Followers

పంట నష్టపోయిన రైతులకు అండగా ఉంటాం

 పంట నష్టపోయిన రైతులకు అండగా ఉంటాం

తాళ్లపూడి, పెన్ పవర్

గురువారం జరిగిన జెడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల్లో వైయస్సార్  పార్టీ కి ఓటేసిన ప్రతి ఓటర్ కి వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకు, అభిమానులకు  కృతజ్ఞతలు తెలియజేసిన పెద్దేవం ప్రెసిడెంట్ తిగిపల్లి వెంకటరావు,  వైఎస్ఆర్సిపి జిల్లా కార్యదర్శి మరియు వైస్ ప్రెసిడెంట్ తోట రామకృష్ణ. అలాగే తోట రామకృష్ణ మాట్లాడుతూ పెద్దేవం గ్రామ పంచాయతీలో పోటీచేసిన  ఇద్దరు ఎంపీటీసీ అభ్యర్థులు విజయం సాధిస్తారని తెలియజేశారు. అలాగే మొన్న కురిసిన అకాల వర్షానికి నష్టపోయిన రైతులకు ధైర్యం ఇస్తూ నష్టపోయిన ప్రతీ రైతు పంట నమోదు చేసుకోవాలని తెలియజేశారు. రైతు ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, పొలం పాస్ బుక్  మరియు కౌలు కార్డు తీసుకుని విఆర్వో సుజాత ని, అగ్రికల్చర్ అసిస్టెంట్ శ్రీరామ్ ని కలవాలని తెలియజేశారు.

కౌన్సిల్ మొదటి సమావేశంలోనే ధాటిగా ప్రసంగించి అందరి దృష్టిని ఆకర్షించిన కందులనాగరాజు

కౌన్సిల్ మొదటి సమావేశంలోనే ధాటిగా ప్రసంగించి అందరి దృష్టిని ఆకర్షించిన కందులనాగరాజు

మహారాణి పేట, పెన్ పవర్

విశాఖ ఉక్కును ప్రవేటీకరణ కు వ్యతిరేకంగా అన్నిరాజకీయపక్షాలు కలిసి పోరాటం చెయ్యాలని జీవీఎంసీ కార్పొరేటర్ కందులనాగరాజు పిలుపునిచ్చారు.శుక్రవారం అల్లిపురం నుంచి జీవీఎంసీ వరకూ విశాఖ ఉక్కును ప్రవేటీకరణ చేయవద్దంటూ పాదయాత్ర గా వచ్చి గాంధీవిగ్రహానికి పూలమావేసి నివాళులు అర్పించారు.అనంతరం జీవీఎంసీ కౌన్సిల్ మొదటిసమావేశానికి హాజరైయ్యారు.

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు  చేసుకుంటూ పాదయాత్ర చేసారు.కౌన్సిల్ లో మాట్లాడుతూ విశాఖ ఉక్కు తెలుగు  ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని,కౌన్సిల్ వేదికగా ప్రవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేద్దామని ప్రతిపాదించారు.విశాఖ ఉక్కుకు  ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని,లక్షలాది కుటుంబాలు విశాఖ ఉక్కుపై ఆధారపడి జీవిస్తున్నాయన్నారు. కౌన్సిల్ మొదటి సమావేశంలోనే ధాటిగా ప్రసంగించి అందరి దృష్టిని ఆకర్షించారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా20 కిలో మీటర్లు పాదయాత్ర చేపట్టిన తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు

స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా20 కిలో మీటర్లు పాదయాత్ర చేపట్టిన తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు

గాజువాక, పెన్ పవర్

స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెల్లవారుజామున కూర్మన్నపాలెం జంక్షన్ నుండి విశాఖ నగర పాలక సంస్థ వరకు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ల పాదయాత్ర చేపట్టారు.పాదయాత్రలో భాగంగా తెల్లవారు నాలుగున్నర  గంటలకు కూర్మన్నపాలెం జంక్షన్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు పూలమాలవేసి  కాగడ వెలిగించి పాదయాత్ర చేపట్టారు.వీరితో పాటు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు కూడా సంఘీభావంగా   పాదయాత్రలో పాల్గొన్నారు.

కార్పొరేటర్లు మాట్లాడుతూ  విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గాజువాక నియోజకవర్గం నుంచి  తెలుగుదేశం కార్పొరేటర్లు ఈరోజు జరగనున్న నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశానికి పాదయాత్రగా బయలుదేరి కౌన్సిల్ తీర్మానంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూడాలని పబ్లిక్ సెక్టర్ గా నడవాలని విశాఖ స్టీల్ ప్లాంట్ కర్మాగారం వేల మందికి అన్నం పెడుతుందని  ప్రైవేట్ పరం అయితే కార్మిక కుటుంబాలు అన్యాయం అయిపోతాయని అన్నారు.

భీమ్ ప్రతిజ్ఞ వారోత్సవాల ను జయప్రదం చేయండి

 భీమ్ ప్రతిజ్ఞ వారోత్సవాలను జయప్రదం చేయండి

 తార్నాక , పెన్ పవర్

సామాజికవిప్లవకారులు మహనీయులు మహాత్మ ఫూలే జయంతి నుండి భారత రాజ్యాంగ పితామహుడు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వరకు ఆర్ట్స్ కళాశాల వేదిక గా ఏప్రిల్ 11నుండి 14 వరకు జరిగే "భీమ్ ప్రతిజ్ఞ వారోత్సవ్ " కార్యక్రమం ను జయప్రదం చేయాలని కోరుతూ ఓయూ విద్యార్థులు పిలుపునిచ్చారు.  ఆర్ట్స్ కాలేజ్ ముందు "బీమ్ ప్రతిజ్ఞ వారోత్సవాల" పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఓయూ విద్యార్థి నాయకులు  హరీష్ ఆజాద్, మంచాల లింగ స్వామి, కృష్ణ మాదిగ, గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ హిందూ మతాన్ని వీడి భౌద్ధము తీసుకునే సమయంలో  చేసిన ప్రమాణాలను మనమూ పాటిస్తూ, ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ అసలైన బాబాసాహెబ్ వారసులుగా ముందుకు రావాలని అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో విస్తృతంగా నిర్వహించాలని  పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్యారనరేశ్, నకిరేకంటి నాగరాజు, దివాకర్, సంతోష్, బట్టు, స్వామి మాదిగ, ఉదయ్, క్రాంతి, వెంకన్న ,బాలు, మురళి కృష్ణ, కిషోర్, సాయి తదితరులు పాల్గొన్నారు.

కోడూరు అప్పలరత్నం ని శాలువాతో సత్కరించిన...అవంతి శ్రీనివాస్

 కోడూరు అప్పలరత్నం ని శాలువాతో సత్కరించిన...అవంతి శ్రీనివాస్

మహారాణి పేట, పెన్ పవర్

గ్రీన్ పార్క్ హోటల్ లో  నూతనంగా ఎన్నుకోబడిన వై.ఎస్.ఆర్.సి.పి 30 వ వార్డు కార్పొరేటర్ కోడూరు.అప్పలరత్నం ని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు అవంతి శ్రీనివాస్ శాలువాతో సత్కరించి సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో  అనకాపల్లి ఎమ్.ఎల్.ఎ. గుడివాడ. ఆమర్నాధ్,విశాఖపట్నం నగర మేయర్ హరి వెంకట కుమారి ,డిప్యూటీ మేయర్ జియ్యని. శ్రీధర్ ,వై.ఎస్.ఆర్.పార్టీ నాయకులు మల్ల.విజయ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

బొడ్డేటి కిషోర్ అధ్యక్షతన వాసుపల్లి ఫాలోయర్స్ వెల్ఫేర్ అసోసియేషన్....

 బొడ్డేటి కిషోర్ అధ్యక్షతన వాసుపల్లి ఫాలోయర్స్ వెల్ఫేర్ అసోసియేషన్....

మహారాణి పేట, పెన్ పవర్

అశోక్ నగర్, అసిల్ మెట్ట, ఎమ్మెల్యే కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని అల్లిపురం 32వార్డ్ వైస్సార్సీపీ యూత్ నాయకుడు బొడ్డేటి కిషోర్ అధ్యక్షతన వాసుపల్లి ఫాలోయర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసన సభ్యులు  వాసుపల్లి గణేష్ కుమార్ చేతుల మీదుగా కేక్ కట్ చేసిన తదుపరి అసోసియేషన్ ప్రారంభించడటం జరిగింది. 

ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వారు ఎమ్మెల్యే ఫోటో ఉన్న మాస్క్స్ మరియు స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ఎవరి వద్ద నుండి ఒక రూపాయి కూడా ఆశించకుండా నిరుపేద పిల్లలకు బుక్స్, నోట్ బుక్స్, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సహాయం, బ్లడ్ పంపిణీ చేస్తామని తెలియజేశారు.

వనపర్తి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం దగ్గర ఆధార్ కేంద్రం

వనపర్తి జిల్లా  కలెక్టరేట్  కార్యాలయం దగ్గర ఆధార్ కేంద్రం 

వనపర్తి, పెన్ పవర్

వనపర్తి పట్టణ ప్రజలకు అందుబాటు లో ఉండే విధంగా వనపర్తి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన ఆధార్ నమోదు కేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ప్రజలను కోరారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఆధార్ సేవా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ఏవో అడ్మిన్, కలెక్టరేట్ టెక్నికల్ సిబ్బంది ఆధార్ సేవా కేంద్రం నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...