Followers

ఎ.వి.ఎన్, కళాశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

 ఎ.వి.ఎన్, కళాశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం 




మహారాణి పేట, పెన్ పవర్


మిసెస్ ఎ.వి.ఎన్, కళాశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.కళాశాల పూర్వ విద్యార్థి మరియు నోబెల్ గ్రహీత సర్. సి.వి. రామన్. కనిపెట్టిన రామన్ ప్రభావమునకు గుర్తుగా 28 ఫిబ్రవరి జాతీయ సైన్స్ దినోత్సవముగా  జరుపుకోవడం చాలా సంతోషకరమని కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సి.హెచ్.మధుసుధనరావు తెలిపారు. సైన్స్ ప్రయోగాల యొక్క ఆవశ్యకత మరియు సైన్స్ యొక్క పరిజ్ఞానం పెంపొందించుకోనుట ఇప్పటి పరిస్థితులలో, ఎంతైనా అవసరమని ఫిజిక్స్ విభాగాధిపతి మరియు వైస్ ప్రిన్సిపల్ ఆచార్య. ఏస్. శ్రీనివాసు రావు తెలిపారు. రామన్ యొక్క ప్రయోగాలు మరియు ఉపన్యాశాల గురించి అతిథిగా వచ్చిన డాక్టర్. డి.జగదీశ్వర్ రావు వివరించారు. ఈ కార్యక్రమంలో కాళాశాల వైస్      ప్రిన్సిపాల్ డాక్టర్. వి.వి.జె. గోపాలక్రిష్ణ ప్రశంగిస్తూ విద్యార్థులందరు పూర్వ విద్యార్థి ఆయిన సర్. సి.వి.రామన్ ని ఆదర్శంగా తీసుకుని జీవితంలో విజయం సాధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కెప్టెన్. ఎన్.రామక్రిష్ణ యితర ఆచార్యులు ,విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రచారంలో హేమలత జోరు ... ప్రత్యర్ధులు బేజారు...

    5వ  వార్డు   మారికవలసలో టీడీపీ అభ్యర్థి మొల్లి హేమలత విస్తృత ప్రచారం. 



 మధురవాడ, పెన్ పవర్ 

గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్బంగా భీమిలి నియోజకవర్గం మధురవాడ 5వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిని మొల్లి హేమలత ప్రచారంలో దూసుకుపోతున్నారు.తన తండ్రి తెలుగుదేశం పార్టీ జిల్లా కార్య నిర్వహణ కార్యదర్శి మొల్లి లక్ష్మణరా వు వారసురాలిగా పదునైన మాటల తూటాలతో ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తూ,తన దైన శైలిలో ప్రచారం హోరేతిస్తున్నారు.


 ఆదివారం మారికవలస రాజీవ్ గృహకల్ప కాలనీలో గల దుర్గాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం సుమారుగా 1000 మందితో పాదయాత్రగా బయలుదేరారు. రాజీవ్ గృహకల్ప కాలనీ , జె.ఎన్.ఎన్ . యు.ఆర్.ఎమ్.న్యూ కాలనీలో గల పలు సమస్యలు తన దృష్టికి వచ్చాయని వాటి పరిస్కారానికి ప్రణాళికలు సిద్ధం చేశామని తనను సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా ఓటర్లను అభ్యర్ధించారు. 




ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు, మహిళలు, పాల్గొన్నారు. కృతజ్ఞతలు :మా యొక్క గెలుపునకు కృషి చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మహిళలకు, తెలుగు తమ్ముళ్లకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీపీ వార్డ్ ప్రెసిడెంట్ నాగోతి సత్యన్నారాయణ (జపాన్).సెక్రటరీ ఈగల రవి. భీమిలి నియోజకవర్గ మహిళ అధ్యక్షురాలు బోయి రమదేవి.నమ్మి శ్రీను.5వ వార్డ్ మహిళ  అధ్యక్షురాలు హేమలత. గోడు అరుణ.వియ్యపు నాయుడు.ఓలేటి శ్రావణ్.నమ్మి సూరి అప్పారావు. మొల్లి అప్పలస్వామి. టీడీపీ అభిమానులు.కార్యకర్తలు.నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ప్రచారంలో దూసుకుపోతున్న మళ్ళ సురేంద్ర

 

ప్రచారంలో దూసుకుపోతున్న మళ్ళ సురేంద్ర 

మళ్ళ సురేంద్ర ఆధ్వర్యంలో  50 మంది యువకులు తెలుగుదేశం లో చేరిక.



పెన్ పవర్ ,అనకాపల్లి

81వ వార్డ్ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్పొరేట్ అభ్యర్థి  శ్రీమతి మళ్ళ కృష్ణ కుమారి  ప్రచార కార్యక్రమంలో భాగంగా స్థానిక నెయ్యల వీధి జంక్షన్లో ఏర్పాటుచేసిన సమావేశంలో  81వ డివిజన్ ఇంచార్జ్  మళ్ళ సురేంద్ర ఆధ్వర్యంలో 50 మంది యువకులు మళ్ళ సురేంద్ర గారు చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు  జాయిన్ అయిన వారిలో రేబాక గణేష్, ఎండపల్లి శేఖర్, అనకాపల్లి చందు, ఎండపల్లి శివశంకర్,మంగరపు సతీష్, ఏడువకల మూర్తి, అనకాపల్లి సన్యాసిరావు, ఎండపల్లి మహేష్, ఎండపల్లి గణేష్, ముత్యాల మల్లిబాబు, అనకాపల్లి నగేష్, అనకాపల్లి మధు, మంగరపు సురేష్, కోడూరు శేఖర్, మరికొంతమంది యువకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ మీడియా కోఆర్డినేటర్ శ్రీ కొణతాల వెంకటరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలం అయిందని ప్రజలందరూ వైసీపీ ప్రభుత్వాన్ని దేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అనకాపల్లి పట్టణం ఎంతో అభివృద్ధి చెందిందని ప్రజలందరూ దాన్ని గుర్తించి ఇప్పుడు మళ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని ఇక్కడ 81 వ డివిజన్ లో మళ్ళ సురేంద్ర  సతీమణి మళ్ళ కృష్ణ కుమారి ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలి అని మళ్ళ సురేంద్ర  గురించి మీ అందరికీ తెలిసిందే అనిగత 20 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీయే కాకుండా అన్ని వర్గాల ప్రజలతో మమేకమై ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారని ఇప్పుడు మళ్ళ సురేంద్ర  భార్య ని గెలిపించుకుంటే ఈ ప్రాంతం అంతా ఎంతో అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు కొణతాల రత్నకుమారి, అనకాపల్లి సంతోషిని, చంద్ర, దాడి రామారావునాయుడు, కొణతాల శ్రీనివాసరావు,  పెతకం శెట్టి వెంకట్రావు, దానాల విష్ణు చౌదరి, బుద్ధ రాజేష్, యల్లప్పు శ్రీనివాసరావు, ఎండకుర్తి అప్పలరాజు, నీలగిరి శీను, మళ్ళ గణేష్, వానపల్లి కోటేశ్వరరావు, దొడ్డి జగదీష్, కొణతాల తులసి, తిప్పన అప్పారావు వేగి కృష్ణ, పెంటకోట వరప్రసాద్, అనకాపల్లి మోహన్, ఎండపల్లి చంద్రశేఖర్, అనకాపల్లి రాము మరియు మహిళలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మనసున్న నాయకుడు మన జగన్ అన్న..

 మనసున్న నాయకుడు  మన జగన్ అన్న..



 గిరిజన ప్రాంత రహదారులకు మోక్షం కలిగిస్తున్న సీఎం

పెన్ పవర్ బ్యూరో ,విశాఖపట్నం

 గత ప్రభుత్వాల నిరాదరణకు గురైన గిరిజన ప్రాంత రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తుందని  ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు అన్నారు. శనివారం సాయంత్రం  సెక్స్మాడుగుల పంచాయతీ కార్యాలయంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో  ఆయన మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు ఎదుర్కొంటున్న రహదారులు తాగునీటి సమస్యల పట్ల ప్రభుత్వం స్పందించింది అన్నారు. వైఎస్ జగన్ మనసున్న నాయకుడు అని సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ప్రాంత రహదారులకు  మోక్షం కలిగించే విధంగా  చర్యలు జరుగుతున్నాయన్నారు. మాడుగుల మండలం శివారు రాజంపేట కొత్తవలస  ఉరక గెడ్డ  వాగుపై  బ్రిడ్జి మరియు 7:30 మీటర్ల రహదారి నిర్మాణానికి  9 కోట్ల రూపాయలు  మంజూరు అయిందని టెండర్లు పూర్తి అయ్యి త్వరలో పనులు ప్రారంభం అవుతాయి అన్నారు  మండలంలో నాలుగు రోడ్లు దేవరపల్లి మండలం లో ఒక రోడ్డు అభివృద్ధికి ఎంజిఎన్ఆర్ఇజిఎస్ నిధుల నుంచి ఐదు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు మంజూరయ్యాయన్నారు ఈ నిధులతో కల్వర్టులు బ్రిడ్జీలు తార్ రోడ్డు  7:30 మీటర్లు విస్తరించనున్న మన్నారు మాడుగుల రామచంద్రపురం రోడ్డుని గ్రామ పంచాయతీ నిధుల నుండి 7:30 మీటర్లు వెడల్పు తారు రోడ్లు కల్వర్టు నిర్మిస్తామన్నారు. ఒక కిలోమీటర్ 800 మీటర్లు రోడ్డు నిర్మాణానికి 85 లక్షలు మంజూరు అయిందన్నరు.  కింతలి వల్లాపురం శివారు శరభన్నపాలెం నుంచి తణుకు గదబ వీధి  2 కిలోమీటర్ల  తారు రోడ్డు నిర్మాణానికి 85 లక్షలు.  పేద సారాడ  శరభన్నపాలెం  మూడు కిలోమీటర్ల 400 మీటర్లు రోడ్డు నిర్మాణానికి ఒక కోటి 85 లక్షలు  ఏ వీరనారాయణం పెద్ద గొర్రె గడ్డ 1 కిలోమీటర్ 600 మీటర్లు రోడ్డుకు  కోటి 20 లక్షలు దేవరపల్లి మండలం గర్సింగి  ఎర్ర చెరువు రెండు కిలోమీటర్ల 100 మీటర్లు ఒక కోటి 10 లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు. మాడుగుల దేవి ఆడిటోరియం  తా చెరువు వాగు వరకు రెండు విడతల్లో రోడ్డు విస్తరణ చేపడతామన్నారు. తాడివలస గోపూర్ లో తాగునీటి సమస్యకు  మినీ వాటర్ ప్లాంట్ నిర్వహించామన్నారు. తాజాగా గెలుపొందిన గ్రామ సర్పంచులు   వార్డు మెంబర్లు బాధ్యతగా ప్రజలకు సేవలు అందించాలన్నారు. తమ తమ పరిధిలో ప్రజాసమస్యలు ప్రతి ఒక్కటీ గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. పురవీధుల్లో మట్టి రోడ్లను సిమెంట్ రోడ్ల గా మార్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయితీ ఆస్తులను పరిరక్షించి అవసరం మేరకు వాటిని వినియోగించుకోవాలని సూచించారు. మోదకొండమ్మ ఆలయం నుంచి రామచంద్రపురం మీదుగా కాశీపురం వరకు రోడ్డు నిర్మాణం బ్రిడ్జి ఏర్పాటుకు తన వంతుగా కృషి చేస్తానని ప్రభుత్వ విప్ ముత్యాలనాయుడు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్  కళావతి  ఉప సర్పంచ్  శ్రీనాథ్ శ్రీనివాసరావు వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.

ఆడపిల్లలు ఆరోగ్యంపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి

 ఆడపిల్లలు ఆరోగ్యంపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి



గరికి వలస జిల్లాపరిషత్ పాఠశాలలో బాలికలకు శానిటైజర్ బాక్సుల పంపిణీ

పెన్ పవర్,విజయనగరం

విజయనగరం జిల్లా గుర్ల మండలం గరికవలసజిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శనివారం కేసలి స్వచ్ఛంద సంస్థ అధినేత తల్లి జ్ఞాపకార్థం పిల్లలకు పండ్లు ఫీడ్స్ తో పాటు పుస్తకాలు పెన్నులు బాలికలకు తదితర సామాగ్రిని అందజేశారుఈ సందర్భంగా ఆడపిల్లల ఆరోగ్యం ఆనందం పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని తూర్పుగోదావరి జిల్లా బాలల సంక్షేమ సమితి అధ్యక్షులు మాధవీలత అన్నారు శనివారం మండలంలో గరికవలస గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు విశాఖపట్నం బాలల సంక్షేమ సమితి అధ్యక్షురాలు శ్యామల రాణి ఎన్ఆర్ఐ ప్రతినిధులుసేవ్ టు చైల్డ్ ఫౌండేషన్ ప్రతినిధి జి సునంద శ్రీధరు ధన్య తో పాటు విజయనగరం జిల్లా కమిటీ అధ్యక్షులు లక్ష్మణ్ రావు తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ ఆడ పిల్లల ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరు శ్రద్ధ తీసుకోవాలన్నారు ఆడపిల్లలకు విద్య చాలా అవసరమని శ్యామల అని అన్నారు వెనుకబడిన ప్రాంతాల్లో ఆడపిల్ల విద్య చాలా అవసరమని అని పేర్కొన్నారు విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం తదితర ప్రాంతాలలో బాలికల సంరక్షణ తో పాటు మంచి పౌష్టికాహారం అందించే బాధ్యత కూడా తీసుకోవాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు కే అప్పారావు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి పేద వారికి విద్య అందుబాటులోకి వచ్చే విధంగా అదే విధంగా వారికి సకల సౌకర్యాలు అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రమ

తపాలా సేవలు వినియోగించుకోవాలి

 తపాలా సేవలు వినియోగించుకోవాలి 

జిల్లా అసిస్టెంట్ సూపరింటెండెంట్.

 నెల్లికుదురు,పెన్ పవర్.


తపాలాశాఖ వినియోగులను సద్వినియోగంచేసుకోవాలని మహుబూబాబాద్  జిల్లా అసిస్టెంట్ సూపరింటెండెంట్ సైదా నాయక్ అన్నారు. శనివారం మండలంలోని రత్తిరామ్ తండాలో బడితండా,నల్లగుట్ట, రత్తిరామ్ తండ,కాచికల్ గ్రామాలకు చెందిన పోస్ట్ఆఫీస్ రత్తిరామ్ తండలో మంజూరు కావడంతో శనివారం వివిధ రకాల గ్రామీణ తపాలా జీవిత బీమా ఖాతాలు తెరవడం కోసం ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ గుగులోత్ బిక్కు నాయక్ తో కలిసి ఖాతాలను ప్రారంభించిన సైదా నాయక్ మాట్లాడుతూ..ఎస్బి, ఆర్ డి, సుకన్య సమృద్ధి యోజన లతోపాటు ఐపీబిమ్, ఏఇపిఎస్ సేవలను తపాల శాఖ అందిస్తుందని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ భూక్యా బాలాజీ నాయక్, ఉప సర్పంచ్ విజయ బాలాజీ, నెల్లికుదురు సబ్ పోస్ట్మాస్టర్ నర్సయ్య,ఆయా గ్రామాల బీపీఎం లు నవీన్ రావు,ఉమామహేశ్వర్, ఐస్లాం,మహేశ్వరి, ప్రశాంత్, స్థానికులు చందూలాల్, శ్రీనివాస్, బిచ్చనాయక్,రఘుతో పాటు తదితరులు పాల్గొన్నారు

అభివృద్ధి పథంలో నడిపిస్తా..వైసిపి 39వ వార్డు కార్పొరేటర్.. అభ్యర్థిని కొల్లి సింహాచలం

 అభివృద్ధి పథంలో నడిపిస్తా..వైసిపి 39వ వార్డు కార్పొరేటర్.. అభ్యర్థిని కొల్లి సింహాచలం




మహారాణి పేట, పెన్ పవర్

విశాఖ, దక్షిణ నియోజకవర్గం 39 వ వార్డు ప్రాంతాన్నిఅభివృద్ధి పథంలో నడిపిస్తానని వైసిపి కార్పొరేటర్ అభ్యర్థిని కొల్లి సింహాచలం ప్రకటించారు.కోటవీధి,ఫెర్రీ వీధి తదితర ప్రాంతాల్లో ఉత్సాహంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.అడుగడుగునా ప్రజలు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. హారతులతో ఘన స్వాగతం పలికారు.స్థానికంగా నెలకొన్న సమస్యలను త్వరితంగా పరిష్కరిస్తానని ఆమె స్థానికులకు భరోసా ఇచ్చారు.అర్హులైన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తానని హామీ ఇచ్చారు.దశాబ్దాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్నాని, ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసమే నిర్విరామంగా శ్రమిస్తున్నానని, తనకు ఘనవిజయం అందించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ ఎన్నికల ప్రచారంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...