Followers

స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలి

 స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలి




మందమర్రి,  పెన్ పవర్ 

దేశ స్వాతంత్రం కోసం పాటుపడిన స్వాతంత్ర సమరయోధులు వారి జీవితాలను త్యాగం చేశారని, ఆ త్యాగాధనుల త్యాగాలను స్మరించుకుంటూ,75 సంవత్సరాలలో దేశం సాధించిన ప్రగతిని, అభివృద్ధిని, విజయాలను గుర్తు చేసుకోవాలని సింగరేణి సంస్థ మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ పేర్కొన్నారు. భారత్ కా అమృత్ మహోత్సవం  కార్యక్రమంలో భాగంగా బుధవారం మందమర్రి ఏరియాలోని కేకే గ్రూప్ ఏజెంట్ కార్యాలయం నుండి స్థానిక జిఎం కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం జిఎం కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు గడిచిన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 12 ,1930 సంవత్సరంలో మహాత్మా గాంధీ దండి సత్యాగ్రహం ప్రారంభించిన రోజున సబర్మతి ఆశ్రమం ఉండే భారత్ కా అమృత మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారని, అందులో భాగంగా సింగరేణి వ్యాప్తంగా జూన్ 30 వరకు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలలో సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. సంస్థలో రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధిస్తూ, సంస్థ అభివృద్ధికి పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా పర్సనల్ మేనేజర్ వరప్రసాద్, టీబీజీకేఎస్ స్టృక్చర్ కమిటీ సభ్యులు శంకర్ రావు, ఏఐటియుసి బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్, ఏరియాలోని అన్ని గనులు, విభాగాల ఏజిఎం లు, హెచ్ఓడి లు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఈ అసెంబ్లీ సమావేశం లోనేగల్ఫ్ కార్మికుల కోసం 500 కోట్లతో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

 ఈ అసెంబ్లీ సమావేశం లోనేగల్ఫ్ కార్మికుల కోసం 500 కోట్లతో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

 రాష్ట్ర ప్రధానకార్యదర్శి అమరగొండ తిరుపతి

పెన్ పవర్, జగిత్యాల

తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభం అయిన అసెంబ్లీ సమావేశాలలో గల్ఫ్ కార్మికుల కోసం 500 కోట్లు కేటాయిస్తూ గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ను ఏర్పాటు చెయ్యాలని తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమరకొండ తిరుపతి గౌడ్ డిమాండ్ చేశారు. బొగ్గుబాయి,బొంబాయి,దుబాయ్ వలసలు వెళ్లిన కార్మికుల కోసం ప్రభుత్వం భూములు అమ్మి వారికి తెలంగాణ రాష్ట్రంలో నే ఉపాధిని కలిపిస్తామని 2014 సం" కెసిఆర్ చెప్పిన మాటలు మర్చిపోకుండా మాట మీద నిలుచోవాలి అన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన 15 లక్షల మంది కార్మికులు వేతనాలు పంపడం వలన ప్రభుత్వానికి రెండు వేల కోట్లు ఆదాయం వస్తోందని రాష్ట్ర సంక్షేమం కోసం మావంతు గా మేము తోడ్పడుతున్నామన్నారు అది మరిచి గల్ఫ్ కార్మికుల పై చిన్న చూపు చూస్తున్నారని  ఆవేదం వ్యక్తపరిచారు.  జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో తప్పకుండా గల్ఫ్ కార్మికుల కోసం 500 కోట్లు కేటాయించి సంక్షేమ బోర్డు ను ఏర్పాటు చేయాలి అన్నారు లేని పక్షాన మా ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తామన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం గల్ఫ్ కార్మికులు చేసిన ఉద్యమాన్ని మర్చిపోకూడదు మాకు ఉద్యమలు చెయ్యడం కొత్త కాదు అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ అధ్యక్షులు కల్లెడ భూమన్న గౌరవ అధ్యక్షులు సేపూరి గోపాల్ , వర్కింగ్ ప్రెసిడెంట్ సంద సుదర్శన్  ఉపాధ్యక్షులు పెరుగు మల్లికార్జున్ కన్వీనర్ పురంశెట్టి నాగేష్, అధికార ప్రతినిది రాజు గౌడ్ ఎరుకల, ముఖ్య సలహాదారులు ఎం.డి హస్సన్ కార్యదర్శులు అమరగొండ మల్లేష్ జునుగురి నాగరాజు పాల్గొన్నారు.

వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రారంభం

 వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రారంభం

చింతపల్లి, పెన్ పవర్ 

వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. అయితే నిర్మాణ స్థలాన్ని ఐటిడిఎ, రెవెన్యూ అధికారులు మార్చు చేశారు. గత ఏడాదిలో చింతపల్లిలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వం రూ.23 కోట్లను మంజూరు చేసింది. దీంతో 2013 ఏప్రిల్లో స్థానిక ఏపిఆర్ కళాశాల దిగువన సర్వే నెంబర్ 63లో 2.3 ఎకరాలు, 12లో నాలుగు ఎకరాల స్థలాన్ని వందపడకల అసుపత్రికి రెవెను్యా అధికారులు వైద్య ఆరోగ్యశాఖకు అప్పగించారు. ఆ స్థలంలో గత ఏడాది నవంబర్ 7వ తేదీన పనులు ప్రారంభించారు. అయితే ఈ స్థలం తమదంటూ ఏపిఎసి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆధారాలు చూపడంతో ప్రత్యామ్నాయ స్థలం రెవెన్యూ అధికారులు అన్వేషించారు. ఖాళీగా ఉన్న పట్టు పరిశ్రమ శాఖకు చెందిన నాలుగు ఎకరాలను వంద పడకల ఆసుషత్రికి కేటాయించాలని ఐటిడిఎ, రెవెన్యూ అధికారులు నిర్ణయించి ఆరోగ్యశాఖకు అప్పగించారు. ఈ మేరకు అంతర్ల సమీపంలో ఉన్న పట్టు పరిశ్రమ స్థలంలో వంధ పడకల ఆసుపత్రి నిర్మాణానికి ఎక్స్కవేటరతో భూమి చదును పనులు ప్రారంభమయ్యాయి. ఈ ఆసుపత్రి నిర్మాణాలు 18 నెలల్లో పూర్తి చేస్తామని సంబంధిత శాఖ అదికారులు చెబుతున్నారు.

శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి రాకతో పులకించిన అనపర్తి భక్తజనం

 శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ  స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి రాకతో పులకించిన అనపర్తి భక్తజనం

అనపర్తి, పెన్ పవర్ 

 విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి బుధవారం అనపర్తి విచ్చేశారు. స్వామివారి దర్శనం తో అనపర్తి భక్తజనం భక్తి పారవశ్యంతో పులకించిపోయారు. స్వామి వారు తొలుత స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గృహానికి విచ్చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి పూర్ణకుంభంతో స్వాగతంచి సూర్యనారాయణరెడ్డి,ఆదిలక్ష్మి దంపతులు పీఠం పారంపర్య పాదుకులకు పూజ గావించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులతో పాటు వారి కుమారుడు డాక్టర్ గౌతమ్ రెడ్డి, ప్రియాంక దంపతులు, వారి బంధు జనం స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఎమ్మెల్యే గృహం నుండి స్థానిక దేవి చౌక్ సెంటర్ వరకు ఏర్పాటుచేసిన పూల మార్గంపై స్వామి వారు పాదయాత్ర చేశారు. భక్తజనం వెంటరాగా దేవీచౌక్ నుండి వాహనంలో బయల్దేరి స్థానిక అయ్యప్ప స్వామి వారి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ప్రాంగణంలో స్వామివారు స్వహస్తాలతో మొక్కలు నాటి అయ్యప్ప స్వామివారి దర్శనం చేసుకుని మంగళ హారతి సమర్పించారు. ఈ సందర్భంగా స్వాత్మానందేంద్ర సరస్వతి భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి వారి ఆలయం ఆంధ్ర ప్రదేశ్ లో మొదటి గొల్లపూడి అని రెండవది అనపర్తి అని ఈ ఆలయం ప్రతిష్టించిన సమయము అత్యంత శక్తివంతమైనది , అనపర్తి అయ్యప్ప స్వామి పూర్తి మహిమాన్వితుడని, ఆలయంలో అత్యంత శక్తి నిఘూడంగా ఉందని పేర్కొన్నారు. అనంతరం భక్తజనులకు మంగళా శాసనాలు చేసిన స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్రాక్షారామం పయనమయ్యారు.

వైయస్సార్సీపి విజయం ఊహించని రీతిలో టీడీపీకి ప్రజా స్పందన

వైయస్సార్సీపి విజయం ఊహించని రీతిలో టీడీపీకి ప్రజా స్పందన

మహారాణి పేట, పెన్ పవర్

వైసిపి ప్రభుత్వము పేద ప్రజల సంక్షేమం కోసం నవరత్నాలు పేరుతో  అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం ప్రకటించింది. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ఆ పధకములలో ప్రజలను భాగస్వాముల చేయుటలో  ప్రభుత్వ యంత్రాంగం విఫలం అయినది. గ్రామ స్వరాజ్యమే నిజమైన స్వరాజ్యం అని మహాత్ముడు సూచించిన మార్గంలో ముఖ్యమంత్రి జగన్ గ్రామ, వార్డు స్థాయిలో వాలంటరీ వ్యవస్థ ను ఏర్పాటు చేశారు.ఈ వ్యవస్థ నుంచి ఆశించిన సత్ఫలితాలు  విశాఖ ఎన్నికలలో  కానరాలేదు.ప్రభుత్వ పథకాల ఆవశ్యకతను ,అర్థమైన రీతిలో ప్రజల వద్దకు చేర్చుట లో ప్రజా ప్రతినిధులు, మంత్రులు, శాసనసభ్యులు,నగర ,వీధి స్థాయి నాయకులు అధికార యంత్రాంగం విఫలం అయినారు.మంత్రి అవంతి ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి నియోజకవర్గ పరిధిలో 9 డివిజన్లకు గాను  ఐదు చోట్ల టీడీపీ భారీ విజయం నమోదు చేసుకుంది.మంత్రి కుమార్తె పోటీచేసిన 6వ వార్డు పరిధిలో వారికి మూడు అంకెల మెజారిటీ నే వచ్చింది .6వ వార్డులో గత సంవత్సరంగా ఓటర్లను ఆకట్టుకొనుటకు మంత్రి గారి కుటుంబ సభ్యులు అనేక రకాల ప్రయత్నాలు చేశారు. అధికార యంత్రాంగం, వాలంటీర్లు, పార్టీ నాయకులు ,కార్యకర్తలు ,కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన మూడంకెల మెజారిటీ దాటలేదు.ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయుటలో అందరూ విఫలం అయినారు. భీమిలి నగర నడిబొడ్డున మంత్రిగారి కార్యాలయం సమీపంలో పోటీ చేసిన టీడీపీ అభ్యర్థికి 2960 ఓట్ల భారీ మెజారిటీతో ప్రజలు విజయం కట్టబెట్టారు.డబ్బే ఎన్నికలలో  ముఖ్యమని భావించారు. ప్రభుత్వ పథకాలు అమ్మ ఒడి,విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, వైయస్సార్ రైతు పథకం, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం,దివ్యాంగుల, వితంతువులకు, ఒంటరి మహిళ పెంచిన పెన్షన్ల పై అవగాహన కల్పించలేకపోయారు.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లో కేంద్రమునకు  రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసినట్లు  ప్రజలు  ప్రగాడంగా నమ్మారు .నాయకులందరూ టిడిపి నాయకులను విమర్శించడానికి సమయమును కేటాయించారు .ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై  ప్రజలకు అవగాహన కల్పించలేకపోయారు.విశాఖ అభివృద్ధికి  ఏ మాత్రం శ్రద్ధ చూపలేదు.నాయకులు ,పోలీసుల అండదండలతో భూకబ్జాలు, రౌడీయిజం ను పెరిగాయి. యువతకు ఉపాధి కల్పన లో విఫలం అయినారు. అవగాహన లేని  సచివాలయ సిబ్బంది , వాలంటీర్ వ్యవస్థలను పూర్తి శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దాలి.పెరిగిన నిత్యావసర ధరలను,లంచగొండితనం,రూపు మాపాలి.మహిళల రక్షణ  కోసం ప్రవేశపెట్టిన దిశ పోలీస్ స్టేషన్ల సేవలను విస్తృతం చేయాలి.ప్రజల పైన పన్నుల భారం తగ్గించాలి.రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసమే ప్రభుత్వము పని చెయ్యాలి.ప్రజల విశ్వాసం పొందిన నాడే  ఇంకా రెండు దశాబ్దాలు పైగా అధికారంలో ఉండగలుగుతారు.

గురజాల జిపి లో వధూవరులకు ధ్రువపత్రాల అందచేత

 గురజాల జిపి లో వధూవరులకు ధ్రువపత్రాల అందచేత

బెల్లంపల్లి , పెన్ పవర్

మండలంలోని గురిజాల గ్రామ పంచాయతీ పరిధిలోని నూతనంగా వివాహం చేసుకున్న వారికి ధ్రువపత్రాలను సర్పంచ్ గాజుల రంజిత వెంకటేషగౌడ్ అందజేశారు .నూతన వధూ వరులు చీకటి నందిని  సాయి కుమార్,నాయిని శిరీష విజయ్ కుమార్ దంపతులకు  అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి లక్ష్మి, మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ. వార్డ్మెం బర్.లక్ష్మి,రవి,నాందేవ్,చంద్రగౌడ్,తదితరులు పాల్గొన్నారు.


దళిత బస్తీ భూములపై సర్వే

 దళిత బస్తీ భూములపై సర్వే


 బేల, పెన్ పవర్

 ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సాంగిడి గ్రామంలో ని దళితుల కోసం కేటాయించిన దళితబస్తీ భూముల సర్వే మంగళవారం బెదొడ గ్రామ శివారులో ఎంసీ గోవిందరావు భూ సర్వే నిర్వహించారు. గ్రామంలో ఎన్ని దళిత కుటుంబాలకు దళితబస్తీ కింద భూములు పంపిణీ చేయాలో దళిత బస్తీ లబ్ధిదారులకు సరిపడ భూమి ఉందో లేదో అనే విషయం తెలుసుకుని భూ సర్వే నిర్వహించినట్లు ఆయన తెలిపారు.  ఆయన వెంట ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర కార్యదర్శి కదరపు ప్రవీణ్, గ్రామ దళిత మహిళలు తదితరులు ఉన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...