, పల్లె ప్రకృతి వనం, స్మశాన వాటిక,నర్సరీ క్రిమిటోరియము పనులు ఎందుకు పూర్తి కాలేదు అని ప్రశ్నించారు.ఈ పనులని నెల చివరి వరకు 25-27 తేదీ లోగ పూర్తి చెలలేని గ్రామ సర్పంచ్ లు,పంచాయతి కార్యదర్శి లు, కాంట్రాక్టు లపై చర్యలు తప్పవని,  మండిపడ్డారు.ముఖ్యగా నర్సరీలలో 20% మొక్కలు మాత్రమే ఉన్నాయని, ఉపాధి హామీ పథకం పనుల మాస్టర్ రోల్ లో కచ్చితంగా మూడు ఫోటోలు తీసి కార్యదర్శి, మెట్, ఎంపీవో,ఏపీ ఓ, టీ ఏ, ఎంపీడీఓ ల సంతకలు ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో  ఎంపీడీఓ రమేశ్వర్,ఎంపీవో సాయి ప్రసాద్,ఏపీఓ  అమర్ సింగ్,వివిధ గ్రామ సర్పంచ్ లు, పంచాయతీ కార్యదర్శులు, టి ఏ లు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...