Followers

32వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజుకు అభినందనలు తెలిపిన వార్డు వాలంటీర్లు,సచివాలయ సిబ్బంది

 32వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజుకు అభినందనలు తెలిపిన వార్డు వాలంటీర్లు,సచివాలయ సిబ్బంది

మహారాణి పేట, పెన్ పవర్

వార్డు ప్రజలకు ఎటువంటి సమస్యలు ఎదురైనా సహనంతో సేవా భావంతో పనిచేయాలని తనను కలసిన వాలంటీర్లకు 32వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు కోరారు.కార్పొరేటర్ గా గెలిచిన నాగరాజును వార్డు వాలంటీర్లు,సచివాలయ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛమిచ్చి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ వార్డుకు సంబదించిన ఈ సమస్యనైనా తన దృష్టికి తీసుకురావాలని కోరారు.వార్డు పరిధిలో అర్హులందరికీ రేషన్ కార్డులు,పించేన్లు,ఇంటి ఇంటికీ రేషన్ వంటి కార్యక్రమంలో నిరంతరం కొనసాగేలా చేరాలని కోరారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందేలా చూడాలని తన సహాయ సహకారాలు ఎల్లపుడు ఉంటాయని నాగరాజు తెలిపారు.

వీటి హై స్కూల్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వారి ఆధ్వర్యంలో రహదారి భద్రత ఉత్సవాలు

 వీటి హై స్కూల్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వారి ఆధ్వర్యంలో రహదారి భద్రత ఉత్సవాలు

మహారాణి పేట, పెన్ పవర్

విశాఖపట్నంలో విద్యారంగంలో 75 సంవత్సరాల నుండి ఎంతోమంది మేధావులుగా తీర్చిదిద్దిన టువంటి ద్వారక నగర్ లో ఉన్న వీటి హై స్కూల్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వారి ఆధ్వర్యంలో విద్యార్థినులతో స్కూలు యాజమాన్యం యొక్క సహకారంతో   ట్రాకింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రహదారి భద్రత ఉత్సవాల్లో భాగంగా మాధవధార మురళి నగర్ పలు ట్రాఫిక్ కూడళ్ల వద్ద రోడ్డు ప్రమాదాలు నివారణ కొరకు పలు సూచనలను లేఖ రూపంలో స్పీడ్ డ్రైవ్ హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం వలన జరిగే అనర్థాలను వాహనదారులకు అర్థమయ్యే రూపంలో వివరించారు.

తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని అవమానిస్తారా?

 తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని అవమానిస్తారా? 

గ్రేటర్ ఎన్నికలు ముగిసినా దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి తొలగని ముసుగు

ఆగ్రహం చేసిన తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్

మహారాణి పేట, పెన్ పవర్

జూనియర్ ఎన్టీఆర్ విశాఖ వచ్చి తాతకు నివాళులు అర్పించాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.గ్రేటర్ ఎన్నికలు ముగిసినా దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి తొలగని ముసుగు ఆగ్రహం చేసిన తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్. జీవీఎంసీ ఎన్నికలు ముగిసి కౌన్సిల్ కొలువు దీరినా  మేయర్ ప్రమాణ స్వీకారం చేసినా రామకృష్ణ బీచ్ లో ని దివంగత ఎన్టీ రామారావు విగ్రహానికి ఉన్న ముసుగును  అధికార యంత్రాంగం తొలగించక పోవడంపై  తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఉదయం ఆ మహనీయుని విగ్రహం వద్దకు చేరుకున్నారు. ముసుగు తొలగించి క్షీరాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామ్  మాట్లాడుతూ వుడా పార్క్ సమీపంలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం సహా నగరంలో అన్ని విగ్రహాలకు ముసుగులు తొలగించినప్పటికీ రామకృష్ణ బీచ్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ముసుగు తొలగించక పోవడం ఏంటని ప్రశ్నించారు. ఎందుకు బాధ్యులైన సంబంధిత జివిఎంసి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసిపి నాయకులు, కార్పొరేటర్లు వైయస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి కౌన్సిల్ హాల్ కి వెళ్లారని ఈ సందర్భంగా తెలిపారు. మరోవైపు విశాఖ నగర ప్రజలు 30 మంది తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ లను గెలిపించారన్నారు. అయినా ఆ పార్టీకి చెందిన ఏ ఒక్కరూ కూడా ఎన్టీఆర్ విగ్రహానికి ఉన్న ముసుగు తొలగించి శుభ్రం చేయడం పై శ్రద్ధ చూపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి తెలుగుదేశం నాయకుల పట్ల టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా తెలుగుజాతి ఆత్మగౌరవం నినాదంతో తెలుగువారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన దివంగత నందమూరి తారక రామారావు విగ్రహానికి జరిగిన ఈ అవమానానికి ఆయన కుటుంబ సభ్యులు విశాఖ చేరుకుని ఆయన ఆత్మ శాంతికి కృషి చేయాలన్నారు. ఇందులో భాగంగా దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి నివాళులు అర్పించాలని కోరారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులలో అందరికంటే ఎక్కువగా ప్రజామోదం ఉన్న జూనియర్ ఎన్టీఆర్ విశాఖ వచ్చి తాతకు నివాళులు అర్పించాలని ప్రజలు కూడా ఆకాంక్షిస్తున్నారన్నారు.ఈ కార్యక్రమంలో కె.రమేష్ బాబు, డాక్టర్ పి.జయశ్రీ, వంశీ,ఎస్.హరి,రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

మహిళలకు పెద్ద పీట వేయడం హర్షణీయం

 మహిళలకు పెద్ద పీట వేయడం హర్షణీయం

ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలిపిన ....కొణతాల సీతారాం

విశాఖపట్నం, పెన్ పవర్

మహిళలకు పెద్ద పీట వేసి మేయర్ లు, మునిసిపల్ చైర్మన్లు గా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం అభినందనీయమని మహిళలకు పెద్ద పీట వేయడం పట్ల మహిళా సాధికారత చేకూరుతుందని అన్నారు.పదవులను అలంకిరించిన వారు పరిపాలనా సాధికారత అంశంలో సొంతంగా నిర్ణయాలు తీసుకునేలా తయారు కావాలని సూచించారు. ప్రభుత్వం చేసే మంచిని మంచి అని తప్పులు చేస్తే అవి తప్పు అని జై అనకాపల్లి సేన ఎప్పుడు తేల్చి చెప్తుందని స్ఫష్టం చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మేయర్, చైర్మన్ లుగా ప్రమాణస్వీకారం చేసిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

కో వ్యాక్సిన్ ను సద్వినియోగం చేసుకోండి

 కో వ్యాక్సిన్ ను సద్వినియోగం చేసుకోండి

పెన్ పవర్, వరదయ్యపాలెం

వరదయ్యపాలెం, చిన్నపాండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొవిడ్ వ్యాక్సిన్ ప్రారంబమైనట్లు వైద్యాధికారి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. 60ఏళ్లు పైబడిన వృద్దులందరికీ,  45ఏళ్ల నుంచి 59ఏళ్ల లోపు వారికి ప్రత్యేకంగా మధుమేహం (సుగర్) బీపీ, క్యాన్సర్, గుండె వ్యాధులు ఇతర దీర్జకాలిక వ్యాధులు ఉన్న వారికి మాత్రం వ్యాక్సిన్ వేస్తున్నట్లు ఆయన తెలిపారు. కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందడానికి ఈ అవకాశాన్ని సద్వినియగం చేసుకోవాలని కోరారు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని, ఎవరూ అపోహలతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు

కుంయ్..కుయ్..కుయ్.. వచ్చేసిందోచ్

 కుంయ్..కుయ్..కుయ్.. వచ్చేసిందోచ్

ఎమ్మెల్యే చొరవ..ఎట్టకేలకు తీరిన ప్రజల చిరకాల కల

వరదయ్యపాలెంలో 108ను ప్రారంభించిన వైసీపీ నాయకులు

పెన్ పవర్,వరదయ్యపాలెం

వరదయ్యపాలెం మండల ప్రజలకు శుభవార్త. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చొరవతో  ప్రజలు చిరకాలంగా ఎదురుచూస్తున్న 108వాహనం వచ్చేసింది. వరదయ్యపాలెం కు మంజూరైన 108 వాహనాన్ని శుక్రవారం స్థానిక ప్రాథమికఆరోగ్యకేంద్రంలో వైద్యాధికారి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్చంగ వైసీపీ అధ్యక్షుడు దయాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ బొప్పనతిలక్ బాబు మాట్లాడుతూ అటు పర్యాటక కేంద్రం ఉబ్బలమడుగు, కల్కి భగవాన్ ఆశ్రమం,ఇటు తిరుపతి శ్రీకాళహస్తి వంటి పుణ్యక్షేత్రాలకు ప్రధాన మార్గంగా ఉన్న వరదయ్య పాలెంలో ఎక్కువుగాప్రమాదాలు జరుగుతున్నా108 లేకపోవటంతో అమాయక ప్రాణాలు కోల్పోయివారని అన్నారు.గత 10ఏళ్లుగా 108 మంజూరు చేయాలని అధికారులకు ప్రజాప్రతినిధులకు విన్నవించినా పలితం శూన్యమని ఆవేదన వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఆశయ సాధనలో భాగంగా ప్రతి మండలానికి 108  మంజూరు చేయడంతో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం  సహకారంతో 108 వాహనం ఏర్పాటు చేయడం హర్షణీయం అని అన్నారు. కార్యక్రమంలో రాచర్ల సర్పంచ్ ధనంజయ లు వైసీపీ యువజన అధ్యక్షుడు వినోద్ యాదవ్, మైనారిటీ కన్వీనర్ అబ్దుల్, హాస్పిటల్ స్టాఫ్,  నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

గొలగానికే....మేయర్ పీఠం

 గొలగానికే....మేయర్ పీఠం

జి.వి.ఎం.సి. మేయరు గా హరి వెంకట కుమారి ఎన్నిక

విశాఖ పొలిటికల్, పెన్ పవర్  

విశాఖ నగర మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఆరిలోవ 11 వ వార్డు వై.ఎస్.ఆర్.సి.పి. అభ్యర్ధినిగా 4850 మెజారిటీ తో గెలిచి అందరి మన్ననలు పొందిన గొలగాని హరి వెంకట కుమారి ని నేడు విశాఖ నగర మేయర్ పదవి వరించింది. ఆమె  ఒమ్మి లక్ష్మీ, మరియు స్వర్గీయ ఒమ్మి అప్పల నాయుడు దంపతుల  ప్రధమ కుమార్తె. ఆమెది ఒక సామాన్య  సాదా సీదా కుటుంబం. బి.ఎస్.సి.,బి.ఇ. డి. విద్యను అభ్యసించారు. అంతకు మించి ప్రజాసేవ అనే గ్రంధాన్నిక్షుణ్ణంగా పఠించిన సేవాతత్పరత భావాన్ని కలిగిన నిగర్వి.  స్వర్గీయ దివంగత నేత, మాజీ మంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి చేసిన సేవలకు ఆకర్షితుడై  ప్రజాసేవకే అంకితమైన గొలగాని శ్రీనివాస్ ను వివాహం చేసుకున్నారు. అప్పటి నుండి అనునిత్యం భర్త అడుగుజాడల్లో నడుస్తూ ప్రతి ఒక్కరి తో మమేకమై తారతమ్య బేధాలు లేకుండా ప్రజాసేయస్సుకు పాటుపడుతూ నేడు మేయర్ పీఠాన్ని అధిష్టించారు. ఈ సందర్బంగా మేయర్ హరి వెంకట కుమారి మాట్లాడుతూ.   ఒక బి.సి. సామాజిక మహిళకు మేయర్ పదవిని కట్టబెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి, రాజ్యసభ సభ్యులు విజయ్ సాయి రెడ్డి కి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా కుల మత వర్గ తరతమ్యా బేధాలు లేకుండా అందరికీ  అన్నివేళలా అందుబాటులో వుంటూ అవినీతికి తావు లేకుండా  ప్రజల సమస్యలను తీర్చడమే నా ప్రధాన ద్యేయమని మరియు నగరం లోని అన్ని వ్వార్డులను సందర్శించి  సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా అడుగులు వేస్తామని ముఖ్యంగా సామాన్య ప్రజానీకానికి అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. 

ఈ నేపథ్యంలో వై.ఎస్.ఆర్.సి.పి. నాయకుడు గోలగాని  శ్రీనివాస్ మాట్లాడుతూ.....కార్పొరేషన్ ఏజండా గా మంచి నీటి సమస్య లేకుండా చూస్తామని, డ్రైనేజీ వ్యవస్థ ను ప్రక్షాళన పరుస్తామని,   పారిశ్రామిక వేత్తలు  పెట్టుబడులు పెట్టె రీతిలో నగరాన్ని తీర్చిదిద్దుతామని, పర్యాటక రంగాన్ని అభివృద్ధి  పరుస్తామని,  100 సంవత్సరాల చరిత్ర కలిగిన ముడసర్లోవ రిజర్వాయర్ ను అభివృద్ధి చేస్తామని,  సిటీ లో ఉన్న విలీన మారుమూల ప్రాంతాలన్నింటినీ జోనల్ కమీషనర్, ఆ ప్రాంత ప్రజా ప్రతినిధి, వ్వాలంట్రీ, సచివాలయా వ్యవస్థ లను కలుపుకోని ఒక ప్రణాళిక బద్దం గా అభివృద్ధి చేస్తామని, ఆరోగ్య విషయం లో స్థానికంగా ఉన్న ప్రాథమిక వైద్యశాలాలను అభివృద్ది పరిచి మెరుగైన వైద్యాన్ని అందిస్తామని, నగరం లో లక్షలాది వాహనాల వలన ట్రాఫిక్ సమస్య అధికంగా ఉందని పోలీస్ కమీషనర్ వారిని సంప్రదించి ప్రజలకు అనుకూలంగా ఆ సమస్యను పరిష్కరిస్తామని అన్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నగరాన్ని ఎగ్జిక్యూటివ్ కాపిటల్ గా ప్రకటించడం జరిగిందని ఆయన ఆశీస్సులతో, విజయసాయిరెడ్డి సూచనలతో ఈ నగరాన్ని యావత్ దేశంలోనే ఆదర్శవంతమైన నగరంగా తీర్చిదిద్ధి ప్రపంచ పటంలో చూపిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. అధికారులు, రాజకీయ నాయకులు అనే తారతమ్యం లేకుండా, పార్టీ వైషమ్యాలు పొడ చూపకుండా అందరూ ఒకే కుటుంబం లా పనిచేసి ప్రజా సంక్షేమానికి, కార్పొరేషన్ అభివృద్ధి కి పాటు పడాలని హితవు పలికారు. విశాఖ జోనల్ కమిషనర్ లు, కార్పొరేషన్ యూనియన్ లీడర్లు, వివిధ సంఘాల పెద్దలు, ఎన్నికయిన పాలక మండలి కార్పొరేటర్లు, వివిధ విద్యా సంస్థల ప్రిన్సిపాల్ లు, విద్యార్థులు, చర్చ్, మసీదు మత పెద్దలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళా సంఘాలు , విద్యుత్ సంఘ ఉద్యోగులు మేయర్ నుమర్యాద పూర్వకంగా కలసి  అభినందించారు. పూలమాలలు, పుష్ప గుచ్చాలు సమర్పించి  శాలువాలు కప్పి సన్మానించారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...