Followers

 ముమ్మరంగా వరి నాట్లు


 ముమ్మరంగా వరి నాట్లు


 


ఏలేశ్వరం ,పెన్ పవర్ 


 

ఏలేశ్వరం మండల పరిధిలో లింగంపర్తి, భద్ర వరం, పేరవరం, తూర్పు లక్ష్మీపురం, ఏలేశ్వరం, జె అన్నవరం, మర్రి వీడు, పెద్దనాపల్లి తదితర గ్రామాల్లో వరినాట్లు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టులో 67 వేల ఎకరాలు, తిమ్మరాజు చెరువు ఆయకట్టు 950 ఎకరాల సేద్యపు భూమి ఉంది. సదర్ భూముల్లో సుమారు 80 శాతం వరి పొలాలను సాగు చేస్తారు. రుతుపవనాల కారణంగా ఈ మధ్య కురిసిన భారీ వర్షాలకు ఏలేరు రిజర్వాయర్, తిమ్మరాజు చెరువులలో కావలసిన సాగు నీరు పుష్కలంగా ఉంది. దీంతో సేద్యానికి సమాయత్త మైన రైతాంగం వరి ఊడ్పులు  ముమ్మరంగా సాగుతున్నాయి.

కార్మికులకు ఆర్థిక సహాయమివ్వాలి




భవన నిర్మాణ కార్మికులకు ఆర్థిక సహాయమివ్వాలి


 


 


అనకాపల్లి,పెన్ పవర్ 


 

భవన నిర్మాణ కార్మికులు ఏడాది కాలంగా ఉపాధి కరువై తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కొన్ని కుటుంబాలు అర్ధాకలితో కాలం వెళ్లదీస్తున్నారని శాసనమండలి సభ్యులు బుద్ధ నాగ జగదీశ్వరరావు తెలిపారు.వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తరువాత ఇసుక పై నిషేధం విధించింది. దీంతో నాలుగు నెలలపాటు ఇసుక లేక పనులు లేకుండా పోయారని ఆ తర్వాత కొత్త ఇసుక విధానం అమల్లోకి రావడంతో కాస్తకూస్తో పనులు దొరికాయని కరోనా వైరస్ రావడంతో మార్చి నెల నుండి లాక్ డౌన్ ప్రకటించడంతో దాదాపు రెండు నెలల పాటు పనులు లేక ఇంటికే పరిమితం అయ్యారని తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉన్నదంటే కరోనా వైరస్ విజృంభించడం వల్ల ఎక్కడికక్కడ లాక్ డౌన్ లు కంటోన్మెంట్ జోన్ లు అమల జరుగుతున్నందున కార్మికులకు పనులు దొరకడం లేదనారు. రాష్ట్రములో నిర్మాణ రంగం పై ఆధారపడి జీవనం సాగిస్తున్న భవన నిర్మాణ కార్మిక కుటుంబాలు దాని అనుబంధ ఉన్నవారు కలిపి సుమారుగా 30 లక్షల మంది ఉన్నారని వీరందరికీ ఏప్రిల్ నెలలో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిందని ఇప్పటికీ వారికి సాయం అందలేదని కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్  నుంచి ఒక్కొక్కరికి పది వేల రూపాయల చొప్పున అందించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించి చేతులు దులుపుకున్నరని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి జమయ్యే సేస్ డబ్బులతో ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది ప్రస్తుతం కార్మిక వెల్ఫేర్ బోర్డు దగ్గర వెయ్యి కోట్లు నిధి ఉందని దీని ద్వారా ఎంతమేరకు సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించలేదని తెలిపారు. ఈ ఆర్థిక సహాయం అందించడానికి రాష్ట్ర కార్మిక శాఖ తో సర్వే నిర్వహించి వివరాలు సేకరించి ఆర్థిక సహాయం అందిస్తానని ప్రభుత్వం ప్రకటించిన 

 నప్పటికీ కార్మికులకు నిరాశే మిగిలిందని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి భవన నిర్మాణ కార్మికులకు సహాయం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


 

 




ఈ టి సి శిథిల గృహాల ఆదాయం రూ.1.16 లక్షలు


ఈ టి సి శిథిల గృహాల ఆదాయం రూ.1.16 లక్షలు


సామర్లకోట, పెన్ పవర్


 

రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందించే ఇళ్ళ స్థలాల కోసం సిద్ధం చేసేందుకు గాను స్థానిక గృహకల్ప వద్ద శిథిలావస్థలో ఉన్న పంచాయితీ రాజ్ కు చెందిన శిథిలాలను కూల్చి వాటి మెటీరియల్ తీసుకుపోయేందుకు గాను నిర్వహించిన బహిరంగ వేలం ద్వారా మునిసిపాలిటీకి రూ.1,16,000 ఆదాయం లభించింది.ఈ మేరకు సోమవారం స్థానిక విస్తరణ శిక్షణా కేంద్రంలో శిథిలా కట్టడాల తొలగింపునకు గాను వేలం పాటలను నిర్వహించారు. దానిలి పలువురు పాట దారులు పాల్గొనగా వారిలో కాకినాడ రూరల్ కరకుదురు గ్రామానికి చెందిన వి.శ్రీనివాసరావు అధిక పాటగా 1,16,000లకు పాడి కైవసం చేసుకున్నారు.ఈ మేరకు అతనికి పాటను ఖరారు చేస్తూ అధికారులు ఉత్తర్వులు అందించారు.కాగా ఈ స్థలం లో అందరికీ ఇల్లు పథకంలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలను అందించేందుకు సిద్ధం చేస్తున్నట్టు డిఇ సిహెచ్ రామారావు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఈ టి సి,మున్సిపల్ రెవిన్యూ అధికారులు పాల్గోన్నారు.

లాక్ డౌన్ నిబంధనలను పునః సమీక్షించాలి


లాక్ డౌన్ నిబంధనలను పునః సమీక్షించాలి



ఏలేశ్వరం,పెన్ పవర్ 


రాష్ట్రంలో అమలవుతున్న లాక్ డౌన్ నిబంధనలను పునః సమీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు మేధావులు హితవు పలుకుతున్నారు. కరోనా బారిన పడకుండా ప్రజలను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా, మండలాల వారిగా లాక్ డౌన్ విధించే అధికారం స్థానిక అధికారులకు ఇచ్చారు. ఈ మేరకు ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని స్థానిక అధికారులు ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు నిత్యావసరాలు, కూరగాయలు తదితర ప్రజా జీవనానికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పించారు. దీంతో ఉదయం ఒక్కసారి గా ప్రజలు తమ వాహనాలను వేసుకుని మార్కెట్లకు , ఇతర అవసరాలకు రోడ్లపైకి రావాల్సిన అవసరం వస్తున్నది. దీంతో వ్యాపార సమూహాల వద్ద తీవ్ర రద్దీ ఏర్పడి సామాజిక దూరం పాటించే పరిస్థితు లకు భంగం కలుగుతుంది. గంటల తరబడి రోడ్లపై వాహనాల రద్దీ పెరగడంతో కరోనా మహమ్మారి  విజృంభించే అవకాశాలను రెట్టింపు చేస్తున్నట్లు అవుతుంది. ఇకనైనా ప్రభుత్వ అధికారులు లాక్ డౌన్  నిబంధనలపై పునః సమీక్ష చేసి ఉదయం 10 గంటల నుంచి  సాయంకాలం 6:00 వరకు వ్యాపార సంస్థలు  నిర్వహించుకునే లా, ప్రజలు సామాజిక దూరం పాటించేలా వ్యాపార సంస్థల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసేలా చర్యలు తీసుకుంటే బాగుంటుందని మేధావుల అభిప్రాయం.ఏలేశ్వరం మెయిన్ రోడ్ లో సోమవారం ఉదయం 10 గంటలకు ట్రాఫిక్ రద్దీ, షాపుల వద్ద నిరీక్షిస్తున్న జన సమూహాలు


పరిశుభ్రత వార్షికోత్సవం


పరిశుభ్రత వార్షికోత్సవం


 ఆత్రేయపురం,పెన్ పవర్


 


 ఆత్రేయపురం మండలం పేరవరం  లో  లో  లో పరిశుభ్రతా పక్షోత్సవాలలో భాగంగా సోమవారం పైలట్ పంచాయతీలైన పేరవరం,బొబ్బర్లంక గ్రామాలలో  ఎంపీడీఒ నాతి బుజ్జి ఆద్వర్యంలో పరిశుభ్రత కమిటీ సభ్యులు , టాస్క్ ఫోర్స్ టీమ్ సభ్యులు, సచివాలయ సిబ్బంది  గ్రామ వాలంటీర్లతో  కలిసి గ్రామ సందర్శ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ఘన,ద్రవవ్యర్ధాల నిర్వహణ,-త్రాగునీటి సరఫరా, పైప్ లైన్ లీకేజ్ లు, వ్యక్తిగత మరుగుదొడ్లు మరియు కమ్యూనిటీ మరుగు దొడ్లు వాడకం, బహిరంగ మల విసర్జన లేకుండా అవగాహన కల్పించడం,  డ్రైన్లు శుభ్రం చేయడం- SWPC షెడ్ నిర్వహణ , 
 అంటువ్యాధులు ,ఇతర ఆరోగ్య సంబంధ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించి , పంచాయతీ సిబ్బందికి తగు సూచనలు చేసారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ విస్తరణాదికారి శ్రీనివాస్ , కార్యదర్శులు శివరామకృష్ణ, హనుమ, ఇంజనీరింగ్ అసిస్టెంట్ శ్రీకాంత్, బొబ్బర్లంక మాజీ ఎంపీటీసి సల్లపూడి క్రీస్తమ్మ, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు


మనం మన పరిశుభ్రత


మనం మన పరిశుభ్రత


 


పెద్దాపురం పెన్ పవర్


 

పరిశుభ్రత పక్షోత్సవములలో భాగముగా పెద్దాపురం మండలం గ్రామాల్లో  మనం-మన పరిశుభ్రత పైలట్ ప్రాజెక్టు కార్యక్రమమునకు ఎంపిక చేయబడిన చదలాడ మరియు ఉలిమేశ్వరం గ్రామపంచాయితీల యందు 3వ రోజు కార్యక్రమములో భాగముగా గ్రామపంచాయితీల యందు ఎంపిక చేయబడిన టాక్స్ ఫోర్సు టీముల ద్వారా  ట్రాన్సాక్ట్ వాక్ నిర్వహించుట జరిగింది.  కార్యక్రమంలో ప్రత్యేక అధికారులు  మండల పరిషత్ అభివృద్ధి అధికారి, విస్తరణాధికారి(పం.రా & గ్రా.అ.) పెద్దాపురం, గ్రామస్దాయి కమీటి మెంబర్లు, ఏ ఈ -ఆర్ డబ్ల్యూ ఎస్ ఏ ఈ -పి  హాజరయ్యారు. రేపటి నుంచి గ్రామాలలో ప్రతి రోజు 50 కుటుంబాలను సందర్శించి, పారిశుద్ధ్య నిర్వహణపై తగు అభిప్రాయాలు, సమస్యల పరిష్కారమునకు చర్యలు తీసుకొనుదురు. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం అని తెలిపారు

కరోనా పట్ల నిర్లక్ష్య వైఖరి తగదు







కరోనా పట్ల నిర్లక్ష్య వైఖరి తగదు


క్వారంటైన్ సెంటర్లలో సరైన సౌకర్యాలు లేవు


ప్రజారోగ్యంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి


తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కొత్తిం వెంకట శ్రీనివాసరావు డిమాండ్


 


పెద్దాపురం,పెన్ పవర్


 

పెద్దాపురం మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు కొత్తిం వెంకట శ్రీనివాసరావు ( కోటి) పాత్రికేయులతో మాట్లాడుతూ. రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో  బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కరోనా కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని రోగులకు తక్షణం మెరుగైన వైద్య సేవలు అందించడం తో పాటుగా వారిని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని. నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తూ ఆంటీ పట్టనట్టు వ్యవహరించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని అందువల్లనే రోజుకు ఐదువేలనుండి ఎనిమిది వేల  పైచిలుకు కేసులు నమోదు అవుతున్నాయని  అలాగే పనులు లేక తీవ్రఇబ్బందులు పడుతున్న అన్ని రంగాల కార్మికులను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని డిమాండ్ చేశారు కరోనా వైరస్ నియంత్రించడం లో రాష్ట్రం చాలా వెనక పడిందని. కరోనా వైరస్ సోకకుండా ప్రజలు  మాస్కులు తప్పనిసరి వాడాలని ఎవరి రక్షణార్థం వాళ్ళు తగు జాగ్రత్త వహించాలని ఆయన కోరారు.  కరోనా క్వరంటైన్ సెంటర్ లో కనీస సౌకర్యాలు కూడా లేవని పది రోజులు ఉంచుకొని టెస్టులు చేయకుండానే బాధితుల్ని వెనక్కి పంపి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కరోనా కష్ట కాలంలో కూరగాయలు మరియు కిరాణా సరుకులు పంపిణీ చేసిన తెలుగు దేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభినందనలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటుందని ప్రతి కార్యకర్త కరోనా టైంలో సైనికుల్లా పని చేశారని ప్రజలకు అండగా నిలవడమే తేదేపా లక్ష్యమని ఆయన తెలిపారు.


 

 




 

 



 



 



Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...